breaking news
D-Street
-
చారిత్రాత్మక గరిష్టంలో దలాల్ స్ట్రీట్
ముంబై: సరికొత్త చారిత్రాత్మక గరిష్టాలతో దలాల్ స్ట్రీట్ మెరుపులు మెరిపిస్తున్నాయి. ఫ్రెష్ ఆల్ టైం హైలతో స్టాక్‌మార్కెట్లు దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ సానుకూలత, బెటర్ మాన్సూన్ సంకేతాలతో ఆరంభంలోనే సెంచరీ సాధించిన సెన్సెక్స్ మరింత పాజిటివ్‌గా స్పందిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 249 పాయిట్లు ఎగిసి 30, 182వద్ద చాలా స్థిరంగా ఉంది. అటు నిఫ్టీ కూడా 9400 స్థాయివైపు పరుగులు తీస్తోంది. 68 పాయింట్ల లాభంతో 9385 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ సెక్టార్ మార్కెట్లను లీడ్ చేస్తోంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా సరికొత్త రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. మిగిలిన అన్ని సెక్టార్లు లాభాల్లో ఉన్నాయి. కేపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్‌లు కూడా భారీగా లాభపడుతుండగా.. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సెక్టార్లలో ర్యాలీ కొనసాగుతోంది. హెచ్ యుఎల్ టాప్ విన్నర్‌గా ఉంది. ఐటీసీ, రిలయన్స్, ఎం అండ్ ఎం, భారతి, అదాని పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ, వోల్టాస్, హిందుస్తాన్ యూనిలీవర్, అరబిందో తదితర షేర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. అయితే ఐటీ, టెక్నాలజీ కౌంటర్లు మాత్రం ఫ్లాట్‌గా ఉన్నాయి. విప్రో, టీసీఎస్, గెయిల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. -
15 నిమిషాల్లో 7 లక్షల కోట్లు డమాల్!
ముంబై: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రేపుతున్న ఉత్కంఠతో దేశీయ స్టాక్ మార్కెట్లు మహాపతనాన్ని నమోదు చేశాయి. రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి ముందంజ వేయడంతో విశ్లేషకులు అంచనాలకనుగుణంగానే ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సునామీ చెలరేగింది. బ్రెగ్జిట్ ను మించిన ఆందోళన మదుపర్లను పట్టి కుదిపేసింది. దలాల్ స్ట్రీట్ లో వెడ్నెస్ డే బ్లడ్ బాత్ గా నిపుణులు విశ్లేషించారు. 2008లో లీమన్ బ్రదర్స్ దివాలా ఉదంతం సందర్భంగా కూడా ఇంతలా మార్కెట్ పతనం కాలేదని నిపుణులు పేర్కొన్నారు. సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్లు, ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 500 పాయింట్ల నష్టంతో రికార్డు స్థాయి పతనాన్ని నమోదుచేసింది. అమెరికా 45వ ప్రెసిడెంట్ గా ఎవరు నెగ్గనున్నారన్న ఉత్కంఠతో మార్కెట్ లో కేవలం 15 నిమిషాల్లో 7 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. ఈ అనూహ్యపరిణామాలుతో డాలర్ ఢమాల్ అంది. దీంతో దేశీయ కరెన్సీ రూపాయి 23 పైసల నఫ్టంతో 66.83 వద్ద ఉంది. పసిడి మాత్రం ఒకరేంజ్ లో దూసుకుపోతోది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 1294లకు పైగా ఎగిసిన పుత్తడి రూ. 31,174 వద్ద ఉంది.