breaking news
Cyber-Attacks
-
డెలాయిట్పై భారీ సైబర్ దాడి
ప్రముఖ అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్‌కు సైబర్ షాక్ తగిలింది. సంస్థ అందించిన సమాచారం ప్రకారం ఈ మెయిల్ వ్యవస్థపై సైబర్‌దాడి జరిగింది. దీంతో క్లయింట్లకు చెందిన విలువైన సమాచారం, రహస్యమైన మెయిల్స్ హ్యాకర్ల బారిన పడ్డాయి. దీనిపై పూర్తిగా విచారణ ప్రారంభించామని డెలాయిట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చాలా కొద్ది మంది ఖాతాదారులను మాత్రమే ఈ దాడి ప్రభావితం చేసిందనీ, ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించామని తెలిపింది. క్లయింట్ బిజినెస్ వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేదనీ పూర్తి విచారణ జరిపిస్తున్నామని ప్రకటించింది. అలాగే తమ సైబర్-సెక్యూరిటీ వ్యవస్థ చాలా ఉత్తమమైందనీ, ఖాతాదారుల రహస్య సమాచారాన్ని రక్షించడంలోనూ, వారి సైబర్‌సెక్యూరిటీ భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని సంస్థ పేర్కొంది. అయితే చాలా పెద్ద సంఖ్యలో ఖాతాదారుల నుండి సమాచారం లీక్ అయిందనీ ది గార్డియన్ దినపత్రిక సోమవారం నివేదించింది. ఇందులో పెద్ద సంస్థలు, అమెరికా ప్రభుత్వ విభాగాలు కూడా ఉన్నాయని తెలిపింది. అమెరికాలోనే అతి పెద్ద ప్రైవేట్ సంస్థ డెలాయిట్ డేటాపై గత ఏడాది అక్టోబర్ నుంచి మార్చి వరకూ హ్యాకర్లు కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలోనే భారీ సైబర్‌దాడికి గురైందట. -
సైబర్ స్వచ్ఛ కేంద్రం లాంచ్..
సైబర్ నేరాల నుంచి భద్రత కల్పించేందుకు, సాంకేతిక మౌలిక వసతులను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త డెస్క్ టాప్ అండ్ మొబైల్ భద్రతా పరిష్కారాన్ని మంగళవారం ప్రకటించింది. రోజురోజుకు తీవ్రమవుతున్న సైబర్ దాడులను నిరోధించే యోచనలో ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. డెస్క్ టాప్ అండ్ మొబైల్ సైబర్ భద్రతకోసం కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(సీఈఆర్టీ) సైబర్ స్వచ్ఛ కేంద్రాన్ని లాంచ్ చేసింది. ఈ అత్యవసర సహాయ కేంద్రం ద్వారా వినియోగదారులకు సురక్షితమైన వ్యవస్థలను ఎనేబుల్ చేయనుందని కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. సైబర్ భద్రతకుద్దేశించిన చర్యల్లో సైబర్ స్వచ్ఛ కేంద్రం (బాట్నెట్ క్లీనింగ్ అండ్ మాల్వేర్ అనాలసిస్ సెంటర్) ఒక మైలురాయి అని ఆయన ట్వీట్ చేశారు. హ్యాకర్లు బారినుంచి స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లను రక్షించడానికి ఎంకె వాచ్ యాప్‌ను అలాగే అనుమానాస్పద అప్లికేషన్ల బారినుంచి డెస్క్ టాప్ లను కాపాడేందుకు సంవిద్, యూఎస్బీ కోసం యూఎస్బీ ప్రతిరోధ్ అనేయాప్ ను లాంచ్ చేసినట్టు తెలిపారు. ముందస్తు మాలావేర్ ను గుర్తించి, శుభ్రపరిచి, పరిష్కారం అందిస్తుందనీ, సైబర్ దాడులనుంచి రక్షిస్తుందన్నారు. పెన్ డ్రైవ్, ఎక్సటర్నల్ హార్డ్ డ్రైవ్‌ల ద్వారా జరిగే అనధికారిక యూఎస్బీ స్టోరేజ్ చోరినీ, దాడులను నిరోధిస్తుందన్నారు. కాగా డిజిటల్ చెల్లింపులు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు దేశం పయనిస్తున్న తరుణంలో సైబర్ నేరాల నుంచి ప్రజలకు సెక్యూరిటీ కల్పించేందుకు కేంద్రం దీన్ని అందుబాటులోకి తెచ్చింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ లక్ష్యాలతో పనిచేసే ఈ సైబర్ స్వచ్ఛ కేంద్ర దేశంలో సురక్షిత సైబర్ పర్యావరణ వ్యవస్థ సృష్టించే లక్ష్యంతో పనిచేస్తుంది. 2015లో బోట్ నెట్ అండ్ మాల్వేర్ విశ్లేషణ సెంటర్ ఏర్పాటుకు రూ.100 కోట్లను కేటాయించినట్టు ప్రకటించారు. Launched "Cyber Swachhta Kendra"(Botnet Cleaning & Malware Analysis Centre),an imp milestone in various initiatives taken on Cyber Security. pic.twitter.com/moEvXsrxB9 — Ravi Shankar Prasad (@rsprasad) February 21, 2017