breaking news
country made liquor
-
నేటి నుంచి మద్యం బంద్!
పాట్నా: బిహార్‌లో మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. తొలుత పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగా మద్యం అమ్మకాలను నిషేధించనున్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నారు. బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ప్రొహిబిషన్ డే సందర్భంగా మాట్లాడుతూ బిహార్ ను మద్య రహిత రాష్ట్రంగా మారుస్తానని, ఏప్రిల్ 1నుంచి ఆ లక్ష్యానికి పునాది వేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే నేటి నుంచి బిహార్ లోని గ్రామీణ ప్రాంతాల్లో దేశీయంగా ఉత్పత్తి అయ్యే మద్యంతోపాటు ఇతర స్పైస్ లిక్కర్‌ను కూడా బ్యాన్ చేస్తున్నారు. ఈ హెచ్చరికను లెక్కచేయకుండా మద్యం అమ్మకాలు చేపడితే బిహార్ మద్యం పాలసీ సవరణ చట్టం 2016 ప్రకారం వారు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎవరైన ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తిస్తే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్, జీమెయిల్, టోల్ ఫ్రీ, ఫ్యాక్స్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. -
1000 లీటర్ల నాటుసారా ధ్వంసం
బేతంచెర్ల (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా బేతంచెర్ల సమీపాన గోర్ల గుట్ట రహదారిలోని నాటు సారా స్థావరాలపై సీఐ సుబ్రమణ్యం, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా బట్టీని పగులగొట్టి 1000 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. అలాగే నాటుసారా తయారుచేస్తున్న ఉప్పరి బాలుడుని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.