breaking news
	
		
	
  commits suicede
- 
      
                   
                                                       వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం..మహబూబాబాద్: వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాలలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల ప్రకారం.. గ్రామానికి చెందిన ఈదురు యాకయ్య, సోమలక్ష్మి దంపతుల మొదటి కూతురు లావణ్య(25) డిగ్రీ పూర్తి చేసింది.ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఇంతలో ఏమైందో తెలియదుగాని శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడింది. తల్లిదండ్రులు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది విగతజీవిగా కనిపించింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- 
      
                    భార్య కాపురానికి రాలేదని..
 కొండాపూర్(మెదక్ జిల్లా): భార్య కాపురానికి రాలేదనే మనస్తాపంతో ఓ భర్త పురుగుల మందు తాగాడు. ఈ సంఘటన కొండాపూర్ మండలం తోగరపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగిన చంద్రయ్య(35)ను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా..మార్గమధ్యంలోనే మృతిచెందాడు.


