నేతల పెత్తనం.. కమీషన్ల తర్పణం
స్వయం ఉపాధి రుణాల్లో చేతివాటం
జేబులు నింపుకుంటున్న అధికార పార్టీ నేతలు
తాము సూచించిన వారికే రుణాలివ్వాలని హుకుం
బ్యాంకుల నుంచి అంగీకార పత్రాలు తెచ్చుకున్నా కుదరదంటున్న నాయకులు
అందిన దరఖాస్తులు 1,33,325
కేటాయించిన యూనిట్లు 17,202
రుణం దక్కడం అనుమానమేనంటున్న దరఖాస్తుదారులు
జంగారెడ్డిగూడెం/భీమవరం టౌన్ :
జిల్లాలోని నిరుద్యోగులకు ఇచ్చే స్వయం ఉపాధి రుణాల విషయంలో నాయకుల జోక్యం పెరిగిపోయింది. కాపు, బీసీ, ఎస్సీ, మైనార్టీ, క్రిస్టియన్, ఎస్టీ కార్పొరేషన్ల రుణాలను తాము సూచించిన వారికే మంజూరు చేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేసిన అధికార పార్టీ నేతలు కమీషన్లు దండుకునే పనిలో పడ్డారు. లబ్ధిదారులకు వచ్చే సబ్సిడీలో కొంత మొత్తాన్ని తమకు ముందుగా ముట్టచెబితేనే రుణాలు మంజూరు చేస్తామంటున్నారు. తమ పేరిట రుణాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు బ్యాంకుల నుంచి అంగీకార పత్రాలు తెచ్చుకున్న అభ్యర్థులను సైతం పక్కనపెట్టేస్తున్నారు. జన్మభూమి, రుణాల మంజూరు కమిటీల పేరుతో తాము సూచించిన వ్యక్తులకే రుణాలివ్వాలని ఆ పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. చేసేదేమీ లేక అధికారులు తలూపుతున్నారు. ఉదాహరణకు జంగారెడ్డిగూడెం ప్రాంతంలో మండల స్థాయి ప్రజాప్రతినిధి భర్త తాము చెప్పిన వారికే రుణాలివ్వాలంటూ అధికారులకు ఇప్పటికే హుకుం జారీ చేశారు. ఏ అభ్యర్థికి రుణం కావాలన్నా.. వారికొచ్చే సబ్సిడీలో తనకు ఎంతిస్తారో చెప్పాలంటూ బేరసారాలు సాగిస్తున్నారు.
రుణమిస్తారో లేదో అనుమానమే
జిల్లాలో స్వయం ఉపాధి రుణాల కోసం గడచిన రెండేళ్లలో 1,33,325 మంది స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 17,202 యూనిట్లను మాత్రమే జిల్లాకు కేటాయించారు. టీడీపీ జన చైతన్య యాత్రలు మొదలుకావడం, త్వరలో జన్మభూమి కార్యక్రమాలు వస్తుండటంతో యువత నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా చూసేందుకు ఈనెల 3వ వారంలో మునిసిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో బ్యాంకర్లు, అధికారులతో కూడిన సెలక్షన్ కమిటీ లబ్ధిదారుల ఎంపిక చేపట్టనుంది. అయితే, ఎంపిక ప్రక్రియ పూర్తికాగానే రుణాలు మంజూరు చేసే అవకాశం లేదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎంపికైన లబ్ధిదారుల జాబితాలను ప్రకటించినా.. రుణాల మంజూరు వ్యవహారాన్ని మరో ఏడాదిపాటు వాయిదా వేసే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలావుంటే.. లబ్ధిదారులకు గతంలో మాదిరిగా సబ్సిడీ మొత్తాన్ని ముందుగా ఇవ్వరు, యూనిట్ విలువ రూ.2 లక్షలు రుణంగా మంజూరు చేస్తారు. బ్యాంకు నుంచి లబ్ధిదారుడు తీసుకున్న రుణంలో రూ.లక్ష జమచేసిన తరువాతే ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ విడుదల చేస్తుంది. లబ్ధిదారులకు మంజూరైన ప్రతి యూనిట్‌ను జియో ట్యాగింగ్ చేస్తారని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశరరావు ఇప్పటికే ప్రకటించారు.
కార్పొరేషన్ల వారీగా స్వయం ఉపాధి రుణాల కోసం జిల్లాలోని మండలాలు, పట్టణాల నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య
కేంద్రం కాపు బీసీ ఎస్సీ మైనార్టీ ఎస్టీ
ఆచంట 1, 107 373 273 2 15
ఆకివీడు 1,382 925 107 16 4
అత్తిలి 1,743 397 139 42 11
భీమవరం 1,141 667 151 3 5
భీమవరం అర్బన్ 1,604 424 155 124 25
భీమడోలు 1,469 1,498 668 46 17
బుట్టాయగూడెం 236 218 217 22 848
చాగల్లు 678 386 404 63 11
చింతలపూడి 1,016 770 1,059 72 287
దెందులూరు 788 845 615 19 27
దేవరపల్లి 712 335 616 71 23
ద్వారకాతిరుమల 559 453 700 33 41
ఏలూరు 1,217 3,188 1,680 276 52
ఏలూరు అర్బన్ 1,402 2,174 883 570 47
గణపవరం 1,947 1,168 421 15 48
గోపాలపురం 826 303 464 61 30
ఇరగవరం 1,268 356 174 4 21
జంగారెడ్డిగూడెం 2,016 1,220 1,008 175 60
జంగారెడ్డిగూడెం అర్బన్ 63 28 45
జీలుగుమిల్లి 336 359 267 16 258
కాళ్ల 1,088 516 46 6 5
కామవరపుకోట 370 653 743 19 22
కొవ్వూరు 2,063 390 554 28 15
కొవ్వూరు అఽర్బన్ 442 247 267 19 9
కొయ్యలగూడెం 1,249 536 565 68 26
కుక్కునూరు 21 223 215 11 111
లింగపాలెం 388 358 748 50 10
మొగల్తూరు 2,743 935 149 3 10
నల్లజర్ల 1,055 815 669 31 18
నరసాపురం 3,143 665 222 4 9
నరసాపురం అర్బన్ 1,321 394 112 131 9
నిడదవోలు 1,892 563 546 87 17
నిడదవోలు అర్బన్ 520 392 262 265 26
నిడమర్రు 2,125 1,130 332 37 10
పాలకొల్లు 1,449 904 443 30 14
పాలకొల్లు అర్బన్ 841 288 141 8 15
పాలకోడేరు 581 481 217 9 13
పెదపాడు 343 621 527 56 47
పెదవేగి 44 628 725 41 27
పెంటపాడు 1,840 720 410 11 19
పెనుగొండ 1,663 418 285 16 24
పెనుమంట్ర 447 266 191 6 9
పెరవలి 2,157 397 345 9 27
పోడూరు 654 527 311 4 16
పోలవరం 688 335 207 18 455
తాడేపల్లిగూడెం 2,085 656 529 9 53
తాడేపల్లిగూడెం అర్బన్ 2,043 573 245 220 34
తణుకు 746 392 255 24 12
తణుకు అర్బన్ 1,001 549 337 64 47
తాళ్లపూడి 1,304 254 670 4 7
టి.నరసాపురం 881 901 788 25 155
ఉండి 1,039 668 157 2 23
ఉండ్రాజవరం 763 311 317 15 16
ఉంగుటూరు 1,353 1,193 493 12 67
వీరవాసరంఽ 1,228 337 178 6 15
వేలేరుపాడు 4 9 47 11 55
యలమంచిలి 2,500 651 434 4 14
==
మొత్తం 66,421 36,012 2,3711 3,041 3,291
==
కేటాయింపులు ఇలా
కార్పొరేషన్ మొత్తం యూనిట్లు మొత్తం రుణం విలువ
కాపు కార్పొరేషన్ 7,000 రూ.140 కోట్లు
కాపు గ్రూపులకు 1,000 రూ.50 కోట్లు
బీసీ కార్పొరేషన్ 1,974 రూ.39.48 కోట్లు
బీసీ ఫెడరేషన్ (196 గ్రూపులు) 2,945 రూ.58.90 కోట్లు
ఎస్సీ కార్పొరేషన్ 3,500 రూ.54.40 కోట్లు
మైనార్టీ కార్పొరేషన్ 295 రూ.1.45 కోట్లు
క్రిస్టియన్, మైనార్టీ 240 రూ.2.40 కోట్లు
ఎస్టీ కార్పొరేషన్ 248 రూ.2.88 కోట్లు
==
మొత్తం యూనిట్లు 17,202 రూ.349.51 కోట్లు