breaking news
co-chairman
-
ఏటా మూడు వినూత్న ఉత్పత్తులు: డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చికిత్స ప్రమాణాలను మెరుగుపర్చగలిగే మూడు వినూత్న ఉత్పత్తులను ఏటా ఆవిష్కరించాలని ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ (డీఆర్ఎల్) నిర్దేశించుకుంది. అలాగే 2030 నాటికి 150 కోట్ల మంది పేషంట్లకు తక్కువ ధరల్లో ఔషధాలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే దశాబ్ద కాలానికి సంబంధించి నిర్దేశించుకున్న సుస్థిర వృద్ధి లక్ష్యాల ప్రణాళికను కంపెనీ గురువారం ఆవిష్కరించింది. దీని ప్రకారం కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా, 2030 నాటికి పూర్తిగా 100 శాతం పునరుత్పాదక విద్యుత్‌నే వాడుకునేలా ప్రణాళికలు ఉన్నాయి. అలాగే 2027 నాటికి మార్కెట్లో తామే ముందుగా ప్రవేశపెట్టే ఉత్పత్తులు 25 శాతం ఉండేలా కంపెనీ కృషి చేయనుంది. అటు సీనియర్ లీడర్షిప్ స్థాయిలో మహిళల సంఖ్యను ప్రస్తుత స్థాయికి మూడు రెట్లు పెంచుకుని 35 శాతానికి పెంచుకోనుంది. సామాజిక, పర్యావరణ లక్ష్యాలపరంగా చూస్తే వ్యర్థాలను గణనీయంగా తగ్గించుకోవడం తదితర అంశాలు ఉన్నాయి. (ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు తీపికబురు!) -
మూర్తిదే పైచేయి: ఇన్ఫీకి కో-చైర్మన్
ముంబై : వేతన ప్యాకేజీ విషయంలో ఇటీవల ఇన్ఫోసిస్ లో నెలకొన్న వివాదం తెలిసిందే. బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు అసలు పడటం లేదు. కంపెనీ గవర్నెర్స్ విషయంలో ఇప్పటికే పలుమార్లు కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పలు హెచ్చరికలు కూడా చేశారు. కాగ, ఈ విషయంలో కంపెనీ చైర్మన్ శేషసాయిపై నారాయణమూర్తినే పైచేయి సాధించారు. స్వతంత్ర బోర్డు సభ్యుడు రవి వెంకటేశన్ ను కంపెనీ కో-చైర్మన్ గా నియమించేలా చేశారు. కంపెనీలో కార్పొరేట్ పాలన విషయంలో వివాదం నెలకొన్న అనంతరం మూర్తితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపిన కీలక వ్యక్తులే వెంకటేశన్ ఒకరు. కంపెనీ గవర్నెర్స్ లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు నేపథ్యంలో చైర్మన్ శేషసాయికి కో-చైర్మన్ గా మరో కీలక వ్యక్తిని నియమించాలని మూర్తి ఆదేశించారు. కంపెనీ వ్యూహాలను అమలు చేస్తూ మేనేజ్ మెంట్ కు సపోర్టు చేయడానికి రవి తనకు సాయపడతాడని శేషసాయి తెలిపారు. ఇన్ఫోసిస్ అంతకమునుపు కూడా మూర్తి రికమెండ్ చేసిన డీఎన్ ప్రహ్లాద్ ను బోర్డులోకి తీసుకుంది. వెంకటేశన్ ప్రస్తుతం బ్యాంకు ఆఫ్ బరోడా చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. మైక్రోసాప్ట్ ఇండియాకు మాజీ చైర్మన్ ఇతను. టెక్నాలీజ ఇండస్ట్రీకి ఇది ఎంతో ఉత్తేజకరమైన సమయంని, శేష, విశాల్, టీమ్ తో వర్క్ చేసే అవకాశం దక్కడం తనకు చాలా సంతోషానిస్తుందని రవి వెంకటేశన్ చెప్పారు. కంపెనీలో నెలకొన్న పరిణామాలకు బాధ్యత వహించాలని పేర్కొంటూ ఇప్పటికే పలువురు శేషసాయిని రాజీనామా చేయాలంటూ డిమాండ్ కూడా చేశారు.