breaking news
chips in petrol pumps
-
ఘరానా మోసం.. పెట్రోల్ బంకుల్లో కొన్నేళ్లుగా చిప్ దందా.. లీటర్‌కు బదులు..
సాక్షి, హైదరాబాద్: నగరంలో పెట్రోల్ బంక్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు బంక్ యజమానులు ఎలక్ట్రానిక్ చిప్‌లతో తక్కువ పెట్రోల్ పోస్తూ వాహనదారుల జేబులకు గండికొడుతున్నారు. తాజాగా, నగరంలోని పలు బంకుల్లో ఎస్వోటీ టీమ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో కొందరు బంక్ యజమానులు చిప్ అమర్చి లీటర్‌కు రూ.10 గండి కొడుతున్నట్టు గుర్తించారు. వాహనదారులను నిలువుదోపిడీ చేస్తున్నట్టు కనుగొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ చీకటి దందా జరుగుతున్నట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారిని గట్టిగా విచారించడంతో నగరవ్యాప్తంగా పలు బంకుల్లో చిప్‌లు అమర్చినట్టు నిందితులు వెల్లడించారు. -
పెట్రోలు బంకు మాయమైపోయింది!
పెట్రోలు బంకులు యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నారని వాళ్ల మీద దాడులు చేస్తుంటే.. దాడి విషయాన్ని కొద్ది నిమిషాల ముందుగా తెలుసుకున్న ఓ యజమాని.. ఏకంగా పెట్రోలు పోసే మిషన్నే తీసి దాచేశారు! అలా తన బంకునే ఆయన మాయం చేశారు. బంకు పునర్నిర్మాణంలో ఉందంటూ బోర్డు పెట్టి.. దాడి నుంచి తప్పించుకోవాలని చూశారు. అయితే తలదన్నేవాడుంటే తాడి తన్నేవాడు ఉంటాడన్నట్లు.. అతగాడి పప్పులు అధికారుల దగ్గర ఉడకలేదు. ఇలాంటి 'పునర్నిర్మాణంలో ఉన్న' పలు బంకులమీద కూడా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. వాళ్లు దాచిపెట్టిన మిషన్లను బయటకు తీయించి మరీ వాటిని తనిఖీ చేశారు. ఆయా మిషన్లలో చిప్‌లు పెట్టిన విషయాన్ని గుర్తించి, వాటిని వెంటనే తీసి పారేయించారు. వినియోగదారులను మోసం చేయడానికి వీలుగా పెట్రోలు బంకుల్లో ఇలాంటి చిప్‌లు పెట్టి, పైకి తగినంత పోసినట్లు చూపిస్తూనే అందులో కోత పెడుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా యూపీ పోలీసులు చేస్తున్న దాడుల్లో ఇలాంటివి దాదాపు వెయ్యి వరకు చిప్‌లు బయటపడ్డాయి. వీటి ద్వారా రోజుకు రూ. 15 లక్షల విలువైన పెట్రోలును బంకుల యాజమాన్యాలు చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. యూపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6వేల పెట్రోలు బంకులుంటే అన్నింటిమీదా దాడులు జరగబోతున్నాయి. ఇప్పటివరకు 9 పెట్రోలు బంకులను సీల్ చేసి, 23 మందిని అరెస్టు చేశామని, వారిలో నలుగురు యజమానులు కూడా ఉన్నారని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు చెప్పారు. ప్రతి లీటరుకు 100 మిల్లీలీటర్లు తక్కువగా పోస్తున్నారు.