breaking news
chicken neck
-
బంగ్లాకు రెండు ‘చికెన్ నెక్‌లు’: మ్యాప్ షేర్ చేసిన అస్సాం సీఎం శర్మ
గౌహతి: బంగ్లాదేశ్‌ను ఈశాన్య రాష్ట్రాలలో కలిపే భారతదేశ చికెన్ నెక్ కారిడార్(Chicken Neck Corridor)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్‌పై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో రెండు ఇరుకైన ‘చికెన్ నెక్’లు ఉన్నాయని, అవి మరింత దుర్భలమైనవని శర్మ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో గల ‘చికెన్స్ నెక్’ గురించి ముహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యల దరిమిలా సీఎం శర్మ ఈ విధంగా స్పందించారు.బంగ్లాదేశ్(Bangladesh)లోని మొదటి ‘చికెన్ నెక్’ దఖిన్ దినాజ్‌పూర్ అని, ఇది నైరుతి గారో హిల్స్ మధ్య 80 కిలోమీటర్ల పొడవైన ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్ అని పేర్కొన్నారు. ఈ మార్గంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే రంగ్‌పూర్ డివిజన్‌ను బంగ్లాదేశ్ నుండి పూర్తిగా వేరు చేయవచ్చని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో తెలిపారు. అలాగే ఈ రహదారిని చూపించే మ్యాప్‌ను ఆయన పంచుకున్నారు. రెండవది దక్షిణ త్రిపుర నుండి బంగాళాఖాతం వరకు ఉన్న 28 కిలోమీటర్ల పొడవైన చిట్టగాంగ్ కారిడార్ అని శర్మ తెలిపారు. భారతదేశానికున్న చికెన్ నెక్ కంటే చిన్నగా ఉన్న ఈ కారిడార్ బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని, రాజకీయ రాజధానికి మధ్య ఉన్న ఏకైక లింక్ అని ఆయన చిట్టగాంగ్ -ఢాకాలను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు.భారతదేశంలోని సిలిగురి కారిడార్ మాదిరిగానే బంగ్లాదేశ్‌లోనూ రెండు ఇరుకైన కారిడార్లు ఉన్నాయని సీఎం అన్నారు. కొంతమంది మరచిపోయిన భౌగోళిక వాస్తవాలను తాను గుర్తుచేస్తున్నానని పేర్కొన్నారు. గత మార్చిలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌లో చైనా కార్యకలాపాలు విస్తరించడాన్ని ఆహ్వానిస్తూ, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను ‘సెవెన్ సిస్టర్స్’(Seven Sisters’) అని అంటారని, ఇవి బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితంగా ఉన్నాయని, అక్కడి వారికి సముద్ర తీరాన్ని చేరుకోవడానికి ఇతర మార్గాలు లేవని యూనస్ వ్యాఖ్యానించారు. అందుకే మేమే వారికి రక్షకులం అని వ్యాఖ్యానించారు. ఇది బంగ్లాదేశ్‌కు పలు అవకాశాలను అందిస్తుందని, చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించడంలో ఇది అనుకూలంగా ఉంటుందని యూనస్ పేర్కొన్నారు.దీనిపై స్పందించిన సీఎం శర్మ ఈ ప్రకటనను అభ్యంతరకరమైనదిగా, తీవ్రంగా ఖండించదగినదిగా పేర్కొన్నారు. యూనస్ ప్రకటన దరిమిలా చికెన్స్ నెక్ కారిడార్ కింద, చుట్టూ మరింత బలమైన రైల్వే , రోడ్డు నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయడం అత్యవసమని పేర్కొన్నారు. అలాగే చికెన్స్ నెక్‌ను దాటేందుకు, ఈశాన్యాన్ని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించేందుకు ప్రత్యామ్నాయ రహదారి మార్గాలను అన్వేషించాలని సీఎం అన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ యూనిస్ చేసిన ప్రకటనలను తేలికగా తీసుకోకూడదని, వారి వ్యూహాత్మక, దీర్ఘకాలిక అజెండాలను ప్రతిబింబిస్తాయని సీఎం శర్మ పేర్కొన్నారు. కాగా బారతదేశంలోని ఈ‘చికెన్ నెక్’ను సిలిగురి కారిడార్ అని కూడా పిలుస్తారు. ఇరుకుగా ఉన్న కారిడార్ కేవలం 20 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీని భౌగోళిక ఆకారం కారణంగా దీనిని ‘చికెన్ నెక్’ అని పిలుస్తారు. ఈ మార్గానికి ఉత్తరాన నేపాల్, భూటాన్, దక్షిణాన బంగ్లాదేశ్ ఉన్నాయి.ఇది కూడా చదవండి: పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఆగ్రహం?.. కారణమిదే.. -
‘కోడి మెడ’పైనే డ్రాగన్ కన్ను!
‘సిలిగురి కారిడార్’పై పట్టు బిగించేందుకు చైనా కుయుక్తులు - భూటాన్‌లోని డోకాలా వరకు రహదారి నిర్మాణానికి యత్నాలు - ఆ కారిడార్‌ను దిగ్బంధిస్తే భారత్–ఈశాన్య రాష్ట్రాల సంబంధాలు కట్ - రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న భారత్.. ఫలితమే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఈశాన్యరాష్ట్రాలతో భారత ప్రధాన భూభాగానికి ఉన్నది ఒకేఒక దారి. అది బెంగాల్‌లోని సిలిగురి మీదుగా వెళుతుంది. భౌగోళికంగా భారత్‌కు అత్యంత కీలకమైన ఈ భూభాగం గుండానే రైలు, రోడ్డు మార్గాలున్నాయి. ఈశాన్యాన్ని దేశంతో కలుపుతున్నాయి. ఉత్తరాన నేపాల్, దక్షిణాన బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య సన్ననిపాయలా ఉన్న భూభాగాన్నే ‘సిలిగురి కారిడార్’గా పిలుస్తారు. దీనికే మరోపేరు కోడి మెడ. అవసరమైతే గంటల్లో ఈ కోడి మెడను పట్టేసేందుకు వీలుగానే చైనా... భూటాన్ భూభాగంలో ఉన్న డోకాలాలో రహదారిని నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. భూటాన్‌లో అంతర్భాగమైన డోక్లామ్ పీఠభూమిలో డోకాలా ఉంది. భారత్, చైనా, భూటాన్ దేశాల సరిహద్దులు కలిసే ‘ట్రై జంక్షన్’కు సమీపంలో ఉంది. తమ సరిహద్దులోని యడాంగ్ నుంచి డోకాలాకు రోడ్డు నిర్మిస్తే... అవసరమైనపుడు భారత సరిహద్దుల సమీపంలోకి అత్యంత వేగంగా చైనా బలగాలను, ట్యాంకులను తరలించేందుకు వీలుంటుందనేది డ్రాగన్ ఆలోచన. దీన్ని భారత్ వ్యతిరేకించి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంది. ఫలితంగా చైనా– భారత్‌ల మధ్య తాజా ఉద్రిక్తతలు. భూటాన్‌తో మనకు 2007లో కుదిరిన ఒప్పందం ద్వారా... ఆ దేశ భద్రతకు మనం హామీదారుగా వ్యవహరిస్తున్నాం. అత్యంత సన్నిహితమైన మిత్రదేశానికి అండగా నిలవడం భారత్ ధర్మం. వ్యూహాత్మకంగా కూడా చైనా ఆర్మీ మన సరిహద్దులవైపు చొచ్చుకురాకుండా నిరోధించడం కూడా మనకు అవసరమే. ఈశాన్యానికి లైఫ్‌లైన్ ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలను మిగతా భారత్‌తో కలిసే సిలిగురి కారిడార్‌కు ఒక వైపు నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్ సరిహద్దులున్నాయి. 200 కిలోమీటర్ల పొడవు, సగటున 60 కిలోమీటర్ల వెడల్పున్న భూభాగం. సిలిగురి కారిడార్ వెడల్పు ఒకచోటైతే 17 కిలోమీటర్లే. దీన్ని ఒకవేళ చైనా ఆధీనంలోకి తీసుకుంటే.. బెంగాల్‌లోని సిలిగురి, డార్జిలింగ్, జల్పాయ్గురిలతో పాటు ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు (సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర) దిగ్బంధనమైనట్లే. (చదవండి: భారత్-చైనా.. ఎవరి సత్తా ఎంత?) వీటిని చేరుకోవడానికి భారత్‌కు మరో రోడ్డు మార్గం లేదు. ఈశాన్య రాష్ట్రాలకు నలువైపులా చైనా, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలున్నాయి. జలమార్గం అసల్లేని ప్రాంతం. దాదాపు ఆరు కోట్ల మంది ప్రజలకు సరుకు రవాణా మార్గాలు మూసుకుపోతాయి. మిగతా భారతావనితో సంబంధాలు తెగిపోతాయి. విమానాల ద్వారా మాత్రమే ఈశాన్యానికి చేరుకోగలం. కాబట్టి సిలిగురి కారిడార్ భౌగోళికంగా అత్యంత కీలకం. డోకాలా నుంచి దాదాపు 130 కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తే చైనా ఆర్మీ సిలిగురి కారిడార్‌ను తమ ఆధీనంలోకి తీసుకోగలదు. అంతేకాకుండా ఈశాన్యంలో చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులకు సరఫరాలు నిలిచిపోతాయి. కొత్తగా బలగాలను తరలించాలన్నా వీలుండదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొనే... అవసరమైతే కోడి మెడను పట్టుకోగలిగే స్థితిలో ఉండాలని చైనా భావిస్తోంది. దిగ్బంధిస్తే ఏంజరుగుతుంది? ఈశాన్యానికి భారతీయ రైలు మార్గాన్ని అనుసంధానించే జంక్షన్ న్యూజల్పాయ్గురి రైల్వేస్టేషన్. అక్కడి నుంచి గౌహతితో పాటు పలు రాష్ట్రాలకు రైల్వే లింకు ఉంది. జాతీయ రహదారి 31 సిలిగురి– గౌహతిని కలుపుతుంది. రవాణాపరంగా ఈ రెండు మార్గాలు భారత్‌కు ఆయువు పట్టు. అస్సాం నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌కు రోడ్డుమార్గం ఉంది. వాస్తవాధీన రేఖకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తవాంగ్‌లో భారత సైన్యానికి చెందిన ఫోర్ కార్ప్స్ మొహరించి ఉంది. ఫోర్ కార్ప్స్లో 60 వేల మంది సైనికులు ఉంటారు. న్యూజల్పాయ్గురి నుంచి దిమాపూర్ (నాగాలాండ్), దిబ్రూఘడ్ (ఉత్తర అస్సాం)లకు రైల్వే లైన్ ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాల ద్వారా నాగాలాండ్, పశ్చిమ అరుణాచల్‌ప్రదేశ్‌లు అనుసంధానమవుతాయి. ఇక్కడ మరో 60 వేల మంది భారత సైనికులతో కూడిన త్రీ కార్ప్స్ ఉంది. సిక్కింలో ఉన్న 33 కార్ప్స్‌ను కూడా రైల్వే అనుసంధానిస్తుంది. ఒకవేళ సిలిగురి కారిడార్ దిగ్బంధనం జరిగితే... భారత సైనికులకు ఆయుధ, నిత్యావసర సరఫరాలు మొత్తం నిలిచిపోతాయి. భారత సైన్యం అయోమయంలో పడుతుంది. రెండోది... పాలనావ్యవహారాలపై భారత్‌కు నేరుగా అజమాయిషీ లేని పరిస్థితి వస్తే... ఈశాన్యంలో సంక్షోభం ముదురుతుంది. పలు రాష్ట్రాల్లో వేర్పాటువాదులు, తీవ్రవాద సంస్థలు ఉన్నందున ఈశాన్యంలో శాంతిభద్రతలను కాపాడి... పరిస్థితిని అదుపులో ఉంచడం కష్టతరమవుతుంది. కాబట్టి భారత్‌తో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారితీస్తే మొదట డ్రాగన్ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన కోడి మెడపైనే దృష్టి సారిస్తుంది. ఎదురుదెబ్బ కొట్టొచ్చు... సిక్కిం, భూటాన్‌ల మధ్య చైనా భూబాగం చిన్న ద్వీపకల్పంగా చొచ్చుకు వచ్చినట్లు ఉంటుంది. యడాంగ్ నుంచి ట్రై జంక్షన్ వైపు వస్తున్న కొద్దీ కుచించుకుపోతుంది. చైనా తమ బలగాలను భారత్ దిశగా ఇక్కడి చుంబీ లోయ గుండా ముందుకు నడపాల్సి ఉంటుంది. ఇది బాగా ఇరుకైన ప్రాంతమని, ఇటు సిక్కిం, అటు భుటాన్ (సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటే)లలో యుద్ధట్యాంకులు మొహరించి క్షిపణులను ప్రయోగించినా, వైమానిక దళాల ద్వారా బాంబుదాడులను దిగినా భారత్... చైనా సైన్యాన్ని కకావికలం చేయగలదని... వ్యూహాత్మకంగా భారత్‌కు ఇది అనుకూలించే అంశమని సైనిక నిపుణుల అభిప్రాయం. చైనా సిలిగురి కారిడార్‌ను ఆక్రమిస్తే... మనం చుంబీ లోయపై గురిపెట్టడం ద్వారా చైనా వెనక్కి తగ్గేలా చేయవచ్చని వారి అభిప్రాయం. - సాక్షి నాలెడ్జ్ సెంటర్