breaking news
chavva rajasekharreddy
-
చవ్వా అంకిత్‌కు వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు చవ్వా రాజశేఖరరెడ్డి కుమారుడి వివాహ వేడుకలకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం హాజరయ్యారు. ఈసందర్భంగా కలశ పూజలో పాల్గొని వరుడు అంకిత్రెడ్డిని దీవించారు. అనంతరం పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేసి ఆమె వెనుదిరిగారు. అంతకముందు అనంతకు చేరుకున్న వైఎస్ విజయమ్మకు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్వీవీయూ పాలక మండలి సభ్యురాలు తోపుదుర్తి నయనతారెడ్డి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ రాగే హరిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ఎల్ఎం ఉమ, వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి, గౌస్‌బేగ్, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, శ్రీదేవి, విద్యాసాగర్‌రెడ్డి, అనిల్‌కుమార్ గౌడ్, కొర్రపాడు హుస్సేన్‌పీరా పాల్గొన్నారు. చదవండి: (అధికారం దక్కదనేగా ఈ దాష్టీకాలు?) -
ప్రజల మనుసును చూరగొన్న నేతలు
- నారాయణరెడ్డి, రామ్మోహన్‌రెడ్డిల సంస్మరణసభలో వైఎస్సార్సీపీ నేతలు అనంతపురం రూరల్ : ప్రజల మనసును చురగొన్న నేతలుగా దివంగత మాజీ మున్సిపల్ చైర్మెన్ అంబటి నారాయణరెడ్డి, వై. రామ్మోహన్‌రెడ్డి నిలిచిపోయారని.. ప్రతి రాజకీయనేతా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. శుక్రవారం అంబటి నారాయణరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మాధవి, అనూషల సంస్మరణ సభను వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన మయూరి లాడ్జ్ ఆవరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా హాజరైన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రెండుసార్లు చైర్మెన్‌గా కొనసాగిన నారాయణరెడ్డి ప్రజలకు ఎన్నో సేవలను చేశారన్నారు. చైర్మెన్ పదవినే ఆయన ఇంటి పేరుగా మలచుకున్న వ్యక్తులు అరుదుగా కనిపిస్తారన్నారు. రామ్మోహన్‌రెడ్డి కుటుంబం సైతం ప్రజా సేవలో పునీతమైందన్నారు. అంబటి నారాయణరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ ఎంపీ అనంత వెంటకరామిరెడ్డి మాట్లాడుతూ యాడికి మండలం నుంచి వ్యాపారం నిమిత్తం అనంతపురం నగరానికి సామాన్య వ్యక్తులుగా వచ్చి వచ్చిన ఇరువురు మంచి పేరును సంపాదించుకున్నారన్నారు. మురికివాడల అభివృద్దే ధ్యేయంగా అంబటి నారాయణరెడ్డి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నారాయణరెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు ఉన్నత స్థానంలో ఉన్నా సాదాసీదాగా ప్రజల్లో కలిసిపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తులని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మాట్లాడుతూ రామ్మోహన్‌రెడ్డి అకాల మరణం కలచి వేసిందన్నారు. చైర్మన్‌గా నారాయణరెడ్డి, కార్పొరేటర్‌గా మాధవిలున్న సమయంలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి అనేక సేవలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప, మాజీ మేయర్ రాగే పరశురాం, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర నాయకులు నాగిరెడ్డి, పామిడి వీరాంజనేయులు, నదీమ్, ఎల్ఎం మోహన్‌రెడ్డి, అనంత చంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ గంపన్న, బోయ సుశీలమ్మ, వీరన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొని అంబటి తిరుమలరెడ్డి, వై.అనుదీపరెడ్డిలను ఓదార్చారు.