breaking news
ch vidyasagara rao
-
అది అత్యంత కఠిన సమయం!
చెన్నై: తమిళనాడు గవర్నర్‌గా తాను అదనపు బాధ్యతలు నిర్వర్తించిన 13 నెలల కాలం ఆ రాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యంత క్లిష్టమైన దశ అని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు అభివర్ణించారు. అధినేత్రి జయలలిత మరణం అనంతరం అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభం.. తదనంతర పరిణామాలు అత్యంత సున్నితమైనవన్నారు. ‘దోజ్ ఈవెంట్ఫుల్ డేస్’ పేరుతో నాటి పరిణామాల్ని అక్షరబద్ధం చేసిన పుస్తకాన్ని సోమవారం రాజ్‌భవన్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. విద్యాసాగర్ రావు గవర్నర్‌గా ఉన్న సమయంలోనే జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం, ఆ తరువాత మరణించడం, వార్దా తుపాను, జల్లికట్టు నిరసనలు.. మొదలైన అత్యంత సున్నిత ఘటనలు చోటు చేసుకున్నాయి. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన తనను నాటి సీఎం జయలలిత విమానాశ్రయానికి వచ్చి ఆహ్వానించడాన్ని విద్యాసాగర్ రావు గుర్తు చేసుకుంటూ.. ఆమె అంటే తనకెంతో గౌరవమన్నారు. పళనిస్వామి ప్రభుత్వంపై 19 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడు బలపరీక్ష నిర్వహించకపోవడంపై విద్యాసాగర్ రావుపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. -
యువతే దేశ సంపద
మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు ఇబ్రహీంపట్నం: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశానికి యువతే అమూల్యమైన శక్తిసంపదలని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగరరావు చెప్పారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో శుక్రవారం నోవా ఫార్మసీ కళాశాల అదనపు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యాసాగరరావు మాట్లాడుతూ యువకులు, విద్యార్థులు తమ మేథాశక్తిని దేశానికి వినియోగించాలని కోరారు. ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇండియా అన్నట్లుగానే మేక్ విజయవాడ నినాదంతో అభివృద్ధి పథంలో ముందుండాలన్నారు. ప్రపంచ దేశాలను శాసిస్తున్న రాజకీయాల్లో విద్యార్థులు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం కమిషనర్ ముత్తంశెట్టి విజయనిర్మల, కళాశాల కరస్పాండెంట్ ఎం.కృష్ణారావు, డెరైక్టర్ జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.