breaking news
CFO post
-
డైనమిక్ అయ్యర్
సవాలును తలకెత్తుకోవడం అంటే ‘తలకు మించిన భారం’ అనుకుంటారు కొందరు. సవాలును స్వీకరించడం అనేది తమను తాము నిరూపించుకునే అపూర్వ అవకాశం అనుకుంటారు మరికొందరు. అపర్ణ అయ్యర్ రెండో కోవకు చెందిన వ్యక్తి. ‘సీఏ పరీక్ష పాస్ కావడం అంటే మాటలు కాదు’ లాంటి ప్రతికూల మాటలు అదేపనిగా వినిపించినా ‘సీఏ’ పై ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు. ఆ ఆసక్తే ఆమెను సీఏ బంగారు పతక విజేతను చేసింది. సవాలును చిరునవ్వుతో స్వీకరించే ఆమె ధైర్యం ‘విప్రో’ లాంటి పెద్ద సంస్థలో సీఎఫ్‌వో (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా బాధ్యతలు స్వీకరించేలా చేసింది.... లీడర్ అంటే ఎవరు? దారి తెలిసిన వారు, ఆ దారిలో ఆటంకాలు లేకుండా ప్రయాణించే వారు, అవసరమైతే కొత్త దారి చూపించేవారు. ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఎన్నో అపర్ణ అయ్యర్‌లో దండిగా ఉన్నాయి కాబట్టే ఆమె మల్టీనేషనల్ ఐటీ కార్పోరేషన్ విప్రోలో ఎన్నో ఉన్నతస్థానాల్లో పనిచేసింది. విప్రోతో ఆమెది రెండు దశాబ్దాల అనుబంధం. సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్‌గా విప్రోలోకి అడుగు పెట్టిన అపర్ణ అక్కడి ఫైనాన్స్ టీమ్‌తో పని చేస్తూ ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ సీఎఫ్‌వో స్థాయికి చేరింది. ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్, క్యాపిటల్ అలోకేషన్, ఫండ్ రైజింగ్, బిజినెస్ స్ట్రాటజీ అండ్ గ్రోత్... మొదలైన సబ్జెక్లలో అపర్ణ నిపుణురాలు. సబ్జెక్ట్‌లో నైపుణ్యం ఉండగానే సరిపోదు. వివిధ సందర్భాలలో ఆ నైపుణ్యాన్ని సృజనాత్మకంగా అన్వయించి మంచి ఫలితాలు సాధించగలగాలి. ఈ విషయంలో ఎప్పుడూ వెనకబడిపోలేదు అపర్ణ అయ్యర్. ఇంటర్నల్ ఆడిట్, బిజినెస్ ఫైనాన్స్, ఫైనాల్సియల్ ప్లానింగ్ అండ్ ఎనాలటిక్స్, కార్పోరేట్ ట్రెజరీ....ఇలా కంపెనీకి సంబంధించి ఎన్నో విభాగాలో కీలకపాత్ర పోషించింది. ముంబై నర్సీ మోంజీ కాలేజి నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన అపర్ణ 2002 సీఏ (చార్టెట్ ఎకౌంటెంట్) గోల్డ్ మెడలిస్ట్. ‘అపర్ణ అయ్యర్‌లో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. తన ముందుచూపు, సాహసోపేతమైన నిర్ణయాలతో సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది’ అంటున్నాడు విప్రో సీయివో డెలాపోర్ట్. ‘కీలకమైన సమయంలో సీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మరిన్ని విజయాలు సాధించే లక్ష్యంతో మా ప్రయాణం కొనసాగుతుంది’ అంటుంది అపర్ణ అయ్యర్. -
‘వన్నాక్రై’ పై సెర్ట్–ఇన్ సూచనలు పాటించండి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఐటీ నెట్‌వర్క్‌లను అస్తవ్యస్తం చేస్తున్న రాన్సమ్వేర్ ’వన్నాక్రై’ దాడుల బారిన పడకుండా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) సూచనలు పాటించాలంటూ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. అలాగే తమ తమ సిస్టమ్స్‌పై వైరస్ దాడులు జరగకుండా ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్‌ను కూడా అప్డేట్ చేసి ఉంచాలని సూచించింది. రష్యా, బ్రిటన్ సహా 150 పైగా దేశాల్లోని ఐటీ నెట్‌వర్క్‌లను వన్నాక్రై దెబ్బతీసింది. మైక్రోసాఫ్ట్‌కి చెందిన ఎక్స్పీ వంటి పాత తరం ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేస్తున్న కంప్యూటర్లు దీని బారిన పడ్డాయి. దీంతో.. రాన్సమ్వేర్ దాడుల నుంచి నెట్‌వర్క్‌లను రక్షించుకునేందుకు దేశీయంగా సంస్థలు తీసుకోతగిన చర్యల జాబితాను సెర్ట్–ఇన్ రూపొందించిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్‌లో సీఎఫ్‌వో పోస్టు..: ఆర్బీఐ తొలిసారిగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో) పోస్టును ఏర్పాటు చేసింది. ఇందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈడీ హోదా ఉండే సీఎఫ్‌వో.. అకౌంటింగ్ విధానాల రూపకల్పన, ఆర్బీఐ ఆర్థిక సమాచారం తదితర బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.