breaking news
ceritificates examination
-
24 నుంచి ఏపీ పాలీసెట్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి బ్యూరో: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన పాలిసెట్–19 కౌన్సెలింగ్ మే 24 నుంచి మే 29 వరకు జరగనుంది. మే 24న 1 నుంచి 8,000 వరకు, మే 25న 8,001 నుంచి 25,000 వరకు, మే 26న 25,001 నుంచి 45,000 వరకు, మే 27న 45,001 నుంచి 65,000 వరకు, మే 28న 65,001 నుంచి 87,000 వరకు, మే 29న 87,001 నుంచి చివరి ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 37 కేంద్రాలలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు తమ పాలిసెట్ ర్యాంకు కార్డు, పాలిసెట్ హాల్‌టికెట్, 10వ తరగతి హాల్‌టికెట్, 10వ తరగతి మార్కుల లిస్టు(నెట్ కాపి), 4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్, నివాస, కుల, ఆదాయ/రేషన్‌కార్డు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు (విద్యార్థి, వారి తల్లితండ్రులది)లను తీసుకెళ్లాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌సెట్లను తీసుకువెళ్లాలి. దివ్యాంగ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్స్ విద్యార్థులు వారికి ప్రత్యేకంగా కేటాయించిన మూడు ప్రభుత్వ పాల్టెక్నిక్ కళాశాలల్లో మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలోని కేంద్రాలలో ఏదైనా ఒక కేంద్రానికి వెళ్లవచ్చు. వెబ్ ఆప్షన్ల నమోదు తేదీలు... అర్హత సాధించిన విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తరువాత మే 27, 28 తేదీల్లో 1–45,000 ర్యాంకు వరకూ, మే 29, 30 తేదీల్లో 45,000 నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు మే 31 ఆప్షన్లు ఇవ్వటానికి చివరి రోజు, ఆప్షన్లలో మార్పులు కావాలంటే ఆ రోజు చేసుకోవచ్చు. సీట్ల కేటాయింపు జూన్ 2న ఉంటుంది. ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, బీసీలు, ఓసీలకు రూ.700 గా నిర్ణయించారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి ఫోన్‌నెం. 6301112473ను, వెబ్సైట్లో హెచ్‌టీటీపీఎస్ ఏపీపీఓఎల్‌వైసీఈటి.ఎన్ఐసి.ఐఎన్‌లను వినియోగించుకోవచ్చు. -
కానిస్టేబుల్ పోస్టులకు సర్టిఫికేట్ల పరిశీలన
ఇటీవల వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ పలు సూచనలు విడుదల చేసింది. - 2015వ సంవత్సరంలో సైబరాబాద్-2, 1వ బెటాలియన్ యూసఫ్‌గూడలోని(హైదరాబాద్ జిల్లా) పిఎంటీ/పిఈటీకి హాజరైన అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 10వ తారీఖు వరకు ఉదయం 10.30కు గెజిటెడ్ ఆఫీసర్‌తో సంతకం చేయించిన వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీలను గచ్చిబౌలి లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సమర్పించాలి. - అభ్యర్థులు అటెస్టేషన్ ఫారాలను తప్పనిసరిగా సొంత దస్తూరితో నింపాలి. - సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అభ్యర్థులు మెడికల్ టెస్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. - ఏయే రోజు ఎవరెవరు హాజరు కావాలననే వివరాలు tslprb వెబ్ సైట్ లో ఉంటాయి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా వివరాలను చూసుకోవచ్చు. - ఈ నెల 7వ తారీఖు ఉదయం 10గంటల నుంచి అభ్యర్థులు ఇంటిమేషన్ లెటర్లను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇందుకోసం ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ను ఎంటర్ చేయాలి. - అభ్యర్థులు అటెస్టేషన్ ఫార్మ్ ను నింపకున్నా, సర్టిఫికెట్ పరిశీలనకు హాజరుకాకున్నా, మెడికల్ పరీక్షలో విఫలమైనా వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తారు.