breaking news
Business sentiment
-
కరోనా కాటు: వ్యాపార సెంటిమెంట్ బేజారు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభం ప్రపంచంతోపాటు భారత ఆర్థికవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ దశల లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో భారతీయ వ్యాపార సెంటిమెంట్ గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా దిగజారింది. తొలిసారి ప్రతికూలంగా మారింది. డిమాండ్ క్షీణత లాభాలపై వ్యాపారుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ అనిశ్చితి, ఆర్థిక మందగమనంతో ప్రపంచంలోనే అతి దారుణమైన దుష్ప్రభావాన్ని ఎదుర్కొంటోందని సోమవారం విడుదల చేసిన తాజా సర్వేలో తేలింది.(గుడ్న్యూస్: కరోనా డ్రగ్ ధర తగ్గింది) ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా బిజినెస్ ఔట్లుక్ సర్వే ఫలితాల ప్రకారం జూన్లో మునుపెన్నడూ లేని స్థాయికి బిజినెస్ సెంటిమెంట్ పడిపోయింది. బిజినెస్ యాక్టివిటీ నికర బ్యాలెన్స్ జూన్ మాసంలో మైనస్ 30 శాతానికి పడిపోయింది. ఇది ఫిబ్రవరిలో 26 శాతం పుంజకుంది. ఇదే ఈ దశాబ్దంలో అతి తక్కువ నమోదు, అలాగే రికార్డు పతనమని సంస్థ ఎకనామిక్స్ డైరెక్టర్ ఆండ్రూ హార్కర్ అన్నారు. 2009 చివరిలో సిరీస్ ప్రారంభమైనప్పటి నుండి వ్యాపార సెంటిమెంట్ ప్రతికూల దృక్పథంలోకి మారడం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఏడాది చివరి నాటికి స్పలంగా పుంజుకునే అవకాశం కనిపిస్తోందన్నారు. -
భారత్ లో పడిపోయిన వ్యాపార ఆశావాదం
న్యూఢిల్లీ : రెండు త్రైమాసికాలుగా టాప్ స్థానంలో ఉన్న భారత్, వ్యాపార ఆశావాద స్థాయిలో(బిజినెస్ అప్టిమిజమ్ ఇండెక్స్) గ్లోబల్ గా మూడో స్థానానికి పడిపోయింది. సంస్కరణలు అమలుచేయడంలో విఫలమవుతుండటంతో వ్యాపార ఆశావాద స్థాయిని ప్రపంచవ్యాప్తంగా భారత్ కోల్పోయింది. ఏకీకృత వస్తుసేవల పన్ను(జీఎస్టీ), ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిల బెడద వంటి కారణాలతో భారత్ తన స్థానాన్ని కోల్పోయిందని రిపోర్టు వెల్లడించింది. తాజా గ్రాంట్ తోర్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ లో ఈ విషయం వెల్లడైంది. 2016 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత మూడో స్థానంలో నిలిచిందని రిపోర్టు నివేదించింది. జీఎస్టీ లాంటి ప్రధాన సంస్కరణల అమలులో విఫలం, పన్ను వివాదాలు ఎంతకీ తేలకపోవడం, నిరర్థక ఆస్తులు పెరగడంతో బ్యాంకింగ్ లో సమస్యలు పెరగడం, బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకుల్లో రీక్యాపిటలైజేషన్ అవసరం రావడం వంటివి కార్పొరేట్ ఇండియాలో వ్యాపార విశ్వాసాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో మొత్తంగా భారత్ లో వ్యాపార ఆశావాద స్థాయిని తగ్గిస్తుందని రిపోర్టు పేర్కొంది. జనవరి-మార్చి త్రైమాసికంలో టాప్ లో నిలిచిన ఉపాధి అంచనాల వృద్ధి రెండో స్థానానికి క్షీణించింది. వ్యాపార అవకాశాలు, మార్కెట్లో ఆశావాద స్థాయి ఎక్కువగానే ఉన్నప్పటికీ.. కీలక సంస్కరణల అమలు పెట్టుబడిదారులు, ర్యాకింగ్ పై ప్రభావం చూపుతుందని గ్రాంట్ తోర్న్టన్ ఇండియా ఎల్ఎల్పీ పార్టనర్ హరీష్ హెచ్వీ చెప్పారు. ఒకవేళ ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు పాస్ అయితే, ఈ ట్రెండ్ రివర్స్ అవుతుందని తెలిపారు.