రాజధాని కోసం బిల్డ్ ఆంధ్రా బాండ్లు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం కోసం అయ్యే నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం వివిధ మార్గాలు అన్వేషిస్తోంది. ప్రజల నుంచి నిధులు సేకరించి, బాండ్లుగా ఇచ్చి, నిర్ణీత సమయానికి అసలు, వడ్డీతో కలిపి ఇవ్వాలనే యోచనలో సర్కారు పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. బిల్డ్ ఆంధ్రా పేరుతో ఈ బాండ్లు జారీ చేస్తే ఎలా ఉంటుందని కొంతమంది ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.
వీటి బాధ్యతలను మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖకు అప్పగిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అయితే, ఇలాంటి బాండ్లు జారీ చేయాలంటే రిజర్వు బ్యాంకు నుంచి కూడా అనుమతి అవసరం అవుతుంది. రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ బుధవారం నాడు హైదరాబాద్ రావడంతో ఆయనతో ఈ విషయాన్ని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రస్తావించారు.