breaking news
Budget discussions
-
‘ఎన్డీయే అంటే.. నో డేటా అవైలబుల్’.. ఎంపీ శశి థరూర్ విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదల సంక్షేమన్ని మర్చిపోయిందని మండిపడ్డారు. బుధవారం లోక్‌సభలో బడ్జెట్ చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాలకు శశి థరూర్ తప్పుపట్టారు. ‘ఎన్డీయే అంటే.. నో డేటా అవైలబుల్. గత పదేళ్లలో దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం తగ్గిపోతుంది. ధనవంతులకు ఖర్చు చేస్తే.. పేద, మధ్య తరగతి ప్రజలు ప్రయోజనం పొందుతారని కేంద్రం అనుకుంటుంది. .. ఆర్థిక వ్యవస్థలో అందరూ భాగస్వాములు కావాలి. కానీ, కేంద్రం అలా చేయకుండా కేవలం మూల ధన వ్యయంపైనే దృష్టి పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థ, పేదవారిపై ఈ బడ్జెట్ ఏ ప్రభావం చూపదు. ఈ విషయాన్ని లోక్‌సభ గ్రహించాలి’ అని శశిథరూర్ అన్నారు. -
ఈటలకు పేరు వస్తే ఓర్వని కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ చర్చలు, ప్రభుత్వ వివరణల్లో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌కు మాట్లాడ టానికి అవకాశం ఇవ్వకుండా స్వయంగా సీఎం కేసీఆరే మాట్లాడు తున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలో ప్రభుత్వం తరఫున ఇచ్చే వివరణల్లో ఆర్థికమంత్రి అధ్యయనం చేసి సభలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే బడ్జెట్ అవసరాలపై మాట్లాడితే ప్రజల్లో, రాజకీయాల్లో ఈటలకు ప్రతిష్ట పెరుగుతుందని, ఓర్వలేనితనంతో సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రతిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.