breaking news
broken track
-
'విజయవాడ-యశ్వంతపూర్' కు తప్పిన ముప్పు
గుంతకల్: అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్ సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్ సమీపంలో 442/50 కిలోమీటర్ వద్ద పట్టా విరిగి ఉండడాన్ని సిబ్బంది గుర్తించి తక్షణమే స్టేషన్‌మాస్టర్ లక్ష్మణ్‌కు సమాచారం అందించారు. సరిగ్గా అదే సమయంలో విజయవాడ- యశ్వంత్‌పూర్ పాసింజర్ రైలు నాల్గో నంబర్ ప్లాట్ఫామ్లోకి రావాల్సి ఉంది. దీంతో అప్రమత్తమైన స్టేషన్ మాస్టర్ ఆ రైలును మూడో నంబర్ ప్లాట్ఫామ్లోకి మళ్లించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. -
విరిగిన రైలు పట్టా..రైళ్లకు అంతరాయం
జనగామ: శ్రీకాకుళం జిల్లా నందిగామ సమీపంలోని రైలు మార్గంలో రైలుపట్టా విరిగింది. ఈ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది ...అధికారులకు సమాచారం అందించారు. తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను ఆపేశారు. పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.