అంతర్జాతీయ అంశాలను గమనిస్తున్నాం: సిన్హా
న్యూఢిల్లీ: యరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్‌పై ఆందోళనలు, అలాగే పెరుగుతున్న చమురు ధరలు వంటి అంతర్జాతీయ పరిణామాలను కేంద్రం జాగ్రత్తగా గమనిస్తోందని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా గురువారం పేర్కొన్నారు. రాజస్వ జ్ఞాన సంగం పేరుతో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న సిన్హా ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తక్కువ ధరల వద్ద క్రూడ్ దిగుమతుల ద్వారా భారత్ చక్కటి ప్రయోజనాలు పొందుతూ వచ్చిందన్నారు.