breaking news
big sketch
-
‘చిప్’ల కోసం ట్రంప్ స్కెచ్
వాషింగ్టన్/తైపీ: సెమీ కండక్టర్ల తయారీలో ద్వీపదేశమైన తైవాన్‌దే అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న సెమీ కండక్టర్లలో 90 శాతానికిపైగా తైవాన్‌లో తయారైనవే. సెల్ఫోన్ల నుంచి అత్యాధునిక డ్రోన్ల దాకా ప్రతి ఎల్రక్టానిక్ పరికరంలో ఈ చిప్‌లు ఉండాల్సిందే. చిప్‌ల రారాజుగా తైవాన్ తలపై ఉన్న కిరీటాన్ని తన్నుకుపోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద స్కెచ్ వేశారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సంస్థగా పేరున్న తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ)తో అమెరికాలో 100 బిలియన్ డాలర్ల (రూ.8.69 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఈ మేరకు ఆ కంపెనీని ఒప్పించారు. గతవారం ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ నిధులతో టీఎస్ఎంసీ అమెరికాలో సెమీకండక్టర్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. అంటే సెమీకండక్టర్లు అమెరికాలోనే ఉత్పత్తి అవుతాయి. అక్కడి నుంచే విదేశాలకు చిప్‌ల ఎగుమతి జరుగుతుంది. ఆదాయం చాలావరకు అమెరికా ఖాతాలోకి వెళ్లిపోతుంది. చిప్‌ల ఉత్పత్తిలో తైవాన్ ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇదే ఇప్పుడు తైవాన్‌లో మంటలు రాజేస్తోంది. జాతీయ భద్రతా సంక్షోభం తైవాన్ అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టి(డీపీపీ)పై మాజీ అధ్యక్షుడు మా యింగ్–జియూ నిప్పులు చెరిగారు. చైనా బారి నుంచి తైవాన్ను కాపాడుతున్నందుకు ట్రంప్‌కు ‘ప్రొటెక్షన్ ఫీజు’ చెల్లిస్తున్నారని డీపీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఎస్ఎంఎస్ను అమెరికాకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం జాతీయ భద్రతా సంక్షోభమేనని తేల్చిచెప్పారు. అమెరికాలో 8.69 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడాన్ని తప్పుపట్టారు. చిప్‌ల తయారీలో తైవాన్ స్థానాన్ని దిగజార్చడం తగదని అన్నారు. ట్రంప్‌తో కుదుర్చుకున్న ఒప్పందం తైవాన్ ప్రజల విశ్వాసాన్ని, ఇతర సంబంధాలను దెబ్బతీస్తుందని మా యీంగ్–జియూ ఆందోళన వ్యక్తంచేశారు. భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాల్లో తైవాన్ హోదాను దిగజారుస్తుందని అన్నారు. అయితే, అమెరికాలో పెట్టుబడులపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తైవాన్ అధ్యక్షుడు లా చింగ్–తే స్పష్టంచేశారు. టీఎస్ఎంసీ విస్తరణ కోసమే ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. దేశ ప్రతిష్టకు వచ్చే ముప్పేమీ లేదని ప్రజలకు హామీ ఇచ్చారు. తైవాన్ను గాలికొదిలేస్తారా? తైవాన్‌పై పొరుగు దేశం చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని, ఏనాటికైనా విలీనం కాక తప్పదని చైనా చెబుతోంది. మరోవైపు అమెరికా మద్దతుతోనే తైవాన్ స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తోంది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం తైవాన్ రక్షణ బాధ్యతను అమెరికా స్వీకరించింది. ఇందుకోసం తైవాన్ రిలేషన్స్ యాక్ట్ తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తైవాన్ విషయంలో అమెరికా స్వరం మారింది. ప్రధానంగా తైవాన్‌కు జీవనాడిగా ఉన్న చిప్‌ల తయారీ రంగంపై ట్రంప్ దృష్టి పెట్టారు. అక్కడి పరిశ్రమను క్రమంగా అమెరికా తరలించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశాన్ని పీల్చిపిప్పి చేసి, ఆఖరికి గాలికి వదిలేయాలన్నదే ట్రంప్ ప్లాన్ అని తైవాన్ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తైవాన్ మరో ఉక్రెయిన్‌లా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నాయి. అమెరికా–తైవాన్ సంబంధాల భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ‘ఈ రోజు ఉక్రెయిన్, రేపు తైవాన్’ అనే మాట తైవాన్‌లో తరచుగా వినిపిస్తోంది. -
బాబుగారి భారీ స్కెచ్
-
బాబుగారి భారీ స్కెచ్
- పోలవరం పనుల్లో భారీ ముడుపులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పక్కా ప్రణాళిక సిద్ధమైంది. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా రూ.4,800 కోట్లు నొక్కేసేందుకు ప్రభుత్వ పెద్దలు పథకం వేశారు. పోలవరానికి జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయిస్తే కేంద్రం జోక్యం చేసుకుంటుందనే భయంతో టెండర్లు లేకుండానే పనులు పంచేసి భారీగా ముడుపులు దండుకోవడానికి వ్యూహం తయారైంది. అందుకోసం అంచనా వ్యయాన్ని ఊహలకు అందనంతగా పెంచేసేందుకు అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు ఇక సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించడం మాత్రమే మిగిలింది. రూ. నాలుగువేల కోట్ల విలువైన పోలవరం కాంట్రాక్టును రష్యా కంపెనీ ‘ట్రాన్స్ట్రాయ్’ భాగస్వామ్యంతో ఇప్పటి టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు దక్కించుకున్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టును నిర్మించే శక్తిసామర్థ్యాలు రాయపాటి కంపెనీకి లేవని, రష్యా కంపెనీ భాగస్వామ్యం కేవలం కాగితాలకే పరిమితమని తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగినా... అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకుండా కాంట్రాక్టును కట్టబెట్టింది. ఆ కంపెనీ కాంట్రాక్టు పొంది రెండేళ్లు దాటినా ఇప్పటికీ నామమాత్రపు పనులకే పరిమితమైంది. ప్రభుత్వం నుంచి రూ.400 కోట్లకు పైబడి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నప్పటికీ ఆ మేరకు పనులు చేయలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆప్తులైన కంపెనీలకు సబ్‌కాంట్రాక్టు కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. అందుకోసం మళ్లీ టెండర్లు పిలవకుండానే పనికానిచ్చేయడానికి అనుసరించాల్సిన విధానాన్ని సూచించాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి నీటిపారుదల శాఖ అధికారులకు ఇటీవల ఆదేశాలు అందాయి. రూ.4,800 కోట్లు బొక్కేసేదిలా... పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2011-12 ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) ప్రకారం నిర్ణయించి రూ. నాలుగువేల కోట్ల విలువైన పనులను ‘ట్రాన్స్ట్రాయ్’కి అప్పగించారు. వివిధ రకాల మెటీరియల్స్, ఇంధనం, వాహనాలు, యంత్రాల ధరలు, కార్మికుల ఖర్చు.. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎస్‌ఎస్‌ఆర్‌ను ప్రభుత్వం రూపొందిస్తుంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఏటా కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌ను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2015-16 ఎస్ఎస్ఆర్ ప్రకారం ఈ పని విలువను గణిస్తే 60-70 శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అంచనా వ్యయాన్ని మరింత పెంచితే ఆ మేరకు ముడుపులు పెంచుకోవడానికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ట్రాన్స్‌ట్రాయ్‌కి అప్పగించిన పనుల అంచనా వ్యయాన్ని గరిష్టంగా రూ. 12 వేల కోట్లకు పెంచడానికి నీటిపారుదల శాఖలో కసరత్తు సాగుతోంది. ప్రభుత్వం, కాంట్రాక్టర్ మధ్య ఉన్న ఒప్పందంలోని 63వ నిబంధన ప్రకారం.. పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడానికి అవకాశం ఉంది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొని, ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎంకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు సబ్ కాంట్రాక్టు ఇచ్చేసి పనుల విలువను భారీగా పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం పనులను లాక్కుంటే తాను నష్టపోతానని, తన సంగతి కూడా చూడాలని ట్రాన్స్ట్రాయ్ కంపెనీ అధినేత, టీడీపీ ఎంపీ రాయపాటి సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు సాగునీటి శాఖలో ప్రచారం జరుగుతోంది. ఈమేరకు రూ. 12 వేల కోట్ల కాంట్రాక్టులో ట్రాన్స్ట్రాయ్ రూ. 1000 నుంచి రూ. 1500 కోట్ల మట్టి పనులు విడిచిపెట్టి, మిగతా పనులను సీఎం సూచించే కంపెనీకి ఇవ్వడానికి రంగం సిద్ధమైందని సమాచారం. పని విలువ భారీగా పెంచుతున్న నేపథ్యంలో.. మొత్తం పని విలువలో 40 శాతం వరకు సర్కారు పెద్దలకు ముడుపుల రూపంలో వస్తుందని, అందుకు అనుగుణంగానే పావులు కదులుతున్నాయని అధికారులే చెబుతున్నారు. కేంద్రం జోక్యం చేసుకోకుండా జాగ్రత్తలు పోలవరానికి జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రమే చూసుకుంటుందని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. అయితే నిర్మాణ బాధ్యతలు కేంద్రం చేతుల్లోకి వెళితే తాము సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఏడాది కాలంగా ఒక్క అంగుళం పని కూడా ముందుకు జరగనివ్వలేదని అన్ని వర్గాలు దుమ్మెత్తిపోసినా ప్రభుత్వంలో చలనం లేని విషయం తెలిసిందే. ఏడాది కాలంగా టీడీపీ ప్రభుత్వ తీరును చూసిన కేంద్రం ఇక లాభం లేదనే ఉద్దేశంతో పోలవరానికి నిధులు ఇవ్వడానికి సానుకూలంగా ఉందనే సమాచారం ఇటీవల వెలువడింది. ఈ నేపథ్యంలో పోలవరంలో సొమ్ము పిండుకొనే మార్గాల మీద సర్కారు పెద్దలు దృష్టిపెట్టారు. ‘‘ప్రస్తుత కాంట్రాక్టర్‌కు పనిచేసే సత్తా లేదు. పనులు జరిగితే తప్ప నిధులు రావు. ఈ నేపథ్యంలో పనులు చేయగల కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం ద్వారా పురోగతి సాధించడం, ముడుపులు దండుకోవడం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడానికి వ్యూహం తయారు చేశారు. మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయిస్తే, కేంద్రం జోక్యం చేసుకొని పోలవరం పనులను నియంత్రణలోకి తీసుకుంటుందనే భయం ప్రభుత్వానికి ఉంది. అందుకే టెండర్లు లేకుండా పనికానివ్వడానికి, భారీగా ముడుపులు దండుకోవడానికి పక్కా ప్రణాళిక సిద్ధమైంది’’ అని పోలవరం వ్యవహారాలను సుదీర్ఘకాలంగా పర్యవేక్షిస్తున్న సీనియర్ ఇంజనీర్ ఒకరు ‘సాక్షి’కి వివరించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం! పోలవరం అంశంపై సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. పని విలువ పెంపు నిర్ణయాన్ని మాత్రమే మంత్రివర్గ సమావేశంలో తీసుకుంటారని, తమకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు టెండర్లు లేకుండా పని కట్టబెట్టే విషయం మీద చర్చించే అవకాశం లేదని నీటిపారుదల శాఖ అధికార వర్గాల సమాచారం.