breaking news
biccavolu
-
రైలు నుంచి జారిపడి మహిళ దుర్మరణం
బిక్కవోలు (అనపర్తి) : గ్రామంలోని రాజారావుపేటకు చెందిన సిరికి సత్యవతి(45) రైలు నుంచి జారిపడి దుర్మరణం పాలైనట్టు బంధువులు తెలిపారు. శనివారం తెల్లవారు జామున పాస్ట్‌ప్యాసింజర్ రైలులో సత్యవతి కుటుంబ సభ్యులతో కలసి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల దైవదర్శనానికి వెళ్ళింది. స్వామి దర్శనానంతరం తిరిగి సాయంత్రం కాకినాడ ప్యాసింజర్‌లో బిక్కవోలు బయలుదేరారు. భీమడోలు స్టేష¯ŒSకు వచ్చిన వారు రద్దీగా ఉన్న రైలు ఎక్కబోతుండగా రైలు కదిలిపోయిందని దీంతో చివరి మెట్టుపై ఉన్న సత్వవతి జారి కిందపడి రైలుకు ప్లాట్‌ఫాంకు మధ్యలో నుంచి పట్టాల పైకి జారిపోవడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఏలూరు రైల్వే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేశారని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు బంధువులు తెలిపారు. -
కదం తొక్కిన జనం
కెనాల్ రోడ్డు మేలుకొలుపు పాదయాత్రకు అనూహ్య స్పందన 12 కిలోమీటర్ల మేర యాత్ర సాగించిన అనపర్తి వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, దంపతులు పలుచోట్ల హారతులు పట్టిన మహిళలు సంఘీభావంగా నిలిచిన ఆటో, లారీ యూనియన్లు అనపర్తి (బిక్కవోలు) : కాకినాడ – రాజమండ్రి కెనాల్ రోడ్డు అభివృద్ధి విషయంలో కాంట్రాక్టర్‌కు వెసులుబాటు కల్పిస్తూ ప్రజల గోడును పట్టించుకోని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మేలుకొలుపు పాదయాత్ర నిర్వహించింది. పార్టీ అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు భారీ జనసందోహంతో రోడ్డు సాధన కోసం అనపర్తి నుంచి బిక్కవోలు వరకు సుమారు 12 కిలోమీటర్లు దూరం పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రతో కెనాల్ రోడ్డు శుక్రవారం జనసంద్రంగా మారిపోయింది. గడువులోపు పనులు జరగకపోవడంతో రోడ్డు అ«ధ్వానంగా తయారై ప్రమాదాల బారిన పడి జనం ప్రాణాలు కోల్పోతున్నా స్థానిక పాలకులు కూడా పట్టించుకోవడం లేదు. డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్రకు రోడ్డు వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలంతా బాసటగా నిలిచారు. అడుగడుగునా ఆయనకు రోడ్డు వెంబడి గ్రామాల మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. రోడ్డు బాధితులైన ఆటో, లారీ యూనియన్లు, వాహనదారులు బాసటగా నిలవడంతో యాత్ర విజయవంతం అయింది. అనంతరం ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదాలలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని వారు రెండు నిముషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ బాధితులకు రూ.10లక్షల పరిహారం ఆందచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.260 కోట్లతో అభివృద్ధి చేయవలసిన ఈ రోడ్డులో గడచిన మూడేళ్లుగా కేవలం ఐదుశాతం పనులే జరిగాయని, ట్రాన్స్ట్రాయ్ సంస్థ అలసత్వం వహిస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎంపీ సంస్థ కావడంతోనే ఈ జాప్యాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని సూర్యనారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఒత్తిడి తేవాలి పాదయాత్రను విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వాల తీరు దారుణంగా ఉందన్నారు. ప్రజలంతా సంఘటితంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేల్, రాష్ట్ర మహిళ కార్యదర్శి యరకారెడ్డి సత్య, రాష్ట్ర యువజన కార్యదర్శి నల్లమిల్లి దుర్గాప్రసాదరెడ్డి, సహాయ కార్యదర్శి సత్తి సుబ్బారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, నాయకులు నల్లమిల్లి వీనురెడ్డి,«ధర్మారెడ్డి కార్యకర్తలు, స్వఛ్ఛంద సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.