breaking news
bhopal man died
-
భార్యాభర్తల గొడవలోకి దూరాడు.. దారుణంగా హత్యకు గురయ్యాడు
భోపాల్: భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. చిన్న చిన్న విషయాలకు సైతం గొడవ పడినా.. మళ్లీ కలిసిపోతుంటారు. అయితే, ఇరువురు గొడవపడుతుంటే చుట్టుపక్కల వారు ఆపేందుకు ప్రయత్నించటమూ మామూలే. కానీ, ఒక్కోసారి అది ప్రాణాలపైకి తెస్తుందనేందుకు ఇదే సరైన ఉదాహరణ. భార్యాభర్తలు గొడవ పడుతున్నారని కలుగజేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. మా మధ్యకే వస్తావా అని దారుణంగా కొట్టి చంపాడు భర్త. ఈ అమానవీయ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. పప్పు అనే వ్యక్తి మంగళవారం రోజు ఇంట్లో మటన్ కూర వండాలని భార్యకు చెప్పాడు. అయితే, మంగళవారం మాంసం తినకూడదని వాదించింది భార్య. ఈ విషయంపై ఇరువురు గొడవకు దిగారు. గొడవ పడుతున్న భార్యాభర్తలను గమనించిన పొరుగింటి వ్యక్తి బిల్లు.. వారి వద్దకు వెళ్లి సర్దిచెప్పాడు. తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. కానీ, బిల్లుపై కోపం పెంచుకున్న భర్త పప్పు.. అతడి ఇంటికి వెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో బిల్లు ప్రాణాలు కోల్పోయాడు. పప్పు భార్య ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదీ చదవండి: చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మరొకటి ఇచ్చారని.. రెస్టారెంట్‌కు నిప్పుపెట్టిన మందుబాబు.. -
మసాజ్.. అతడి ప్రాణాలు తీసింది
ఒళ్లు నొప్పులుగా ఉన్నాయని మసాజ్ చేయించుకోడానికి వెళ్తే.. మెడ ఎముక విరిగి ప్రాణాలు కోల్పోయాడు! ఈ ఘటనపై దాదాపు ఏడాది పాటు దర్యాప్తు జరిగిన తర్వాత.. అతడి ప్రాణాలు పోవడానికి మసాజే కారణమని తేలింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ ఘటన జరిగింది. దానిపై ఇన్నాళ్ల పాటు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత. మసాజ్ సెంటర్ మేనేజర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. భోపాల్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. 2015 డిసెంబర్ 12వ తేదీన నజీరాబాద్ ప్రాంతానికి చెందిన హర్నభ్ సింగ్ అనే వ్యక్తి తమ బంధువుల ఇంట్లో పార్టీలో ఉండగా తనకు మెడ బాగా నొప్పిగా ఉందని చెబుతూనే కుప్పకూలిపోయాడు. అతడికి నొప్పి చాలా ఎక్కువగా ఉండటంతో.. స్థానికంగా ఉండే మధు ఠాకూర్ అనే వ్యక్తికి సింగ్ తల్లి ఆ విషయాన్ని చెప్పారు. అది ఎలా తగ్గుతుందో తనకు తెలుసని అతడు చెప్పి, దగ్గర్లో ఉన్న మసాజ్ పార్లర్‌కు వెళ్లమని సూచించాడు. అయితే.. హర్నభ్కు అక్కడ చేసిన మసాజ్ కారణంగా మెడ ఎముకల్లో ఒకటి విరిగిపోయి, అతడు స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆస్తప్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. పోస్టుమార్టం నివేదికలో డాక్టర్లు అతడి మృతికి కచ్చితమైన కారణం ఏంటో చెప్పకపోవపడంతో కేసు నమోదు చేయడంలో ఆలస్యమైందని పోలీసులు తెలిపారు. చివరకు వైద్య, న్యాయ నిపుణులతో కూడిన బృందం క్షుణ్ణంగా విచారణ జరిపి, అతడి మెడ ఎముక విరిగిన తర్వాతే మరణించాడని, అందుకు కారణం మసాజ్ అని తేల్చడంతో ఇన్నాళ్లకు కేసు నమోదు చేశారు.