breaking news
bhavitha centers
-
‘భవిత’కు భరోసా ఏది..!
పై చిత్రంలో కనిపిస్తున్న బాలుడి పేరు దుమాల ఆశన్న. జైనథ్ మండల కేంద్రానికి చెందిన దుమాల చిన్నక్క, నడిపెన్న దంపతుల చిన్న కుమారుడు. ఆశన్న పుట్టుకతోనే మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. సాధారణ పిల్లల్లాగా కాకుండా శారీరక, మానసిక ఎదుగుదల లోపం కనిపించడంతో జైనథ్‌లోని భవిత విలీన విద్య కేంద్రంలో చేర్పించారు. కొన్నేళ్లుగా ఆటపాటలతో విద్య నేర్చుకుంటున్నాడు. ఏప్రిల్ 14నుంచి ఈ కేంద్రం మూసి వేయడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ‘‘అప్పటి నుంచి మరింతగా మానసిక వేదన చెందుతున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు స్పృహ తప్పి పడిపోతున్నాడు. దినం, రాత్రి కంటికిరెప్పలా కాపాడుకోవాల్సి వస్తంది..’’ అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిత కేంద్రం తెరిచి ఉంటే పిల్లలతో కలిసి ఆటపాటలతో కొంత ఉల్లాసంగా గడిపేవాడని తెలిపారు. ఆదిలాబాద్‌టౌన్ : పుట్టుకతో వచ్చే వివిధ రకాల శారీరక, మానసిక వైకల్యాలకు వైద్యం అందించడంతోపాటు కనీస విద్య సామర్థ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం భవిత విలీన విద్యావనరుల కేంద్రానికి శ్రీకారం చూట్టింది. మానసిక వైకల్యం గల పిల్లలతోపాటు వైకల్యం గల పిల్లలకు చదువు, ఆటపాటలు నేర్పించి సాధారణ పిల్లలుగా మారే విధంగా చేయడమే భవిత కేంద్రాల లక్ష్యం. వైకల్యం గల పిల్లలకు ఫిజియోథెరపి చికిత్స అందించి వారికి ప్రయోజనం చేకూర్చాలి. కానీ.. గత రెండు నెలలుగా కేంద్రాలు మూతపడ్డాయి. పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు, వైద్య సేవలు అందడం లేదు. సాధారణ పాఠశాలల మాదిరిగా ఈ కేంద్రాలకు కూడా విద్యశాఖ సేవలు ఇవ్వడంతో వైకల్యంతో బాధపడుతున్న చిన్నారుల బాధలు వర్ణనాతీతం. చిన్నారుల రాత మార్చే భవిత కేంద్రాలు తెరవకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాగైతే వారి ‘భవిత’వ్యం ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో.. ప్రత్యేక అవసరాలు ఉన్న శారీరక, మానసిక దివ్యాంగులకు మండల కేంద్రాల్లో భవిత కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 17 కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. జిల్లా వ్యాప్తంగా 251 మంది చిన్నారులు భవిత కేంద్రాల్లో చదువుకుంటున్నారు. 131 మంది చిన్నారులు ఫిజియోథెరఫి వైద్య చికిత్సలను పొందుతున్నారు. 88 మంది చిన్నారులు ఇంటి వద్ద చదువు నేర్చుకుంటున్నారు. భవిత కేంద్రాల్లో 23 మంది ఐఈఆర్పీ(ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్)లు చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. ఆరుగురు ఫిజియోథెరఫిస్టులు, 17 మంది కేర్‌గీవర్స్ పనిచేస్తున్నారు. పిల్లల భవితవ్యం పట్టదా.. దివ్యాంగులకు వివిధ అంశాల్లో ఆట, పాటల ద్వారా శిక్షణ ఇచ్చి క్రమంగా వారి సామర్థ్యాలను పెరిగేలా చూడాలి. దీంతోపాటు వారంలో ఒకసారి అవసరమైన వారికి ఫిజియోథెరఫితోపాటు ఇతర థెరఫిలు చేయిస్తారు. ఈ పిల్లల అంశాలను గుర్తించి తమ పనులు తాము చేసుకునేలా చూడడం, కాస్త క్రీయాశీలకంగా ఉన్న వారి సామర్థ్యాలను మరింతగా పెంచి సాధారణ విద్యార్థులతో కలిసిపోయేలా చేయడం దీని లక్ష్యం.. కానీ సర్వశిక్ష అభియాన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరుగారిపోతోంది. కాగా భవిత కేంద్రాలకు ఏప్రిల్ 13 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. దీంతో భవిత కేంద్రానికి వచ్చి ఫిజియోథెరఫి చేసుకునే పిల్లలు ఇబ్బందులు గురవుతున్నారు. ఫిజియోథెరఫి క్రమం తప్పకుండా చేయాలి. లేనట్లయితే పరిస్థితి మొదటికి వస్తుంది. కండరాలు బిగిసుకుని చచ్చుబడిపోతాయి. ప్రైవేటుగా ఫిజియోథెరఫి చేయించుకోలేని వారే అధికంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి శనివారం కేంద్రాలకు రాలేని స్థితిలో ఉన్న పిల్లలకు వారి ఇంటికి వెళ్లి ఐఈఆర్పీలు చదువు నేర్పిస్తారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఫిజియోథెరఫి చేసే విధానం చూపిస్తారు. వారిలో మనోధైర్యం నింపుతారు. ఇవన్నీ నిలిచిపోయి ఇప్పటికే నెల రోజులు దాటింది. భవిత కేంద్రాలు మళ్లీ వచ్చే నెల 12న ప్రారంభమయ్యే అవకాశాలు ఉండడంతో రెండు నెలలపాటు సేవలు నిలిచిపోయినట్లే. ఉద్యోగ భద్రతా కరువే.. మానసిక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులను సాధారణ స్థితికి తీసుకువస్తున్న ఐఈఆర్పీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి 10 నెలల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో ఈ ఉద్యోగంపై ఆధారపడి జీవిస్తున్నవారి కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతోంది. ఏప్రిల్‌లో 13 వరకే వేతనం చెల్లించారు. మే నెలకు వేతనం లేకపోగా, జూన్ మాసంతో 20 రోజుల వేతనం ఇవ్వనున్నారు. వీరు గత కొన్నేల్లుగా ఉద్యోగం చేస్తున్నా ప్రతి సంవత్సరం రీఎంగేజ్ (రెన్యువల్) చేస్తుండడంతో ఉద్యోగ భద్రత లేదు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా రెన్యువల్ చేయలేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో వేతనాలు అధికంగా ఉండగా మన రాష్ట్రంలో రూ.15వేలు మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి గత 15 సంవత్సరాలుగా వైకల్యం గల పిల్లలకు సేవలు అందిస్తున్నాను. ఐఈఆర్పీలకు ఉద్యోగ భదత్ర కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. కనీస వేతనం రూ.28,940 చెల్లించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 6 నెలల మాతృత్వ సెలవులు మంజూరు చేయాలి. ఒక్క రోజు విరామంతో తిరిగి పునర్నియామకం చేయాలి. – పుష్పవేణి, ఐఈఆర్పీ ఆదిలాబాద్ -
భవితకు బాటేదీ?
ధర్మవరం : భవిత కేంద్రాల్లోని ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు వైద్యసేవల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వీరు ప్రత్యేక అవసరాలు కల్గిన పిల్లలుగానే ఉండిపోవాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2,223 పాఠశాలల్లో 7,212 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు. వీరికి ఈ ఏడాది ఫిజియోథెరపీ సేవలు అందలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వారానికి ఒకరోజు చొప్పున ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఫిజియోథెరపీ శిబిరాన్ని నిర్వహించేవారు. వారికి ఉచితంగా చికిత్స అందించేవారు. ఇందుకోసం ప్రభుత్వం ఔట్సోర్సింగ్ విధానంలో ఫిజియోథెరపిస్ట్‌లను నియమించేది. సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఆధ్వర్యంలో నడిచే భవిత కేంద్రాల్లో ఆయా ఫిజియోథెరపిస్ట్‌లు విద్యార్థులతో తగిన వ్యాయామం చేయించేవారు. ఇంటివద్ద కూడా వ్యాయామం చేయించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించేవారు. ఈ ఏడాది మాత్రం వైద్యసేవల గురించి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. వేసవి సెలవుల తరువాత ఫిజియోథెరపీ సేవలకు మంగళం పాడారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడునెలలు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క శిబిరం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం సమకూర్చిన పరికరాలు ఎమ్మార్సీలు, భవిత కేంద్రాల్లో మూలనపడ్డాయి. శారీరక, మానసిక వైకల్యం కల్గిన చిన్నారులకు తగిన వ్యాయామం లేక పరిస్థితి మొదటికి వస్తోంది. వారి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అనుమతి రాలేదు ఫిజియోథెరపీ శిబిరాల విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులూ రాలే దు. ప్రభుత్వం ఇంకా ఫిజియోథెరపిస్టులను ఎంపిక చేయలేదు. ఈ ప్రక్రియ పూర్తయితే వైద్యసేవల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తాం. – నూర్ అహమ్మద్, ధర్మవరం మండల విద్యాధికారి ఎకరాకు రూ.15 వేల నష్టపరిహారమివ్వాలి అనంతపురం అర్బన్: జిల్లాలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతినిందని, ఎకరాకు రూ.15 వేలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ గేయానంద్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీనా మేషాలు లేక్కిస్తూ పంట నష్టాన్ని తక్కువగా చూపే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. రైతుల మనోధైర్యాన్ని కాపాడేందుకు బేషరుతుగా పంట నష్ట పరిహారాన్ని ప్రకటించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే రాయలసీమను కరువు లేని ప్రాంతంగా మారుస్తామని ప్రకటిస్తున్నారన్నారు. కరువు రైతులకు వెంటనే పంట నష్ట పరిహారం ప్రకటిండం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపారు. -
ఐఈఆర్టీలు స్థానికంగా ఉండాలి
దండేపల్లి : జిల్లాలోని భవిత కేంద్రాల్లో పని చేస్తున్న ఐఈఆర్టీలు స్థానికంగా ఉండాలని ఐఈఆర్టీ జిల్లా కో–ఆర్డినేటర్ లస్మన్న సూచించారు. దండేపల్లి మోడల్ భవిత కేంద్రాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవిత కేంద్రంలోని రికార్డులు, రిజిష్టర్లు పరిశీలించారు. హోమ్బేస్డ్(ఇంటివద్ద విద్య) ఫలితాల తీరును ఐఈఆర్టీ రాజమల్లును అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన హాజరు రిజిష్టర్లను తనిఖీ చేశారు. మండలంలో కొత్తగా గుర్తించిన ప్రత్యేక అవసరతలు గల పిల్లల వివరాలు, అలింకో క్యాపుల నిర్వహణపై తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో మరిన్ని భవిత కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో కొత్తగా ఈ సంవత్సరం నాలుగు భవిత కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాన్స్‌పోర్టు అలవెన్స్ రాని వికలాంగ పిల్లలకు త్వరలో అందజేస్తామని తెలిపారు. భవిత కేంద్రాల్లోని ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేస్తామని అన్నారు.