breaking news
baths
-
Jivitputrika festival: 24 గంటల వ్యవధిలో.. బిహార్‌లో 22 మంది నీటమునక
పట్నా: బిహార్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో నదులు, చెరువుల్లో స్నానాలు చేసేందుకు వెళ్లిన 22 మంది మృత్యువాత పడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. వీరిలో అత్యధికులు జీవిత్పుత్రికా పండుగ సందర్భంగా స్నానాలు చేయడానికి వెళ్లిన మహిళలేనన్నారు. ఈ పండుగ రోజు మహిళలు తమ సంతానం బాగుండాలని దేవుణ్ని కోరుకుంటూ ఉపవాస దీక్షలు, నదీ స్నానాలు ఆచరించడం సంప్రదాయం. భోజ్‌పూర్‌లో బహియారా ఘాట్ వద్ద సోనె నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లిన 15–20 మధ్య వయస్కులైన బాలికలు సెల్ఫీ తీసుకుంటూ నీటి ఉధృతికి కొట్టుకుపోయినట్లు అధికారులు వివరించారు. భోజ్‌పూర్‌లో అయిదుగురు, జెహానాబాద్‌లో నలుగురు, పట్నా, రొహతాస్ల్లో ముగ్గురు చొప్పున, దర్భంగా, నవడాల్లో ఇద్దరేసి, కైమూర్, మాధెపురా, ఔరంగాబాద్‌ల్లో ఒక్కరు చొప్పున జల సమాధి అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. -
విజ్జేశ్వరం బ్యారేజ్‌కు సందర్శకుల తాకిడి
కొవ్వూరు రూరల్: వేసవి తాపం ప్రజలను గోదావరి వైపు పరుగులు తీయిస్తోంది. కొవ్వూరు మండలం మద్దూరలంక వద్ద విజ్జేశ్వరం బ్యారేజ్ వద్దకు పెద్ద ఎత్తున సందర్శకులు చేరుకోవడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. బ్యారేజ్ దిగువన ఉన్న స్పిల్ వే పైకి వాహనాలతో చేరుకున్న జనం గోదావరిలో స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. కొందరు బ్యారేజ్ స్తంభాలపై నుంచి ప్రమాదకర పరిస్థితుల్లో గోదావరిలోకి దూకుతున్నారు. బ్యారేజ్ వద్ద ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టక పోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు. వచ్చే సందర్శకులను అదుపు చేసేందుకు పోలీసులతో గస్తీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
బాడీటాక్స్
స్నానాలే సరిపోవు..శరీరం లోపలికి మురికిని కూడా కడగాలి డీటాక్స్ ఎందుకు..? శరీరంలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన మలినాలను, కాలుష్యాలను, విషపదార్థాలను పూర్తిగా ప్రక్షాళన చేసి, పునరుత్తేజం పొందడానికి డీటాక్స్ చక్కని మార్గం. ఇది సామాన్యులకూ సాధ్యమే. శరీరంలో దీర్ఘకాలంగా పేరుకున్న విషపదార్థాలను పూర్తిగా వెలుపలకు పంపి, జీర్ణవ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు క్రమబద్ధమైన ఆహార పానీయాలు తీసుకోవడంతో పాటు వ్యాయామాలు చేయడం అవసరం. వాటి ప్రభావంతో విసర్జన ప్రక్రియ మెరుగుపడి, శరీరంలోని విషపదార్థాలు వెలుపలకుపోయి, శరీరం విషరహితమవుతుంది. ఎప్పుడు అవసరం? బరువు తగ్గడం ఇబ్బందికరంగా మారినప్పుడు, తరచు జీర్ణసంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు, ముఖంలో జీవకళ తగ్గినప్పుడు డీటాక్స్ చేసుకోవడం మంచిది. డీటాక్స్ ప్రక్రియలో భాగంగా తీసుకునే ప్రత్యేక ఆహార పదార్థాలు, ప్రత్యేకంగా చేసే వ్యాయామాల వల్ల శరీరం పునరుత్తేజితమవుతుంది. అయితే, సమతుల ఆహారం, వ్యాయామాలతో నిమిత్తం లేకుండా డీటాక్స్ ప్రక్రియ సాధ్యం కాదు. డీటాక్స్ ఔషధాల పేరిట మార్కెట్లో దొరుకుతున్న మందుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. శరీరాన్ని శుభ్రపరచే ఆహారం డీటాక్సిఫికేషన్ కోసం ప్రత్యేక ఆహారాన్ని ఎవరికి వారే ఇంటి వద్ద తీసుకోవచ్చు. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో పీచు పదార్థాలు, నీరు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పూర్తిస్థాయిలో డీటాక్స్ కోసం క్రమబద్ధంగా ఉపవాస పద్ధతిని కూడా పాటించవచ్చు. అయితే, ఉపవాస పద్ధతి పాటించే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది. ఉపవాస పద్ధతి పాటించేవారు వారంలో మూడో రోజు, ఆరో రోజు ఉదయం పూట ఘనాహారమేదీ తీసుకోకుండా, గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. సాధారణంగా ఈ పద్ధతిలో రాత్రిపూట భోజనానికి బదులు పండ్లు తీసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉండే అరటిపండ్లు, సీతాఫలాలు, మామిడి, సపోటా వంటివి కాకుండా, తక్కువ చక్కెర, ఎక్కువ పీచు పదార్థాలు ఉండే నారింజ, బత్తాయి వంటి పండ్లు తీసుకోవాలి. ఈ పద్ధతిలో పచ్చి కూరగాయలు, హెర్బల్ టీ, గ్రీన్ టీ వంటి పానీయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో పిజ్జాలు, మిర్చిబజ్జీలు వంటి జంక్‌ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. మలినాలను తొలగించే వ్యాయామం డీటాక్స్ విధానంలో జీర్ణవ్యవస్థను శుభ్రపరచే ఆహారంతో పాటు చెమట ద్వారా శరీరంలోని మలినాలను తొలగించే వ్యాయామాలూ అవసరమే. వేగంగా నడక, కార్డియో వ్యాయామాలు, యోగాసనాలు వంటి వ్యాయామాలు స్వేదగ్రంథుల ద్వారా శరీరంలో పేరుకుపోయిన మలినాలను వెలుపలకు పంపేందుకు దోహదపడతాయి. ఇలాంటి వ్యాయామాలు కండరాలకు సత్తువ ఇవ్వడంతో పాటు శరీరాకృతిని చక్కగా తీర్చిదిద్దుతాయి. నీరు కడిగేస్తుంది శరీరంపై పేరుకున్న మలినాలనే కాదు, శరీరం లోపలి మలినాలను కడిగేయడంలోనూ నీరే కీలకం. డీటాక్స్ ప్రక్రియలో ప్రతిరోజూ 60 ఔన్సుల ఊటనీరు (బావి నీరు లేదా నీటిబుగ్గల నుంచి ఊరిన నీరు) తీసుకోవాలి. ఒక్కోసారి పది ఔన్సుల చొప్పున ఆరుసార్లు ఈ నీరు తీసుకోవాలి. ఈ నీటిలో ఒక్కోసారి రెండు ఔన్సుల చొప్పున నిమ్మరసం కలపాలి. రుచికోసం కొద్దిగా మిరియాల పొడి కలుపుకోవచ్చు. డీటాక్స్‌లో భాగంగా కొబ్బరినీరు, తాజా కూరగాయల జ్యూస్‌లు కూడా తీసుకోవచ్చు. ఇలా ఆరు నెలలకు ఒకసారి పూర్తిస్థాయి డీటాక్స్ ప్రక్రియను పాటించవచ్చు. అయితే బరువు తగ్గించుకోవడానికి ‘డీటాక్స్’ అనుసరించే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.ఈ ప్రక్రియలో అన్ని పోషకాలు అందవు కాబట్టి తాత్కాలికంగా కొద్దిగా నీరసం రావచ్చు. కాబట్టి రెండు ‘డీటాక్స్’లకు మధ్య కనీసం పదిహేను రోజుల వ్యవధి ఉండేలా చూడాలి. వీరు దూరంగా ఉండాలి కఠినమైన ఆహార పద్ధతులు, వ్యాయామాలతో కూడిన డీటాక్స్ పద్ధతిని సాధారణ ఆరోగ్యవంతులు మాత్రమే పాటించాలి. గర్భిణులు, చక్కెర వ్యాధితో బాధపడేవారు, గుండెజబ్బులకు, కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న వారు, సత్తువలేని వృద్ధులు, ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారు ఈ ప్రక్రియకు దూరంగా ఉండాలి. మనలోకి చేరే కాలుష్యాలు గాలి, నీరు, ఆహారం ద్వారా మన శరీరంలోకి నానా కాలుష్యాలు, విష పదార్థాలు నిరంతరం చేరుతూనే ఉంటాయి. ప్లాస్టిక్ సంచుల వాడకం విరివిగా ఉన్నందున, ప్లాస్టిక్‌లోని బిస్ఫెనల్ అనే విష రసాయనం మనలోకి చేరుతూ ఉంటుంది. పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమైన నీరు తాగునీటిగా సరఫరా అవుతోంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగ మన ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. వాడిపారేసిన ఫ్లోరోసెంట్ బల్బులు, డెంటల్ ఫిల్లింగ్స్ కారణంగా పాదరసం మోతాదుకు మించి వాతావరణంలోకి, తర్వాత మన శరీరంలోకి చేరుతోంది. ఇలాంటి కాలుష్యాల కారణంగా కేన్సర్ సహా పలు ప్రమాదకర వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఒత్తిడి దూరం డీటాక్స్ ప్రక్రియ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఆరోగ్యంలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. ఒళ్లు తేలికబడటమే కాదు, మానసికంగానూ ఒత్తిడి తగ్గుతుంది. క్రమంగా శరీరం పునరుత్తేజం పొందడంతో ఉత్సాహం పెరుగుతుంది. కండరాలకు జవసత్వాలు వచ్చి, వయసు తగ్గిన అనుభూతి కలుగుతుంది. ఆహారంపై శ్రద్ధ డీటాక్స్ ప్రక్రియకు ముందు ఏం తింటున్నామో పట్టించుకోకుండా తినే అలవాటు ఉన్నా, ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఆహారంపై శ్రద్ధ పెరుగుతుంది. ఆహార విహారాల్లో క్రమశిక్షణ అలవడుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ముఖంలో కళాకాంతులు వచ్చి, చర్మం నునుపుదేరుతుంది. వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుంది. అతి అనర్థదాయకం శరీరంలోని మలినాలను తొలగించుకునేందుకు డీటాక్స్ ఆహార, వ్యాయామ ప్రణాళిక అవసరమే అయినా, త్వర త్వరగా ఈప్రక్రియను పూర్తి చేసుకోవాలనే యావతో అతి జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బందులు తప్పవు. శక్తికి మించిన ఉపవాసాల వల్ల, మోతాదుకు మించి నీరు తాగడం వంటి చర్యలకు పాల్పడితే రక్తపోటు, చక్కెర స్థాయి పడిపోవడం, జీర్ణవ్యవస్థలో సమతుల్యత లోపించడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందువల్ల డీటాక్స్ కోసం ఇంటి వద్ద ఎలాంటి ఆహార పద్ధతులు, వ్యాయామ పద్ధతులు పాటించాలనుకున్నా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. వ్యసనాలను వదులుకోవాలి పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల శరీరంలోకి నిరంతరం విషపదార్థాలు చేరుతూనే ఉంటాయి. డీటాక్స్ పద్ధతులు పాటించాలనుకునేవారు తమకు ఇలాంటి అలవాట్లేమైనా ఉంటే, వాటిని వదులుకోవాలి. డీటాక్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా తిరిగి సిగరెట్లు, మద్యం వంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. దీర్ఘకాలిక ఫలితాల కోసం డీటాక్స్ ప్రక్రియ ద్వారా ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. అయితే, ఆ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగాలంటే, ఆహార విహారాల్లో నిరంతరం అప్రమత్తత అవసరం. సమతుల పోషకాహారం తీసుకోవడం, వీలైనంత వరకు కాలుష్యాలకు దూరంగా ఉండటం, వ్యాయామ పద్ధతులను మానేయకుండా కొనసాగించడం ద్వారా డీటాక్స్ ఫలితాలను ఎక్కువకాలం ఆస్వాదించవచ్చు.