breaking news
balesh
-
ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నేరానికి గాను భారతీయ ప్రముఖుడు ఒకరికి న్యాయస్థానం 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 30 ఏళ్ల వరకు ఎలాంటి పెరోల్‌కు అవకాశం లేదని శుక్రవారం స్పష్టం చేసింది. దీంతో, ఘటన చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. బాలేశ్ ధన్‌ఖడ్(43) మోసపూరిత ఉద్యోగ ప్రకటనలతో ఐదుగురు కొరియా మహిళలను ఆకర్షించి ప్రణాళిక ప్రకారం వారిని సిడ్నీలోని తన నివాసానికి రప్పించాడు. అక్కడ వారికి డ్రగ్స్ కలిపిన డ్రింక్స్ ఇచ్చి మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైందని డౌనింగ్ సెంటర్ డిస్ట్రిక్ట్ కోర్టు పేర్కొంది. తీర్పు వెలువడిన సమయంలో ధన్‌ఖడ్ కోర్టులోనే ఉన్నాడు. భవిష్యత్ లైంగిక సంతృప్తి కోసం అతను తన నేరాలను రికార్డు చేసి, వీడియోల రూపంలో భద్రపర్చు కోవడాన్ని జడ్జి మైకేల్ కింగ్ ప్రస్తావించారు.ఇక, బాధితులంతా 21–27 ఏళ్ల మధ్య వయ స్కులైన కొరియా మహిళలు. ఒక్కొక్కరికి వారి తెలివితేటలు, అందాన్ని బట్టి వేరుగా మార్కులు కూడా వేసేవాడని పోలీసులు తెలిపారు. బాధిత మహిళలతో జరిపిన చర్చలను సైతం రికార్డు చేశాడు. వారికి ఉద్యోగం అవసరం ఎంతుందనే దాన్ని బట్టి కుట్రను అమలు చేసేవాడు. చివరికి ఐదో బాధితురాలు 2018 అక్టోబర్‌లో ఫిర్యాదు చేయడంతో ఇతడి నేరాలకు పుల్‌స్టాప్ పడింది.పోలీసులు సిడ్నీ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని ఇతడి కార్యాలయంపై దాడి చేసి డ్రగ్స్‌తోపాటు టేబుల్ క్లాక్ మాదిరిగా ఉన్న వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసు కున్నారు. అందులోనే అత్యాచారాల క్రమ మంతా నిక్షిప్తమై ఉండటం గమనార్హం. విచారణ జరిపిన కోర్టు ధన్‌ఖడ్ 39 నేరాలకు పాల్పడినట్లు గుర్తించింది. ఇందులో లైంగిక దాడికి సంబంధించిన నేరాలు 13 వరకు ఉన్నాయి. కోర్టు విధించిన జైలు శిక్షలో పెరోల్‌కు వీలులేని 30 ఏళ్ల కాలం 2053తో ముగియనుంది. మొత్తం 40 ఏళ్ల జైలు శిక్ష పూర్తయ్యే సరికి ధన్‌ఖడ్‌కు 83 ఏళ్లొస్తాయి.విద్యార్థిగా వెళ్లి...2006లో చదువుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ధన్‌ఖడ్ భారతీయ ఆస్ట్రేలియన్లలో పేరున్న నాయకుడి స్థాయికి ఎదిగారు. భారతీయ జనతా పార్టీ అనే గ్రూపును నెలకొల్పారు. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధిగా 2018లో అరెస్టయ్యే వరకు వ్యవహరించారు. ఏబీసీ, బ్రిటిష్ అమెరికన్ టొబాకో, టొయోటా, సిడ్నీ ట్రెయిన్స్ కంపెనీలకు డేటా విజువలైజేషన్ కన్సల్టెంట్‌గా సేవలందించారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రముఖుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.Indian community leader Balesh Dhankhar sentenced to 40 years in Australia for sexually assaulting five Korean women. Dhankhar lured victims with fake job ads, drugged and raped them and kept kept horrific spreadsheet detailing his crimes. Non-parole period set at 30 years.… pic.twitter.com/NcA4TUU3cq— Benefit News (@BenefitNews24) March 8, 2025 -
13 మందిపై అత్యాచారం, వీడియో రికార్డింగ్.. బాలేశ్ ధన్కర్ అకృత్యాలు
సిడ్నీ: ఉద్యోగాల పేరుతో ఇంటర్వ్యూలకు పిలిచి, మత్తు కలిపిన డ్రింక్స్ తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు.. ఆ దురాగతాలను వీడియో రికార్డింగ్ చేసేవాడు. కొరియా మహిళలంటే ఇతడికి పిచ్చి. బాధితుల్లో వీరే ఎక్కువమంది. వీరి పేర్లు, వివరాలను దాచుకున్నాడు. అతడి గదిలో బెడ్ పక్కనే అలారం క్లాక్‌లోని సీక్రెట్ కెమెరా ద్వారా అన్నీ రికార్డయ్యేవి...ఇవన్నీ ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన భారత సంతతి వ్యక్తి బాలేశ్ ధన్కర్ అకృత్యాలు. 2018 జనవరి– అక్టోబర్కాలంలో ఇతడు 13 మంది ఇతడు మహిళలను రేప్ చేశాడు. 2018 అక్టోబర్‌లో పోలీసులు ఇతడి సొంత ఫ్లాట్‌తోపాటు ఓ హోటల్ గదిలో సోదాలు జరపగా మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్ బాటిళ్లు, రేప్ దృశ్యాలు, మహిళలతో ఏకాంతంగా ఉండగా తీసిన మొత్తం 47 వీడియోలతో హార్డ్‌డ్రైవ్ దొరికింది. బాలేశ్ నేరాలపై న్యూసౌత్ వేల్స్ జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. కొన్ని వీడియోల్లోని అసహ్యకర దృశ్యాలను జడ్జీలు కూడా చూడలేకపోయారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. -
అత్యాచార నిందితులకు రిమాండ్
మెదక్: మోసపూరిత మాటలతో ఇంటి వద్ద దిగబెడతామని నమ్మించి బైక్ పై మహిళను తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన ఓ మహిళ(30)పై బాలేష్, నగేష్ అనే ఇద్దరు యువకులు బుధవారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని మహిళ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.