breaking news
Bait
-
చిరుత బోనులో కోడి దొంగ!
చిరుతపులి కోసం ఏర్పాటు చేసిన బోనులో.. గాలానికి పడ్డదాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అదొక మనిషి. తనను బయటకు తీయండి మహాప్రభో అంటూ బోను తలుపులను పట్టుకుని.. అధికారులను అతను వేడుకోవడం ట్విటర్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలోని బసెందువా గ్రామంలో చిరుత సంచారం గురించి అధికారులు సమాచారం అందుకున్నారు. దానిని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. చిరుతకు ఎరగా.. ఓ కోడిని అందులో ఉంచారు. అయితే ఆ కోడి కోసం వెళ్లి.. ఆ వ్యక్తి బోనులో చిక్కుకున్నాడు. దొంగతనగా కోడిని బోనులోంచి తీసేందుకు యత్నిస్తుండగా.. ఒక్కసారిగా బోను తలుపు పడిపోయింది. దీంతో బయటకు తీయాలని అధికారులను వేడుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. #WATCH | Uttar Pradesh: A man got stuck in a cage, installed to nab a leopard, in Basendua village of Bulandshahr dist. Forest Dept says that the man had entered the cage to get a rooster that was kept there as bait for the leopard. (Video: viral video confirmed by Forest Dept) pic.twitter.com/8ujj23I2AO — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 24, 2023 (చదవండి: మీ సంగతి ప్రజలే చూసుకుంటారు: నరేంద్ర మోదీ) -
పురుగుల నివారణకు చక్కటి మార్గం
లింగార్షక బుట్టలతో.. పురుగులు ఒకదానికొకటి సంభాషించుకుంటాయి. కొన్ని రకాల వాసనల ద్వారా ఆకర్షించుకుంటాయి. వీటి ద్వారా పురుగుల ఉద్ధృతి పెరుగుతుంది. పురుగుల నివారణకు కృత్రిమంగా తయారు చేసిన ‘ఎర’ లింగాకర్షణ బుట్టలు అమర్చుకోవచ్చు. వీటిలో కొన్ని రకాల వాసనలను ఉపయోగించి ఆడ పురుగులను ఆకర్షించేందుకు వీలుంటుంది. ఇలా ఉపయోగించాలి లింగాకర్షక బుట్టలు ఒకటి రూ.14, ఫిరమోన్ (ఎర) రూ.8 ఉంటాయి. నెలకు ఒకటి చొప్పున మార్చా లి.పురుగుల ఉనికి గుర్తిస్తే ఎకరాకు4బుట్టలు, వాటిని నివారించేందుకు ఎకరాకు 10 బుట్టలు ఆమర్చుకోవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు బుట్టల వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పంట 30 రోజుల వయసు నుంచి వాడాలి. ఎరలను ప్రతి 30 రోజులకోసారి తప్పకుండా మార్చాలి. బుట్టను పైరు మీద సరైన ఎత్తులో అమర్చుకోవాలి. ఎరలను మార్చేటప్పుడు చేతులకు ఎటువంటి వాసన లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. బుట్టల్లో పడిన పురుగులను ప్రతి 2-3 రోజులకు గమనించడం ద్వారా పురుగు గుడ్లు పెట్టకుండా చూడాలి. పొలంలో లింగాకర్షక బుట్టలు వాడడం ద్వారా సమర్థవంతంగా అరికట్టవచ్చు. లాభాలెన్నో.. పంటలో లింగాకర్షక బుట్టలు అమర్చడం వల్ల హానికారకమైన పురుగులను అదుపు చేయవచ్చు. ఇందులో ప్రధానంగా కంది, మొక్కజొన్న, జొన్న పంట ల్లో కాండం తొలుచు పురుగు, వరిలో కాండం తొలుచు తెల్ల రెక్క పురుగు, వేరుశనగలో ఆకుమడతతోపాటు పచ్చపురుగు, పత్తి, బెండలో తలనత్త పరుగు, పత్తిలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారించుకోవచ్చు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ దీనిని స్టిక్ ఎ ఫ్లయ్ అని అంటారు. రసం పీల్చు పురుగుల నివారణకు ఇవి ఉపయోగపడతాయి. ఇందులో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, ఆకుమడత పురుగు, పచ్చదీపపు పురుగులను అరికట్టుకోవచ్చు. ఇందులో చిన్నగా ఎగిరే రసం పీల్చు పురుగులు ప్రత్యేకమైన వి. పసుపు రంగుకు ఆకర్షణకు గురై ట్రాప్‌పై ఉన్న జిగురుకు అంటుకుపోయి పురుగులు అదుపులోకి వస్తాయి. వాడకం ఇలా.. 50 శాతం కన్నా ఎక్కువ పురుగుల తో లేదా దుమ్ముతో నిండగానే ఎరను మార్చుకోవాలి. ఎరను పంటపై 25-30 సెంటీ మీటర్ల ఎత్తులో అమర్చుకోవాలి. పిదప పైన ఉన్న పేపరును తొలగించాలి. ఎరను తూర్పు- పడమర దిక్కులను చూసేటట్లుగా అమర్చాలి. {పతి వారం గమనించి పురుగు ఉద్ధృతి తెలుసుకుంటూ తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. ఎకరాకు 10 ఎరల చొప్పున అమర్చుకోవాలి. ఒక్కో ట్రాప్స్ రూ.10 ప్రకారం లభిస్తుంది.