breaking news
Badaun Gang-Rape
-
అత్యాచారాలపై మోడీని ప్రశ్నించరే
మీడియాపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. గతంలో నిర్భయ అత్యాచార ఘటన విషయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్నే లక్ష్యంగా చేసుకున్న మీడియా..... నేడు యూపీలో మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు లక్ష్యంగా చేయడంలేదంటూ దిగ్విజయ్ సింగ్ మీడియాను ప్రశ్నించారు. 2012 డిసెంబర్లో దేశ రాజధాని హస్తినలో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై స్పందించాలని మీడియా ప్రధాని మన్మోమన్ సింగ్ వెంటపడిన తీరు దిగ్విజయ్ సింగ్ ఈ సందర్బంగా విశదీకరించారు. వరుస అత్యాచారాలతో ఉత్తరప్రదేశ్ అట్టుకుతున్న పాపం మీడియాకు మాత్రం నరేంద్ర మోడీని ప్రశ్నించలేకపోతుందంటూ ఆయన ఎద్దేవా చేశారు. మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.మరి ముఖ్యంగా బుదాయూలో అక్కచెల్లిళ్లపై సామూహిక అత్యాచారం జరిపి ఆపై చెట్టుకు ఉరివేసిన సంఘటన దారణమని దిగ్విజయ్ సింగ్ గురువారం తన ట్విట్టర్లో వెల్లడించారు. -
అధినేత్రి వచ్చింది... పొలం మాయమైంది
మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షురాలు వస్తున్నారు. అది హెలికాప్టర్లో... దిగడానికి అనువైన స్థలం లేదు . ఏం చేయాలి. కార్యకర్తలు బుర్రలు చించుకున్నారు. అంతే బంగారంలాంటి పొలాన్ని హెలిపాడ్ కోసం ఏర్పాటు చేయాలన్న ఆలోచనల కార్యకర్తల బుర్రలో చటుకున్న మెరుపులా మెరిసింది. అంతే అనుకున్నదే తడువుగా పొలాన్ని పార్టీ కార్యకర్తలు క్షణాల్లో హెలిపాడ్గా మర్చేశారు. ఆ తతంగమంతా ఉత్తరప్రదేశ్ బుదాయూ జిల్లాలోని కట్రా గ్రామంలో చోటు చేసుకుంది. అది కూడా బీఎస్పీ అధ్యక్షురాలు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి కోసం. ఈ వారం మొదట్లో కట్రా గ్రామంలో వరుసకు అక్కాచెల్లిళ్లపై సామూహిక అత్యాచారం చేసి ఆపై వారిని మామిడి చెట్టుకు ఉరి వేశారు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ బాలికల కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు జాతీయనాయకులు ఇప్పటికే ఆ గ్రామానికి క్యూడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి ఆదివారం కట్రాలో బాధిత కుటుంబసభ్యులను ఓదార్చనున్నారు. అందుకోసం ఆమె హెలికాప్టర్లో కట్రా గ్రామానికి రానున్నారు. దాంతో బంగారం లాంటి పోలాన్ని హెలిపాడ్గా మార్చేశారు. అయితే శనివారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధిత కుటుంబాలను పరామర్శించిన సంగతి తెలిసిందే.