breaking news
artillery guns
-
ఆర్మీలోకి అధునాతన శతఘ్ని వ్యవస్థలు
దియోలాలి: భారత ఆర్మీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగా మూడు శతఘ్ని వ్యవస్థలను కొనుగోలు చేసినట్లు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వీటిలో ఎం777 ఏ2 అల్ట్రాలైట్ హోవిట్జర్లు, కె9 వజ్ర శతఘ్నులతో పాటు ఆయుధాలను సరిహద్దులకు చేరవేసే ఫీల్డ్ ఆర్టిలరీ ట్రాక్టర్(ఫ్యాట్)లు ఉన్నాయి. మహారాష్ట్రలోని దియోలాలి ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీతారామన్ వీటిని సైన్యానికి అందజేశారు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎం777 ఏ2(155 ఎంఎం–39 క్యాలిబర్)హోవిట్జర్ శతఘ్నులు 30 కి.మీ దూరంలోని శత్రు స్థావరాలను తుత్తునియలు చేయగలవు. మారుమూల, పర్వత ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా తరలించగల ఈ హోవిట్జర్ల ద్వారా పగలు, రాత్రి తేడా లేకుండా నిమిషానికి 5 రౌండ్ల కాల్పులు జరపొచ్చు. అలాగే దక్షిణకొరియాకు చెందిన థండర్–9ను అభివృద్ధి చేసి కె9 వజ్ర(155 ఎంఎం–52 క్యాలిబర్) యుద్ధ ట్యాంకును రూపొందించారు. వేరియంట్స్‌ను బట్టి ఈ ట్యాంకులు 30 కి.మీ నుంచి 58 కి.మీ దూరంలోని లక్ష్యాలను అవలీలగా ఛేదిస్తాయి. దాదాపు 100 వజ్ర యుద్ధ ట్యాంకుల్లో పదింటిని సైన్యం ఇప్పటికే అందుకోగా, మిగిలినవాటిని భారత్‌లో తయారు చేయనున్నారు. అలాగే శతఘ్నులను యుద్ధ సమయంలో సరిహద్దుకు తరలించేందుకు అవసరమైన 6్ఠ6 ఫీల్డ్ ఆర్టిలరీ ట్రాక్టర్(ఫ్యాట్)లను అశోక్ లేలాండ్ సంస్థ నుంచి సైన్యం కొనుగోలు చేసింది. 10 టన్నుల బరువును ఈ ట్రక్కులు అవలీలగా మోసుకెళ్తాయి. -
దినదిన గండం.. అక్కడ బతకడం
వారికి చెవులకు ప్రార్థనా గీతాలు వినిపించకపోవచ్చు.. కానీ తుపాకీ చప్పుళ్లు వినిపించని రోజుండదు.. దాహార్తికి అలమటించిన క్షణాలు ఉండొచ్చు.. కానీ మోర్టార్ గుళ్ల వర్షం కురవని క్షణాలు ఉండవు. అంతర్జాతీయ సరిహద్ధులోని 42 భారతీయ గ్రామాల్లోని ప్రజలు నిత్యం సమరమే.. ప్రతి క్షణం దినదిన గండమే. ఎప్పుడు తుపాకులు విరుచుకుపడతాయో.. ఏ క్షణంలో పాకిస్తాన్ ముష్కరమూకల మోర్గార్లు పేలుతాయో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు అక్కడి ప్రజలు. ఆర్నియా సెక్టార్.. జమ్మూ కశ్మీర్‌లోని పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఈ సరిహద్దు వెంబడి 42 గ్రామాల్లో 45 వేల మంది ప్రజలు జీవిస్తున్నారు. మొత్తం 198 కిలోమీటర్ల ఈ సరిహద్దు ప్రజలు నిరంతరం పాక్ సైన్యం జరిపే కాల్పులకు బలి అవుతూనే ఉన్నారు. ఇరు దేశాల మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. పాకిస్తాన్ మాత్రం దానిని ప్రతి రోజూ ఉల్లంఘిస్తోంది. పాక్ సైన్యం ఎప్పుడు మోర్టార్ కాల్పులకు తెగబడుతుందో.. ఏ అర్దరాత్రి.. ఏకే 47 తుపాకులు గుళ్ల వర్షం కురిపిస్తాయో తెలియక.. ఇళ్లలో కన్నా బంకర్లలోనే ప్రజలు కాలం గడుపుతున్నారు. మోర్టార్ల బీభత్సం కశ్మీర్ సరిహద్దు ప్రజలకు శాంతి అంటే.. మోర్టార్లు, తుపాకులు పేలడం అగడం వరకూ అని మాత్రమే తెలుసు. ఆగిన కొద్ది సేపటిలో పనులు పూర్తి చేసుకుని తిరిగి గుళ్ల వర్షం కురిసే లోపు.. సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. సెప్టెంబర్16-17 తేదీల్లో పాకిస్తాన్ సైన్యం ఆర్నియా సెక్టార్లోఅర్దరాత్రి కాల్పులకు తెగబడింది. ఈ సమయంలో సరిహద్దు గ్రామంలోని రత్నాదేవి (50) అనే మహిళకు బుల్లెట్లు తాకి అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ఆమె భర్త చునాయి లాల్ మాట్లాడుతూ.. పాక్‌సైన్యం రాత్రంతా కాల్పులు జరుపుతూనే ఉందన్నారు. ఇటువంటివి ఇక్కడ ప్రతి రోజూ జరుగుతాయని చెప్పారు. చిన్నారుల పరిస్థితి విషయం సరిహధ్దు గ్రామాల్లోని చిన్నారుల పరిస్థితి మరీ విషయంగా ఉందని గ్రామస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర 16-17 తేదీల్లో పాక్ కాల్పుల్లో ఎనిమిది మంది చిన్నారులు తీవ్రగాయాల పాలయ్యారు. ఇక పాక్‌రేంజర్ల కాల్పుల్లో వందలాది మంది చిన్నారులు కాళ్లు, చేతులు కోల్పోవడం, చూపు దెబ్బతినడం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ముఖ్యంగా పాక్‌రేంజర్లు 82, 120 ఎంఎం మోర్టార్లతో జరిపే కాల్పుల్లో ప్రమాదాల తీవ్రత అధికంగా ఉంటోందని వారు స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్ అగమ్యగోచరం సరిహద్ధు ప్రాంతాల్లోని చిన్నారుల భవిష్యత్ అగమ్యగోచరమే. ఇక్కడి చిన్నారులు సాధారణ జీవితానికి చాలా దూరం. ఆర్నియా సబ్ సెక్టార్లో మొత్తం 33 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో 1500 మంది చిన్నారులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈ పాఠశాలలు ఏడాది మొత్తం కొన్ని వారాలు మాత్రమే పనిచేస్తాయని.. స్థానికులు అంటున్నారు. చిన్నారులు స్వేచ్ఛగా తిరగడం, ఆడుకోవడం, చదువుకోవడం ఇక్కడ కుదరదు. బంకర్లే ఆవాసాలు సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు భారత సైన్యం ఏర్పాటు చేసిన బంకర్లే స్థిర నివాసాలుగా మారాయి. ఇక్కడ ఒక్కో బంకర్లో సగటున 7 వేల మంది ఉంటున్నారు. ఈ బంకర్లలోనే ప్రజలు నెలలతరబడి గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వమే సరిహద్దు గ్రామాల్లోని ప్రతి ఇంటికి ఒక బంకర్‌ను నిర్మించింది. ప్రభుత్వం సుమారు రూ. 5లక్షలతో ఏర్పాటు చేసిన బంకర్ల తరువాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందని థోరు రామ్ (56) చెబుతున్నారు. మోర్టార్ శబ్దాలు మొదలవగానే.. మేమంతా బంకర్లలోకి వెళ్లిపోతామని ఆయన చెబుతున్నారు. ఇక రాజౌరీ జిల్లాల్లో 621 కమ్యూనిటీ బంకర్లను 8,197 వ్యక్తిగత బంకర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాయి. -
30 ఏళ్ల తర్వాత భారత అమ్ములపొదిలోకి..
-
30 ఏళ్ల తర్వాత భారత అమ్ములపొదిలోకి..
న్యూఢిల్లీ: ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత భారత అమ్ములపొదిలోకి కొత్త శతఘ్నులు చేరాయి. ఎత్తయిన కొండ ప్రాంతాల్లోని శత్రువులను ఢీకొట్టే సామర్థ్యం ఉన్న వీటిని గత ఏడాది కేంద్రం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అమెరికా నుంచి కొనుగోలు చేశారు. మొత్తం 145 శతఘ్నులను కొనుగోలు చేయగా వాటిల్లో రెండు నేడు భారత్‌కు చేరుకున్నాయి. ఇవి దాదాపు 30 కిలో మీటర్ల లక్ష్యాన్ని సైతం అవి తుత్తునీయలు చేస్తాయి. రెండు ఎం-777 ఆల్ట్రా-లైట్ హొవిట్జర్ ఆయుధాలు నేడు భారత్‌కు చేరుకున్నట్లు భారత ఆర్మీ ప్రతినిధులు ఒక ప్రకటనలో చెప్పారు. 1980లో తొలిసారి స్వీడన్ నుంచి బొఫోర్స్ శతఘ్నులను కొనుగోలు చేసిన భారత్ ఆ తర్వాత వీటిని తిరిగి ఆర్మీలోకి తీసుకోలేదు. భారత ఆర్మీ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునేందుకు వీటిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకోని కేంద్రానికి ప్రతిపాదన చేయగా గత ఏడాది జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో వీటి కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అమెరికాతో మొత్తం 700 మిలియన్ డాలర్లతో ఈ ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది.