breaking news
arrrest
-
సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య.. నిందితుడి అరెస్ట్
సాక్షి, తిరుపతి: ఏడడుగులు.. మూడు ముళ్ల బంధం.. అగ్నిసాక్షిగా మనువాడి కడదాకా తోడుంటానన్న భర్తే.. ఆమె పాలిట కాల యముడవుతాడని ఆ ఇల్లాలు ఊహించలేకపోయింది. మరోవైపు ఏ పాపం తెలియని ఆ చిన్నారి ఇకముందు తల్లిదండ్రులు లేని అనాథగా మిగలింది. ఉద్యోగం లేకపోయిన భర్త అడగగానే డబ్బు ఇవ్వడమే ఆమెకు శాపమై తన ప్రాణం తీసింది. కట్టుకున్న వాడే కిరాతకంగా కడతేర్చాడు తిరుపతిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసులోని మిస్టరీ వీడిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో ఆమె భర్త శ్రీకాంత్‌రెడ్డి నిందితుడిగా నిర్థారణ కావడంతో పోలీసులు ఆ కిరాతకుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భువనేశ్వరి ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, శ్రీకాంత్‌రెడ్డి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ నిత్యం భార్యతో గొడవపడేవాడు. దీంతో ఆమె తెలిసినవారి దగ్గర రూ.10 లక్షలు తెచ్చి భర్తకు ఇచ్చింది. ఈ అప్పు తీర్చాలని ఇటీవల అడుగుతుండటంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో గత నెల 22న భువనేశ్వరిని ఆమె భర్త శ్రీకాంత్ కిరాతకంగా చంపి సాక్ష్యాలను తారుమారు చేసే క్రమంలో సూట్‌కేసులో భార్య మృతదేహాన్ని తీసుకెళ్లి రుయా ఆస్పత్రి వెనుక తగలబెట్టాడు. అలానే వారి బంధువులకు అనుమానం రాకుండా కరోనాతో భార్య చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
అజ్ఞాతంలో విష్ణు, బెయిల్‌కు యత్నం
-
అజ్ఞాతంలో విష్ణు, బెయిల్‌కు యత్నం
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అరెస్ట్‌కు మాదాపూర్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. వంశీచంద్ రెడ్డిపై దాడి కేసుకు సంబంధించి ప్రత్యేక టీమ్..గురువారం ఉదయం అదుపులోకి తీసుకునేందుకు అతని నివాసానికి వెళ్లారు. అయితే విష్ణు ఆ సమయంలో ఇంట్లో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన రెండు సెల్ఫోన్లు కూడా స్విచ్చ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాచారం. మరోవైపు విష్ణు రంగారెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా విష్ణువర్దన్‌రెడ్డి నిన్న గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో జరిగిన గొడవకు సంబంధించిన వివరాలు ఆయనకు తెలిపారు. విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీతో జరిగిన గొడవ విచారకరం.మా గొడవకు, పార్టీకి ఏ సంబంధం లేదు. మేమంతా కాంగ్రెస్ కుటుంబ స భ్యులం..' అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వంశీచంద్ రెడ్డిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు విష్ణు స్పందించ లేదు