అన్నతో కలిసి గ్రాండ్‌గా ఈద్ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు
రంజాన్ పర్వదినం సందర్బంగా వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా శర్మ ఖాన్ సోమవారం రాత్రి ఈద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరుడితో కలిసి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. పండుగ వేడుక, గ్లామర్ రెండింటినీ మిళితం చేసిన ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్లో పలువురు బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈద్ వేడుకలో సాంప్రదాయ లుక్స్‌లో అందరూ మంత్రముగ్ధుల్ని చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విశేషంగా నిలిచాయి.రంజాన్ సందర్బంగా అర్పితా ఖాన్ ఇచ్చిన లావిష్ పార్టీకి అర్బాజ్ ఖాన్, అల్విరా ఖాన్ , ఆయుష్ శర్మ వంటి కుటుంబ సభ్యులతోపాటు పెళ్లి తరువాత తొలిసారి ఈద్ వేడుకలను జరుపుకుంటున్నసోనాక్షి సిన్హా, భర్తతో కలిసి హాజరైంది.అర్పితా శర్మ ఖాన్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ ఈద్ వేడుకలో, సోనాలి బింద్రే పింక్ సూట్లో అందంగా కనిపించింది. ఇంకా జెనీలియా,రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, షమితా శెట్టి, అంగద్ బేడి, నేహా ధుపియా తదితర బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.అంతకుముందు తన సోదరి గెలాక్సీ అపార్ట్మెంట్స్లోని తన బాల్కనీ నుండి అభిమానులను పలకరించాడు. సల్మాన్ సోదరి అర్పితా కుమార్తె, మేనకోడలితో కలిసి అభిమానులకు కనువిందు చేశాడు. అధిక భద్రతా సమస్యల కారణంగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి తెల్లటి కుర్తా-పైజామా ధరించి ఫ్యాన్స్‌ను అభినందించారు. ఈ సందర్బంగా సల్మాన్ మూవీ "సికందర్" అంటూ సందడి చేశారు. “షుక్రియా ధన్యవాదాలు ఔర్ సబ్ కో ఈద్ ముబారక్.” అంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.Shukriya Thank you aur sab ko Eid Mubarak! pic.twitter.com/EaW0CeaZWi— Salman Khan (@BeingSalmanKhan) March 31, 2025