breaking news
ar damodar
-
కౌంటింగ్ ముంగిట మరో కుట్ర
సాక్షి, అమరావతి: కీలకమైన ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసు శాఖ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ఒత్తిడికి ఎన్నికల కమిషన్ (ఈసీ), రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గి వ్యవహరిస్తున్నారన్నది మరోసారి స్పష్టమైంది. అత్యంత వివాదాస్పద పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ) ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు హఠాత్తుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు.రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అదీ పంజాబ్ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఆయన పోలింగ్ ముగిసిన తరువాత వ్యక్తిగత పనులపై సెలవులో ఉన్నారు. సెలవులో ఉన్న దామోదర్‌ను హఠాత్తుగా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని.. కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలని ఉత్తర్వులు జారీచేయడం వెనుక ఏదో పెద్ద గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమవుతోంది. టీడీపీకి వీర విధేయుడు.. 2007 గ్రూప్–1 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ దామోదర్ అత్యంత వివాదాస్పద అధికారిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరడంలో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారి మధ్య బంధుత్వం కూడా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు అండతో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు. పశి్చమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీగా ఆయన వివాదాలకు కేంద్ర బిందువయ్యారు.ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక నాన్ కేడర్ ఎస్పీ అయినప్పటికీ దామోదర్‌ను 2019 సంవత్సరంలో ఎన్నికల కోసమని విజయనగరం జిల్లా ఎస్పీగా నియమించారు. వైఎస్సార్సీపీ పటిష్టంగా ఉన్న విజయనగరం జిల్లాలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే ఆయనకు ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. అనుకున్నట్లుగానే 2019 ఎన్నికల పోలింగ్ రోజున టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులతో బీభత్సం సృష్టించి కురుపాం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని బంధించాయి.దాదాపు నాలుగు గంటలపాటు టీడీపీ రౌడీమూకలు స్వైర విహారం చేసినా పోలీసులు, ఎస్పీగా ఉన్న దామోదర్ సైతం పట్టించుకోలేదు. సరికదా అదనపు బలగాలను కూడా అక్కడికి పంపించలేదు. అప్పట్లో విశాఖపట్నం డీఐజీ స్పందించి అదనపు బలగాలను కురుపాం పంపించడంతో నాలుగు గంటల తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదీ దామోదర్ అసమర్థ, నిర్లక్ష్యపూరిత ట్రాక్ రికార్డ్.అలాంటి అధికారికి కంట్రోల్ రూమ్ బాధ్యతలా?ఎన్నికల విధుల్లో ఉద్దేశపూర్వకంగా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఆర్ దామోదర్‌కు ప్రస్తుతం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించారు. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, ఈసీకి నోడల్ అధికారిగా ఉన్న అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబాత్ర బాగ్చీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా విధ్వంసకర సంఘటనలు జరిగితే వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, అందుకోసం జిల్లా ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీచేయడం ఆయన బాధ్యత. అంటే.. డీజీపీ తరఫున జిల్లా ఎస్పీలకు ఆయనే ఆదేశాలు జారీచేస్తారు.2019 ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలను అడ్డుకోవడంలో విఫలమైన ఆయన ప్రస్తుతం కంట్రోల్ రూమ్ బాధ్యతలను ఎలా నిర్వహించగలరని డీజీపీ, అదనపు డీజీ భావించారో అర్థంకావడంలేదు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే దామోదర్‌కు ఈ బాధ్యతలు అప్పగించారా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇటీవల పోలింగ్ రోజున పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ గూండాలు విధ్వంసానికి పాల్పడ్డాయి.అదే రీతిలో కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జన్యానికి కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయినాసరే.. టీడీపీకి అనుకూల అధికారిగా గుర్తింపు పొందిన దామోదర్‌కు కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసేందుకు.. టీడీపీ గూండా మూకలపై కఠిన చర్యలు తీసుకోకుండా ఎస్పీలను నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
ఏవోబీ ఉద్రిక్తం
విశాఖ ఏజెన్సీలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మేలో ఆకు రాల్చిన అడవి చిగురించింది. దీంతో రెండు నెలలు మౌనంగా ఉన్న దళసభ్యులు కదలికలను పెంచారు. ఏవోబీలో తిరుగుతూ రిక్రూట్మెంట్కు ప్రయత్నిస్తున్నారు. ఈనెల 28 నుంచి ఆగస్టు మూడు వరకు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో కొత్త ప్రాంతాల్లో స్తూపాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సమాచారం మేరకు పోలీసులు ఆయా నిర్మాణాలను అడ్డుకుంటున్నారు. ఎవరైనా స్తూపాలు నిర్మించినా...దళసభ్యులకు సహకరించినా అరెస్టు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. వెరసి మన్యం నెల రోజుల పాటు భయం గుప్పెట్లోకి వెళ్లింది. అంతటా హైఅలె ర్ట్ పాడేరు: వారోత్సవాల భగ్నానికి అప్రమత్తంగా ఉన్నామని నర్సీపట్నం ఓఎస్డి ఎఆర్ దామోదర్ తెలిపారు. ఏజెన్సీలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో హైఅలెర్ట్ ప్రకటించామన్నారు. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, స్పెషల్‌పార్టీ పోలీసు బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నామన్నారు. పోలీసు స్టేషన్ ల పరిధిలోనూ బలగాలు తనిఖీలు చేపడుతున్నాయన్నారు. కొయ్యూరు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది మావోయిస్టులే. ఇక్కడి ఈస్టు,మల్కన్‌గిరి, కొరాపుట్,శ్రీకాకుళం డివిజన్లలో కొండలు, గుట్టలు, దట్టమైన అటవీప్రాంతం, కనీస సదుపాయాలకు నోచుకోని గిరిజన గూడేలు ఉన్నాయి. కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈనెల 28 నుంచి ఆగస్టు మూడు వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని దళసభ్యులు విధ్వంసాలకు తెగబడే అవకాశం ఉందని పోలీసులు, నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఇటీవల ఎంపీపీ,జెడ్పీటీసీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన వారంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చింతపల్లి, జీకేవీధి, జి.మాడుగుల, ముంచంగిపుట్టు,పెదబయలు,కొయ్యూరు మండలాల నేతలు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి. ఏవోబీలోని మావోయిస్టుల మూడు కేంద్రీయ రిజర్వ్ కమాండ్(సీఆర్సీ)లు బలహీన పడ్డాయని పోలీసులు అంచనా వేస్తున్నప్పటికీ,అదును చూసి మెరుపుదాడులకు దిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చెట్లు చిగురించి అంతటా దట్టంగా పచ్చదనం సంతరించుకుంది. పోలీసులకు మావోయిస్టులు లేదా వారికి వీరు దూరం ప్రాంతాల నుంచి కనిపించే అవకాశం లేదు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడుగడుగునా తనిఖీ, గాలింపు ముమ్మరం చేశారు. అనుమానితులను విచారించి విడిచిపెడుతున్నారు. ఇటీవల కొయ్యూరు మండలం పుట్టకోట ప్రాంతంలో ఎన్ఆర్ఈజీఎస్ బృందాన్ని అడ్డుకొని వారి సామగ్రిని లాక్కొని వెళ్లడంతో మావోయిస్టుల కదలికలపై నిఘాను పెంచారు. మండలంలోని అన్ని ప్రాంతాల్లోకి బ లగాలను దింపుతున్నారు. దీంతో విశాఖ ఏజెన్సీలో మళ్లీ భయానక వాతావరణం చోటు చేసుకుంది. గుత్తికోయలు వచ్చే అవకాశం? వారోత్సవాల సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి మావోయిస్టులు ఏవోబీకి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుత్తికోయలు వస్తుంటారు. వారి వద్ద అత్యాధునిక ఆయుధాలున్నట్టు చెప్పుకుంటున్నారు. గతేడాది పంచాయతీ ఎన్నికల్లో చిత్రకొండలోని కలి మెల బ్లాక్‌కు చెందిన అసిస్టెంట్ కమాండర్ రం బోతు అలియాస్ లక్ష్మి కిండంగికి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించింది. దీని ఆధారంగా అనేక సందర్భాలలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన మావోయిస్టులు ఇక్కడకు వ స్తున్నారని నిర్ధారణ అవుతోంది. ఎలాగైనా వారోత్సవాలను నిర్వహించాలని మావోయిస్టులు చూస్తుంటే.. వా టిని అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. జీకేవీధి మండలంలో ఇటీవల మావోయిస్టులు చే పట్టిన స్తూపం నిర్మాణాన్ని పోలీసు లు అడ్డుకున్నట్టు తెలిసింది. దశాబ్దం కిందట వారోత్సవాలకు మావోయిస్టు అగ్రనాయకులు హాజరయ్యేవారు. పాత్రికేయులను కూడా పిలిచేవారు. అయితే రెండు మూడేళ్లుగా మావోయిస్టులే పాత్రికేయులకు నేరుగా సీడీలను పంపుతున్నారు. గూడెంకొత్తవీధి: పోలీసులు అడుగడుగునా తనిఖీ, గాలింపు ముమ్మరం చేశారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను తిప్పికొట్టేందుకు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు స్తూపాల నిర్మాణాలను ప్రోత్సహించే వారిపై హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. ప్రధాన రహదారుల్లో వాహనాల తనిఖీ, అడవిలో గాలింపు ముమ్మరం చేశారు. ఆదివారం స్థానిక ఎస్ఐ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. అనుమానితులను విచారించి విడిచిపెడుతున్నారు. మావోయిస్టులకోసం గాలింపు ముమ్మరం చేయడంతోపాటు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించాయి. ఇటీవల కొయ్యూరు మండలం పుట్టకోట ప్రాంతంలో ఎన్ఆర్ఈజీఎస్ బృందాన్ని అడ్డుకొని వారి సామగ్రిని లాక్కొని వెళ్లడంతో మావోయిస్టుల కదలికలపై నిఘాకు మండలంలోని అన్ని ప్రాంతాల్లోకి బ లగాలను దింపుతున్నారు. దీంతో విశాఖ ఏజెన్సీలో మళ్లీ భయానక వాతావరణం చోటు చేసుకుంది.