breaking news
Anirudh Sharma
-
స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం..
కాలేజీ రోజుల్లో కల కనని వారు అంటూ ఉండరు. ఆ కలకు కష్టం, అంకితభావం తోడైతే ఎంత పెద్ద విజయం సాధించవచ్చో ‘దిగంతర’ నిరూపించింది. అనిరుథ్ శర్మ, రాహుల్ రావత్, తన్వీర్ అహ్మద్ అనే కుర్రవాళ్లు కాలేజీ రోజుల్లో కన్న కలను స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం చేసుకొని తిరుగు లేని విజయాన్ని సాధించారు..‘దిగంతర మొదలైనప్పుడు, ఇప్పటికి తేడా ఏమిటి?’ అనే ప్రశ్నకు వినిపించే జవాబు... ‘దిగంతర’ అంటే అంతరిక్ష వ్యర్థాలను గుర్తించే సంస్థగానే ఎక్కువ గుర్తింపు ఉండేది. తాజా విషయానికి వస్తే... వినియోగదారులకు సేవలు అందించడం మాత్రమే కాకుండా మన దేశ రక్షణ ప్రయోజనాల విషయంలో మౌలిక సదు΄ాయాలను అందించే సంస్థగా అభివృద్ధి చెందింది. ‘అంతరిక్షంలో ఏం జరుగుతుంది?’ అనేది అర్థం చేసుకోవడానికి స్పేస్ డొమైన్ అవేర్నెస్ కంపెనీగా ఎదిగింది.దిగంతరకు సంబంధించిన ఐడియా కాలేజీ రోజుల్లోనే అనిరు«థ్ శర్మ, రాహుల్ రావత్‌లకు వచ్చింది. బెంగళూరులో శాటిలైట్ క్లబ్ నిర్వహిస్తున్న తన్వీర్ అహ్మద్‌తో కలిసి ‘దిగంతర’ కలను సాకారం చేసుకున్నారు. విమానయానం, సముద్ర నావిగేషన్‌కు సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సంస్థలు, నియమాలు ఉన్నాయి. అంతరిక్షానికి సంబంధించి అలాంటివి లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘స్పేస్ డొమైన్ అవేర్నెస్’కు ప్రాధాన్యత ఇస్తోంది దిగంతర.దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోంది. స్పేస్ డొమైన్ అవేర్నెస్ వల్ల అంతరిక్షంలో ఏం జరుగుతుందో అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. స్పేస్–మ్యాప్ (స్పేస్ మిషన్ ఎష్యూరెన్స్ ప్లాట్‌ఫామ్), స్టార్స్(స్పేస్ థ్రెట్ అసెస్మెంట్ అండ్ రెస్సాన్స్ సూట్) అనే రెండు సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేసింది కంపెనీ. అంతరిక్ష ఆధారిత సెన్సర్లు, గ్రౌండ్ ఆధారిత టెలిస్కోపిక్ అబ్జర్వేటరీల కాంబినేషన్‌ను ఉపయోగిస్తోంది దిగంతర.ఈ అబ్జర్వేటరీలలో మొదటిది లద్దాఖ్‌లో రానుంది. సెన్సర్ల నుంచి తీసుకున్న డెటా, వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, ఇతరత్రా సంస్థల నుంచి సేకరించిన డేటాతో తన సొంత లైబ్రరీలను ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఈ లైబ్రరీలను ఉపయోగించి విశ్లేషణలు అందించే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది.‘దిగంతర’కు ‘సింగపూర్ స్పేస్ అండ్ టెక్నాలజీ’లాంటి అంతర్జాతీయ కస్టమర్లు ఉన్నారు. మైత్రి(మిషన్ ఫర్ ఆస్ట్రేలియా–ఇండియా టెక్నాలజీ, రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్)లో భాగంగా ఆప్టికల్ సెన్సర్ల సప్లైకు సంబంధించి ఆస్ట్రేలియాకు చెందిన స్పేస్ మెషిన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.స్పేస్ ఆపరేషన్స్, సిచ్యుయేషనల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కటింగ్–ఎడ్జ్ టెక్నాలజీతో దూసుకు΄ోతున్న ‘దిగంతర’ అంతరిక్షానికి సంబంధించి అంతర్జాతీయ కంపెనీగా ఎదిగింది. ‘వర్క్ హార్డ్ డ్రీమ్ బిగ్’ అనేది ముగ్గురు మిత్రులకు ఇష్టమైన మాట. ఆ మాటకు అర్థం ఏమిటో ‘దిగంతర’ విజయం చెప్పకనే చెబుతోంది.ఇవి చదవండి: మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే? -
అంధులకు దారిచూపే పాదరక్షలు!
భలేబుర్ర ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పయి కోట్ల మంది అంధులు ఉన్నారు. వెంట ఎవరూ లేకుండా ఎక్కడికైనా వెళ్లాలంటే ఎంతో కష్టపడుతున్నారు. అది చూసిన ఇద్దరు యువకులు... అందరిలాగే అంధులు కూడా తేలికగా ఎక్కడికి కావాలన్నా వెళ్లిపోగలిగేలా చేస్తే బాగుండనుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రయోగాలు చేశారు. చివరకు అంధులకు దారిచూపే పాదరక్షలకు రూపకల్పన చేశారు. ఢిల్లీకి చెందిన విద్యార్థులు అనిరుధ్ శర్మ, క్రిస్పియన్ లారెన్స్ రూపొందించిన ఈ పాదరక్షలకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ప్రశంసలు లభించాయి. యంత్రాలపై నిరంతరం ప్రయోగాలు సాగించే అనిరుధ్శర్మ ఒకసారి కుతూహలం కొద్దీ ఒక మిత్రుడి షూస్‌లో వైబ్రేటర్ ఉంచి చూశాడు. అప్పుడు మెదిలింది అతడిలో ఆలోచన. వైబ్రేటర్‌తో పనిచేసే పాదరక్షలు అంధులకు బాగా ఉపయోగపడగలవని అనుకున్నాడు. తోటి మిత్రుడు లారెన్స్‌తో కలసి ఈ ప్రయోగాన్ని కొనసాగించి, ఎట్టకేలకు అంధులకు దారిచూపే పాదరక్షలను రూపొందించాడు. వీటికి ‘లే చల్’ అని పేరు పెట్టాడు. సాదాసీదా షూస్లాగానే కనిపిస్తాయి ఇవి. వాటిలో ఒక వైబ్రేటింగ్ యూనిట్, ఒక చిప్, రీచార్జబుల్ బ్యాటరీ ఉంటాయి. బ్యాటరీని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బయటకు తీసి, తిరిగి రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ పాదరక్షలు ధరించిన వారిని నిర్ణీత గమ్యానికి సురక్షితంగా చేరుస్తాయి. దారిలో వచ్చే అడ్డంకులను గుర్తించి, ఎటువైపు మళ్లితే క్షేమమో, ఎక్కడెక్కడ మలుపులు తిరగాలో వైబ్రేటర్ ద్వారా సంకేతాలు ఇస్తాయి ఈ బూట్లు.