పెడదారిలో వెళితే..?
కాలేజీ నేపథ్య కథాంశంతో మల్లెల చరణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అబ్బాయిలు బీ కేర్ఫుల్’. గోపాల్ సమర్పణలో ధర్మవరపు చంద్రమౌళి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివ, రామకృష్ణ, నరేశ్, శ్రీచరణ్, అక్షయ్ హీరోలు. శ్రీనయన, విజయసాయి, లావణ్య హీరోయిన్లు. త్వరలో రెండో షెడ్యూల్ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. యువత తప్పు దోవలో వెళితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనే కథతో ఈ సినిమా తీస్తున్నామని దర్శకుడు తెలిపారు.