breaking news
Ambati Srihari Prasad
-
అవనిగడ్డలో టీడీపీకి షాక్..!
సాక్షి, కృష్ణా : టీడీపీకి మరో షాక్ తగిలింది. అవనిగడ్డ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ జగన్ సమక్షంలో మంగళవారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు తమకు గుర్తింపునివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే టీడీపీని వీడుతున్నట్టు తెలిపారు. 2014 ఎన్నికల్లో తనను కాదని మండలి బుద్ధప్రసాద్‌కు టికెట్ ఇచ్చిన చంద్రబాబు.. ‘నీ బాధ్యత నేను తీసుకుంటా. తగిన ప్రాధాన్యం ఇస్తానని చెప్పి మోసం చేశాడు. మానసిక వేదనతోనే టీడీపీని వీడాను. వైఎస్సార్సీపీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉంది. వైఎస్ జగన్ అవనిగడ్డకు వస్తున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరడం శుభపరిణామంగా భావిస్తున్నాను’ అని శ్రీహరి అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కృష్ణా జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎంపీ, దివంగత బ్రాహ్మణయ్య వారసుడు శ్రీహరి. (చదవండి : కొండంత అండగా నేనున్నాను: వైఎస్ జగన్) పశ్చిమ గోదావరిలో టీడీపీకి షాక్..! పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. నరసాపురం టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ చాగంటి సత్యనారాయణ ఆ పార్టీకీ రాజీనామా చేశారు. ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో మంగళవారం ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. నెల్లూరులో పచ్చపార్టీకి షాక్..! వెంకటగిరిలో టీడీపీకి షాక్ తగిలింది.70 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన వెంకటగిరి రాజాలు టీడీపీని వీడారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వెంకటగిరి సమన్వయకర్త ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. రాజాలుతో పాటు టీడీపీ నెల్లూరు జిల్లా తెలుగుమహిళ మాజీ అధ్యక్షురాలు, నువ్వుల మంజుల పలువురు టీడీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. -
అవనిగడ్డ ఉపఎన్నిక అనివార్యం
అవనిగడ్డ ఉపఎన్నిక పోలింగ్ అనివార్యంగా మారింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమయింది. నామినేషన్ ఉపసంహరణ బుధవారంతో ముగిసింది. చివరకు టీడీపీ సహా ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. 21న అవనిగడ్డకు ఉప ఎన్నికలు జరగనుండగా, 24న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. టీడీపీ తరపున అంబటి బ్రాహ్మణయ్య తనయుడు అంబటి హరిప్రసాద్ పోటీ చేస్తున్నారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి అంబటి బ్రాహ్మణయ్య మృతితో ఖాళీ ఏర్పడింది. ఆయన చనిపోయిన నాటి నుంచి ఏకగ్రీవం కోసం టీడీపీ నాయకులు, అంబటి కుటుంబసభ్యులు ఇతర పార్టీల నేతలను కోరుతూ వచ్చారు. ఇదే విషయమై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాన పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖలు కూడా రాశారు. సానుభూతి కోణంలో చూసిన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, సీపీఎం, బీజేపీలు తాము అభ్యర్థులను పోటీకి పెట్టలేదు.