breaking news
adulterate
-
6 నెలల్లో 554 మంది భర్తల మరణాలు : షాకింగ్ సర్వే
గురుగ్రామ్‌కు చెందిన 'ఏకం న్యాయ్ ఫౌండేషన్' (Ekam Nyaay Foundation) అనే స్వచ్ఛంద సంస్థ (NGO) సంచలన నివేదకను వెల్లడించింది. జెండర్ సమానత్వం కోసం, ముఖ్యంగా సమాజంలో పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల నివారణకు పనిచేసే ఈ ఎన్జీవో 2026 తొలి ఆరు నెలల్లో (జులై 14 వరకు) దేశవ్యాప్తంగా 554 మంది భర్తల హత్యలు లేదా ఆత్మహత్యలు చేసుకున్నట్టు తేలిందని ఈ నివేదిక పేర్కొంది. మీడియాలో వచ్చిన వార్తలు, తాము సేకరించిన వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించినట్టు తెలిపింది.ఇటీవలి కాలంలో ప్రియులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేస్తున్న దారుణ ఉదంతాలు ఆందోళన రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల కాబోయే భార్య చేతిలో పుణే రియల్టర్ హత్య సంచలనంగా మారింది. అయితే ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ జరుగుతున్నాయని ఏకం న్యాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఫిలిం మేకర్, దీపికా నారాయణ్ భరద్వాజ్ వెల్లడించారు. అధికారిక నేరాల డేటాలో పురుషులపై జరిగే గృహహింసకు లేదా భర్తల హత్యలకు ప్రత్యేక వర్గీకరణ (classification) లేకపోవడం వల్ల ఈ సమస్య తీవ్రతను అంచనా వేయడం కష్టంగా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ గణాంకాల ప్రకారం భారతదేశంలో 2026 మొదటి ఆరు నెలల్లో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురవుతుండగా, ఒకరి కంటే ఎక్కువ మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఫౌండేషన్ తెలిపింది. అయితే ఇవి కేవలం మీడియా నివేదికల ఆధారంగా సేకరించినవేనని, ప్రభుత్వ అధికారిక గణాంకాలు కావని స్పష్టం చేసింది. పురుషులపై జరిగే గృహహింసను ట్రాక్ చేయడానికి ప్రత్యేక జాతీయ డేటాబేస్ లేనందున, వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చన్నారు. ఇదీ చదవండి: తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీభార్యలు లేదా వారి ప్రియుల చేతిలో హత్యకు గురైన భర్తల కేసులు: 322వైవాహిక వివాదాలు, గృహహింస, వేధింపులు, తప్పుడు కేసుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న భర్తల కేసులు: 232హత్యలకు ప్రధాన కారణాలు322 హత్య కేసుల్లో 194 కేసులు (60.2%) వివాహేతర సంబంధాల వల్లే జరిగాయి. వివాహేతర సంబంధాన్ని భర్త వ్యతిరేకించడంతో, భార్యలు తమ ప్రియుళ్లతో కలిసి భర్తలను చంపడానికి కుట్ర పన్నినట్లు నివేదిక పేర్కొంది. 88 కేసులు పాత గృహ వివాదాల కారణంగా జరిగాయి. మిగిలిన హత్యలు డబ్బు గొడవలు, కుటుంబ కుట్రలు మొదలైన కారణాలతో సంభవించాయి.ఇదీ చదవండి: తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీవణికిస్తున్న హత్యా పద్దతులువిషం పెట్టడం, సజీవ దహనం, కరెంట్ షాక్ ఇవ్వడం, గొంతు నులమడం, మృతదేహాలను ముక్కలుగా నరకడం, పూడ్చిపెట్టడం, హత్యలను ప్రమాదాలు లేదా ఆత్మహత్యలుగా చిత్రీకరించడం వంటివి ఉన్నాయని ఫౌండేషన్ తెలిపింది. ఈ కాలంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 93 భర్తల హత్యలు, 103 ఆత్మహత్యలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి.ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్‌పాట్ : నిద్రలేమే వరంలా మారిందిఫౌండేషన్ ఈ ఏడాది జరిగిన 25 అత్యంత ఘోరమైన కేసులను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇందులో భర్తల తలలు నరకడం, ముక్కలుగా కోయడం, ఇళ్లల్లోనే పూడ్చిపెట్టడం వంటి ఘటనలు ఉన్నాయి. మరికొన్ని ఆత్మహత్య కేసుల్లో బాధితులు చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్లు లేదా రికార్డ్ చేసిన వీడియోలలో... తాము ఎదుర్కొన్న మానసిక క్షోభ, పిల్లలను చూడనివ్వకపోవడం, తప్పుడు కేసుల వేధింపులు ఉన్నాయని దీపికా నారాయణ్ భరద్వాజ్ వివరించారు.ఇదీ చదవండి: రెచ్చిపోయిన పోకిరీకి, యువతి గుణపాఠం : వీడియో వైరల్ -
హైదరాబాద్‌లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయం.. వ్యాపారి అరెస్ట్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్‌లోని జెమ్ ఫుడ్స్ గోడౌన్‌పై పోలీసులు దాడి చేశారు. అక్కడ నిల్వ ఉంచిన 30 బాక్సులకు పైగా కుళ్లిపోయిన డ్రై ఫ్రూట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మనీష్ అనే డ్రై ఫ్రూట్స్ వ్యాపారి బూజు పట్టిన జీడిపప్పు, బాదంలను నాణ్యమైనవిగా చూపించి ప్రజలకు విక్రయిస్తున్నాడు. దాంతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేసే సమయంలో వాటి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. ఈ ఘటనతో కల్తీ ఆహార పదార్థాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
పెట్రోల్ కల్తీని నివారించండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా పెట్రోల్ బంకుల్లో భారీగా కల్తీ జరుగుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. పెబ్రోల్ బంకుల్లో జరుగుతున్న కల్తీని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది. ఎటువంటి చర్యలు చేపట్టారో ఆరు వారాల్లోగా తెలపాలని సూచించింది. చమురు కల్తీకి ఆస్కారం లేని పెట్రోల్, డీజిల్ అమ్మకపు యంత్రాలు తయారు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరింది. పెట్రోల్‌లో కిరోసిన్ కలుపుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన సదాబాద్ ఎమ్మెల్యే దేవేంద్ర అగర్వాల్ పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.


