Top Stories
ప్రధాన వార్తలు
చికెన్ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత
ముంబై: చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్ నగర్లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో షాక్ తగలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సోమవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ సమక్షంలో గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గార్ల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్.జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్… pic.twitter.com/4YkyrxJvSy— Telangana Congress (@INCTelangana) April 29, 2024 ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గుత్తా అమిత్.. బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ స్థానం ఆశించారు. భువనగిరి లేదా నల్లగొండ స్థానం ఆశించి భంగపడ్డారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు.. గుత్తా సుఖేందర్ కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం.
T20 WC: సచినే ఓపెనర్‌గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధంగా ఉండాలని సూచించాడు. అంతటి సచిన్ టెండుల్కరే 2007 వరల్డ్‌కప్ టోర్నీలో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడని సెహ్వాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓపెనింగ్ జోడీ గురించి మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.మూడో స్థానంలో ఆడిస్తాను‘‘నాకు గనుక అవకాశం ఉంటే.. అతడి(కోహ్లి)ని ఓపెనింగ్‌కు పంపించను. అతడిని మూడో స్థానంలో ఆడిస్తాను. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా నా ఆప్షన్. కోహ్లి వన్‌డౌన్‌లోనే రావాలి.మిడిల్ ఓవర్లలో ఎలా ఆడాలి అనేది అతడి తలనొప్పి. ఒకవేళ ఆరంభంలోనే వికెట్ పడితే కోహ్లి బ్యాటింగ్‌కు వస్తాడు. కాబట్టి పవర్ ప్లేలో తను ఇన్నింగ్స్ చక్కదిద్దగలడు.ఒకవేళ వికెట్ తొందరగా పడకపోతే.. ఎలా ఆడాలో కెప్టెన్, కోచ్‌ల సూచనలకు అనుగుణంగా అతడు ఆడాలి. జట్టులో ఒక ఆటగాడిగా అతడు తప్పక ఇది చేయాల్సిందే’’ అని క్రిక్‌బజ్ షోలో అతడు వ్యాఖ్యానించాడు.మిడిలార్డర్లో ఆడటం సచిన్‌కు అస్సలు ఇష్టం లేదుఇందుకు ఉదాహరణగా సచిన్ టెండుల్కర్ పేరును ప్రస్తావించిన సెహ్వాగ్.. ‘‘2007 ప్రపంచకప్ టోర్నీలో సచిన్ టెండుల్కర్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేశాడు.మిడిలార్డర్లో ఆడటం సచిన్‌కు అస్సలు ఇష్టం లేదు. అయినా.. జట్టు ప్రయోజనాల కోసం ఒప్పుకొన్నాడు. మీ జట్టులో ఇద్దరు మంచి ఓపెనర్లు ఉండి.. నిన్ను(కోహ్లిని ఉద్దేశించి) మూడో స్థానంలో ఆడమన్నపుడు.. కచ్చితంగా అలాగే చేయాలి.ఓపెనర్లు సెట్ చేసిన మూమెంటమ్‌ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వన్‌డౌన్ బ్యాటర్‌కు ఉంటుంది. నాకు తెలిసి ఈ విషయంలో విరాట్ కోహ్లికి ఎలాంటి అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నా’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.ఓపెనర్లుగా వాళ్లేకాగా ఈసారి పొట్టి ప్రపంచకప్ ఈవెంట్లో కోహ్లి రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడిగా దిగనున్నాడని.. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ లేదంటే.. శుబ్‌మన్ గిల్‌పై వేటు పడనుందన్న వార్తల నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా జూన్ 5న వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
సాక్షి, విశాఖపట్నం: ఆమె పేరు కొత్తపల్లి గీత. 2014లో అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో ఆమెకు 4,13,191 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణిపై ఆమె 91,398 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎంపీ అయిన కొన్నాళ్లకే ఆమె వైఎస్సార్సీపీని వీడారు. ఆపై 2018లో సొంతంగా జన జాగృతి పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. 2014లో అరకు నుంచి 4 లక్షలకు పైగా ఓట్లను, 90 వేలకు పైగా ఆధిక్యాన్ని సాధించిన ఆమె అదంతా తన బలంగా భావించారు. ఆ నమ్మకంతో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు తన సత్తా ఏపాటిదో తెలిసొచ్చింది. 2019 ఎన్నికలకు విశాఖ లోక్‌సభ నియోజకవర్గంలో 18,29,300 మంది ఓటర్లున్నారు.వీరిలో 12,39,754 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో కొత్తపల్లి గీతకు 1,158 మంది మాత్రమే ఓట్లు వేశారు. ఇది మొత్తం ఓట్లలో 0.09 శాతం మాత్రమే కావడం విశేషం. దీంతో ఆమె డిపాజిట్లు కోల్పోవడమే కాదు.. నోటాకు పడిన ఓట్లలో ఒక శాతం కూడా పొందలేక పోయారు. 2019 విశాఖ లోక్‌సభ స్థానానికి 14 మంది పోటీ చేశారు. వీరందరిలో ఆమె అత్యల్పంగా 1,158 ఓట్లు మాత్రమే సాధించి 13 వ స్థానంలో నిలిచారు. మిగిలిన 12 మంది ఆమెకంటే ఎక్కువ ఓట్లను సాధించిన వారే! వీరిలో విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లు లభించాయి. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి భరత్‌కు 4,32,492, జనసేన అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణకు 2,88,874, బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి 33,892, నోటాకు 16,646 ఓట్లు వచ్చాయి. బలం తెలిసి.. బీజేపీలో చేరి.. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయంతో జనంలో తనకు వ్యక్తిగతంగా ఎంత బలముందో గీతకు తేటతెల్లమైంది. 2014లో వచ్చిన ఓట్లను చూసి తనను తాను అతిగా ఊహించుకున్న ఆమెకు అదంతా తన బలం కాదన్న వాస్తవం అర్థమైంది. దీంతో ఎన్నో ఆశలతో స్థాపించిన జన జాగృతి పార్టీకి మనుగడ లేదన్న నిర్ధారణకు వచ్చిన ఆమె ఆ పార్టీ చాప చుట్టేసి 2019 జూన్‌లో బీజేపీలో విలీనం చేశారు. తాను కూడా బీజేపీలో చేరిపోయారు. అరకులో మరోసారి పరీక్ష ఈసారి ఎన్నికల్లో కొత్తపల్లి గీత అరకు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. అరకు నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో కనీసం 1,200 ఓట్లు కూడా తెచ్చుకోలేని గీత ఈ ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారోనని అరకు పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఓటర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తొలిసారి ఎంపీగా పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్లతో గెలిచి.. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి వందల ఓట్లకు దిగజారిన అభ్యర్థి ఈమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టు ప్రకటన.. వినూత్న ప్రయోగం
యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఈ ఏడాది జూన్ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (ఏప్రిల్ 29) ప్రకటించారు. స్టార్లతో నిండిన ఈ జట్టుకు కేన్ విలియమ్సన్ సారథ్యం వహించనున్నాడు. గాయపడిన ఆడమ్ మిల్నే స్థానంలో మ్యాట్ హెన్రీ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్‌లతో కలిసి హెన్రీ కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు. బొటనవేలి గాయంతో బాధపడుతున్న డెవాన్ కాన్వేను సైతం న్యూజిలాండ్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టులో మరో వికెట్‌కీపర్ బ్యాటర్ ఫిన్ అలెన్‌కు స్థానం లభించినప్పటికీ.. వరల్డ్‌కప్‌లో కాన్వేనే కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వికెట్‌కీపర్ బ్యాటర్లైన టిమ్ సీఫర్ట్, టామ్ బ్లండెల్‌లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు లభించలేదు. ఇటీవల పాక్‌తో సిరీస్‌ను (టీ20) డ్రా చేసుకున్న జట్టుకు సారధి అయిన మైఖేల్ బ్రేస్‌వెల్ కూడా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కోటాలో ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఐష్ సోధి, మిచెల్ సాంట్నార్.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్ వ్యవహరించనున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో మూడు శతకాలతో విజృంభించిన రచిన్ తొలిసారి టీ20 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా లూక్ రాంచీ, బౌలింగ్ కోచ్‌గా జేకబ్ ఓరమ్, అసిస్టెంట్ కోచ్‌గా జేమ్స్ ఫోస్టర్ వ్యవహరించనున్నారు. హెడ్ కోచ్‌గా గ్యారీ స్టెడ్ కొనసాగనున్నాడు. వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్ జట్టు మే 23న బయల్దేరనుంది. జూన్ 7న న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ (ఆఫ్ఘనిస్తాన్) ఆడనుంది.న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐష్ సోధీ [ట్రావెలింగ్ రిజర్వ్-బెన్ సియర్స్ ]Join special guests Matilda and Angus at the squad announcement for the upcoming @t20worldcup in the West Indies and USA. #T20WorldCup pic.twitter.com/6lZbAsFlD5— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024 వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్న్యూజిలాండ్ క్రికెట్ తమ టీ20 వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. సెలక్టర్లు, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిథులు కాకుండా ఇద్దరు చిన్నారులు జట్టు సభ్యుల పేర్లను వెల్లడించారు. న్యూజిలాండ్ క్రికెట్ మటిల్డా, ఆంగస్ అనే ఇద్దరు చిన్నారులకు చీఫ్ గెస్ట్లుగా ఆహ్వానించింది. The team's kit for the 2024 @T20WorldCup 🏏Available at the NZC store from tomorrow. #T20WorldCup pic.twitter.com/T4Okjs2JIx— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024 న్యూజిలాండ్ క్రికెట్ చేసిన ఈ వినూత్న ప్రయోగం అందరినీ ఆకట్టుకుంది. వరల్డ్‌కప్ జట్టు ప్రకటన సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ తమ వరల్డ్‌కప్ జెర్సీని కూడా రివీల్ చేసింది. మెగా టోర్నీలో న్యూజిలాండ్ క్రికెటర్లు తాము రెగ్యులర్‌గా ధరించే బ్లాక్ కిట్ కాకుండా వేరే కలర్లో ఉండే కిట్లను ధరించనున్నారు.
ఎన్నికల వేళ కలకలం.. సోషల్ మీడియాలో అమిత్ షా ఫేక్ వీడియో!
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కామెంట్స్ ఉన్నాయి. దీంతో.. హోం మంత్రిత్వ శాఖ, బీజేపీల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది. .@INCTelangana is spreading an edited video, which is completely fake and has the potential to cause large scale violence.Home Minister Amit Shah spoke about removing the unconstitutional reservation given to Muslims, on the basis of religion, after reducing share of SCs/STs and… pic.twitter.com/5plMsEHCe3— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 27, 2024 ఇక, వీడియోపై కాంగ్రెస్ స్పందించింది. రిజర్వేషన్‌ను అంతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందని పేర్కొంటూ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ల అధికారిక ఖాతాలతో సహా పలు సోషల్ మీడియా ఖాతాల్లో ఆ వీడియో షేర్ చేశారు. దీంతో బీజేపీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోను పూర్తిగా ఎడిట్ చేశారని పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలో దీనిపై కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఈ వీడియోపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఫేక్ వీడియోపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మాలవీయా.. కాంగ్రెస్ పార్టీ ఈ నకిలీ వీడియోను వ్యాప్తి చేస్తోంది. చట్టపరమైన చర్యలకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఫేక్, ఎడిట్ చేసిన వీడియోలను ప్రచారం చేయడం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
Bank Holidays in May 2024: బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన సమచారం ఇది. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి.దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఉండగా వీటిలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిసి ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఆన్లైన్ లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కొన్ని పనులు బ్యాంకులకు వెళ్లి చేయాల్సి ఉంటుంది. అటువంటివారి కోసం బ్యాంకు సెలవుల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..మే 1: మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) మే 5: ఆదివారం.మే 8: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్లో బ్యాంకుల బంద్మే 10: బసవ జయంతి/ అక్షయ తృతీయమే 11: రెండో శనివారంమే 12: ఆదివారం.మే 16: సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుమే 19: ఆదివారం.మే 20: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బేలాపూర్, ముంబైలో బ్యాంకుల మూతమే 23: బుద్ధ పూర్ణిమ మే 25: నాలుగో శనివారం. మే 26: ఆదివారం.
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక
బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు పలు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం షోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్‌తో హైదరాబాద్‌లోనే కలిసి ఉంటున్న ప్రియాంక ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఇక్కడ భూమి కొనుగోలు చేసినట్లు శుభవార్త చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్)ప్రస్తుతం హైదరాబాద్‌లోని అద్దె ఫ్లాట్‌లో ఉంటున్న ప్రియాంక-శివ్.. తొలుత కొత్త ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నారు. టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఫ్లాట్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని, ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటే వచ్చే మజా వేరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివ్ అసలు విషయం చెప్పాడు. జనవరి నుంచి ల్యాండ్ కోసం తిరుగుతుండగా ఎప్పుడో ఓ సమస్య వచ్చేదని ప్రియాంక చెప్పుకొచ్చింది.ల్యాండ్ బాగుంటే రేటు నచ్చడం లేదని, అన్ని బాగుంటే పేపర్స్ సరిగా ఉండట్లేదని ప్రియాంక-శివ్ చెప్పారు. ఏప్రిల్ 10న ల్యాండ్ ఓకే చేసి, 23వ తేదీని రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. ఆ విజువల్స్ కూడా చూపించారు. అయితే హైదరాబాద్‌లో ల్యాండ్ కొనడం అంత ఈజీ కాదని చెప్పాడు. మొత్తానికి తన కల నెరవేరిందని శివ్ చెప్పగా.. ప్రియాంక ఫుల్ హ్యాపీగా కనిపించింది. ప్రస్తుతానితి ముహుర్తాలు లేవని, త్వరలో ఇంటి అప్డేట్స్ చెబుతామని ప్రియాంక-శివ్ చెప్పారు.(ఇదీ చదవండి:కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్ )
Neha Hiremath murder: నేహా హత్య కేసు నిందితునికి డీఎన్ఏ పరీక్ష
హుబ్లీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ హత్య కేసు నిందితుడు ఫయాజ్ రక్త నమూనాను సీఐడీ దర్యాప్తు అధికారులు న్యాయమూర్తి సమక్షంలో సేకరించారు. నిందితునిపై మరింత దర్యాప్తు, అతని డీఎన్ఏ పరీక్ష చేయడానికి అనుమతి కోరి సీఐడీ అధికారులు హుబ్లీ 1వ అదనపు సెషన్స్ కోర్టులో అర్జీ వేశారు. ఈ నేపథ్యంలో జడ్జి సమక్షంలో వైద్యులు ఫయాజ్ రక్త నమూనాలను సేకరించారు. హత్య జరిగిన స్థలం, హత్యకు వాడిన చాకుపై రెండు రక్తపు గ్రూప్‌లను కనుగొన్నారు. ఒక రక్త గ్రూప్ నేహాది అయితే, మరొకటి ఫయాజ్‌ది కావచ్చని, కత్తితో పొడిచేటప్పుడు అతనికి స్వల్ప గాయమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు అధికారులు ఫయాజ్ డీఎన్ఏ పరీక్ష నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు. కాగా ఫయాజ్ను సీఐడీ బృందం 6 రోజుల కస్టడీకి తీసుకున్న సంగతి విదితమే. సోమవారంతో కస్టడీ గడువు ముగియనుంది. అతన్ని మరింతగా విచారించడానికి కస్టడీ గడువును పొడిగించాలని సీఐడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది.
అవ్వాతాతలకు బాబు బ్యాచ్ తెచ్చిన కష్టాలు
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలోని లక్షలాది అవ్వాతాతలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరికి జీవనాధారమైన ప్రభుత్వ పింఛను అందకుండా కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్ వలంటీర్ల ద్వారా 65,49,864 మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛను లబ్ధిదారులకు నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీనే వారున్న చోటునే పింఛను అందిస్తున్నారు. గత ఐదేళ్లుగా నిరి్వఘ్నంగా ఇంటి వద్దే పింఛను అందుతుండటం చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్‌కు కంటగింపయింది. దీంతో బాబు బ్యాచ్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల కారణంగా పింఛన్ లబ్ధిదారులు గత నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు బ్యాచ్ పచ్చ కళ్లు చల్లబడకపోవడంతో వీరికి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. చంద్రబాబు హయాంలో పింఛను మంజూరవడమే గగనమైతే, ఆ వచ్చే కాస్త పింఛను కోసం అవ్వాతాతలు, దివ్యాంగులను నానా అగచాట్లకు గురిచేసే వారు. అందులోనూ కమీషన్లు గుంజేవారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛన్‌దారుల అవస్థలకు చెల్లుచీటీ పాడారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛనుగా పింఛను ఇంటి వద్దే అందించేవారు. సీఎం జగన్ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంతో గత 58 నెలలుగా పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందీలేకుండా వారి డబ్బులు అందుకున్నారు. ఇదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ లు, ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియాకు మింగుడుపడలేదు. ఎన్నికల కోడ్ నెపంతో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని నెల కిత్రమే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానంలో లేదంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏప్రిల్ నెల పింఛను డబ్బును సచివాలయాల వద్ద పంపిణీ చేస్తూనే, విభిన్న దివ్యాంగులు, కదల్లేక మంచానికి లేదా వీల్‌చైర్‌కే పరిమితమైన వారికి, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ ఈ నెల 3న మొదలుపెట్టి 8వ తేదీకల్లా పూర్తిచేశారు. సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకొనే క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. చల్లారని పచ్చ కళ్లు ఏప్రిల్ నెలలో పింఛను లబ్ధిదారులను నానా అగచాట్లకు గురి చేసినప్పటికీ, పచ్చ కళ్లు చల్లబడలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్లీ ఫిర్యాదులు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నతాధికారులందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ అనుకూల మీడియాలో పింఛన్ల పంపిణీపై రకరకాల తప్పుడు కథనాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా లబ్ధిదారులకు నేరుగా డబ్బుల పంపిణీకి బదులు బ్యాంకుల్లో జమ చేసేలా అధికారులు మళ్లీ మార్పులు చేయాల్సి వచి్చంది. 48,92,503 మంది అవ్వాతాతలు, ఇతరుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్‌తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. మే, జూన్ రెండు నెలల పాటు వీరు కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరో ఒకరి వెంట బెట్టుకొని బ్యాంకుల దాకా వెళ్లి ఆ డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గత నెలలో సచివాలయాల్లో డబ్బు తీసుకున్న వీరికి ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. సాధారణంగా అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకులో పని ఉంటే సమీపంలోని పెద్ద పంచాయతీలకో, మండల కేంద్రాలు, లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లాలి. ఈ రెండు నెలలూ పింఛను కోసం అవ్వాతాతలకు ఈ అవస్థలు తప్పవు. మండుటెండల్లో ఎవరో ఒకరిని వెంటబెట్టుకొని ఆటోలోనో, బస్సులోనో పక్క ఊరు లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లి డబ్బు తెచ్చుకోవాలి. దీని కోసం ఒక కుటుంబంలో ఇద్దరు ఒకట్రెండు రోజులు పనులు మానుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్లిరావాల్సి ఉంటుంది. వీరు కాకుండా విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో పింఛను పొందే వారు, మంచం లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన వారు, యుద్ధ వీరుల వృద్ధ వితంతువులతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేని వారు, అసలు బ్యాంకు ఖాతాలే లేని వారికి శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.66 లక్షల మంది వలంటీర్లు ఐదు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్న శాశ్వత ఉద్యోగుల ద్వారా వారి ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి నిర్ణయం వల్ల ఒక గ్రామంలో రోజుకు కొందరికి అంది, మరికొందరికి అందకపోతే పింఛనుదారులలో అలజడి రేగే అవకాశమూ ఉందని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ, సకాలంలో పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.గత చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుదారులకు అన్నీ కష్టాలే.. 2014 – 19 మధ్య రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పింఛనుదారులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవ్వాతాతలు, దివ్యాంగులు పింఛను మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. పింఛన్ల మంజూరు మొదలు, తొలగింపులు వంటి వాటిని కూడా జన్మభూమి కమిటీలకే చంద్రబాబు అప్పగించారు. ఆ జన్మభూమి కమిటీల్లో గ్రామాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే పూర్తిగా ఉండడంతో వాళ్లు టీడీపీకి ఓటు వేసిన వారికి లేదా లంచాలు ఇచి్చన వారికే కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు.ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులకు పింఛన్లు మంజూరయ్యేవే కావు. ఒకవేళ అప్పటికే ఎవరికైనా మంజూరై ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించారన్న ఆరోపణలున్నాయి. పింఛన్లు మంజూరైన వారు కూడా ఆ డబ్బు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఊరిలో ఎప్పుడు పింఛను పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో కూర్చొని ఊసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఉండేది.
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్‌దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
సినిమా
క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇందులో భాగంగానే తన లుక్ అంతా మార్చే పనిలో ఉన్నాడు. అయితే షూటింగ్ కి ఇంకా టైమ్ ఉండటంతో ప్రస్తుతం ఫ్యామిలీతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ క్యూట్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాసరే మహేశ్ తన ఫ్యామిలీతో ఎక్కువగా సమయాన్ని గడుపుతుంటాడు. తాజాగా అలా కూతురు సితారతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లికి వెళ్లాడు. ఈ వేడుకకు మహేశ్ అక్క మంజులు కూడా వచ్చింది. తమ్ముడితో సరదా కబుర్లు చెబుతూ పొడుగు జుత్తు గురించి అడిగింది. అలా అక్క-తమ్ముడు కలిసి చాలా సరదాగా కనిపించారు. ఇప్పుడీ వీడియోనే వైరల్ అవుతోంది.మరోవైపు ఇదే పెళ్లికి వచ్చిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి.. మహేశ్ బాబుని పలకరించారు. మహేశ్, అతడి కూతురు సితారతో కలిసి ఫొటో కూడా తీసుకున్నారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో అభిమానులకు తెగ నచ్చేస్తుంది.(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక) Cutest video on the internet today#MaheshBabu with his sister Manjula pic.twitter.com/ZkwXXp6mZL— KLAPBOARD (@klapboardpost) April 29, 2024Prabhas Raju Peddamma Taking photo with Favourite Actor @urstrulyMahesh 👌#SSMB29 #MaheshBabu pic.twitter.com/36oqc2zUvr— Nikhil_Prince🚲 (@Nikhil_Prince01) April 28, 2024
ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా థియేటర్లలో 'ప్రసన్నవదనం', 'కృష్ణమ్మ', 'జితేందర్ రెడ్డి' సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఉన్నంతలో సుహాస్ 'ప్రసన్నవదనం'పై కాస్త అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం చాలావరకు కొత్త చిత్రాలు రాబోతున్నాయి. వీటిలో ఓ రెండు మాత్రమే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక)ఓటీటీలో ఈ వారం దాదాపు 16 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇంగ్లీష్-హిందీ చిత్రాల సంగతి పక్కనబెడితే 'మంజుమ్మల్ బాయ్స్', 'సైతాన్' చిత్రాలు మాత్రమే చూడదగ్గవి అనిపిస్తున్నాయి. మిగతా వాటి గురించి రిలీజైతే తప్ప ఏం చెప్పలేం. ఇంతకీ ఈసారి ఓటీటీల్లోకి ఏం రాబోతున్నాయి. ఎందుకు స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు)నెట్ఫ్లిక్స్ఫియాస్కో (ఫ్రెండ్ సిరీస్) - ఏప్రిల్ 30టీ పీ బన్ (జపనీస్ సిరీస్) - మే 02సైతాన్ (హిందీ సినిమా) - మే 03ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) - మే 04అమెజాన్ ప్రైమ్అంబర్ గర్ల్స్ స్కూల్ (హిందీ సిరీస్) - మే 01ద ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) - మే 02క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 03హాట్స్టార్ద వెయిల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 30మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 05మాన్స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05జియో సినిమామైగ్రేషన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 01హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 03వోంకా (ఇంగ్లీష్ మూవీ) - మే 03ఆపిల్ ప్లస్ టీవీఅకాపుల్కో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 01(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక
బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు పలు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం షోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్‌తో హైదరాబాద్‌లోనే కలిసి ఉంటున్న ప్రియాంక ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఇక్కడ భూమి కొనుగోలు చేసినట్లు శుభవార్త చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్)ప్రస్తుతం హైదరాబాద్‌లోని అద్దె ఫ్లాట్‌లో ఉంటున్న ప్రియాంక-శివ్.. తొలుత కొత్త ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నారు. టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఫ్లాట్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని, ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటే వచ్చే మజా వేరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివ్ అసలు విషయం చెప్పాడు. జనవరి నుంచి ల్యాండ్ కోసం తిరుగుతుండగా ఎప్పుడో ఓ సమస్య వచ్చేదని ప్రియాంక చెప్పుకొచ్చింది.ల్యాండ్ బాగుంటే రేటు నచ్చడం లేదని, అన్ని బాగుంటే పేపర్స్ సరిగా ఉండట్లేదని ప్రియాంక-శివ్ చెప్పారు. ఏప్రిల్ 10న ల్యాండ్ ఓకే చేసి, 23వ తేదీని రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. ఆ విజువల్స్ కూడా చూపించారు. అయితే హైదరాబాద్‌లో ల్యాండ్ కొనడం అంత ఈజీ కాదని చెప్పాడు. మొత్తానికి తన కల నెరవేరిందని శివ్ చెప్పగా.. ప్రియాంక ఫుల్ హ్యాపీగా కనిపించింది. ప్రస్తుతానితి ముహుర్తాలు లేవని, త్వరలో ఇంటి అప్డేట్స్ చెబుతామని ప్రియాంక-శివ్ చెప్పారు.(ఇదీ చదవండి:కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్ )
అలాంటి సన్నివేశాలకు నో: మృణాళ్ ఠాకూర్
‘కథకి, పాత్రకి అవసరమైతే గ్లామర్ సన్నివేశాల్లో, ముద్దు సీన్స్‌లో నటించేందుకు సిద్ధం’ అనే మాటని ఎక్కువశాతం హీరోయిన్లు అంటుంటారు. అయితే అలాంటి సన్నివేశాలకు నో అనే కథానాయికలూ లేకపోలేదు. హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కూడా గ్లామర్ సన్నివేశాలు, ముద్దు సీన్స్‌లో నటించేందుకు నో చెబుతాను అంటున్నారు. ‘సీతా రామం’(2022) సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు ఈ మరాఠీ బ్యూటీ. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు మృణాళ్. ఆ తర్వాత తెలుగులో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నారామె.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ–‘‘ఇంటెన్స్ కిస్సింగ్ సీన్స్, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. పైగా నేను అలాంటి సీన్స్‌లో యాక్ట్ చేసేందుకు నా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. అందుకే మొహ మాటం లేకుండా నో చెబుతాను’’ అన్నారు.
ఫొటోలు
బిజినెస్
మాజీ రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్ సీఈఓ అంకుర్ జైన్.. ఫోటోలు
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, బిలినీయర్ 'అంకుర్ జైన్' గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతీయ మూలాలున్న ఈయన బిల్ట్ రివార్డ్స్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ 'ఎరికా హమ్మండ్'ను వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు.అంకుర్ జైన్, ఎరికా హమ్మండ్ ఏప్రిల్ 26న ఈజిప్ట్‌లోని పిరమిడ్స్ ఎదురుగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు.. పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.పెళ్లి కొంత భిన్నంగా ఉండాలనే ఆలోచనతోనే వారు దక్షిణాఫ్రికాలోని సఫారీ సందర్శనలో మొదలు పెట్టి ఈజిప్ట్‌లో పెళ్లి వేడుకలను ముగించారు. న్యూయార్క్ సిటీకి చెందిన భారత సంతతి బిలియనీర్ అంకుర్ జైన్ రంబుల్ బాక్సింగ్ జిమ్‌కి వెళ్లే సమయంలో.. ఎరికా హమ్మండ్, అంకుర్‌కు ఫిజికల్ ట్రైనర్‌గా వ్యవహరించారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.ఎవరీ ఎరికా హమ్మండ్?ఎరికా హమ్మండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఆమె రెజ్లింగ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫిట్నెస్ కోచ్‌గా మారింది. ఈ సమయంలోనే బిలినీయర్ 'అంకుర్ జైన్'ను కలుసుకున్నారు. ఈమె స్ట్రాంగ్ అనే యాప్ కూడా స్టార్ట్ చేశారు. View this post on Instagram A post shared by Ankur Jain (@ankurjain)
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్ వాలా పిలుపు
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్ధుల్లారా.. మీరెక్కడున్నా దేశానికి తిరిగి వచ్చేయండి. దేశ సేవ చేయండి. దేశ అభివృద్దిలో పాలు పంచుకోండి అంటూ ప్రముఖ ఎడ్యుటెక్ ఫిజిక్స్ వాల వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే పిలుపునిచ్చారు.యూఎస్‌లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు దేశ సేవ చేయాలని అలఖ్ పాండే కోరారు. తిరిగి రాలేని వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అలఖ్ పాండే ఇటీవల హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ క్యాంపస్‌లలో భారతీయ విద్యార్ధులతో దిగిన ఫోటోల్ని, అనుభవాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవును, మన దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఏ దేశం పరిపూర్ణంగా లేదు. కానీ యువత దేశాన్ని మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah)
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
సెమీ-హై స్పీడ్ వందే భారత్ రైళ్ల భారీ విజయం తర్వాత ఇండియన్ రైల్వే దేశంలోని మొదటి వందే మెట్రోను ప్రారంభించాలని యోచిస్తోందని, ఇంట్రా-సిటీ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌ను మార్చేందుకు ప్రణాళికలు వేస్తోందని ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న ఒక సీనియర్ అధికారి తెలిపారు."2024 జూలై నుండి వందే మెట్రో ట్రయల్ రన్ ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. తద్వారా దీని సేవలను వీలైనంత త్వరగా ప్రజలకు అందించవచ్చు" అని ఆ అధికారి చెప్పినట్లుగా ఎన్డీటీవీ పేర్కొంది. క్షణాల్లో వేగాన్ని అందుకునేలా, తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్‌లను కవర్ చేసేలా ఆధునిక టెక్నాలజీతో పాటు మరిన్ని ఫీచర్లు ఈ ట్రైన్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.రైల్వే వర్గాల ప్రకారం, ఇది ఒక ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. దీనిలో నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. ప్రాథమికంగా కనీసం 12 కోచ్‌లు ఒక వందే మెట్రోలో ఉంటాయి. తర్వాత డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌లను 16 వరకు పెంచుతారు.
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం అభయ్ ఐమా కన్నుమూశారు. శనివారం సాయంత్రం ఆయన 63 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన చిరకాల మిత్రుడు, జమ్మూకశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబు ఈ విషయం వెల్లడించారు.హసీబ్ ద్రాబు ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఐమా సాయెబా, ఇక లేరు! చిన్ననాటి స్నేహితుడు నన్ను ఒంటరిగా విడిచి వెళ్లిపోయాడు. శ్రీనగర్, ముంబైలో ఐదు దశాబ్దాల అనుబంధం ఒక నిమిషంలో ముగిపోయింది" అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు శాంతాక్రూజ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని ద్రాబు వేరే పోస్ట్‌లో తెలిపారు.బ్యాంకింగ్‌లో అత్యుత్తమ పదవులు నిర్వహించిన ఐమా 2020లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి పదవీ విరమణ చేశారు. 2021లో స్పైస్ మనీ అడ్వైజరీ బోర్డులో చేరారు. 1995లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో చేరడానికి ముందు, ఐమా సిటీ బ్యాంక్‌లో పనిచేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్ అయిన ఐమా, బ్యాంకింగ్ రంగానికి రాక ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ కావడానికి కృషి చేశారు.
వీడియోలు
సాధ్యం కానీ హామీలతో చంద్రబాబు కొత్త డ్రామా..!
చంద్రబాబుపై సిఎం జగన్ నాన్ స్టాప్ పంచులు
చోడవరంలో సింహగర్జన.. దద్దరిల్లిన సీఎం జగన్ స్పీచ్
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే
సీఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ విజువల్స్
మళ్ళీ మీ జగన్ కే అధికారం ఎందుకు ఇవ్వాలో చెబుతాను..!
ప్రతి ఇంటి దగ్గర మా బిడ్డ..మా బిడ్డ అంటున్నారు.. భార్యగా నాకు ఇంకేం కావాలి
అమెరికా జీవితాన్నివదిలేసి పవన్ కళ్యాణ్ కోసం వస్తే..!
పాపం చంద్రబాబు పరువంత "గోవిందా గోవిందా"
పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి కొమ్మినేని అదిరిపోయే సెటైర్లు