Top Stories
ప్రధాన వార్తలు
తెలంగాణలో ‘RR’ ట్యాక్స్‌పై చర్చ నడుస్తోంది: ప్రధాని మోదీ
సాక్షి, వేములవాడ: బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్ అని అన్నారు ప్రధాని మోదీ. అలాగే, మూడో దశ పోలింగ్ తర్వాత ఇండియా కూటమికి ఫ్యూజ్ ఎగిరిపోయిందని మోదీ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రజలు ఓటు వేసిన కారణంగానే బీజేపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని స్పష్టం చేశారు.కాగా, ప్రధాని మోదీ వేములవాడలో పర్యటించారు. ఈ సందర్బంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం, వేములవాడలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ..‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి విజయం పక్కాగా ఖాయమని కనిపిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ అడ్రస్ కూడా కనిపించడం లేదు.రేవంత్ రెడ్డి ట్యాక్స్..కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పెద్ద తేడా ఏమీ లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్లను అవినీతి కలుపుతోంది. తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కాపాడాలి. ఓటుకు నోటు కేసుపై బీఆర్ఎస్ ఎందుకు విచారణ చేయించలేదు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిపై కాంగ్రెస్ ఇంత వరకూ ఎందుకు విచారణకు ఆదేశించలేదు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి బాగా చర్చ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తే.. ఇప్పుడు 3-4 నెలల్లోనే ‘ఆర్ఆర్’ (రేవంత్ రెడ్డి) ట్యాక్స్ దాన్ని మించిపోయింది. ఇక్కడి వసూళ్లు ఢిల్లీకి పంపుతున్నారు. రాహుల్ గాంధీ నాలుగున్నరేళ్లుగా అంబానీ-అదానీ పేర్లు జపించారు. ఎన్నికలు ప్రారంభం కాగానే రాహుల్.. అంబానీ-అదానీ పేర్లు జపించడం మానేశారు. అంబానీ-అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ హైదరాబాద్‌ను ఎంఐఎంకు లీజ్‌కు ఇచ్చాయి. తొలిసారిగా ఎంఐఎంకు బీజేపీ సవాల్ విసురుతోంది. భారత్ ముందుకు సాగుతోంది..కాంగ్రెస్ అతి కష్టం మీద కరీంనగర్లో అభ్యర్థిని బరిలో నిలిపింది. పీవీని కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో మనమంతా చూశాం. పీవీని భారతరత్నతో సన్మానించాము. నిన్ననే ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పీవీని ఎంతగానో గౌరవించాము. ఉదయం పది గంటలకే ఇంత పెద్ద సభ నిర్వహించడం.. నాకు గుజరాత్లో కూడా సాధ్యం కాదు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు.మన దేశంలో ఎంతో సమర్థత ఉన్నా.. ఇన్నేళ్లు కాంగ్రెస్ ఆ సామర్థ్యాన్ని నాశనం చేసి సమస్యలవలయంగా మార్చింది. బీజేపీ, ఎన్డీఏ హయాంలోనే ఈ దేశంలో సమగ్రాభివృద్ధి జరుగుతోంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయమందించి, బీమా అందిస్తూ లాభసాటిగా మార్చాం. పదేళ్లుగా నా పనితీరు ఎలా ఉందో మీరంతా గమనించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మన దేశం చేరింది. మీరంతా బీజేపీకి ఓటు వేసిన కారణంగానే.. దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. అయోధ్యకు రామమందిరం తలుపులు తెలంగాణ నుంచే వచ్చాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం కాకుండా కాంగ్రెస్ ప్రయత్నించింది. మాదిగలకు వ్యతిరేకంగా రిజర్వేషన్లన్నీ ముస్లింలకు చెందాలని కాంగ్రెస్ నేత అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు లాక్కొని వాటిని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు.
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu11:30 AM, May 8th, 2024అభివృద్ధి అంటే జగనే: దేవినేని అవినాష్ప్రతీ గడపలో జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారుఅభివృద్ధి లేదు అంటున్న టీడీపీ నేతలు మూడో డివిజన్లో పర్యటించాలిఐదేళల్లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నాంఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందిటీడీపీ ఎమ్మెల్యేకు ఈ ప్రాంతం, నియోజకవర్గ అభివృద్ధిపై చిత్త శుద్ధి లేదుఅభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వాలిఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించండి 11:00 AM, May 8th, 2024ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు.జగనన్న పథకాలపై ఈసీకి ఫిర్యాదుకు చేసి వాటిని ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు.చంద్రబాబుకు పేద ప్రజల పట్ల అంత అసూయ ఎందుకు?.ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటే.గతంలో చంద్రబాబు పసుపు కుంకులకు ఎలక్షన్ సమయంలో పర్మిషన్ ఇచ్చారు.ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారు.ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని పున: పరిశీలన చేయాలి.విద్యాదీవెన ఆపిన కారకులు చంద్రబాబు, జనసేన, బీజేపీదుర్మార్గపు ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్ వీరి ముగ్గురే.పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు వద్దు.సీఎం జగన్ పేద ప్రజలకు కవచంలా అండగా ఉంటారు. 10:30 AM, May 8th, 2024బాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి పెద్దిరెడ్డిమంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందిఇందుకే పిచ్చి పట్టినట్లు బాబు మాట్లాడుతున్నారుసీఎం జగన్‌తో పాటు నాపై చంద్రబాబు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారువేల కోట్లు నేను సంపాదించానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటుచంద్రబాబు ఆరోపణలకు రుజువులు ఉన్నాయా?.ఈసారి కుప్పంలో చంద్రబాబును ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేయనున్నారు. 10:00 AM, May 8th, 2024చంద్రబాబుపై మాట మార్చిన మోదీ..నాడు చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మార్చుకున్నాడని మోదీ వ్యాఖ్యలునేడు చంద్రబాబుపై మోదీ ప్రశంసలు. వెన్నుపోటు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో బాబు నిపుణుడు.మోదీ కూడా చంద్రబాబులాగే మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మన ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి. చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు మోడీ గారు ఏమన్నారో గుర్తుందా? పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో చంద్రబాబు నిపుణుడని, అత్యంత అవినీతిపరుడని చెప్పారు. కానీ ఇప్పుడు అదే మోడీ గారు ఎన్డీయే గూటికి చేరిన చంద్రబాబుని ఇంతకంటే… pic.twitter.com/rSUlLqQzQB— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2024 08:45 AM, May 8th, 2024మోదీ, బాబుకు వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ప్రధాని మోదీ, చంద్రబాబుకి మాజీ మంత్రి వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని రద్దు చేయించగలరా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా?.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ మద్దతు పలకలేదా?టీడీపీ లోపల మద్దతు పలుకుతూ, పైకి మాటల గాంభీర్యం ప్రకటించడం కరెక్టేనా?ఈటీవీ, అన్నదాతల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకూల కథనాలు ప్రసారం చేయడం వాస్తవం కాదా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు మోదీని ప్రశ్నించాలి, నిలదీయాలి.మోదీ విజయవాడ పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయించే హామీని ఇవ్వగలవా చంద్రబాబు? 07:35 AM, May 8th, 2024టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: తానేటి వనితహోంమంత్రి తానేటి వనిత కామెంట్స్.. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. మహిళ అని చూడకుండా దాడికి ప్రయత్నించారు. హోంమంత్రి దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. 07:15 AM, May 8th, 2024తానేటి వనితపై టీడీపీ నేతల దాడి యత్నం..తూర్పుగోదావరిలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల బీభత్సంహోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. హోంమంత్రిని సురక్షితంగా గదిలో ఉంచిన సెక్యూరిటీ. వైఎస్సార్సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల మూకుమ్మడి దాడి.టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ నేతలకు తీవ్ర గాయాలు. టీడీపీ శ్రేణుల దాడిలో వాహనాలు, ఫర్నీచర్ ధ్వంసంసీసీ కెమెరాలో రికార్డయిన టీడీపీ నేతల దాడి దృశ్యాలు. నల్లజర్లలో భారీగా పోలీసుల మోహరింపు. 07:00 AM, May 8th, 2024గాజువాక రోడ్‌షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి 06:50 AM, May 8th, 2024నేడు ఏపీలో మోదీ ప్రచారంనేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంమధ్యాహ్నం ప్రత్యేక విమానం తిరుమలకు మోదీరాజంపేట లోక్‌సభ పరిధిలో కలికిరిలో ఎన్నికల ప్రచారంసాయంత్రం విజయవాడలో రోడ్ షో 06:40 AM, May 8th, 2024అప్పుడూ ఇప్పుడూ 'అంతే'పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడవారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యంఅప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్ చేయని ప్రయత్నంలేదు.. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులుతొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్‌తాజాగా కోడ్ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా.. ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలుతెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో 06:30 AM, May 8th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం
రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
తూర్పు గోదావరి, సాక్షి: మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఏపీ ముక్తకంఠంతో చెబుతోంది. ఆ పిలుపు కూటమి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాదరణను భరించలేక దుశ్చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపైన దాడికి టీడీపీ శ్రేణులు యత్నించారు.మంగళవారం అర్ధరాత్రి గోపాలపురం నల్లజర్లలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. హోం మంత్రి తానేటి వనిత స్థానికంగా ప్రచారం ముగించుకుని ఎక్స్ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. YSRCP ప్రచార వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలతో గొడవకు దిగాయి. ఈలోపు టీడీపీ కార్యకర్తల్లో కొందరు తానేటి వనిత పైకి దూసుకెళ్లే యత్నం చేశారు.అయితే అప్రమత్తమైన ఆమె భద్రతా సిబ్బంది ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు. అయినా ఆగకుండా సుబ్రహ్మణ్యం ఇంటి ఫర్నీచర్‌ను, అక్కడున్న మరికొన్ని వాహనాల్ని ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. వాళ్లనూ తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ నేతలు దాడికి యత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యాయి. శాంతి భద్రతలను పర్యవేక్షించే హోం మంత్రిపై దాడికి యత్నించడాన్ని వైఎస్సార్సీపీ ముక్తకంఠంతో ఖండిస్తోంది. విషయం తెలిసిన ఎస్పీ జగదీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చిన పోలీసులు.. మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నల్లజర్లలో భారీగా మోహరించారు.హోం మంత్రి స్పందనటీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, పైగా మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ‘‘హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
విమాన సేవలందిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 70కి పైగా సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. సిబ్బంది అనారోగ్యంతో ఉండడమే ఇందుకు కారణమని చెప్పింది. రద్దైన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి. దాంతో ఉన్న సర్వీసులు ఆలస్యంగా నడిచినట్లు తెలిసింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని పౌర విమానయాన అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.సిబ్బంది అనారోగ్యంగా ఉన్నారని దాంతో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సంస్థ తన ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్ వేదికగా స్పందించింది. ‘మా క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగానికి చెందిన ఉద్యోగులు చివరి నిమిషంలో ఏకకాలంలో అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు మూకుమ్మడిగా ‘సిక్‌లీవ్’ దరఖాస్తులు అందాయి. దాంతో మంగళవారం రాత్రి నుంచి కొన్నివిమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. మరికొన్నింటిని రద్దు చేశాం. ఈ సంఘటనకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి మేము సిబ్బందితో మాట్లాడుతున్నాం. ఊహించని పరిణామం వల్ల ప్రయాణికులకు అంతరాయం కలిగిస్తే క్షమాపణలు కోరుతున్నాం. ఇకపై చేసే ప్రయాణాలకు సంబంధించి సదరు సర్వీసు అందుబాటులో ఉందో లేదో సరిచూసుకోవాలి కోరుతున్నాం’ అని తెలిపింది.ఇదీ చదవండి: ట్రేడింగ్ వేళల పెంపునకు నో చెప్పిన సెబీరద్దు అయిన విమానసర్వీసుల టికెట్ డబ్బులు వాపసు చేస్తామని.. లేదంటే మరోతేదీకి రీషెడ్యుల్ చేసుకునే వీలుందని కంపెనీ పేర్కొంది. More than 70 international and domestic flights of Air India Express from Tuesday night till Wednesday morning have been cancelled after the senior crew member of the airline went on mass 'sick leave'. Civil Aviation authorities are looking into the issue: Aviation Sources— ANI (@ANI) May 8, 2024
రచ్చ శ్రీను కేరాఫ్ తాడేపల్లిగూడెం
‘నేను నిజాయతీపరుడిని.. నాకు పక్కవాడిది రూపాయి కూడా అక్కర్లేదు.. కష్టపడి సంపాదించి ఈ స్థాయికి చేరాను..’ ఇవీ తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో రోజూ చెబుతున్న మాటలు. అయితే ఆయన అసలు స్వరూపం మరోలా ఉంది. బొలిశెట్టి శ్రీనుకు నియోజకవర్గంలో మరో పేరు ఉంది.. అదే రచ్చ శీను. దుందుడుకు స్వభావంతో ఇతరులను దబాయించడం, తీవ్రస్థాయిలో భయాందోళనలకు గురిచేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందారు. లారీ ఫీల్డ్‌తో మొదలుపెట్టి 30 ఏళ్లలో తాడేపల్లిగూడెంలో సంపన్నుడిగా మారారు. సెటిల్మెంట్లతో ప్రారంభమైన ప్రస్థానం రాజకీయ పార్టీ అభ్యర్థి వరకు సాగిందిలా..సాక్షి ప్రతినిధి, ఏలూరు: బొలిశెట్టి శ్రీనివాస్‌ను తాడేపల్లిగూడెంలో రచ్చ శీనుగా పిలుచుకుంటారు. 30 ఏళ్లలో కోట్ల సంపద సృష్టించారనేది ప్రచారం. వాస్తవంలో మాత్రం భూ సెటిల్మెంట్లతో మొదలుకొని అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల వరకు దండుకుని ఎదిగారనేది అందరికీ తెలిసిన సత్యం. వీటన్నింటితో పాటు జూద కళల్లో ప్రావీణ్యం కూడా ఉందనేది గూడెం ఎరిగిన నిజం. 1981లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, 1999లో మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఆ తరువాత 2014లో టీడీపీలో చేరి మున్సిపల్ చైర్మన్‌గా ఐదేళ్ల పాటు పనిచేసి 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బియ్యం అక్రమ రవాణా : సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బొలిశెట్టి క్లాస్ వన్ కాంట్రాక్టర్ అని చెప్పుకుంటారు. కౌన్సిలర్‌గా ప్రారంభమైన నాటి నుంచే భూ సెటిల్మెంట్లలో అందె వేసిన చేయి. లెక్కకు మించి భూ సెటిల్మెంట్లు, చౌకగా భూములు కొనడం, భారీగా అమ్మడంతో ఆర్థికంగా ఎదిగారు. అక్కడి నుంచి సివిల్ సప్లయీస్‌కు లారీల కాంట్రా క్టర్‌గా, గన్నీ బ్యాగ్ సప్లయర్‌గా, కందిపప్పు సప్లయర్‌గా మారి భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. బియ్యం అక్రమ రవాణా, కందిపప్పు కల్తీలో సిద్ధహస్తుడిగా పేరొందారు. కట్ చేస్తే.. ఒకే లారీకి నంబర్ ప్లేట్లు మార్చి రవాణా చేయడం, అక్రమ బియ్యం సరఫరా వ్యవహారంలో కత్తిపూడి వద్ద లారీలను పట్టుకోగా కేసు నమోదైనట్టు సమాచారం. ఈ పరిణా మాల క్రమంలో ఆయన లైసెన్స్‌లను బ్లాక్ లిస్టులో పెట్టడంతో బావమరిది పేరుతో మరో లైసెన్స్ సృష్టించి దానిపై ఇదే వ్యాపారాన్ని నిరాటంకంగా కొన సాగించారు. ఈ పరిణామ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కేసు కూడా నమోదై ముగిసిపోయింది. బినామీ కాంట్రాక్టర్లతో భారీగా దండుకొని.. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నిధులతో పార్కుల నిర్వహణ, డ్రెయిన్ల పూడికతీత, ఇతర అభివృద్ధి పనులన్నీ బినామీ కాంట్రాక్టర్లతో చేయించి భారీగా దండుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలో ఎల్ఈడీ లైట్ల కొనుగోలు టెండర్లో రూ.5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అప్పట్లో పట్టణమంతా చర్చ సాగింది. 20 ఎకరాల లేఅవుట్లో పది శాతం కమీషన్, పట్టణంలోని అనధికారిక లేఅవుట్లో 25 శాతం వాటాలు, దళితులకు చెందిన అసైన్డ్ భూమి స్వాహా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చంపేస్తామని మహిళకు బెదిరింపులు స్థలం అమ్మకపోతే చంపేస్తామని మహిళను బెదిరించిన కేసు కూడా 692/2021గా బొలిశెట్టిపై నమోదైంది. కొయ్యలగూడేనికి చెందిన మార్ని ప్రవీణ అనే మహిళకు గూడెంలోని మోర్ సూపర్‌బజార్ ఎదురుగా స్థలం ఉంది. బొలిశెట్టి దానిని తమకు విక్రయించమని కోరితే ఆమె నిరాకరించడంతో రాత్రికి రాత్రే కుర్రాళ్లను పెట్టి సరిహద్దు గోడను పగులగొట్టించి స్థలం అమ్మకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ సంఘటనలో బొలిశెట్టి శ్రీనివాస్ మూడో నిందితుడిగా, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జీని 4వ నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. పేకాటలో సిద్ధహస్తుడు బొలిశెట్టికి ప్రవృత్తి రీత్యా ఇష్టమైన క్రీడ పేకాట. 2010లో పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిరోజులు పేకాట క్లబ్‌లు నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. పేకాటకు సంబంధించిన కేసు విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ఆయనే ధ్రువీకరించారు. 2010లో క్రైమ్ నం.169 పట్టణంలోని ఒక రెసిడెన్సీలో పేకాడుతుండగా పోలీసులు దాడి చేసి రూ.26,565 స్వా«దీనం చేసుకుని బొలిశెట్టి శ్రీనును ఏ1గా చేర్చారు. 2020లో ఎస్సై, కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించి.. అరెస్టయిన వ్యక్తిని స్టేషన్ నుంచి తీసుకువెళ్లడమే కాకుండా 20 మంది కుర్రాళ్లను పంపి అందరి సంగతీ తేలుస్తానని పోలీసులను బెదిరించిన ఘటనలో క్రైమ్ నం.42తో కేసు నమోదైంది. తాడేపల్లిగూడెం అభివృద్ధికి మోకాలడ్డు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పారీ్టలో చేరిన క్రమంలో 2014లో తాడేపల్లిగూడెం నుంచి కౌన్సిలర్‌గా గెలిచి బొలిశెట్టి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు (బీజేపీ) మంత్రి అయ్యారు. కట్ చేస్తే.. మాణిక్యాలరావుకు చుక్కలు చూపించి ఆయన్ను మించి సంపాదించడంతో పాటు ఏ ఒక్క అభివృద్ధి పనీ ముందుకు సాగకుండా ఐదేళ్ల పాటు చేయడంలో బొలిశెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు. మంత్రి మాణిక్యాలరావు మంజూరు చేయించిన పనులన్నింటినీ కౌన్సిలర్ తీర్మానం పేరుతో అడ్డుకుని పట్టణ అభివృద్ధిని ఐదేళ్లు వెనక్కి నెట్టారు. ప్రధానంగా మోడల్ ప్రాజెక్ట్‌గా ఏసీ రైతు బజారును మంత్రి మాణిక్యాలరావు గూడెంకు మంజూరు చేయించారు. ఏసీ ఫిష్, నాన్‌వెజ్ మార్కెట్, కూరగాయల మార్కెట్ అన్ని మున్సిపాలిటీలోని ప్రధాన ప్రాంతంలో ఉన్న ఎకరా స్థలంలో ఏర్పాటు చేయడానికి వీలుగా రూ.9 కోట్ల ప్రాజెక్టు మంజూరైంది. మాణిక్యాలరావుతో ఆధిపత్య పోరు ఉన్న క్రమంలో కౌన్సిల్లో తీర్మానం చేసి స్థలం మంజూరు చేయకుండా రూ.9 కోట్ల ప్రాజెక్టును గూడెంకు రాకుండా చేయడంలో బొలిశెట్టి సఫలీకృతులయ్యారు. అలాగే దాదాపు రూ.10 కోట్ల విలువైన రహదారుల పనులకు తీ ర్మానాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. తాడేపల్లిగూ డెం, పెంటపాడు మండలాల్లో మంత్రి పనులన్నింటికీ అడ్డంకొట్టి తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో మాత్రం తన స్నేహితుడి దగ్గర పర్సంటేజ్ తీ సుకుని పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి.
అవుటా? నాటౌటా?.. సంజూకు షాకిచ్చిన బీసీసీఐ
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా సంజూ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. అతడికి జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ ఢిల్లీతో మంగళవారం తలపడింది. టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. పంత్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దంచికొట్టిన ఢిల్లీ ఓపెనర్లుఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65), ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.ఫలితంగా ఢిల్లీ జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.అవుటా? నాటౌటా?మొత్తంగా 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సంజూ అవుటైన తీరు వివాదానికి దారితీసింది.రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో పదహారో ఓవర్లో ఢిల్లీ పేసర్ ముకేశ్ కమార్ బౌలింగ్‌కు వచ్చాడు. అతడి బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సంజూ.. బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద షాయీ హోప్ క్యాచ్ పట్టగా ఫీల్డ్ అంపైర్ అవుటిచ్చాడు.చిర్రెత్తిపోయిన సంజూ.. అంపైర్‌తో వాగ్వాదంఅయితే, ఆ సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్ తాకినట్టుగా కనిపించింది. రివ్యూ వెళ్లగా.. థర్డ్ అంపైర్ కూడా సంజూ అవుటైనట్లు ప్రకటించాడు. అదే సమయంలో ఢిల్లీ డగౌట్ నుంచి ఆ జట్టు యజమాని పార్థ్ జిందాల్ సైతం అవుట్ అంటూ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో చిర్రెత్తిపోయిన సంజూ శాంసన్ అంపైర్లతో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద బీసీసీఐ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం మేర కోత విధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్ రాయల్స్ మీద 20 పరుగుల తేడాతో గెలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో తామూ ఉన్నామంటూ దూసుకువచ్చింది.చదవండి: యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే: ప్రీతి జింటాGame of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024
CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
ఇచ్చిన హామీలు అమలు చేయడం ఆయనకే చెల్లు జగన్‌లోని పట్టుదల ఎందరికో స్ఫూర్తిదాయకం సాక్షి ఇంటర్వ్యూలో సినీనటి, యాంకర్ శ్యామల ‘వైఎస్సార్సీపీ నవరత్నాలు అమలు సాధ్యమేనా అన్న నోళ్లు మూతపడేలా అమలు చేసి చూపించారు సీఎం జగన్. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్కరికీ ఓ లెసన్. ‘జగన్ గెలుపు అంటే జనం గెలుపు’ అన్నది ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది’ అని సినీనటి, ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్యామల అన్నారు. కొంత కాలంగా వైఎస్ జగన్‌కు మద్దతుదారుగా ఉన్న ఆమె ఈ ఎన్నికలలో వైఎస్సార్సీపీ తరఫున చురుకుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. జగన్‌పై తనకు అభిమానం కలగడానికి కారణాలను... తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణాన్ని ఆమె తెలియజేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...వైఎస్ అంటే ఇష్టం.. జగన్‌పై అభిమానం... తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం సమీపంలోని ఇంద్రపాలెం మాది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నాకు రాజకీయ నేపథ్యం ఏమీ లేదు. ఎదుగుతున్న సమయంలో లీడర్స్ చేపట్టే పనులు మన మీద చాలా ప్రభావం చూపుతాయి కదా. అలా తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేసినప్పటి నుంచీ వైఎస్ అంటే నాకు చాలా ఇష్టం. కట్టు బొట్టు నుంచి ఆయన ఆహార్యం దాకా అన్నీ గమనిస్తుండేదాన్ని. ఆయన హుందాతనం, మందహాసం బాగా నచ్చేవి. కెరీర్ కోసం హైదరాబాద్ వచ్చేసిన తర్వాత.. వైఎస్సార్ మరణించిన సమయంలో ఉప్పల్‌లో ఓ ప్రైవేట్ చానల్లో పనిచేస్తున్నాను. ఎంతగానో బాధనిపించినా... ఆ సమయంలో ఎటూ కదలడానికి వీలు కాలేదు. వైఎస్ మరణం తర్వాత జగన్‌ను బాగా గమనిస్తూ ఉండేదాన్ని, ఆయన చేసిన పోరాటం, అడ్డంకులు ఎదుర్కొంటూ ఆయన వేసిన అడుగులు చూశాక ఆయనపైనా కొండంత అభిమానం కలిగింది. నా భర్త కూడా జగన్ అభిమాని కావడంతో... ఆయన్ను స్వయంగా కలవడం, ఆయన చేతుల మీదుగా వైఎస్సార్సీపీ కండువా ధరించడం జరిగిపోయాయి. హామీల ఆమల్లో ఆయనకు ఆయనే సాటి ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి? ప్రజలకు ఆపద వస్తే ఎలా స్పందించాలి? ఇలాంటివన్నీ జగన్‌ను చూసి నేర్చుకోవాలి. అందుకే భవిష్యత్తు రాజకీయ నేతలకు ఆయన పాలన ఒక పాఠం అంటాను నేను. ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి మొదట్లో విని... బాబోయ్ ఇన్ని పథకాలా? ఎలా ఇస్తారో అని భయపడిన మాట నిజం. కాని అవి పక్కాగా అందించడానికి గ్రామ వలంటీర్ పేరిట ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది కలిగిందీ అంటే ఫిర్యాదు చేసిన 10–20 రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అయిపోయేలా పక్కాగా నిర్వహించడం అద్భుతం అనిపించింది.కోవిడ్ సవాల్‌నూసమర్థంగా ఎదుర్కొని... ప్రపంచమే బిత్తరపోయిన సంక్షోభం కోవిడ్. మహామహులే ఆ సమయంలో చేతులెత్తేశారు. అలాంటిది ఒక కొత్త సీఎం, అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఇలాంటి తరుణంలో అనూహ్యమైన ఈ చాలెంజ్ ఎదురైనా.. జగన్ అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా రెండు వేవ్స్‌నూ సమర్థంగా ఎదుర్కొన్నా రు. అందుకే నేను ఫిదా అయ్యా. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లోని ప్రజల్ని కలిసినప్పుడు వారు చెబుతున్నదీ అదే. ‘కోవిడ్ టైమ్‌లో సొంత వారు కూడా మా మొహం చూడలేదమ్మా.. అలాంటిది వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతీదీ మా చేతికి అందించింది’ అని.జగన్ గురించి తెలుసుకున్న కొద్దీ సంతోషం మా సొంత ఊరితో పాటు మా అత్తగారి ఊరు చీరాలకు రాకపోకలు సాగించినప్పుడు, షూటింగ్ కోసం గ్రామాలకు వెళ్లినప్పుడు... అక్కడి స్థితిగతుల గురించి కనుక్కునేదాన్ని. వీలైనంతమందితో మాట్లాడేదాన్ని. వాళ్లందరి స్పందన తెలుసుకుంటున్న కొద్దీ జగన్ మీద ఇష్టం పెరుగుతూ వచి్చంది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన నాడు నేడు కార్యక్రమం నా ఆల్‌ౖ టెమ్ ఫేవరెట్. నేను కాకినాడ ప్రభుత్వ పాఠశాలలో చదువు కున్నా. ఆ స్కూల్లో 7వ తరగతి వరకూ అసలు ఇంగ్లిష్ మీడియం ఉండేది కాదు. ఇప్పుడు ఏకంగా డిజిటల్ బోధన, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్స్, షూస్, సాక్స్... ఇవన్నీ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇటీవల ఒక ప్రభుత్వ పాఠశాల విద్యారి్థని జగన్ ముందు అద్భుతమైన ఇంగ్లిష్ లో మాట్లాడితే షాక్ అయిపోయా. ఆ భాషా పరిజ్ఞానం నాకు కూడా లేదు. కేవలం రాజకీయాల కోసం ఓ పాపను దారుణంగా ట్రోల్ చేయడం దారుణం.అవకాశాలు పోతాయని వారించినా...అయితే నేను ఇంకా సినీ–టీవీ కెరీర్ ప్రారంభంలోనే ఉండడంతో పార్టీ మనిషిగా ముద్ర వేసుకోవడం మంచిది కాదంటూ చాలా మంది హెచ్చరించారు. నిజానికి ఇప్పటికీ చాలా మంది అలాగే చెబుతుంటారు. అయితే ఏదో రాజకీయ పారీ్టలో ఉన్నానని ఒక క్యారెక్టర్‌కి నేను సరిపోతానని తెలిసినా పిలవకుండా ఉంటారా? అలా జరగదని నా నమ్మకం. ఇప్పటివరకూ అలాంటి అనుభవాలు కూడా ఎదురవ్వలేదు. నేను కేవలం టీవీ యాంకర్‌గానే కాకుండా మాచర్ల నియోజకవర్గం, బెంగాల్ టైగర్... తదితర సినిమాల్లో మంచి పాత్రల్లో చేశాను.
యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా : భావోద్వేగం
2014 నుండి యూనిసెఫ్ ఇండియాతో అనుబంధం కలిగి ఉంది బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్. ఇద్దరు బిడ్డల తల్లిగా బాల్య అభివృద్ధి, ఆరోగ్యం, విద్య మరియు లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో సంస్థకు మద్దతు ఇస్తుంది. తాజాగా యునిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా కపూర్ ఎంపికైంది. ఈ సందర్బంగా ఆమె భావోద్వేగానికి లోనైంది.కరీనా కపూర్ అనగానే రంగుల ప్రపంచం కళ్ల ముందు ఆవిష్కారం అవుతుంది.అయితే ఈ అందాల నటికి మరో ప్రపంచం కూడా తెలుసు.స్త్రీ సాధికారత నుంచి మెన్స్ట్రువల్ హైజీన్ వరకు ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు వెళుతోంది. పేదింటి బిడ్డలతో మాట్లాడుతోంది.తాజాగా యూనిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా నియామకం అయిన కరీనా కపూర్‌లో ఫ్యాషన్ డిజైనర్, రైటర్, మోటివేషనల్ స్పీకర్, సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు...ఉత్తమనటిగా సుపరిచితమైన కరీనా కపూర్ సృజనాత్మకమైన డిజైనర్ కూడా. క్లాతింగ్ రిటైలర్ ‘గ్లోబస్’తో కలిసి పనిచేసింది. న్యూట్రిషనిస్ట్ రుజుత దివాకర్‌తో కలిసి తీసుకు వచ్చిన ‘డోంట్ లూజ్ యువర్ మైండ్, లూజ్ యువర్ వెయిట్’ పుస్తకం అమ్మకాల్లో రికార్డ్ సృష్టించింది. కరీనా కపూర్ వాయిస్‌తో ఈ పుస్తకం ఆడియో బుక్‌గా రావడం మరో విశేషం. ‘ది స్టైల్ డైరీ ఆఫ్ బాలీవుడ్ దివా’ పేరుతో తన జ్ఞాపకాల పుస్తకాన్ని తీసుకువచ్చింది. అదితి షా బీమ్జానీతో కలసి ప్రెగ్నెన్సీపై రాసిన పుస్తకం కమర్షియల్‌గా సక్సెస్ అయింది. రుజుత దివాకర్‌తో కలిసి న్యూట్రిషన్‌కు సంబంధించి ‘ది ఇండియన్ ఫుడ్ విజ్డమ్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ ఈటింగ్ రైట్’ డాక్యుమెంటరీపై పనిచేసింది. ఉమెన్ ఎంపవర్మెంట్పై వచ్చిన ‘గర్ల్ రైజింగ్’ అనే డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌కు వాయిస్–వోవర్ ఇచ్చింది.ఒకవైపు సినిమాల్లో బిజిగా ఉన్నప్పటికీ... పిల్లల విద్య, మహిళల భద్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. మహిళలపై హింసను నిరో«ధించడానికి ఎన్డీ టీవి ప్రారంభించిన శక్తి క్యాంపెయిన్‌కు అంబాసిడర్‌గా పనిచేసింది. 2014 నుంచి బాలికల విద్యకు సంబంధించి యూనిసెఫ్‌తో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని పాఠశాలలకు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేది. జాల్నా జిల్లాలో కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంది.నిరుపేద పిల్లల చదువు కోసం షర్మిలా ఠాగుర్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. చైల్డ్–ఫ్రెండ్లీ స్కూల్ అండ్ సిస్టమ్స్ (సీఎఫ్ఎస్ఎస్) యాకేజీని లాంచ్ చేసింది. చత్తీస్‌ఘడ్‌లో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ వీక్ çసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బాగా చదివే పిల్లలు, పాఠాలు బాగా చెప్పే టీచర్లకు పురస్కారాలు అందజేసింది. మెన్స్ట్రువల్ హైజీన్‌పై యూనిసెఫ్ లక్నోలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించింది. ‘నవజాత శిశువులను కాపాడుకుందాం’ పేరుతో కరీనా రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. నవజాత శిశువులు, తల్లుల క్వాలిటీ హెల్త్ కేర్‌కు సంబంధించి ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ అనే క్యాంపెయిన్‌ను నిర్వహించింది. మదర్స్ డే సందర్భంగా యూనిసెఫ్ దిల్లీలో నిర్వహించిన సమావేశంలో కరీనా ప్రధాన వక్త.ప్రకృతి వైపరీత్య బాధితుల కోసం, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల కోసం నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంది కరీన. పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుదలకు సంబంధించిన అంశాలపై పనిచేసే స్వస్థ్ ఇమ్యునైజేషన్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది.తాజా విషయానికి వస్తే.. ‘నేషనల్ అంబాసిడర్‌గా యూనిసెఫ్‌తో నా అనుబంధం కొనసాగడం గౌరవంగా భావిస్తున్నాను. పిల్లల చదువు, హక్కుల కోసం నా గొంతు వినిపిస్తాను’ అంటుంది కరీనా కపూర్.‘కరీనా కపూర్ ఎక్స్లెంట్ కమ్యూనికేటర్’ అని కితాబు ఇచ్చింది యూనిసెఫ్. చిన్న విజయం చాలు... పెద్ద సంతోషానికిసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ‘నేను ఎలా సాధించానంటే’లాంటి స్టోరీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేస్ మొదలైంది. ఆ రేస్‌లో భాగంగా యువతరం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ రేసులో మెంటల్ హెల్త్ అనేది వెనక్కి వెళ్లిపోయింది. రేస్ అనేది శాంతి, సంతోషాల కోసం ఉండాలి. విద్యార్థులు తమ మానసిక శాంతిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చిన్న విజయాన్ని కూడా పెద్ద విజయంగా భావించుకోవాలి. ‘ఇదీ ఒక విజయమేనా!’ అనుకున్నప్పుడు అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి నుంచి అశాంతి జనిస్తుంది –కరీనా కపూర్
హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మంగళవారం కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రమాదాల కారణంగా రెండు రాష్ట్రాల్లో పలువురు మృతిచెందారు.కాగా, హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రింగ్ పని కార్మికుల షెడ్‌పై కూలిన రిటైనింగ్ వాల్. భారీ వర్షానికి కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీఎన్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఇక, మృతులను ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఇక, ఏపీలో కూడా పిడుగుల కారణంగా ఏడుగురు మృత్యువాడపడ్డారు. బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోడ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలన్నారు. #HyderabadRains #tankbund #Hussainsagar @CoreenaSuares2 @Rajani_Weather super duper rain. #scary pic.twitter.com/2xvWITJ3jt— sαмυεℓ ραυℓ🇮🇳 (@vikramsamuelp) May 7, 2024
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- Telangana: మరో రెండు రోజులు వానలు
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
సినిమా
పల్లె పిలిచింది
పల్లెటూరి కథలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఎక్కువగా సిటీ చుట్టూ తిరిగే కథలే చూస్తుంటారు కాబట్టి పల్లె కథలు వచ్చినప్పుడు ప్రేక్షకులు చూడాలని అనుకుంటారు. పైగా ఆ కథల్లో స్టార్ హీరోలు నటిస్తే క్రేజ్ రెండింతలు ఉంటుంది. అలా ‘పల్లె పిలిచింది’ అంటూ కొందరు హీరోలు రూరల్ స్టోరీలతో చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. పల్లెటూరి ఆట రామ్‌చరణ్ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమా అంటే ప్రేక్షకులకు ‘రంగస్థలం’ (2018) సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత మరో రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు రామ్‌చరణ్. కాగా తనకు ‘రంగస్థలం’ వంటి హిట్ ఫిల్మ్‌ను అందించిన సుకుమార్‌తో మరో సినిమాకు రామ్‌చరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ‘రంగస్థలం’కు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది.అలాగే ఇది వార్ డ్రామా మూవీ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌పై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబుతో రామ్‌చరణ్ హీరోగా చేయనున్న సినిమా మాత్రం పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాయే. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో అన్నదమ్ముల పాత్రలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఈ పల్లె కథలో జాన్వీ కపూర్ హీరోయిన్. రాజు కథ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 24 మంది మత్స్యకారులు 2018లో జీవనోపాధికి గుజరాత్ సముద్ర తీరానికి వెళ్లి, పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు బందీలుగా చిక్కుతారు. ఈ ఘటనలో ఉన్న ఓ మత్స్యకారుడి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘తండేల్’. ప్రధానంగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. రాజు పాత్ర కోసం నాగచైతన్య పూర్తిగా మేకోవర్ అయ్యారు. అలాగే శ్రీకాకుళం యాస కూడా నేర్చుకున్నారు. ‘తండేల్’ను డిసెంబరు 20న విడుదల చేయాలనుకుంటున్నారు. దసరా కాంబో రిపీట్‘దసరా’ వంటి రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు హీరో నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. హీరో నాని– దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో మళ్లీ ఓ సినిమా రానుంది. ఈ సినిమా కథాంశం కూడా గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. అలాగే ‘బలగం’ దర్శకుడు వేణు ఎల్దండి గ్రామీణ నేపథ్యంలో నాని హీరోగా ఓ సినిమా చేయనున్నారట. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ్రపారంభం కానుందని సమాచారం. మాస్ కుర్రాడు సిల్వర్ స్క్రీన్‌పై విజయ్ దేవరకొండ ఎక్కువగా సిటీ అబ్బాయిలానే కనిపించారు. ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయిలో ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీలో హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నారు. ‘రాజావారు రాణిగారు’ వంటి పల్లె ప్రేమకథను తీసిన దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు ఈ నెల 9న... విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా వెల్లడి కానున్నాయి. లంకల రత్న విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. గోదావరి పరిసర ్రపాంతాల్లోని గ్రామాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. చీకటి సామ్రాజ్యంలో లంకల రత్న అనే సాధారాణ వ్యక్తి అసాధారణ స్థాయికి ఎలా చేరుకుంటాడు? అన్నదే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కథ అని యూనిట్ పేర్కొంది. లంకల రత్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తారు. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. అలాగే హీరోలు రక్షిత్ అట్లూరి ‘శశివదనే’, నార్నే నితిన్ ‘ఆయ్..’ సినిమాలు గోదావరి నేపథ్యంలో సాగే కథలే. ఇంకా గ్రామీణ నేపథ్యంలో పలు చిత్రాలు ఉన్నాయి.
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ సేవలో దూసుకుపోతున్నాడు. పేదరికంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మాత్రం అనే అనే ఫౌండేష్ ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు. ఇటీవలే దివ్యాంగులకు టూవీలర్ వాహనాలు అందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన మాట ప్రకారం మరో పది కుటుంబాలకు ట్రాక్టర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం విల్లుపురం జిల్లాలోని ఓ పేద కుటుంబానికి ట్రాక్టర్‌ను తానే స్వయంగా అందించారు.దీనికి సంబంధించిన వీడియోను రాఘవ లారెన్స్ ట్విటర్లో పంచుకున్నారు. విల్లుపురం జిల్లాలో ప్రభు కుటుంబానికి మూడో ట్రాక్టర్ తాళాలు అందజేశానని తెలిపారు. మీ ప్రేమను చూస్తుంటే.. ఇది నాకు మరింత శక్తిని ఇస్తోందని.. ముందుకు సాగడానికి ప్రేరణనిస్తోందని రాసుకొచ్చారు. మనమంతా కలిసి అందరికీ ఉజ్వల భవిష్యత్తును సృష్టించగలం అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #serviceisgod DAY TWO JOURNEY! I handed over the 3rd tractor key to the Prabu family in the Villupuram district. Seeing all your love, It's giving us more energy and motivation to go forward. Together, we can make a difference and create a brighter future for all. #Maatram… pic.twitter.com/Hq9lY9vylA— Raghava Lawrence (@offl_Lawrence) May 7, 2024
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈసారి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అంటూ యానిమేషన్ సిరీస్‌ను పరిచయం చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యానిమేషన్ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రాజమౌళి. ఈఈసందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. 'బాహుబలిని ముందుకుతీసుకెళ్లే బాధ్యతను మరొకరికి అప్పగించడం కఠినమైన నిర్ణయం. ఆ సినిమా తీసేటప్పుడే అనేక మార్గాల్లో బాహుబలిని ఆవిష్కరించాలనుకున్నాం. సరైన సమయంలో సరైన వ్యక్తులు, టీమ్ మాకు లభించింది. యానిమేషన్ సిరీస్‌పై వాళ్లు పంచుకున్న ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది కేవలం పిల్లలనే కాదు.. అందరినీ అలరించేలా తీయొచ్చని తెలిపారు. ఈ ఫార్మాట్లో సిరీస్ చేయాలనుకున్నప్పుడు మరోసారి ‘బాహుబలి సినిమాను సమీక్షించాం. పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ ఇలా అనేక అంశాలు పరిశీలించాం. ఆ పాత్రలపై నాకున్న ప్రేమను వాళ్లు అర్థం చేసుకున్నారు. కథతో పాటు పాత్రలు చాలా చక్కగా క్రియేట్ చేశారు. అది చూసి నాకు సంతోషంగా కలిగింది.' అని అన్నారు.థియేటర్లో బాహుబలి చిత్రాన్ని చూసింది కేవలం 10 కోట్ల మంది మాత్రమేనని రాజమౌళి అన్నారు. అంటే మిగిలిన కోట్ల జనాభా ఏదో ఒక మాధ్యమం ద్వారా చూసి ఉంటారని తెలిపారు. కథలు చూసే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది.. అందరూ రెగ్యులర్ సినిమాలు మాత్రమే చూడరు. కేవలం యానిమేషన్ చిత్రాలు మాత్రమే చూసేవాళ్లు కూడా ఉంటారు. ఆ ఆలోచనతోనే బాహుబలి ఈ మాధ్యమం ద్వారా తీసుకొస్తున్నాం. సినిమా తీయాలంటే చాలా విషయాలు ఆలోచించాలి. డైలాగ్స్, ఫైట్స్, పాటలు ఇలా ఆలోచలన్నీ దాని చుట్టూనే ఉంటాయి. కానీ, యానిమేషన్లో అది వర్కవుట్ కాదు. సీజన్లు చూసే కొద్దీ మీరు యానిమేషన్ సిరీస్‌కు కనెక్ట్ అవుతారన అన్నారు.యానిమేషన్ సినిమా చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఈ సమావేశంలో రాజమౌళిని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. యానిమేషన్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో తనకు ఆలోచన ఉందని.. ఎప్పుడో ఒకసారి జరుగుతుందన్నారు. నేను సినిమాలు చేస్తూ నేర్చుకుంటూనే ఉంటానని.. దీని వల్ల రానున్న సినిమాల్లో కొత్త విషయాలు చేసేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈగ సినిమాలో కొంత భాగం యానిమేషన్ ఉందని వెల్లడించారు. భవిష్యత్‌లో చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ సిరీస్ ద్వారా నేర్చుకున్న అంశాలు నాకు కచ్చితంగా ఉపయోగపడతాయన్నారు. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం ప్రిన్స్ మహేశ్‌బాబుతో తెరకెక్కించనున్నారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ డిస్నీప్లస్ మే 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చాడు. చాన్నాళ్లు కష్టపడి డైరెక్టర్ అయ్యాడు. హిట్ కొట్టాడు. అలా అటు నటుడిగా ఇటు దర్శకుడిగా అడపాదడపా మూవీస్ చేశాడు. కానీ రెండేళ్ల క్రితం ఓ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఎంతలా అంటే ప్రాంతీయ హీరో కాస్త పాన్ ఇండియా హీరో అయ్యేంతలా. కోట్లాదిమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. మరి ఇంతలా చెప్పాం కదా.. ఇతడు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడి పేరు రిషభ్ శెట్టి. హా అవును మీరు ఊహించింది కరెక్టే. 'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించాడు. రూ.15 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తీయగా.. ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీనిబట్టి ఈ మూవీ ఏ రేంజ్ హిట్ అయ్యిందో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ప్రస్తుతం 'కాంతార' ప్రీక్వెల్ తీస్తూ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది రిలీజ్ ఉండొచ్చు.రిషభ్ శెట్టి విషయానికొస్తే.. కర్ణాటకలోని కుందాపుర అనే ఊరిలో పుట్టాడు. జూ.ఎన్టీఆర్ అమ్మది కూడా ఈ ఊరే. అందుకేనేమో తారక్ అంటే రిషభ్ శెట్టి చాలా ఇష్టం. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పాడు కూడా. 2012 నుంచి శాండల్ వుడ్లో ఉన్న రిషభ్ శెట్టి.. 'కాంతార' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ఫ్యామిలీ విషయానికొస్తే.. ప్రగతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 'కాంతార'తో సంచలన హిట్ కొట్టిన ఇతడు.. ప్రీక్వెల్తో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో?(ఇదీ చదవండి: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!)
ఫొటోలు
లెజెండ్రీ నటుడికి నివాళిగా.. నబా నటేష్ ఇలా మారిపోయింది! (ఫోటోలు)
ఎంతైనా జ్యోతిక... ఆ స్టయిలే వేరు! (ఫొటోలు)
Regina Cassandra: టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రెజీనా (ఫొటోలు)
Allu Arjun HD Photos: ‘ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్’లో అల్లు అర్జున్ (ఫొటోలు)
ప్రముఖ కంపెనీల రెయిన్బో కలర్ లోగోలు.. (ఫోటోలు)
క్రీడలు
ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఫీట్‌ను నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత వేగంగా 200 సిక్సర్ల మార్క్‌ను చేరుకున్న తొలి భారత క్రికెటర్‌గా శాంసన్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదిన సంజూ.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసకున్నాడు. శాంసన్ కేవలం 159 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును సాధించాడు. ఇప్పటివవరకు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ఎంఎస్ ధోని 165 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో ధోని రికార్డును శాంసన్ బ్రేక్ చేశాడు. He's got power. He's got placement. And he's dealing in sixes in Delhi 💥Sanju Samson on the move & @rajasthanroyals are 67/2 at the end of powerplay 💗Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/PkUUEHj9Zr— IndianPremierLeague (@IPL) May 7, 2024ఓవరాల్‌గా పదో ప్లేయర్ఇక ఐపీఎల్లో ఓవరాల్‌గా 200 సిక్స్‌లు మైలు రాయిని అందుకున్న 10వ ప్లేయర్‌గా శాంసన్ నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, డేవిడ్ వార్నర్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, సురేష్ రైనా ఉన్నారు.కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఢిల్లీ ఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65) దంచికొట్టారు. He's got power. He's got placement. And he's dealing in sixes in Delhi 💥Sanju Samson on the move & @rajasthanroyals are 67/2 at the end of powerplay 💗Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/PkUUEHj9Zr— IndianPremierLeague (@IPL) May 7, 2024 వీరికి తోడు ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పంత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథాఇక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ 201 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా రాజస్తాన్ బ్యాటర్లంతా విఫలం కాగా సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. The home side emerge victorious in tonight's run-fest here in Delhi 💥And with that win, Delhi Capitals move to number 5⃣ on the Points Table 🔥🔥Scorecard ▶️ https://t.co/nQ6EWQGoYN#TATAIPL | #DCvRR pic.twitter.com/vQvWMSk5lt— IndianPremierLeague (@IPL) May 7, 2024
విమానం దారి మళ్లింపు... వారణాసిలో కోల్‌కతా జట్టు
న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లకు సోమవారం రాత్రి కునుకు లేకుండా గడిచింది. క్రికెటర్లు ప్రయాణించిన విమానం లక్నో నుంచి కోల్‌కతాకు బయలుదేరాల్సి ఉండగా... ప్రతికూల వాతావరణంతో పలుమార్లు దారి మళ్లించారు. వారి చార్టర్ ఫ్లయిట్‌ను తొలుత గువాహటికి మళ్లించారు. అక్కడి నుంచి కోల్‌కతాకు క్లియరెన్స్ రావడంతో టేకాఫ్ అయిన విమానానికి మళ్లీ వాతావరణం ఏమాత్రం అనుకూలించలేదు. దీంతో ఉన్నపళంగా ఫ్లయిట్‌ను వారణాసి ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించాల్సి వచి్చంది. అలా తీవ్రమైన ప్రయాణ బడలిక, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఆటగాళ్లు సోమవారమంతా వారణాసిలోని హోటల్లో గడపాల్సి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత తమ విమాన ప్రయాణం ఉండటంతో ఈలోపు కోల్‌కతా జట్టు క్రికెటర్లు వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం తర్వాత నైట్‌రైడర్స్ జట్టు కోల్‌కతాకు చేరుకోగలిగింది. ఈ నెల 11న సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది.
DC Vs RR: ఢిల్లీ రేసులోకొచ్చింది!
న్యూఢిల్లీ: జోరుమీదున్న రాజస్తాన్ రాయల్స్‌పై కీలకమైన విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో పడింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ పోరులో ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెగర్క్ (20 బంతుల్లో 50; 7 ఫోర్లు; 3 సిక్స్‌లు), అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి ఓడింది. కెపె్టన్ సంజూ సామ్సన్ (46 బంతుల్లో 86; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. ఖలీల్, ముకేశ్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ తలా 2 వికెట్లు తీశారు. 4,4,4,6,4,6... ఓపెనర్లు ఫ్రేజర్, పోరెల్ ఒకరి తర్వాత ఒకరు రాయల్స్ బౌలర్లను చితగ్గొట్టారు. ముందుగా ఫ్రేజర్... బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో ఒక సిక్స్, 2 బౌండరీలతో 15 పరుగులు రాబట్టాడు. అవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 4, 4, 4, 6, 4, 6లతో 28 పరుగులు పిండుకోవడంతో ఫ్రేజర్ ఫిఫ్టీ 19 బంతుల్లోనే పూర్తయ్యింది. అతని దూకుడును అశ్విన్ తన తొలి ఓవర్లోనే అడ్డుకున్నాడు. అనంతరం అక్షర్ పటేల్ అండతో పోరెల్ బాదడం మొదలుపెట్టాడు. 9వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. మరుసటి ఓవర్లోనే అక్షర్ (15)ను అశ్విన్ బోల్తా కొట్టించగా, పోరెల్ సిక్సర్‌తో 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. వరుస ఓవర్లలో పోరెల్‌ను అశ్విన్... రిషభ్ పంత్ (15)ను చహల్ పెవిలియన్ పంపారు. మిడిలార్డర్లో స్టబ్స్ (20 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో ఢిల్లీ 200 పైచిలుకు స్కోరు చేసింది. కెప్టెన్ పోరాడినా... క్లిష్టమైన లక్ష్యం ముందరుంటే ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (4), బట్లర్ (19) గట్టి పునాది వేయలేకపోయారు. ఈ దశలో కెపె్టన్ సామ్సన్, రియాన్ పరాగ్ (22 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అండతో రాయల్స్‌ను నడిపించాడు. 11వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులు దాటాక అదే ఓవర్ ఆఖరి బంతికి పరాగ్‌ను రసిఖ్ బౌల్డ్ చేశాడు. అయితే శుభమ్ దూబే వచ్చాక సామ్సన్ 28 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సామ్సన్ను ముకేశ్ అవుట్ చేయడం రాజస్తాన్‌ను కుదిపేసింది. శుభమ్‌తో నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించాక భారీ షాట్‌కు ప్రయత్నించి సామ్సన్ నిష్క్రమించగా... తర్వాత ఓవర్‌కు ఒకటి, రెండు చొప్పున వికెట్లను కోల్పోయిన రాయల్స్ ఓటమి పాలైంది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: ఫ్రేజర్ (సి) ఫెరీరా (బి) అశ్విన్ 50; పోరెల్ (సి) సందీప్ (బి) అశ్విన్ 65; షై హోప్ (రనౌట్) 1; అక్షర్ (సి) పరాగ్ (బి) అశ్విన్ 15; పంత్ (సి) బౌల్ట్ (బి) చహల్ 15; స్టబ్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 41; గుల్బదిన్ (సి) అశ్విన్ (బి) బౌల్ట్ 19; రసిఖ్ (రనౌట్) 9; కుల్దీప్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–60, 2–68, 3–110, 4–144, 5–150, 6–195, 7–215, 8–221. బౌలింగ్: బౌల్ట్ 4–0–48–1, సందీప్ శర్మ 4–0–42–1, అవేశ్ 2–0–42–0, అశి్వన్ 4–0–24–3, పరాగ్ 2–0–17–0, చహల్ 4–0–48–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) అక్షర్ (బి) ఖలీల్ 4; బట్లర్ (బి) అక్షర్ 19; సామ్సన్ (సి) హోప్ (బి) ముకేశ్ 86; పరాగ్ (బి) రసిఖ్ 27; శుభమ్ (సి) స్టబ్స్ (బి) ఖలీల్ 25; పావెల్ (బి) ముకేశ్ 13; ఫెరీరా (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 1; అశి్వన్ (సి) హోప్ (బి) కుల్దీప్ 2; బౌల్ట్ (నాటౌట్) 2; అవేశ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–4, 2–67, 3–103, 4–162, 5–180, 6–181, 7–185, 8–194. బౌలింగ్: ఖలీల్ 4–0–47–2, ఇషాంత్ 3–0–34–0, ముకేశ్ 3–0–30–2, అక్షర్ 3–0–25 –1, కుల్దీప్ 4–0–25–2, రసిఖ్ 3–0–36–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X లక్నో వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
అర్జెంటీనా దివంగత దిగ్గజ ఫుట్‌బాలర్ డీగో మారడోనా 1986లో గెల్చుకున్న ‘గోల్డెన్ బాల్’ ట్రోఫీ వేలానికి రానుంది. జూన్ 6వ తేదీన పారిస్‌లోని అగుటెస్ ఆక్షన్ హౌజ్‌లో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ వేలం జరుగుతుందని, దీనికి కనీస ధరను ఇంకా నిర్ణయించలేదని వేలం నిర్వాహకులు తెలిపారు. మెక్సికో ఆతిథ్యమిచ్చిన 1986 ప్రపంచకప్ లో మారడోనా సారథ్యంలో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోరీ్నలో మారడోనా ఐదు గోల్స్ చేయడంతోపాటు ఉత్తమ ప్లేయర్‌కు అందించే ‘గోల్డెన్ బాల్’ ట్రోఫీని సాధించాడు.
బిజినెస్
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,307 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కీలకమైన అమెరికా మార్కెట్లో అమ్మకాల దన్నుతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ రూ. 1,307 కోట్ల లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 959 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించింది. సమీక్షాకాలంలో ఆదాయం రూ. 6,297 కోట్ల నుంచి రూ. 7,083 కోట్లకు పెరిగింది.పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 4,507 కోట్ల నుంచి రూ. 5,568 కోట్లకు, ఆదాయం రూ. 24,588 కోట్ల నుంచి రూ. 27,916 కోట్లకు పెరిగింది. 2023–24కి గాను రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై కంపెనీ రూ. 40 డివిడెండు ప్రకటించింది. అమెరికా మార్కెట్లో అమ్మకాలు పటిష్టంగా ఉండటం లాభాల వృద్ధికి తోడ్పడిందని విలేకరుల సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న సంస్థ సహ–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కంపెనీ ఏర్పాటై 40 ఏళ్లయిందని, రాబోయే దశాబ్ద కాలంలో నవకల్పనలు, డిజిటల్ థెరప్యూటిక్స్ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా అధిక వృద్ధి సాధనకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు.. ∗ క్యూ4లో గ్లోబల్ జనరిక్స్ ఆదాయం 13 శాతం వృద్ధితో రూ. 6,119 కోట్లకు చేరింది. ∗యూరప్ మార్కెట్లో ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 521 కోట్లుగా నమోదైంది. మరోవైపు, భారత్ మార్కెట్లో ఆదాయం 12 శాతం క్షీణించి రూ. 1,126 కోట్లకు పరిమితమైంది. ∗ అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 9 % వృద్ధి చెంది రూ. 1,209 కోట్లుగా ఉంది. ∗ ఫార్మా సరీ్వసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం 6 శాతం వృద్ధితో రూ. 779 కోట్ల నుంచి రూ. 822 కోట్లకు చేరింది. ∗ మంగళవారం బీఎస్ఈలో ఈ షేరు ధర స్వల్పంగా క్షీణించి రూ. 6,259 వద్ద ముగిసింది.
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కంపెనీలో సుమారు ఏడు సంవత్సరాలు పనిచేసిన ఓ ఉద్యోగిని ఒక్క ఈమెయిల్‌తో తొలగించినట్లు వెల్లడించింది.దాదాపు ఏడేళ్ల పాటు ఎంతో నమ్మకంగా పని చేసిన తన సోదరి లేఆఫ్‌కి గురైన తీరుపై ఆమె సోదరుడు జతిన్ సైనీ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఇందులో గత నెలలోనే ఆమె ప్రమోషన్ (పదోన్నతి) పొందినట్లు పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన తరువాత వారు న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్కు మకాం మార్చాలని కూడా అనుకున్నట్లు పేర్కొన్నారు.రోజు మాదిరిగానే జతిన్ సైనీ సోదరి మే 3న ఆఫీసుకు వెళ్తే తన కార్డు పనిచేయకపోవడాన్ని గమనించి విస్తుపోయింది. ఆశలన్నీ ఆవిరైపోవడంతో ఆమె చాలా బాధపడింది. ఆమెను మాత్రమే కాకుండా ఆమె టీమ్‌లో ఉండే దాదాపు 73 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఏడు సంవత్సరాలు ఎంతో నమ్మకంగా పనిచేసినప్పటికీ ఒక్క మైయిల్ పంపి తీసివేయడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది.పోస్ట్ చివరలో.. జతిన్ సైనీ తన సోదరి ఉద్యోగాన్ని కోల్పోవడంతో కార్పొరేట్ నిర్ణయాల వెనుక ఉన్న విలువలను గురించి వెల్లడించారు. టెస్లాలో ఏడు సంవత్సరాలు పనిచేస్తే.. కష్టాన్ని ఏ మాత్రం గుర్తించకుండా ఇప్పుడు బయటకు పంపారు. శ్రమ మొత్తం సున్నా అయిపోయిందని అన్నారు.టెస్లా కంపెనీ ఏప్రిల్ నెలలో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించింది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగా ఇప్పటికి నాలుగు సార్లు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. దీంతో టెస్లాలో ఉద్యోగం గాల్లో దీపంలాగా అయిపోయింది.
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
దేశాన్ని విడిచి వెళ్లాలా? అంటూ బెంగళూరు ఇన్ఫ్రా, వాతావారణంపై ఆంత్రప్రెన్యూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బెంగళూరు ఇప్పుడు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొటోంది. ఈ తరుణంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మోమో మీడియా కో-ఫౌండర్, క్రియేటీవ్ హెడ్ అనంత్ శర్మ బెంగళూరు నగరంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.బెంగళూరులో మౌలిక సదుపాయాలు, వాతావరణం, నీటి సమస్యపై ఎక్స్ వేదికపై అనంత్ శర్మ స్పందించారు. శర్మ తాను ముంబై లేదా పూణే షిఫ్ట్ అవ్వడం మంచిదా లేకా దేశం విడిచిపెట్టి వెళ్లడం మంచిదా అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. Bangalore looks like it's gonna go to the dogs in another 5 years with bad infra bad weather and bad water. Is Mumbai or Pune worth shifting to or should I just leave India?— Anant (@AnantNoFilter) May 3, 2024‘బాడ్ ఇన్ఫ్రా, బ్యాడ్ వెదర్, బ్యాడ్ వాటర్. నేను ముంబై లేదా పూణేకు షిఫ్ట్ అవ్వాలా? లేదా? దేశం విడిచి వెళ్లాలా? అంటూ నెటిజన్ల అభిప్రాయాల్ని కోరారు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఎక్కువ మంది నెటిజన్లు తన అభిప్రాయంతో ఏకీభవించారు. కొందరు మరో ప్రాంతానికి షిఫ్ట్ అవ్వండి అంటూ సలహా ఇస్తే.. మరికొందరు మాత్రం బెంగళూరులో సానుకూల అంశాలను చర్చించారు. మీకు ఆర్థిక స్థోమత ఉంటే వదిలేయండి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. బెంగుళూరుతో ఉన్న వ్యవస్థాగత సమస్య ఏమిటంటే ప్రజలు దీనిని వలస నగరంగా భావించడం. ఓటు బ్యాంకుగా మారితే తప్ప నగరాన్ని మార్చాలని ఎవరూ కోరుకోరని నిట్టూర్చాడు.
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న ఆంద్రప్రదేశ్ 'బ్లూ ఎకానమీ' (ఓషన్ ఎకానమీ)లో కూడా ఓ కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కోస్తాంధ్రలోని ప్రతి 50 కిలోమీటర్లకు ఓడరేవు, ఫిష్ ల్యాండర్లు, ఫిషింగ్ హోరోబర్‌లలో ఏదో ఒకదాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద తీరప్రాంతాన్ని కలిగి ఉండటం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం బ్లూ ఎకానమీపై దృష్టి సారించింది. ఇప్పటికే వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం 4 కొత్త ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను నిర్మించింది. ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఎక్కడ నిర్మించారు. వాటికైన ఖర్చు వివరాలు కింద గమనించవచ్చు.ఓడరేవులురామాయపట్నం పోర్టు: రూ. 3,736.14 కోట్లుమచిలీపట్నం పోర్టు: రూ. 5,115.73 కోట్లుమూలపేట పోర్టు: రూ. 4,361.91 కోట్లుకాకినాడ గేట్‌వే పోర్ట్: రూ. 2,123.43 కోట్లుఫిషింగ్ హార్బర్లుజువ్వాలదిన్నె: రూ. 288.80 కోట్లునిజాంపట్నం: రూ. 451 కోట్లుమచిలీపట్నం: రూ. 422 కోట్లుఉప్పాడ: రూ. 361 కోట్లుబుడగట్లపాలెం: రూ. 365.81 కోట్లుపూడిమడక: రూ. 392.53 కోట్లుబియ్యపుతిప్ప: రూ. 428.43 కోట్లువొడరేవు: రూ. 417.55 కోట్లుకొత్తపట్నం: రూ. 392.45 కోట్లుమంచినీళ్లపేట: అప్గ్రేడేషన్ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలుచింతపల్లి: రూ. 23.74 కోట్లుభీమిలి: రూ. 24.86 కోట్లురాజయ్యపేట: రూ. 24.73 కోట్లుదొండవాక: రూ. 23.90 కోట్లుఉప్పలంక: రూ. 5.74 కోట్లురాయదరువు: రూ. 23.90 కోట్లువైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ఈ కేంద్రాల వల్ల ఎంతోమంది ఉపాధి పొందగలిగారు. పోర్ట్‌లు ద్వారా 75000 కంటే ఎక్కువమంది ఉపాధి పొందారు. ఫిషింగ్ హార్బర్ల ద్వారా 65000 కంటే ఎక్కువ, ఫిష్ ల్యాండర్ల ద్వారా 39000 కంటే ఎక్కువమంది ఉపాధి అవకాశాలను పొందగలిగారు.ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎగుమతులు కూడా పెరిగాయి. ఎగుమతుల్లో 12వ సంఖ్య దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ కేంద్రాల నిర్మాణం తరువాత ఆరో స్థానానికి చేరింది. 2014-19లో ఎగుమతుల విలువ రూ. 90829 కోట్లు, కాగా 2019-23 మధ్య రూ. 159368 కోట్లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బ్లూ ఎకానమీలో రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వీడియోలు
రాక్షస పరివార్..
కూటమికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..
విశాఖపై టీడీపీ కొత్తరాగం
పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర
నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..
బాచుపల్లిలో ఘోర ప్రమాదం
మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..
నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్
సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..
ఫ్యామిలీ
అత్యధిక మిలియనీర్స్ ఉన్న భారతీయ నగరం ఇదే..!
ప్రపంచంలోనే అత్యధిక మిలియర్లు ఉన్న నగరాల జాబితాను ఏటా ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ అయిన హెన్లీ & పార్ట్నర్స్ ఇస్తుంది. సంపన్న నగరాల జాబితాలో న్యూయార్క్ దాదాపు మూడు లక్షల మిలియనీర్లతో రెండు స్థానంలో ఉంది. ఇక్కడ నివాసితులు ప్రపంచంలోని ఇతర మెట్రోల కంటే దాదాపు మూడు డాలర్ల ట్రిలయన్లకు పైగా సంపదను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక్కడ మిలియనీర్ల సంఖ్య సుమారు 4% పెరిగినట్లు తెలిపింది. న్యూయార్క్‌లో 2013 నుంచి ఇప్పటి వరకు అంత్యంత సంపన్నుల సంఖ్యలో పెద్ద వాటాను కలిగి ఉంది. ఇక్కడ సుమారు 60 బిలియనీర్లు ఉన్నారని, వారిలో చాలామంది దాదాపు రూ. 800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టగలరని వెల్లడించింది. ఇక శాన్ జోస్, శాన్ ఫ్రాన్సిస్కో బేఏరియా, పాలో ఆల్టోల వంటి నగరాల్లో శాన్ ఫ్రాన్సిస్కో బేఏరియాలో మాత్రం మూడు లక్షల మంది ఏడు సంఖ్యల నికర విలువ కలిగి ఉండటంతో రెండో స్థానంలో ఉందని తెలిపింది. ఇక ఈ అత్యధిక మిలియనీర్స్ జాబితాలో టోక్యో మూడో స్థానంలో ఉండగా, సింగపూర్ నాల్గో స్థానంలో ఉంది. కాగా హెన్లీ & పార్ట్నర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జుర్గ్ స్టెఫెన్ ప్రకారం గత కొన్ని ఏళ్లలో ఆర్థిక మార్కెట్లలో విజృంభణ ఒక్కసారిగా ప్రపంచంలోని కొన్ని అత్యంత సంపన్న నగరాల వృద్దిని పెంచింది. పైగా వాటి గ్లోబల్ ఈక్విటీలు 2023లోనే సుమారు 20% పెరగగా, ఈ ఏడాది ఏకంగా 7% పెరిగాయి. దీంతో కొన్ని ప్రపంచ నగరాల అదృష్టం తారుమారయ్యిందని చెబుతోంది హెన్లీ & పార్ట్నర్స్ సర్వే. గత దశాబ్దంలో లండన్ తన మిలియనీర్ జనాభాలో 10% కోల్పోయింది. దీనికి యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించాలని యూకే తీసుకున్న నిర్ణయమని చెబుతోంది. అలాగే చైనా మహమ్మారి టైంలో విధించిన ఆంక్షలు కారణంతో సంపన్న ప్రవాసులు సింగపూర్‌కు తరలిరావడంతో హాంకాంగ్ దాని మిలియనీర్ ర్యాంక్‌లలో 4% క్షీణతను చవి చూసింది. ఇదే సమయంలో కొన్ని నగరాల్లో మిలియనీర్ల వృద్ది అనూహ్యంగా పెరిగింది వాటిలో షెన్జెన్ కూడా ఉంది, ఇక్కడ గత దశాబ్దంలో మిలియనీర్ల సంఖ్య సుమారు 140% పెరిగింది. ఇక గత 10 ఏళ్లలో రెట్టింపుకు పైగా మిలియనీర్ జనాభా పెరిగిన నగరాలు వరుసగా భారతదేశంలోని బెంగళూరు, హో చి మిన్ సిటీ, వియత్నాం, యూఎస్‌లో అరిజోనాలోని స్కాట్స్‌డేల్ వంటి నగరాలు. కాగా ఆ జాబితాలో సంపన్న నగరంగా దుబాయ్ 21వ స్థానం దక్కించుకోగా, మొనాకో నెంబర్ 1 స్థానంలో ఉంది. మొనాకోలో సుమారు 40%కి పైగా మిలియనీర్లు ఉన్నారని హెన్లీ & పార్ట్నర్స్ సర్వే చెబుతోంది. (చదవండి: సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ)
ఎంతైనా జ్యోతిక... ఆ స్టయిలే వేరు! (ఫొటోలు)
ఉద్యోగం దొరికితే చాలు అనే యువతరం కాదు..అంతకుమించి..!
కొత్త రంగాలు ఉనికిలోకి రావడం వల్ల ‘ఉద్యోగమే సర్వస్వం’ ‘ఉద్యోగం దొరికితే చాలు’ అనుకోవడం లేదు యువతరంలో చాలామంది. దీనికి కారణం...ప్రత్యామ్నాయ అవకాశాలు. ‘ఉద్యోగం ఎందుకు చేయాలి?’ నుంచి ‘చేస్తే ఎలాంటి ఉద్యోగం చేయాలి’ వరకు కెరీర్ బాట పట్టడానికి ముందు రకరకాల కోణాలలో ఆలోచిస్తున్నారు. మంచి వేతనం కంటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 44 దేశాల్లో మిలీనియల్స్, జెన్ జెడ్‌పై సర్వే చేసింది డెలాయిట్. దీని ప్రకారం ప్రైమరీ జాబ్ తోపాటు మరో జాబ్ చేస్తున్న యువ ఉద్యోగుల సంఖ్య తక్కువేమీ కాదు. బెంగళూరులో ఒక ప్రైవేట్ కాలేజీలో పని చేస్తున్న పరిమళ ఆన్లైన్లో వ్యాపారం కూడా చేస్తుంటుంది.‘డబ్బు కోసం కాదు. అదొక ఫ్యాషన్’ అంటుంది తన ఆన్లైన్ వ్యాపారం గురించి. లింక్డ్ ఇన్ సర్వే ప్రకారం 2023లో మన దేశంలో 88 శాతం మంది జెన్ జెడ్ ఉద్యోగులు ‘ఉద్యోగ మార్పు’నకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. జెన్ జెడ్ ఉద్యోగులపై ఆర్పీజీ గ్రూప్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం పదిమందిలో ఆరుగురు మంచి వేతనం కంటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు.‘పని ఒత్తిడి చచ్చినట్లు భరించాల్సిందే’ అని రాజీపడడం కంటే ‘జీతం తక్కువ అయినా సరే నాకు నచ్చిన ఉద్యోగం చేస్తాను’ అని ఆలోచిస్తున్న వారి సంఖ్య యువతరంలో ఎక్కువగానే ఉంది. ముంబైలోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసిన అనన్యకు పనిభారంతో ఊపిరాడేది కాదు. ఒక ఫైన్ మార్నింగ్ ‘ఇది కాదు జీవితం’ అనిపించింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోంది. ‘నేను పని చేస్తున్న కంపెనీతో పోల్చితే ఇది చాలా చిన్న ఉద్యోగం కావచ్చు. కాని ఎంతో సంతోషంగా ఉంది’ అంటుంది అనన్య. ఒక మార్కెటింగ్ సంస్థలో ఉద్యోగం చేసిన ఇరవై సంవత్సరాల సారా బోహ్ర ఆ ఉద్యోగం మానేసి సొంతంగా మార్కెటింగ్ ఫర్మ్ మొదలుపెట్టింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. ‘ఇప్పుడు చాలా సౌకర్యంగా ఫీలవుతున్నాను. పని ప్రకారం కాదు గంటల ఆధారంగా ప్రొడక్టివిటీని కంపెనీలు అంచనా వేస్తున్నాయి’ అంటుంది సారాతీయని పాఠాలు..రాజస్థాన్‌లోని వనస్థలి యూనివవర్శిటీలో బీబీఏ డిగ్రీ పూర్తి చేసిన అనువ కక్కర్ ఉద్యోగం కంటే సొంత స్టార్టప్‌కే ్ర΄ాధాన్యత ఇచ్చింది. అయితే కస్టమైజ్డ్ పోస్టర్ కార్డ్‌లకు సంబంధించి ఆన్లైన్ బిజినెస్‌లో ఫెయిల్ అయింది. అయితే ఈ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకున్న అనువ ‘టిగెల్’ చాకోలెట్ బ్రాండ్‌తో సక్సెస్ అయింది. హాట్ చాక్లెట్+వింటర్= హ్యాపీనెస్ నినాదంతో చిన్న బడ్జెట్లో కంపెనీ మొదలు పెట్టింది. కస్టమర్ చాయిస్‌లను అర్థం చేసుకోవడంలో పట్టు సాధించింది. ‘టిగెల్’ స్టార్ట్ చేసినప్పుడు అనువ వయసు 21 సంవత్సరాలు. ‘చిన్న వయసులో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రస్థానం మొదలు పెట్టడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది’ అంటుంది అనువ కక్కర్. బెస్ట్ ప్లాన్ బెడిసి కొడితే?‘ఈ రంగంలో మాత్రమే పనిచేస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏ రంగంలో పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. యాంత్రిక జీవితం కంటే ఉల్లాసకరమైన మార్పు చాలామంచిది’ అంటుంది చెన్నైకి చెందిన శ్రీతేజ. కోల్‌కత్తాకు చెందిన 23 సంవత్సరాల మనీష తన ఉద్యోగానికి సంబంధించి ఇప్పటికీ మూడు రంగాలు మారింది. అలా అని ఆమెలో పశ్చాత్తాపం ఏమీ లేదు. ‘ఏ రంగంలో అయినా పనిచేయగలను అనే నమ్మకం వచ్చింది’ అంటుంది మనీష. వర్క్ నుంచి గ్యాప్ తీసుకోవాలనుకునే యువతరం కోసం ఈమధ్య కాలంలో ఎన్నో ‘గ్యాప్ ఇయర్ కమ్యూనిటీస్’ వచ్చాయి. ‘గ్యాప్ఎక్స్’ పేరుతో హరియాణాలోని అశోకా యూనివర్శిటీలో 40 మంది స్టూడెంట్స్‌తో కూడిన గ్రూప్ ఉంది.‘యువతలో చాలామంది కెరీర్ మార్గాన్ని నిర్ణయించుకునే ముందు వివిధ అవకాశాల గురించి అన్వేషిస్తున్నారు. ఆలోచిస్తున్నారు’ అంటున్నాడు దిల్లీ యూనివర్శిటీ మాజీ వైస్ చాన్సలర్ దినేష్ సింగ్. చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి నచ్చిన ఉద్యోగం చేయడం, సొంతంగా కంపెనీ మొదలుపెట్టడం, ఉద్యోగ విరామం తీసుకొని ఆన్లైన్ కోర్సులలో చేరడం వరకు తమదైన దారిలో ప్రయాణం చేస్తోంది నవతరం.(చదవండి: సడెన్‌గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..)
యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా : భావోద్వేగం
2014 నుండి యూనిసెఫ్ ఇండియాతో అనుబంధం కలిగి ఉంది బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్. ఇద్దరు బిడ్డల తల్లిగా బాల్య అభివృద్ధి, ఆరోగ్యం, విద్య మరియు లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో సంస్థకు మద్దతు ఇస్తుంది. తాజాగా యునిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా కపూర్ ఎంపికైంది. ఈ సందర్బంగా ఆమె భావోద్వేగానికి లోనైంది.కరీనా కపూర్ అనగానే రంగుల ప్రపంచం కళ్ల ముందు ఆవిష్కారం అవుతుంది.అయితే ఈ అందాల నటికి మరో ప్రపంచం కూడా తెలుసు.స్త్రీ సాధికారత నుంచి మెన్స్ట్రువల్ హైజీన్ వరకు ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు వెళుతోంది. పేదింటి బిడ్డలతో మాట్లాడుతోంది.తాజాగా యూనిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా నియామకం అయిన కరీనా కపూర్‌లో ఫ్యాషన్ డిజైనర్, రైటర్, మోటివేషనల్ స్పీకర్, సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు...ఉత్తమనటిగా సుపరిచితమైన కరీనా కపూర్ సృజనాత్మకమైన డిజైనర్ కూడా. క్లాతింగ్ రిటైలర్ ‘గ్లోబస్’తో కలిసి పనిచేసింది. న్యూట్రిషనిస్ట్ రుజుత దివాకర్‌తో కలిసి తీసుకు వచ్చిన ‘డోంట్ లూజ్ యువర్ మైండ్, లూజ్ యువర్ వెయిట్’ పుస్తకం అమ్మకాల్లో రికార్డ్ సృష్టించింది. కరీనా కపూర్ వాయిస్‌తో ఈ పుస్తకం ఆడియో బుక్‌గా రావడం మరో విశేషం. ‘ది స్టైల్ డైరీ ఆఫ్ బాలీవుడ్ దివా’ పేరుతో తన జ్ఞాపకాల పుస్తకాన్ని తీసుకువచ్చింది. అదితి షా బీమ్జానీతో కలసి ప్రెగ్నెన్సీపై రాసిన పుస్తకం కమర్షియల్‌గా సక్సెస్ అయింది. రుజుత దివాకర్‌తో కలిసి న్యూట్రిషన్‌కు సంబంధించి ‘ది ఇండియన్ ఫుడ్ విజ్డమ్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ ఈటింగ్ రైట్’ డాక్యుమెంటరీపై పనిచేసింది. ఉమెన్ ఎంపవర్మెంట్పై వచ్చిన ‘గర్ల్ రైజింగ్’ అనే డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌కు వాయిస్–వోవర్ ఇచ్చింది.ఒకవైపు సినిమాల్లో బిజిగా ఉన్నప్పటికీ... పిల్లల విద్య, మహిళల భద్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. మహిళలపై హింసను నిరో«ధించడానికి ఎన్డీ టీవి ప్రారంభించిన శక్తి క్యాంపెయిన్‌కు అంబాసిడర్‌గా పనిచేసింది. 2014 నుంచి బాలికల విద్యకు సంబంధించి యూనిసెఫ్‌తో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని పాఠశాలలకు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేది. జాల్నా జిల్లాలో కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంది.నిరుపేద పిల్లల చదువు కోసం షర్మిలా ఠాగుర్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. చైల్డ్–ఫ్రెండ్లీ స్కూల్ అండ్ సిస్టమ్స్ (సీఎఫ్ఎస్ఎస్) యాకేజీని లాంచ్ చేసింది. చత్తీస్‌ఘడ్‌లో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ వీక్ çసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బాగా చదివే పిల్లలు, పాఠాలు బాగా చెప్పే టీచర్లకు పురస్కారాలు అందజేసింది. మెన్స్ట్రువల్ హైజీన్‌పై యూనిసెఫ్ లక్నోలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించింది. ‘నవజాత శిశువులను కాపాడుకుందాం’ పేరుతో కరీనా రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. నవజాత శిశువులు, తల్లుల క్వాలిటీ హెల్త్ కేర్‌కు సంబంధించి ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ అనే క్యాంపెయిన్‌ను నిర్వహించింది. మదర్స్ డే సందర్భంగా యూనిసెఫ్ దిల్లీలో నిర్వహించిన సమావేశంలో కరీనా ప్రధాన వక్త.ప్రకృతి వైపరీత్య బాధితుల కోసం, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల కోసం నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంది కరీన. పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుదలకు సంబంధించిన అంశాలపై పనిచేసే స్వస్థ్ ఇమ్యునైజేషన్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది.తాజా విషయానికి వస్తే.. ‘నేషనల్ అంబాసిడర్‌గా యూనిసెఫ్‌తో నా అనుబంధం కొనసాగడం గౌరవంగా భావిస్తున్నాను. పిల్లల చదువు, హక్కుల కోసం నా గొంతు వినిపిస్తాను’ అంటుంది కరీనా కపూర్.‘కరీనా కపూర్ ఎక్స్లెంట్ కమ్యూనికేటర్’ అని కితాబు ఇచ్చింది యూనిసెఫ్. చిన్న విజయం చాలు... పెద్ద సంతోషానికిసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ‘నేను ఎలా సాధించానంటే’లాంటి స్టోరీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేస్ మొదలైంది. ఆ రేస్‌లో భాగంగా యువతరం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ రేసులో మెంటల్ హెల్త్ అనేది వెనక్కి వెళ్లిపోయింది. రేస్ అనేది శాంతి, సంతోషాల కోసం ఉండాలి. విద్యార్థులు తమ మానసిక శాంతిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చిన్న విజయాన్ని కూడా పెద్ద విజయంగా భావించుకోవాలి. ‘ఇదీ ఒక విజయమేనా!’ అనుకున్నప్పుడు అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి నుంచి అశాంతి జనిస్తుంది –కరీనా కపూర్
న్యూస్ పాడ్‌కాస్ట్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రోగ్రెస్ రిపోర్ట్... టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నేత చంద్రబాబును నమ్మితే అధోగతే.. చోడవరం, అంబాజీపేట, పొన్నూరు ప్రచార సభల్లో ప్రజలను అప్రమత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈ నెల 14వ తేదీ వరకు.. సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇంతకు ముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో.. అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా కోరారు.కుంభకోణంలో కవిత పాత్రపై ఒకట్రెండు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. మరోవైపు సీబీఐ కేసులో న్యాయవాది పంకజ్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కవితతో సంబంధాలు ఉన్న మరికొందరిని విచారించాల్సి ఉందని, దర్యాప్తు సజావుగా సాగాలంటే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు. ఇక ఈడీ కేసులో కవిత తరఫు న్యాయవాది నితీశ్‌రాణా వాదనలు వినిపిస్తూ.. కుటుంబ సభ్యులు కవితతో 15 నిమిషాలు మాట్లాడటానికి అనుమతించాలని కోరారు. కోర్టు లాకప్‌లో పిటిషనర్ భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. జైలుకు పంపుతున్న ఇంటి భోజనాన్ని కూడా జైలు సూపరింటెండెంట్ ఒక్కరే తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కవితకు ఇంటి భోజనం నిలిపివేశాక కూడా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని, దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత కవిత జ్యుడీషి యల్ కస్టడీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కవితకు చదువుకోవ డానికి పది పుస్తకా లను అనుమతించాల ని జైలు అధికారులకు సూచించారు. ఈడీ, సీబీఐ కేసులలో ప్రత్యేక కోర్టుకు కవితకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో.. ఆమె న్యాయవా దులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.నా అరెస్టు అన్యాయం: కవితఅధికారులు ప్రత్యేక కోర్టు ప్రాంగణంలోకి కవితను తీసుకువచ్చినప్పుడు.. ‘జైతెలంగాణ.. జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి, తనలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
మంచిర్యాలక్రైం: నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కళ్లనిండా చూసుకోకుండానే కాటికి చేరుకున్న ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్ భార్య రవళిక (26) సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చింది. సదరు మహిళకు అధిక రక్తస్రావం కావడంతో వైద్యురాలు అర్జంటుగా రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంకటేశ్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకు వచ్చే లోగానే వైద్యురాలు నందిని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మహిళను సమీపంలోని మెడిలైఫ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవళిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు నందిని, మెడిలైఫ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రవళిక మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ బన్సీలాల్ సిబ్బందితో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్బోర్న్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్ స్టడీ వీసాపై ఎంటెక్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం చదువుకోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్‌తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్‌పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్ కూడా గాయపడ్డాడు.అయితే గొడవ పడవద్దు అన్నందుకే నవజీత్‌పై దాడి చేశారని బాధితురాలి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి అనీ, సెలవుల కోసం జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని తెలిపారు. రైతు అయిన అతని తండ్రి, నవజీత్ చదువుకోసం ఒకటిన్నర ఎకరాల భూమిని విక్రయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుడి కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
Karachi Bakery:హోటల్స్, బేకరీల్లో తనిఖీ
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు హోటల్స్, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఎంజేమార్కెట్ చౌరస్తాలోని అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీలో గడువు తేదీ ముగిసిన పదార్థాలను గుర్తించారు. ఇందులో రూ.5200 వేల విలువైన బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకులు, రస్క్, బన్నులు ఉన్నాయి. అంతేగాకుండా పలు ఆహార పదార్థాలపై లేబుల్ లేని ఉత్పత్తులను గుర్తించారు. ఫుడ్‌సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో కరాచీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.