Review
-
Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ
మనం చూసే ప్రతి సినిమాలో నిజ జీవిత పాత్రలు మనలోనివారు కొంతమంది తెర మీద పోషించి మనల్ని మెప్పించడం సహజమే. కాని మనలోని భావావేశాలను జంతువులచే డిజిటల్ రూపంలో పలికించి మన మనస్సులను కదిలించడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో హాలీవుడ్‌ను నిజంగా అభినందించాలి. కానీ హాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ 40 ఏళ్ళ క్రితమే అంటే డిజిటల్ సాంకేతికత మనకు పరిచయమవ్వని రోజుల్లోనే ఇటువంటి కోవలో మనకు ఓ సినిమా పరిచయం చేసింది. దాని పేరే మాకూ స్వాతంత్రం కావాలి. ఇక్కడ టాలీవుడ్, హాలీవుడ్ చేసిందా అన్నది కాదు, మనుషులకు జంతువులతో కూడా భావావేశాలు పలికించవచ్చన్నదే విషయం. ముఫాసా సినిమా 2019వ సంవత్సరంలో 'ది లయన్ కింగ్' సినిమా సిరీస్‌లో వచ్చిన రెండవ భాగం. ముఫాసా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రతి భాషలో విడుదలైంది. ముఫాసా సినిమాకి అన్ని భాషల్లో పేరున్న గొప్ప నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగులో ప్రముఖ నటులు మహేశ్‌బాబు, బ్రహ్మానందం, అలీ తదితరులు వాయిస్ ఇచ్చారు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు మన నేటివిటీ ఎక్కడా తగ్గదు ఒక్క పేర్లలో తప్ప.ఈ సినిమాకి దర్శకుడు బారీ జెర్కిన్స్. కథాపరంగా లయన్ కింగ్‌కు కొనసాగింపైన ఈ ముఫాసాలో సింబా - నాలా సింహాలకు కియారా అనే ఆడ సింహం పుడుతుంది. ఆ తర్వాత సింబ- నాలా జంట టిమన్, పంబ దగ్గర కియారాను వదిలేసి ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి సెరేన్ ఒయాసిస్కు బయలుదేరతాయి. అప్పుడు రఫీకి అనే కోతి కియారాకు తాను సింబ వయస్సులో ఉన్నపుడు జరిగిన ముఫాసా కథ గురించి చెప్తుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ సి యం రాజు ఈ కోతికి గాత్రదానం చేశారు. కథంతా ఈ రఫీకీయే చెప్తాడు. ముఫాసా అనే పిల్ల సింహం ఓ తుఫానులో చిక్కుకుని తన తల్లిదండ్రుల నుంచి విడిపోతుంది. అలా నీళ్లలో ముఫాసా కొట్టుకుపోతూ టాకా అనే మరో సింహం పిల్లను కలుస్తుంది. టాకా తల్లిదండ్రులు ఒబాసీ, ఇషా. వీళ్ళిద్దరూ వారి ప్రాంతంలో రాజు, రాణి. టాకాని యువరాజును చేయాలనుకుంటారు. ఇంతలో తెల్ల సింహాల గుంపు వీరి రాజ్యం మీద దాడి చేస్తుంది. వాటి నుండి ముఫాసా, టాకా తప్పించుకుంటారు. ముఫాసా తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ మిలేలే అనే ప్రాంతానికి వెళ్లాలనుకుంటాడు. తరువాత సినిమా అంతా ముఫాసా తన తల్లిదండ్రులను చేరుకుంటాడా లేదా అన్నదే. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా స్క్రీన్ ప్లే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అలానే పెద్దల మనసును సైతం కదిలిస్తుంది. ఎక్కడా గ్రాఫిక్స్ అన్నదే తెలియకుండా నిజజీవితంలో జంతువుల కథను దగ్గరగా చూసినట్టుంది. వర్త్‌ఫుల్ మూవీ ఫర్ ఫ్యామిలీ.- హరికృష్ణ ఇంటూరు -
'మన్యం ధీరుడు' సినిమా రివ్యూ
బ్రిటీష్ వారి బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈయన జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదివినా, వెండితెరపై చూసినా ఎప్పుడూ కొత్తగానే వుంటుంది. అలాంటి పాత్రలో రంగస్థల నటుడు ఆర్.వి.వి.సత్యనారాయణ నటించడమే కాకుండా తానే సినిమా నిర్మించారు. మన్యం ధీరుడు పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్.వి.వి మూవీస్ పతాకంపై ఆర్.పార్వతిదేవి సమర్పణలో తెరకెక్కించారు. నరేష్ డెక్కల దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మన్యం ధీరుడు ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకున్నారో చూసేద్దాం..కథబ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పొరాడిన అల్లూరి సీతారామరాజు వారి తుపాకీ గుళ్లకు బలై నేలకొరిగారు. అలాంటి పవర్ ఫుల్ పాత్రలో రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ పోషించారు. సహజసిద్ధంగా లభించిన భూమిని దుక్కి దున్ని చేసుకుంటున్న మన్యం ప్రజలపై పన్నులు వేసి... బలవంతంగా వసూళ్లను చేయడం అల్లూరి సీతారామరాజు వ్యతిరేకిస్తారు. అందుకు ప్రతిగా బ్రిటీష్ వారు ఎలా స్పందించారు? సీతారామరాజు వారిని ఏ విధంగా ముప్పుతిప్పలు పెట్టి ప్రజల తరఫున పోరాడాడు? స్వాతంత్ర్యం కోసం మన్యం ప్రజలను ఎలా మేలుకొల్పాడు? పేద ప్రజలకు ఉన్న మద్యం సేవించడం తదితర అలవాట్లను ఎలా మాన్పించి వారిని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేలా చేశారు? లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.విశ్లేషణటెక్నాలజీ యుగంలో కొట్టుకుపోతున్న యువతకు విప్లవ వీరుల కథలను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గతంలో అల్లూరి సీతారామరాజు జీవిత కథను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఎన్నో అవార్డులు పొందాయి. అలాంటి మన్యం వీరుడి కథను మరోసారి వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ముఖ్యమైన ఘట్టం మన్యం ప్రాంతంలోని చింతపల్లి, రాజవొమ్మంగి తదితర పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను అపహరించడం... వాటితో బ్రిటీష్ వారిపై పోరాటం చేయడంలాంటి సన్నివేషాలన్నీ ఆడియన్స్‌కు గూస్ బమ్స్ తెప్పిస్తాయి.అలాగే మన్యం కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రను ఎదిరించడం, బ్రిటీష్ వారి మీద పోరాటం చేసే సన్నివేషాలు మాస్ ఆడియన్స్‌ను అలరిస్తాయి. సత్యనారాయణ రంగస్థలం నుంచి రావడం వల్ల డైలాగ్ డెలివరీ స్పష్టంగా వుంది. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా వున్నా... సెకెండాఫ్‌లో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా పరుగులు పెడుతుంది. జబర్దస్థ్ అప్పారావుతో కాసేపు నవ్వించే ప్రయత్నం చేసినా... ఓ యువజంట ప్రేమాయణం గురించి కథకు అవసరం లేకున్నా బలవంతంగా చొప్పించారనిపిస్తుంది.మద్యపానం సేవించడం సమాజానికి, కుటుంబానికి మంచిది కాదని చెప్పే ప్రయత్నం బాగుంది. అలాగే స్వాతంత్రం భారతదేశానికి ఎంత అవసరమో... బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే భారతీయులకు చెప్పడం, వారిని కూడా బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడేలా చేయడం, మన భూమిన మనం దుక్కి దున్నితే... వాళ్లకు ఎందుకు పన్ను కట్టాలి? మన పంటలను వాళ్లకు ఎందుకు ధారాదత్తం చేయాలి అనే అంశాలను బాగా చూపించారు.రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ టైటిల్ పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా గుర్రపుస్వారీ, కత్తియుద్ధం కూడా నేర్చుకుని నటించడం విశేషం. బ్రిటీష్ వారిని ఎదిరించే మల్లుదొర పాత్రలో జీవీ త్రినాథ్ చివరి దాకా బాగా నటించారు.జబర్దస్థ్ అప్పారావు, సత్తి పండు పాత్రలు కాసేపు ఉన్నా... నవ్విస్తాయి. కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రలో ఉమేద్ కుమార్ పాత్ర ఆకట్టుకుంటుంది.ఈ చిత్రంలో ప్రధానంగా మెచ్చుకోవాల్సింది విలేజ్ సెట్టింగ్. మన్యంలో గూడెం ఎలా వుంటుందో చాలా నేచురల్‌గా వేశారు. అరుకు, పాడేరు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ప్రాంతాల అందాలను కెమెరాలో బంధించారు. అల్లూరి సీతారామరాజు ఎలివేషన్ షాట్స్ బాగున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఓకే. రెండుగంటలలోపే నిడివి వుండటం ఈ సినిమాకి ప్రధాన బలం. డైరెక్టర్ కథను బాగానే డీల్ చేశారు. -
మత్తు వదలరా-2 ట్విటర్ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీకి రీతేష్ రానా దర్శకత్వం వహించారు. పార్ట్-1 హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడిపోవడంతో ట్విటర్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.(ఇది చదవండి: ‘మత్తు వదలరా 2’ ట్రైలర్: శ్రీసింహా, సత్య కామెడీ అదుర్స్)మత్తు వదలరా-2 ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఉందంటూ ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లోనే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయమని అంటున్నారు. నాన్‌స్టాప్ కామెడీ ఎంటర్టైనర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సత్య తన ఫర్మామెన్స్, కామెడీ అదిరిపోయిందని బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమంటున్నారు. అయితే ఇది కేవలం ఆడియన్స్ అభిప్రాయం మాత్రమే. వీటికి సాక్షికి ఎలాంటి బాధ్యత వహించదు. IT’s A BLOCKBUSTER LAUGHING RIOT😂#Mathuvadalara2 pic.twitter.com/EbXyZKXGvL— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 13, 2024 Red Carpet Premiere:#MathuVadalara2 first half!🤣🤣😂Pure #Satya Rampage! Potta Noppochesindi. Really gifted comedian👏👏❤️🔥Non-stop entertainment. Second half Ee range lo Vinte Blockbuster guaranteed#MathuVadalara pic.twitter.com/0Qu8BGjAeD— Ungamma (@ShittyWriters) September 12, 2024 Done with my show, thoroughly enjoyed all references, although it has some lag moments. Satya is spot-on with his comic timing!!while other actors did their part. bhairava's music is lit. Overall a complete laugh riot film:) my rating is 2.75 #Mathuvadalara2Oneman show #Satya pic.twitter.com/kRyZ8Bf5Kn— palnadu tweets (@Nazeershaik1712) September 12, 2024 -
సారంగదరియా సినిమా రివ్యూ
టైటిల్: ‘సారంగదరియా’నటీనటులు: రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ, నీల ప్రియా, కదంబరి కిరణ్ తదిరతులునిర్మాణ సంస్థ: సాయిజా క్రియేషన్స్నిర్మాతలు: ఉమాదేవి, శరత్ చంద్ర, చల్లపల్లిదర్శకత్వం: పద్మారావు అబ్బిశెట్టి(పండు)సంగీతం: ఎం. ఎబెనెజర్ పాల్సిసిమాటోగ్రఫీ: సిద్ధార్థ స్వయంభువిడుదల తేది: జూలై 11, 2024కథమిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. పెద్ద కొడుకు అర్జున్(మెయిన్ మొహమద్) తాగుడుకు బానిసవుతాడు. రోజూ మద్యం తాగుతూ బార్లో గొడవపడుతుంటాడు. చిన్నోడు సాయి (మోహిత్) అమ్మాయిల చుట్టూ తిరుగుతూ.. చివరకు తమ ఏరియాలోనే ఉండే కాలేజీ అమ్మాయి ఫాతిమా(మధులత)ను ప్రేమలోకి దింపి, రొమాంటిక్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. కూతురు అనుపమ(యశస్విని) మాత్రం బుద్ధిగా చదువుకుంటూ.. బయటి ప్రపంచానికి దూరంగా ఉంటుంది. అనుపమ అంటే అదే కాలేజీలో చదువుతున్న రాజ్(శివచందు)కి చాలా ఇష్టం. తన ప్రేమను అంగీకరించాలంటూ ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. అనుపమ మాత్రం అతన్ని దూరం పెడుతుంది. మిస్ బ్యూటీ క్వీన్ కావాలనేది ఆమె లక్ష్యం. అయితే ఓ రోజు కృష్ణకుమార్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా.. రాజ్ తండ్రి(కదంబరి కిరణ్)వచ్చి గొడవ చేస్తాడు. దీంతో అనుపమకు సంబంధించిన ఓ పెద్ద రహస్యం బయట పడుతుంది. అదేంటి? కృష్ణకుమార్ సొంత ఊరిని వదిలి వచ్చి వేరే చోట బతకడానికి గల కారణం ఏంటి? రెస్టారెంట్ పెట్టి మంచి బిజినెస్ చేసే అర్జున్.. తాగుడుకు ఎందుకు బానిసగా మారాడు? ఫాతిమాతో ప్రేమాయణం.. సాయి జీవితాన్ని ఎలా మార్చేసింది? మిస్ బ్యూటీ క్వీన్ పోటీల్లో పాల్గొనే క్రమంలో అనుపమకు ఎదురైన సమస్యలు ఏంటి? తనకు తండ్రి కృష్ణ కుమార్ ఎలా సపోర్ట్‌గా నిలిచాడు? కృష్ణకుమార్ ఫ్యామిలీకి సమాజం నుంచి ఎదురైన సమస్యలేంటి? వాటిని అధిగమించి తన పిల్లలను ఎలా ప్రయోజకులుగా మార్చుకున్నాడు? అన్నదే మిగతా కథ.ఎలా ఉందంటే?ఇదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. ‘సమానత్వం’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో డైరెక్టర్ పండు మధ్య తరగతి కుటుంబంలోని కష్టాలను కొత్త కోణంలో చూపించాడు. ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సమస్యలు మాత్రమే కాదు.. కులమత ప్రస్తావన, లింగ మార్పిడి ప్రస్తావన కూడా ఉంది. ట్రాన్స్ ఉమెన్స్‌ని సమాజం ఎలా చూస్తుంది? సొంతవాళ్ల నుంచే వాళ్లకు ఎలాంటి అవమానాలు ఎదురవుతాయి? అనేది చూపిస్తూనే.. వారిని ఎంకరేజ్ చేస్తే ఎలా రాణించగలరో ఇందులో చూపించారు. ఓ వైపు భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ పండు. ఒకే సినిమా ద్వారా నాలుగైదు సందేశాత్మక కథలను చెప్పాడు. ఇలాంటి సబ్జెక్ట్‌ను డీల్ చేయడం మాములు విషయం కాదు. తొలి సినిమాతోనే మంచి సందేశం అందించిన డైరెక్టర్ని అభినందించాల్సిందే. కానీ ఇలాంటి సందేశాత్మక సినిమాలను ఎంకరేజ్ చేసేందుకు ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించరు. అటు సరదాగా, ఇటు కమర్షియల్‌గా చెబితేనే సినిమా చూస్తామంటున్నారు. దర్శకుడు పద్మారావు ఆ కోణంలో సినిమా తీయాలని ప్రయత్నించాడు కానీ పూర్తిగా సఫలం కాలేకపోయాడు.విశ్లేషణకృష్ణకుమార్ కుటుంబ సభ్యులందరి గురించి వివరంగా చెప్పడంతో మూవీ కొంత సాగదీసినట్లు అనిపిస్తుంది. అర్జున్ పాత్ర ఎమోషనల్‌గా ఉంటే సాయి పాత్ర టీనేజ్ కుర్రాళ్లకు కనెక్ట్ అయ్యేలా చిల్‌గా ఉంటుంది. ఫస్టాఫ్ ఓకే అనిపిస్తుంది. రెండో భాగంలో ఏమైనా మెరుపులు ఉంటాయా? అంటే అక్కడ తడబాటే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి సీన్‌ను డీటెయిల్‌గా చెప్పేందుకు ప్రయత్నించడంతో బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. వరుసగా కష్టాలు ఎదురవడంతో సినిమా చూసే ప్రేక్షకుడికి ఓరకమైన నిస్సహాయత అలుముకున్న భావన రాక మానదు. అను పాత్ర యాక్టివ్‌గా ఉంటుంది.'ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం. కానీ, జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది' అన్న డైలాగ్ అదిరిపోయింది. క్లైమాక్స్‌లో అను తండ్రి గురించి చెప్పే డైలాగ్స్‌కు విజిల్ వేయాల్సిందే! తన స్పీచ్.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్ష గురించి చర్చించేలా చేస్తుంది. ఎక్కువ సాగదీత వల్లే సినిమాలో ఎమోషన్ ఆశించినంత పండలేదు.నటీనటులుకృష్ణ కుమార్‌గా రాజా రవీంద్ర బాగా యాక్ట్ చేశాడు. ఎప్పుడూ పాజిటివ్, నెగెటివ్ రోల్స్ చేసే ఆయనకు తొలిసారి పూర్తి స్థాయి ఎమోషనల్ పాత్ర దక్కింది. ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా వాడుకున్నాడు. ప్లేబాయ్ తరహా పాత్రలో సాయి మెప్పించాడు. అనుగా యశస్వి ఆకట్టుకుంది. అర్జున్ పాత్రలో మెయిన్ మొహమ్మద్ లీనమైపోయి నటించాడు. మిగతా పాత్రలు పర్వాలేదనిపించాయి. -
Black Widow Review: ఓటీటీలో కళ్లు చెదిరే స్పై యాక్షన్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే?
టైటిల్: బ్లాక్ విడోనటీనటులు: స్కార్లెట్ జాన్సన్, ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ తదితరులుదర్శకుడు: కేట్ షార్ట్ల్యాండ్నిర్మాత: కెవిన్ ఫీగేసంగీత దర్శకుడు: లోర్న్ బాల్ఫ్సినిమాటోగ్రఫీ: గాబ్రియెల్ బెరిస్టెన్ఎడిటర్: లీ ఫోల్సమ్ బోయ్డ్, మాథ్యూ ష్మిత్ఓటీటీ: డిస్నీ హాట్‌స్టార్(2021లో థియేటర్లలో రిలీజైంది)కథేంటంటే..బ్లాక్ విడో అదే పేరుతో ఉన్న మార్వెల్ కామిక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించిన సూపర్ హీరో చిత్రం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిచర్స్లో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కేట్ షార్ట్‌ల్యాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్ టైటిల్ పాత్రలో నటించారు. కెప్టెన్ అమెరికా సివిల్ వార్ సంఘటనలతో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ మూవీ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఈ లేడీ-ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఎలా ఉందంటే..ఈ మూవీ అంతా కూడా అంతుకుముందు మనకు అవెంజర్స్ సిరీస్‌లాగా ఉన్న స్టోరీలానే అనిపిస్తుంది. రష్యాకు చెందిన ఓ విలన్(డేవిడ్ హార్బర్) ముఖ్యంగా అనాథ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారిని.. ఒక సైన్యంలా తయారు చేస్తాడు. తాను చెప్పినట్లు నడుచుకునేలా వాళ్ల బ్రెయిన్‌ను మారుస్తాడు. ఆ తర్వాత అమెరికాలోని రహస్యాన్ని తెలుసుకునేందుకు ఒక ఫేక్ కుటుంబాన్ని సృష్టిస్తాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలోని వాళ్లను మొత్తం విడదీస్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలను మళ్లీ తన సైన్యంలోనే చేర్చుకుంటాడు. ఆ తర్వాత అందులో ఉన్న స్కార్లెట్ జాన్సన్(బ్లాక్ విడో) బయటికి వచ్చి అతనితో పోరాటం చేస్తుంది. తన మిత్రులు మరికొందరితో కలిసి అతన్ని అంతం చేసేందుకు యత్నిస్తుంది. మరి అసలు అతని నుంచి అనాథ అమ్మాయిలను కాపాడిందా? ఆ విలన్‌ను అంతం చేసిందా? అనే ఆసక్తికర అంశాలు తెలియాలంటే బ్లాక్ విడో చూడాల్సిందే.ఈ స్పై థ్రిల్లర్ సినిమాలో ఫైట్ సీక్వెన్స్‌లు, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కొన్ని ట్విస్టులు కూడా ఫర్వాలేదనిపించాయి. ఒక్క ట్విస్ట్ మాత్రం సర్ప్రైజింగా ఉంటుంది. అయితే ఈ కథలో స్క్రీన్ ప్లేను అద్భుతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ కేట్ షార్ట్‌ల్యాండ్ విఫలమయ్యాడు. ఆడియన్స్‌కు ఎమోషనల్ కనెక్ట్ అయ్యే సీన్స్ ఎక్కడా కూడా కనిపించవు. విజువల్ పరంగా ఆకట్టుకున్నా.. ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడం పెద్ద మైనస్. దర్శకుడు కేట్ షార్ట్‌ల్యాండ్ కథను ఇంకా బాగా రాసుకుంటేనే బాగుండేది. కేవలం యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ కోసమైతే ఈ బ్లాక్ విడో మూవీని ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..బ్లాక్ విడో పాత్రలో స్కార్లెట్ జాన్సన్ యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించారు. ఆమె తన సూపర్ హీరో హోదాకు న్యాయం చేశారు. ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ తన పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో మెప్పించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ
టైటిల్: కల్కి 2898 ఏడీనటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పఠాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అన్నాబెన్ తదితరులునిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్నిర్మాత: అశ్వనీదత్దర్శకత్వం: నాగ్ అశ్విన్సంగీతం: సంతోష్ నారాయణన్సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావువిడుదల తేది: జూన్ 27, 2024ఈ ఏడాది యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన సినిమాల్లో కల్కి ‘2898 ఏడీ’ ఒకటి. ప్రభాస్ హీరోగా నటించడం.. కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు సినిమాపై ఎంతో హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘కల్కి 2898 ఏడీ’ కథేంటంటే..కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. మొదటి నగరంగా చెపుకునే కాశీలో తాగడానికి నీళ్లు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ప్రకృతి మొత్తం నాశనం అవుతుండటంతో సుప్రీం యాష్కిన్(కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్‌లో ఉంటాయి. ఆ ప్రపంచంలోకి వెళ్లాలంటే కనీసం ఒక మిలియన్ యూనిట్స్(డబ్బులు) ఉండాలి. ఆ యూనిట్స్ కోసం కాశీ ప్రజలు చాలా కష్టపడుతుంటారు. అందులో ఫైటర్ భైరవ(ప్రభాస్) కూడా ఒకడు. ఎప్పటికైనా కాంప్లెక్స్‌లోకి వెళ్లి సుఖపడాలనేది అతడి కోరిక. యూనిట్స్ కోసం ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధపడుతుంటాడు. అతనికి బుజ్జి((ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆలోచించే మెషీన్)తోడుగా ఉంటుంది. మరోవైపు యాష్కిన్ చేస్తున్న అన్యాయాలపై రెబల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. సుప్రీం యాష్కిన్ని అంతం చేసి కాంప్లెక్స్ వనరులను అందరికి అందేలా చేయాలనేది వారి లక్ష్యం. దాని కోసం ‘శంబాల’ అనే రహస్య ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచే పోరాటం చేస్తుంటారు. ‘కాంప్లెక్స్’లో ‘ప్రాజెక్ట్ కే’పేరుతో సుప్రీం యాష్కిన్ ఓ ప్రయోగం చేస్తుంటాడు. గర్భంతో ఉన్న సమ్-80 అలియాస్ సుమతి(దీపికా పదుకొణె) కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని శంబాల వెళ్తుంది.. సుమతిని పట్టుకునేందుకు కాంప్లెక్స్ మనుషులు ప్రయత్నిస్తుంటారు. ఆమెను అప్పగిస్తే కాంప్లెక్స్‌లోకి వెళ్లొచ్చు అనే ఉద్దేశంతో భైరవ కూడా సుమతి కోసం వెళ్తాడు.వీరిద్దరి బారి నుంచి సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ(అమితాబ్ బచ్చన్) ప్రయత్నిస్తాడు. అసలు అశ్వత్థామ ఎవరు? వేల సంవత్సరాలు అయినా అతను మరణించకుండా ఉండడానికి గల కారణం ఏంటి? సుమతిని ఎందుకు కాపాడుతున్నాడు? ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరు? సుప్రీం యాష్కి చేపట్టిన ‘ప్రాజెక్ట్ కే’ ప్రయోగం ఏంటి? కాంప్లెక్స్‌లోకి వెళ్లాలనుకున్న భైరవ కోరిక నెరవేరిందా? అసలు భైరవ నేపథ్యం ఏంటి? అశ్వత్థామతో పోరాడే శక్తి అతనికి ఎలా వచ్చింది? భైరవ, అశ్వత్థామ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..వెండితెరపై ప్రయోగాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కొద్ది మంది దర్శకులు మాత్రమే వైవిధ్యభరిత కథలను తెరకెక్కిస్తుంటారు. అది విజయం సాధించిందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఆ ప్రయోగం మాత్రం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ‘కల్కి 2898’తో అలాంటి ప్రయోగమే చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా అద్భుతమనే చెప్పాలి. కాంప్లెక్స్, శంబాల ప్రపంచాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. అయితే కథ పరంగా చూస్తే మాత్రం ఇందులో పెద్దగా ఏమీ ఉండడు. అసలు కథంతా పార్ట్ 2లో ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు. వాస్తవానికి నాగ్ అశ్విన్ రాసుకున్న కథ చాలా పెద్దది. అనేక పాత్రలు ఉంటాయి. ఒక్క పార్ట్‌లో ఇది పూర్తి చేయడం సాధ్యం కాని పని. అది నాగికి కూడా తెలుసు. అందుకే పార్ట్ 1ని ఎక్కువగా పాత్రల పరిచయాలకే ఉపయోగించాడు. కురుక్షేత్ర సంగ్రామంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఆరువేల సంవత్సరాల తర్వాత కాలంలోకి వెళ్తుంది. కాశీ, కాంప్లెక్స్, శంబాల ప్రపంచాల పరిచయం తర్వాత ప్రేక్షకుడు కథలో లీనం అవుతాడు. భారీ యాక్షన్ సీన్‌తో ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. బుజ్జి, భైరవల కామెడీ సంభాషణలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్‌లో ఎక్కువగా పాత్రల పరిచయమే జరుగుతుంది. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం కాస్త ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ఇంటెర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో కథనంలో వేగం పుంజుకుంటుంది. ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే యాక్షన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మధ్య మధ్యలో అమితాబ్ పాత్రతో మహాభారతం కథను చెప్పించడం.. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించడంతో ప్రేక్షకుడికి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు పార్ట్ 2పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. దీంతో ప్రభాస్ కూడా తెరపై తక్కువ సమయమే కనిపిస్తాడు. భైరవగా ఆయన చేసే యాక్షన్, కామెడీ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ మరో పాత్ర కూడా పోషించాడు అదేంటనేది వెండితెరపైనే చూడాలి. ప్రభాస్ తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర అమితాబ్‌ది. అశ్వత్థామ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ వయసులోనూ యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ప్రభాస్-అమితాబ్ మధ్య వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్. సుప్రీం యాష్కిన్‌గా కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్‌లో కనిపించాడు. అయితే ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే. పార్ట్ 2లో ఆయన రోల్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీ సుమతిగా దీపికా పదుకొణె తనదైన నటనతో ఆకట్టుకుంది. శంబాల ప్రంచానికి చెందిన రెబల్ ఖైరాగా అన్నాబెన్, రూమిగా రాజేంద్ర ప్రసాద్, వీరణ్గా పశుపతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌వర్క్ చాలా బాగుంది. నాగ్ అశ్విన్ ఊహా ప్రపంచానికి టెక్నికల్ టీమ్ ప్రాణం పోసింది. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. పాటలు అయితే తెరపై మరీ దారుణంగా అనిపించాయి. నేపథ్య సంగీతం కూడా యావరేజ్‌గానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సుత్తి లేకుండా సాగే థ్రిల్లర్ సినిమా.. లూ మూవీ రివ్యూ
థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడని సినీప్రేక్షకులు ఉండరు. అలాంటివారి కోసం ఏ యేటికాయేడు కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అందులో చాలా చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కొన్ని మాత్రమే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబడతాయి. మరికొన్ని మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా అవార్డులు అందుకుంటాయి. అలాంటి చిత్రమే లూ. 2022లో వచ్చిన ఈ సినిమా గతేడాది రీఫ్రేమ్ స్టాంప్ అవార్డు అందుకుంది. మరి లూ మూవీ ఎలా ఉందో చూసేద్దాం..లూ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంది. ఓ రోజు తన బ్యాంక్‌లో నుంచి పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చేసుకుని ఇంటికి వస్తుంది. అలాగే పెంపుడు కుక్కకు కొన్ని వారాలపాటు అవసరమయ్యే మాంసాన్ని ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంది. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను, పేపర్లను మంటల్లో తగలబెట్టి కుర్చీలో కూలబడుతుంది. పెద్ద తుపాకీ అందుకుని చనిపోవడానికి సిద్ధమవుతుంది. సరిగ్గా ట్రిగర్ నొక్కే సమయంలో హన్నా అనే మహిళ తన ఇంట్లోకి పరుగు పరుగున వస్తుంది. తన కూతురు వీ తప్పిపోయిందని చెప్తుంది. ఆ చిన్నారిని క్షేమంగా తీసుకొస్తానని మాటిచ్చిన లూ ఆత్మహత్య ఆలోచన విరమించుకుంటుంది. మరి లూ మాట మీద నిలబడిందా? చిన్నారిని కిడ్నాప్ చేసిందెవరు? తనను కాపాడిందా? లేదా? అసలు ఆమె ప్రాణాలు తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!లూ మహిళ విచిత్రంగా ప్రవర్తించినప్పుడే తన వెనుక ఏదో ఫ్లాష్‌బ్యాక్ ఉందని అర్థమైపోతుంది. భీకరమైన వర్షం రాబోతోంది.. అప్రమత్తంగా ఉండండి అన్న ప్రకటనతో ఏదో ఘోరం జరగబోతుందని ముందుగానే హింటిచ్చాడు డైరెక్టర్ అన్నా ఫోరెస్టర్. పొరుగింట్లో ఉండే చిన్నారి వీని కనీసం ఒక్కసారైనా పలకరించని లూ.. ఆమె కోసం ప్రాణాలకు తెగించి పోరాడటం, ప్రయత్నించడం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.లూగా అలిసన్ జానీ నటన అద్భుతంగా ఉంది. హన్నాగా జుర్నీ స్మోలెట్, వీగా రైడ్లీ ఆషా నటన పర్వాలేదు. ప్రీక్లైమాక్స్ బాగుంది. కథను మలుపు తిప్పే ట్విస్టు బాగుంటుంది. కానీ కొన్ని సన్నివేశాలను జీర్ణించుకోవడం కష్టంగా అనిపిస్తుంది. డైరెక్టర్ కథకు ఇంకాస్త మెరుగులు దిద్ది ఉంటే లూ అద్భుతాలు సృష్టించేదనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారైతే పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూసేయొచ్చు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అందుబాటులో ఉంది. -
బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?
యావత్ సీనీ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘కల్కి 2989 ఏడీ’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ మూవీ ప్రచారాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ వినూత్నంగా ప్లాన్ చేశాడు. ప్రధాన పాత్రలు..వాటి నేపథ్యాన్ని ముందే ప్రేక్షకులను తెలిసేలా చేస్తున్నాడు. ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న ‘బుజ్జి’(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆలోచించే మెషీన్) పరిచయం కోసం ఓ ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేయడమే కాకుండా.. బుజ్జిని దేశంలోని ప్రధాన నగరాలలో తిప్పుతూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడు. అంతేకాదు బుజ్జి, భైరవ(ప్రభాస్) ఎలా కలిశారనేది తెలియజేయడానికి ఓ యానిమేటెడ్ సిరీస్‌ని కూడా రూపొందించారు. ‘బుజ్జి అండ్ భైరవ’ పేరుతో తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్..ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 31 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ యానిమేటెడ్ సీరిస్ ఎలా ఉందో చూద్దాం.‘బుజ్జి అండ్ భైరవ’కథేంటంటే..కల్కి సినిమాలోని ప్రధాన పాత్రలైన ‘బుజ్జి’, ‘భైరవ’లను పరిచయం చేస్తూ ఈ సిరిస్ సాగుతుంది. BU- JZ- 1 అనే కోడ్ నేమ్‌తో ఉన్న ఏఐ మిషన్(కీర్తి సురేశ్) చాలా ఏళ్లుగా కార్గో వెహికల్లో పని చేస్తుంటుంది. సరైన గైడెన్స్ ఇస్తూ 99 మిషన్స్ విజయవంతంగా పూర్తి చేస్తుంది. అయితే చివరగా 100వసారి కార్గో డెలివరీ చేసేందుకు వెళ్తుండగా.. ఓ దాడి జరుగుతుంది. రెబల్స్ అటాక్‌లో బుజ్జి ఉన్న వెహికల్ ధ్వంసం అవుతుంది. దీంతో బుజ్జికి కాంప్లెక్స్ సిటీతో ఉన్న కనెక్షన్ కట్ అయిపోయి స్క్రాప్‌లోకి వెళ్లిపోతుంది. మరోపక్క భైరవ(ప్రభాస్) కాశీ పట్టణంలో సరదాగా తిరుగుతూ దొంగలను, దోపిడీదారులను పట్టుకొని యూనిట్స్(2898సంవత్సరంలో డబ్బు) సంపాదిస్తుంటాడు. ఎప్పకైనా కాంప్లెక్స్‌కు షిప్ట్ కావాలనేది అతని కోరిక. కానీ భైరవ ఏ పని చేసినా..నష్టాలే తప్ప లాభాలు రావు. అద్దె కూడా సరిగా చెల్లించకపోవడంతో యజమాని(బ్రహ్మానందం) ఇంటిని ఖాలీ చేయమని పోరు పెడుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో భైరవ చేతికి బుజ్జి దొరుకుతుంది. బుజ్జి ఇచ్చే సలహాలతో ఓ స్పెషల్ కారును తయారు చేస్తాడు? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ స్పెషల్ కారుని బుజ్జి ఎందుకు రెడీ చేయించింది? కాంప్లెక్స్‌కి వెళ్లాలనే భైరక కోరిక నెరవేరిందా లేదా? భైరవను బుజ్జి ఎందుకు మోసం చేయాలనుకుంది? అనేది తెలియాలంటే అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో పూర్తి సిరీస్ చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ‘కల్కి’లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ ప్రేక్షకులకు అంత ఈజీగా అర్థం కావు. ఇందులోని పాత్రలు..వాటి నేపథ్యం గురించి ముందే కొంచెం తెలిసి ఉంటే..సినిమా చూసినప్పుడు వాటితో కనెక్ట్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటాం. అందుకే ఇలాంటి లార్జర్ దేన్ లైఫ్ సినిమాల్లోని పాత్రలను, స్టోరీని ముందే చెబుతూ టీజర్, ట్రైలర్లను కట్ చేస్తుంటారు మేకర్స్. సినిమా ప్రమోషన్స్‌లో కూడా ప్రధాన పాత్రల ప్రవర్తన ఎలా ఉండబోతుందో చెప్పేస్తుంటారు. ‘బాహుబలి’సమయంలో రాజమౌళి ఇలానే చేశాడు. సినిమా కథ, అందులోని పాత్రలను ప్రేక్షకులను ముందే చేరువయ్యేలా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపట్టి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. ‘కల్కి’ సినిమా స్టోరీ ఏంటి? బుజ్జి, భైరవ పాత్రల స్వభావం ఏంటి? అనేది ముందే చెప్పేస్తున్నాడు. ప్రధాన పాత్రలపై ఎలాంటి సందేహాలు రాకుండా ముందే ఓ సిరీస్‌ని వదిలి మంచి పని చేశాడు. యానిమేటెడ్ రూపంలో తీసుకొచ్చిన ఈ సిరీల్లో బుజ్జి, భైరవ పాత్రలు..వాటి స్వభావం ఎలా ఉంటుందనేది వినోదాత్మకంగా చూపించారు. అంతేకాదు కల్కి ప్రపంచం ఎలా ఉండబోతుందనేది కొన్ని సీన్లలో చూపించారు. 2898 సంవత్సరంలో డబ్బుని యూనిట్స్ అంటారని చెబుతూనే.. ఆ కాలంలో నిర్మాణాలు ఎలా ఉండబోతున్నాయనేది చూపించారు. ప్రభాస్ పాత్రకు యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోడించడం బాగుంది. మధ్య మధ్యలో బ్రహ్మానందం చేసే కామెడీ డైలాగ్స్ నవ్వులు పూయిస్తుంది. మొదటి ఎపిసోడ్లో బుజ్జి, భైరవ పాత్రలను పరిచయం..వాటి నేపథ్యాన్ని చూపించి..రెండో ఎపిసోడ్లో వారిద్దరు కలిసి ఏం చేశారనేది చూపించారు. తన సినిమా కాన్సెప్ట్ ఏంటనేది ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఇందులో కల్కి చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌ల గురించి ప్రస్తావననే లేదు. వారిద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయనేది ఇందులో చూపించలేదు. కానీ ఓ సీన్లో భారీ విగ్రహాన్ని చూపించారు. అది కమల్ హాసన్‌ని పోలి ఉంది. ఆ విగ్రహం స్టోరీ ఏంటనేది ప్రమోషన్స్‌లో చెబుతారో లేదా డైరెక్ట్‌గా సినిమా చూసే తెలుసుకోమంటారో చూడాలి. టెక్నికల్ పరంగా కూడా ఈ సిరీస్ చాలా బాగుంది. సినిమాటోగ్రపీ, బీజీఎం అదిరిపోయింది. మొత్తానికి 28 నిమిషాల నిడివి ఉన్న ఈ యానిమేటెడ్ సిరీస్ ‘కల్కి 2898’ ప్రపంచం ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది. -
'దర్శిని' సినిమా రివ్యూ
వికాస్, శాంతిప్రియ జంటగా నటించిన సినిమా 'దర్శిని'. డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహించగా, ఎల్వీ సూర్యం నిర్మాత వ్యవహరించారు. సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సంతోష్(వికాస్), ప్రియ(శాంతిప్రియ), లివింగ్ స్టోన్(సత్య) ఫ్రెండ్స్. ముగ్గురూ కలిసి ఔటింగ్ కోసం సైంటిస్ట్ డాక్టర్ దర్శిని ఫామ్ హౌస్‌కి వెళ్తారు. అనుకోకుండా ఓ గదిలో సెన్సార్ ఉన్న పెన్ దొరుకుతుంది. దాని బటన్ ప్రెస్ చేయగానే స్క్రీన్‌పై భవిష్యత్ చూపిస్తుంది. మరోవైపు అదే ఫామ్ హౌస్‌లో దర్శిని శవంలా కనిపిస్తుంది. ఇకపోతే ఓ పోలీస్ తన చెల్లి కనపడట్లేదని ఇక్కడికి వస్తాడు. ముగ్గురు ఫ్రెండ్స్‌కి ఎవరో ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు. అసలు దర్శిని ఎలా చనిపోయింది? ముగ్గుర్ని బెదిరించేది ఎవరు? ఆ భవిష్యత్తు మిషిన్ కథేంటి? అనేదే సినిమా స్టోరీ.(ఇదీ చదవండి: స్థల వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్)ఎలా ఉందంటే?టైమ్ ట్రావెల్ కథలు.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ఇంట్రెస్ట్ కలిగిస్తుంటాయి. అలా భవిష్యత్ చూపించే మెషీన్ అనే కాన్సెప్ట్‌తో స్టోరీ బాగానే అనుకున్నారు. కానీ కథనం మాత్రం కాస్త సాగదీశారు. సైన్స్ ఫిక్షన్ కథతో పాటు ఇందులో ప్రేమకథ కూడా ఉంటుంది. ఇంటర్వెల్‌కి ముగ్గురు ఫ్రెండ్స్‌ని ఎవరో చంపబోతున్నట్టు ట్విస్ట్ ఇచ్చి, సెకండాఫ్‌పై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇక ఇంటర్వెల్ తర్వాత ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ వెళ్తారు. అయితే తక్కువ పాత్రలతో దాదాపు ఒకే ఇంట్లో సినిమా అంతా తీశారు. కొన్ని సన్నివేశాల్లో భయపెట్టారు!ఎవరెలా చేశారు?'దర్శిని'లో చేసిన వాళ్లందరూ కొత్తవాళ్లే. ప్రధాన పాత్రల్లో చేసిన వికాస్, శాంతి ప్రియ పర్వాలేదనిపించారు. లివింగ్ స్టోన్ పాత్ర చేసిన సత్య నవ్వించగా, మిగిలిన వాళ్లు ఫరిది మేరకు యాక్ట్ చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. పాటలు ఓకే. దర్శకత్వం కూడా చాలా మెరుగుపరుచుకోవాల్సింది. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా) -
వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
టైటిల్: ది కంజూరింగ్: ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్నటీనటులు: వేరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్, సారా కేథరిన్ హుక్, జులియన్ హిలార్డ్, జాన్ నోబుల్, ఎజిన్ బొండురెంట్, రూయ్ ఓకోన్నూర్ తదితరులుదర్శకత్వం: మేఖేల్ చావ్స్నిర్మాణ సంస్థ: వార్నర్ బ్రదర్స్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్హారర్ సినిమాలు అంటేనే క్రియేటివీటికి మారుపేరు. లేనిది ఉన్నట్లుగా ప్రేక్షకులను భయపెట్టేలా ఉంటాయి. కానీ ది కంజూరింగ్ మాత్రం అలాంటి హారర్ మూవీ కాదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చిన చిత్రం. అమెరికాలో జరిగిన ఓ హత్య ఆధారంగా రూపొందించారు. అసలు ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు? దెయ్యమా? లేక మనుషులేనా? అన్నది తెలియాలంటే ది కంజూరింగ్ చూసేయాల్సిందే.హాలీవుడ్లో హారర్ సినిమాలకు కొదువే లేదు. గతంలో వచ్చిన అన్నా బెల్లె, ది నన్ వెన్నులో వణుకు పుట్టించే చిత్రాలే. మైఖేల్ చావ్స్ తెరకెక్కించిన ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ కూడా అంతకుమించి ఉందనడంలో సందేహం లేదు. ఈ 21వ శతాబ్దంలో అత్యంత భయపెట్టే చిత్రాల్లో ది కంజూరింగ్ ఒకటని చెప్పొచ్చు. ఈ మూవీ చూశాక దెయ్యాలు కూడా చేతబడులు చేస్తాయా? అనే అనుమానం కచ్చితంగా వస్తుంది. అసలు దెయ్యం ఏంటి? చేతబడులు చేయడమేంటి? అనే డౌటానుమానం మొదలైందా? అయితే ఈ సినిమా చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది. ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ 1981 ప్రాంతంలో జరిగిన కథ. ఇందులో డేవిడ్ గ్లాట్జెల్, డెబ్బీ, ఆర్నె, లోరాయిన్, ఈడ్, క్యాస్టనర్, జూడీ వారెన్ పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. మసాచుసెట్స్‌లోని ఓ ఫ్యామిలీలోని చిన్న పిల్లాడు(డేవిడ్ గ్లాట్జెల్)కి పట్టిన దెయ్యాన్ని విడిపించేందుకు భూతవైద్యుని వద్దకు వెళ్తారు. అదే క్రమంలో ఆ పిల్లాడిని విడిచిపెట్టిన ఆ దెయ్యం.. ఆర్నె అనే యువకుడి శరీరంలోకి వెళ్తుంది. ఆ తర్వాత దెయ్యం ఆవహించిన ఆర్నె తన యాజమానిని హత్య చేస్తాడు. దీంతో పోలీసులు ఆర్నెను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఇలాంటి కేసు అమెరికాలోనే మొదటిదని న్యాయమూర్తి సైతం ఆశ్చర్యపోతారు. అదే క్రమంలో జైల్లో ఉన్న ఆర్నెను దెయ్యం తన అధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తూనే ఉంటుంది. అయితే ఆ దెయ్యాన్ని నిలువరించేందుకు.. ఆర్నెను రక్షించేందుకు లోరాయిన్, ఈడ్ ప్రయత్నిస్తారు. కానీ ఆ క్రమంలోనే వారికి అసలు నిజం తెలుస్తుంది? అసలు లోరాయిన్, ఈడ్ ఎవరిని కలిశారు? వారికి తెలిసిన నిజమేంటి? ఆర్నెను వేధిస్తున్న దెయ్యం ఒకరా? ఇద్దరా? లేక ఆత్మనా అనే సస్పెన్ష్ చివరి వరకు ఆడియన్స్‌కు అర్థం కాదు.డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టపడేవారు ది కంజూరింగ్ ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ చిత్రంలో దెయ్యం మనిషిని ఆవహించే సన్నివేశాలు మాత్రం ఒళ్లు గగుర్పొడ్చేలా ఉంటాయి. ప్రతి సీన్ నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తాయి. దెయ్యం ఆర్నెను తన అధీనంలోకి తెచ్చుకునే క్రమంలో వచ్చే దృశ్యాలు ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో క్లైమాక్స్ సీన్స్‌ను డైరెక్టర్ మరింత రియలిస్టిక్‌గా చూపించారు. అంతే కాకుండా చివర్లో ఓ బిగ్ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనేది ది కంజూరింగ్ ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ చూడాల్సిందే. 2021లో వచ్చిన ఈ థ్రిలర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని చిన్నపిల్లల సమక్షంలో చూడవద్దని మనవి. -
సుహాస్ ప్రసన్న వదనం.. మరో హిట్ పడినట్టేనా?
టైటిల్: ప్రసన్న వదనంనటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుడైరెక్టర్: అర్జున్ వైకేనిర్మాతలు: మణికంఠ జేఎస్, ప్రసాద్‌రెడ్డి టీఆర్‌సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్‌ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్విడుదల తేదీ: 03-05-2024టాలీవుడ్లో యంగ్ హీరో సుహాస్ ప్రత్యేక శైలితో దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ డ్రామా, కలర్ ఫోటో, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తాజాగా మరోసారి ప్రసన్న వదనం అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. సుకుమార్ వద్ద పని చేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫేస్ అండ్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి సరికొత్త కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యిందా? కొత్త దర్శకుడితో సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? చూసేద్దాం పదండి. అసలు కథేంటంటే...ఓ ప్రమాదంలో తల్లితండ్రులను కోల్పోతాడు సూర్య(సుహాస్). అసలే కష్టాల్లో ఉన్న అతనికి మరో వింత డిజార్డర్ కూడా వస్తుంది. తలకి బలంగా గాయం కావడంతో ఫేస్ బ్లైండ్నెస్ డిజార్డర్ వస్తుంది. అంటే అతను ఎవరినీ గుర్తించలేడు. ఓ ఎఫ్ఎం స్టేషన్లో ఆర్జేగా పని చేస్తున్న సూర్య ఓ అర్ధరాత్రి దారుణమైన ఘటనను ప్రత్యక్షంగా చూస్తాడు. అమృత(సాయి శ్వేత)అనే అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేస్తారు. అయితే ఈ ఘటనని ప్రత్యక్షంగా చూసిన సూర్య.. తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉండటం వల్ల ఆ వ్యక్తి ఎవరనేది గుర్తుపట్టలేడు. మరుసటి రోజే అది యాక్సిడెంట్ అని వార్తల్లో వస్తుంది. ఇది చూసిన సూర్య బాధితురాలికి న్యాయం చేయాలని భావించి పోలీసులకు ఫోన్ చేసి అసలు సంగతి చెబుతాడు. ఈ కేసుని ఏసీపీ వైదేహి(రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అసలు పోలీసులు నిందితున్ని పట్టుకున్నారా? దర్యాప్తులో ఎలాంటి నిజాలు రాబట్టారు? ఫేస్ బ్లైండ్‌నెస్‌తో సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు ? అసలు అమృతని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ? అనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.ఎలా సాగిందంటే.. ఇలాంటి ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటివరకూ సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్‌ను తీసుకున్న డైరెక్టర్ అర్జున్ ఆ పాయింట్‌ను అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. సూర్య తల్లితండ్రులు ప్రమాదంలో చనిపోవడం.. సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రావడం.. ఆ తర్వాత అతను పడే ఇబ్బందులు, అధ్య(పాయల్ రాధకృష్ణ) రూపంలో ఓ క్యూట్ లవ్ స్టొరీతో కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లాడు. కథలోకి క్రైమ్ ఎలిమెంట్ వచ్చిన తరవాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నిజంగానే బ్లైండ్నెస్ వచ్చేలా చేస్తుంది. అంటే అంతలా సస్పెన్ష్ ఉంటుందన్నమాట.సెకండాఫ్‌కు వచ్చేసరికి కథను మరింత గ్రిప్పింగ్‌గా నడిపించారు డైరెక్టర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు. కథను అంత పకడ్బందీగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ ఈ సినిమాకి మరో హైలెట్‌గా నిలిచింది. అప్పటివరకూ కాస్తా స్లో నేరేషన్ అనిపించినప్పటికీ ఈ కథకు ఇచ్చిన ముగింపు మాత్రం అదిరిపోయింది.ఎవరెలా చేశారంటే...సూర్య పాత్రలో సుహాస్ సహజంగా ఒదిగిపోయాడు .తనదైన నటనలో ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. పాయల్ తన అందంతో పాత్రలో ఒదిగిపోయింది. రాశి సింగ్, నితిన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. హర్ష, సత్య కామెడీతో అదరగొట్టేశారు. ఓవరాల్‌గా నందుతో పాటు మిగిలిన నటీనటులు తమపాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్‌లో తన కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా తొలి సినిమాతోనే దర్శకుడు అర్జున్ తన మార్క్ చూపించారు. -
Tenant Movie Review: ‘టెనెంట్' మూవీ రివ్యూ
టైటిల్: టెనెంట్ నటీనటులు: సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నొరోన్హ, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తదితరులు దర్శకత్వం: వై. యుగంధర్ నిర్మాత: మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాణ సంస్థ: మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ సినిమాటోగ్రఫీ: జెమిన్ జోం అయ్యనీత్ ఎడిటర్: విజయ్ ముక్తవరపు సంగీతం: సాహిత్య సాగర్ విడుదల తేదీ: 19-04-2024 అసలు కథేంటంటే.. సత్యం రాజేశ్(గౌతమ్), మేఘా చౌదరి(సంధ్య) పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంటారు. అన్యోన్య దాంపత్యం అంటే ఎలా ఉంటుందో వారి మధ్య ప్రేమానురాగాలు అలా ఉంటాయి. ఓ ఖరీదైన ఫ్లాట్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. త్వరలోనే అమెరికా వెళ్లాలనుకున్న ఆ దంపతుల మధ్య బంధం, ప్రేమ ఒక్కసారిగా దూరమవుతుంది. కానీ అన్నింటిని మౌనంగానే భరిస్తూ వస్తాడు గౌతమ్. సంధ్య ఎందుకిలా ప్రవర్తిస్తుందో.. ఆమె ప్రవర్తన వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎవరూ ఊహించని విధంగా ఆమె బెడ్‌పైనే విగతజీవిలా పడి ఉంటుంది. అదే సమయంలో వారి అపార్ట్మెంట్లోనే ఓ యువకుడు పైనుంచి కిందకు దూకేస్తాడు. అసలు సంధ్యను ఎవరు చంపారు? ఆమెది హత్యా? లేక ఆత్మహత్యా?. గౌతమే ఆమెను చంపేశాడా? లేదా ఆమె మరణం వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అసలు అపార్ట్మెంట్ నుంచి కిందకు దూకిన యువకుడు ఎవరు? అసలు పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన నిజాలేంటి? అనే విషయాలు తెలియాలంటే టెనెంట్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ తర్వాత డైరెక్టర్ వై యుగంధర్ తెరకెక్కించిన చిత్రమిది. సమాజంలో నిజజీవితంలో సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే టెనెంట్. టెనెంట్.. ఈ టైటిల్ చూడగానే చాలామందికి గుర్తొచ్చేది అద్దెకు ఉంటున్న వాళ్లు అని. టైటిల్‌తోనే మీకు కథ ఏంటనేది ఓ ఐడియా వచ్చేస్తుంది. ఆ కాన్సెప్ట్‌తోనే ఈ సినిమాను తీశారు. క్లైమాక్స్ సీన్‌తో కథను ప్రారంభించిన యుగంధర్.. ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్‌లో గౌతమ్, సంధ్యకు పెళ్లి కావడం, వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో కథను నడిపించారు. వారి ఫ్లాట్ పక్కన ఉండే టెనెంట్స్తో సన్నివేశాలు కాస్తా నవ్వులు తెప్పించినా.. సీరియస్‌నెస్ ఎక్కడా మిస్సవ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఒకవైపు పోలీసుల దర్యాప్తు.. మరోవైపు భార్య, భర్తల మధ్య వచ్చే సీన్లతో మెల్లగా ఆడియన్స్‌ను కథలోకి తీసుకెళ్లాడు. కానీ పెద్దగా సస్పెన్ష్, ట్విస్టుల్లాంటి లేకపోవడంతో కథ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఎలాంటి హడావుడి లేకుండానే ఇంటర్వెల్ బ్యాంగ్ పడిపోతుంది. సెకండాఫ్‌లో కథలో వేగం పెరుగుతుంది. పక్క ఫ్లాట్‌లో ఉండేవారితో గౌతమ్ భార్య సంధ్యకు పరిచయం కావడం, వారితో కలిసిపోవడం చకాచకా జరిగిపోతుంది. గౌతమ్, సంధ్యకు ఫ్లాట్ పక్కన ఉండే రిషి(భరత్ కాంత్) తనకు కాబోయే అమ్మాయి శ్రావణిని(చందన) పరిచయం చేస్తాడు. అక్కడి నుంచే కథ మలుపులు తిరుగుతుంది. రిషి ఫ్రెండ్స్ అతని ఫ్లాట్‌కు రావడం.. గౌతమ్‌ను రిషి సాయం కోరడం.. ఆ తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతాయి. అదే సమయంలో రిషి ఫ్రెండ్స్ చేసిన పనికి అతని జీవితం ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. అతని ఫ్రెండ్స్ చేసిన పనేంటి? చివరికీ రిషికి గౌతమ్ సాయం చేశాడా? ఆ తర్వాత రిషి, శ్రావణి ఏమయ్యారు? సంధ్య ఎలా మరణించింది? పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్ చివరికీ నిజం చెప్పాడా? అనే సస్పెన్ష్తో ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేలా చేశారు. క్లైమాక్స్ సీన్ వరకు సంధ్య ఎలా చనిపోయిందన్న విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్ష్ కొనసాగించాడు డైరెక్టర్. చివర్లో వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఓవరాల్‌గా ఆడియన్స్‌కు ఓ మంచి సందేశం ఇస్తూ ముగింపు పలికాడు. ఎవరెలా చేశారంటే.. పొలిమేర-2 తర్వాత సత్యం రాజేశ్ నటించిన చిత్రం టెనెంట్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై అంచనాలు కూడా పెరిగాయి. సత్యం రాజేశ్ మరోసారి తనదైన మార్క్ చూపించారు. ఇలాంటి మిస్టరీ కథల్లో హావాభావాలతో మెప్పించడంలో సత్యం రాజేశ్ ఒదిగిపోయారు. హీరోయిన్గా మేఘా చౌదరి ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి మూవీ తర్వాత నటించిన చిత్రమిది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన నటనతో మెప్పించింది. ఇన్స్పెక్టర్ ఎస్తేర్ నోరోన్హా ఈ సినిమాలో హైలెట్. తన గ్లామర్‌తో పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ చూపించింది. చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తమ పాత్రల ఫరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే సాహిత్య సాగర్ నేపథ్యం సంగీతం, బీజీఎం బాగుంది. జెమిన్ జోం అయ్యనీత్ సినిమాటోగ్రఫీ, విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ ఫరవాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
Love Guru Review: విజయ్ ఆంటోనీ 'లవ్ గురు'.. ఎలా ఉందంటే?
వైవిధ్య పాత్రలను పోషిస్తూ అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో నటించిన చిత్రం ‘లవ్ గురు’. ఆయన నటించిన తొలి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లవ్ గురు’ కథేంటంటే.. ఆర్థిక సమస్యల కారణంగా మలేసియా వెళ్లిన అరవింద్(విజయ్ ఆంటోని) కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. అప్పటికే ఆయనకు 35 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. డబ్బు సంపాదనలో పడి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. ఇప్పటికైనా ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పాలని సొంతూరు సింహాచలం వెళ్తాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా ఓసారి చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల(మృణాళిని రవి) చూసి, తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అరవింద్ తల్లిదండ్రులు.. లీల తండ్రితో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తారు. లీలకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. హీరోయిన్ కావాలనేది ఆమె డ్రీమ్. కానీ ఆమె తండ్రికి కూతురు నటిగా మారడం ఇష్టం ఉండదు. బలవంతంగా అరవింద్‌తో పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లైన మరుసటి రోజు అరవింద్‌కు ఈ విషయం తెలుస్తుంది. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత అరవింద్‌ను దూరం పెడుతుంది లీల. విడాకులు తీసుకుందామని చెబుతుంది. లీల డ్రీమ్ గురించి తెలిసిన తర్వాత ఆమెపై మరింత ప్రేమను పెంచుకుంటాడు అరవింద్. ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? భార్య ప్రేమను పొందడానికి అరవింద్ ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న గతమేంటి? లీలా జీవితంలోకి వచ్చిన విక్రమ్ ఎవరు? జనని ఎవరు? ఆమెకు అరవింద్‌కు ఉన్న సంబంధం ఏంటి? నిప్పు అంటే అరవింద్‌కు ఎందుకు భయం? హీరోయిన్ కావాలనే లీల కల నెరవేరిందా లేదా? చివరకు వీరిద్దరు విడిపోయారా? లేదా దగ్గరయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విజయ్ ఆంటోని సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఓ మంచి సందేశం ఉంటుంది. ‘లవ్ గురు’ కూడా అదే తరహా కథ. ఓ మహిళ కలకు పెళ్లి అడ్డం కాకూడదని, మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే అసలైన ప్రేమ అనే ఓ సందేశాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది ఇందులో కొత్తదనమేమి ఉండడు. హీరోతో పెళ్లి హీరోయిన్‌కి ఇష్టం ఉండడు. పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకుంటారు. ఆమె ప్రేమను పొందడానికి హీరో రకరకాల ప్రయత్నం చేస్తాడు. చివరకు ఒక్కటవుతారు.. ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. కానీ వినోదాత్మకంగా కథనాన్ని సాగించడం లవ్‌గురు ప్రత్యేకత. కేలవం భార్యభర్తల రిలేషన్‌ని మాత్రమే కాకుండా సిస్టర్ సెంటిమెంట్‌ని కూడా జోడించడం ఈ సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. హీరోహీరోయిన్ల పాత్రలతో చాలా మంది కనెక్ట్ అవుతారు. జీవిత భాగస్వామిని ఎలా ప్రేమించాలి అనేది ఈ సినిమాలో చూపించారు. అరవింద్‌ని ఓ పీడకల వెంటాడే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. మలేసియా నుంచి ఇండియాకు తిరిగి రావడం.. చావు ఇంటిలో లీలను చూసి ఇష్టపడడం.. పెళ్లి చేసుకొని హైదరాబాద్‌కు మకాం మార్చడం వరకు కథనం సింపుల్‌గా సాగుతుంది. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత లీల స్నేహితులు చేసే హంగామ నవ్వులు పూయిస్తాయి. అలాగే విజయ్ ఆంటోనికి.. వీటీవీ గణేష్ మధ్య జరిగే సంభాషణ కూడా వినోదాన్ని పంచతుంది. యోగిబాబు ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. భార్య ప్రేమను గెలుచుకోవడం కోసం హీరో చేసే పని షారుక్ ‘రబ్ నే బనా ది జోడి’ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా అంటూ లీల ప్రెండ్స్ చేసే హంగామా బోర్ కొట్టిస్తుంది. అరవింద్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. అరవింద్‌గా విజయ్ ఆంటోనీ తన పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన హావాభావాలతో మెప్పించారు. లీల పాత్రలో మృణాళిని రవి మెప్పించింది. తన అందంతో తెరపై ఆకట్టుకుంది. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
'వీ లవ్ బ్యాడ్ బాయ్స్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: వీ లవ్ బ్యాడ్ బాయ్స్ నటీనటులు: బిగ్ బాస్ అజయ్ కతుర్వార్, వంశీ ఏకసిరి, ఆదిత్య శశాంక్, రొమికా శర్మ, రోషిణి సహోత, ప్రగ్యా నయన్ తదితరులు నిర్మాణసంస్థ: బీఎం క్రియేషన్స్ నిర్మాత: పప్పుల కనకదుర్గా రావు దర్శకత్వం: రాజు రాజేంద్ర ప్రసాద్ మంచి ఎమోషన్స్‌తో అవుట్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన చిత్రం 'వీ లవ్ బ్యాడ్ బాయ్స్'. ఈ చిత్రం నేటి యువత, ప్రేమకు అద్దం పట్టేలా ఉంటుంది. ఈ సినిమాను ఎమోషనల్‌గా మలిచినా కూడా మన మూలాల్ని చూపించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రులు, యువత తప్పకుండా చూడదగ్గ చిత్రంగా థియేటర్లోకి వచ్చింది. బిగ్ బాస్ అజయ్ కతుర్వార్, వంశీ ఏకసిరి, ఆదిత్య శశాంక్, రొమికా శర్మ, రోషిణి సహోత, ప్రగ్యా నయన్ ముఖ్య పాత్రల్లో నటించారు. పోసానీ కృష్ణ మురళీ, కాశీ విశ్వనాథ్, అలీ, సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, శివా రెడ్డి వంటి వారు ఇతర కీ రోల్స్ పోషించారు. బీఎం క్రియేషన్స్ బ్యానర్ మీద పప్పుల కనకదుర్గా రావు నిర్మించిన ఈ చిత్రానికి రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మార్చి 8న థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. అసలు కథేంటంటే.. ప్రశాంత్ (అజయ్ కతుర్వార్), వినయ్ (వంశీ యాకసిరి), అరుణ్ (ఆదిత్య శశాంక్) రూమ్మేట్స్ పైగా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ముగ్గురూ నిజమైన, స్వచ్చమైన ప్రేమ కోసం ఎదురుచూస్తుంటారు. దివ్య (రోమికా శర్మ), రమ్య (రోషిణి సహోతా) మరియు పూజ (ప్రజ్ఞా నయన్) అక్కాచెల్లెళ్లు. ఈ ముగ్గురూ ఆ ముగ్గురి ప్రేమలో పడతారు. అంటే దివ్య ప్రశాంత్‌తో, రమ్య వినయ్‌తో, పూజ అరుణ్‌లతో ప్రేమలో పడతారు. దీంతో వారి తండ్రి (పోసాని కృష్ణ మురళి) వారు ఇష్టపడ్డ వారితో వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ ప్రశాంత్, వినయ్ వారిని వివాహం చేసుకోవడానికి విస్మరిస్తారు. ప్రశాంత్, వినయ్ పెళ్లిని ఎందుకు నిరాకరించారు? అసలు ఈ జంటల మధ్య ఏం జరిగింది? వీరి ప్రేమ కథకు ఎలాంటి ముగింపు వచ్చింది? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. నేటి యువతకు సరిపోయేలా ఈ సినిమాను దర్శకుడు ఆద్యంతం వినోద భరితంగా తెరకెక్కించాడు. లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. నేటి యువతకు మంచి సందేశాన్ని ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆహ్లాదకరంగా.. ఎంతో వినోదభరితంగా సాగుతుంది. సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌లో ఇటు యూత్‌కి.. అటు పేరెంట్స్‌కి ఇచ్చిన సందేశం అందరినీ కదిలిస్తుంది. పోలీస్ స్టేషన్ సీన్స్,వేశ్య సన్నివేశం, అలీ ఎపిసోడ్లు, క్లైమాక్స్ ఎపిసోడ్లు కడుపుబ్బా నవ్విస్తాయి. దర్శకుడు రాజు రాజేంద్ర ప్రసాద్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అందించారు. ఇది రొటీన్ సినిమా కాబట్టి ఓవరాల్‌గా బాగుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. పాటలు బాగున్నాయి. ఎవరెలా చేశారంటే.. అజయ్, వంశీ, ఆదిత్య అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రస్తుత యువత ఈ పాత్రలలో బాగా కనెక్ట్ అవుతారు. రోమికా శర్మ అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రోషిణి సహోతా, ప్రగ్యా నయన్ తెరపై అందంగా కనిపించారు. పోసాని కృష్ణమురళి, కాశీ విశ్వనాథ్, అలీ, సప్తగిరి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి, శివారెడ్డి తమ పరిధిలో ఆకట్టుకున్నారు. సాంకేతికత విషయానికొస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతో ఎంగేజ్ చేస్తుంది. లొకేషన్స్, విజువల్స్ అందంగా కనిపిస్తాయి. అయితే ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. సంగీతం, సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సంస్థకు తగినట్లుగా ఉన్నాయి. -
రికార్డ్ బ్రేక్ మూవీ రివ్యూ
మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జయసుధ కుమారుడు నిహార్ కపూర్ హీరోగా నటించాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.. కథ విషయానికొస్తే.. కోటీశ్వరులకు జన్మించిన ఇద్దరు చిన్నారులు అనుకోని పరిస్థితుల వల్ల అనాథలుగా మారతారు. ఆ ఇద్దరు అనాథలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ రెజ్లింగ్ ఛాంపియన్స్‌గా ఎలా నిలిచారు? అలాంటి అనాథలకు స్నేహితురాలు అయిన ఒక అమ్మాయి వాళ్లకు తల్లిగా ఎలా మారింది? వాళ్లు రెజ్లింగ్ వెళ్లడానికి ఆ తల్లి చేసిన త్యాగం ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే! ఈ మూవీలో రైతుల గురించి తల్లి సెంటిమెంట్ గురించి చాలా బాగా చిత్రీకరించారు. సినిమాలో విఎఫ్ఎక్స్ ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే? కొత్త వాళ్లయినా కూడా నిహారి కపూర్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, సోనియా బాగా నటించారు. సత్య కృష్ణ పాత్ర సినిమా మొత్తానికే హైలైట్. విలన్‌గా టి. ప్రసన్నకుమార్ చాలా బాగా నటించారు. మిగతావాళ్లు తమ పాత్రల పరిధి మేర నటించారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కానట్లు కనిపిస్తుంది. చదలవాడ శ్రీనివాసరావు ఎంచుకున్న కథ కాస్త పాతదే అయినా దాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది. సెకండ్ హాఫ్ నిడివి ఎక్కువ ఉండటం, అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్ ప్రేక్షకుడికి విసుగు పుట్టిస్తాయి. అయితే కొన్నిచోట్ల దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అంగిరెడ్డి శ్రీనివాస్ అందించిన కథ, సాబు వర్గీస్ సంగీతం పర్వాలేదు. డిఓపిగా కంతేటి శంకర్ ఫోటోగ్రఫీ బాగుంది. చదవండి: ‘భీమా’ మూవీ రివ్యూ -
Buried Truth Review In Telugu: ఇంద్రాణి ముఖర్జీ 'బరీడ్ ట్రూత్'.. ఎలా ఉందంటే?
మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జీ ఆధారంగా వచ్చి డాక్యు సీరిస్ వివాదాలతో పాటు.. చాలా కొత్త విషయాలను తెరమీదకు తెచ్చింది. కూతురు హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఇంద్రాణి చేస్తున్న వాదనకు మద్దతు పలికేలా ఈ సీరిస్ ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ సిరీస్ విడుదలను అడ్డుకోవాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో… ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజ్‌దీప్ సర్దేశాయితో పాటు ఈ కేసును కవర్ చేసిన సీనియర్ జర్నలిస్టులు అందరి ఇంటర్వ్యూలు ఈ సిరీస్‌లో మనం చూడొచ్చు. పోలిస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న లూప్‌హోల్స్ … లీగల్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఈ క్రైం కథలో బ్లెండ్ అయ్యాయి. హై ప్రొఫైల్ కేసుల్లో పోలీసుల అత్యుత్సాహం… మీడియా ట్రయల్లాంటి సున్నితమైన అంశాలను కూడా ఈ సిరీస్ టచ్ చేసింది. బరీడ్ ట్రూత్ సిరీస్‌లో ఇంద్రాణి స్వయంగా తన వాదనను తానే టీవీ స్క్రీన్‌పై చెప్పుకోవడం… ఆడియన్స్‌కు మరింత ఆసక్తిని పెంచింది. 2012లో మాయమైన ఇంద్రాణి కూతురు షీనాబోరా హత్యకు గురైందని మూడేళ్ల తరువాత పోలీసులు గుర్తిస్తారు. అదీ ఓ సాధారణ వెహికిల్ చెకింగ్‌లో భాగంగా అరెస్టైన వ్యక్తి చెప్పిన సమాచారంతో ఈ మొత్తం కథ బయటకు వస్తుంది. కూతురు మూడేళ్ల పాటు కనిపించకుండా పోయినా ఇంద్రాణి ఎందుకు మాట్లాడలేదనే విషయంపై ఈ సిరీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. చాలా వరకు నిజమైన క్యారెక్టర్లతోనే స్టోరీ చెప్పే ప్రయత్నం జరిగింది. షీనాబోరాను తన చెల్లెలుగా మూడోభర్త కుటుంబానికి ఎందుకు పరిచయం చేసిందననే విషయంపై ఇంద్రాణి చెప్పిన సీక్రెట్ హైలెట్‌గా ఉంటుంది. తన తండ్రే తన కూతురికి తండ్రి అన్న విషయాన్ని ఇంద్రాణి ఈ సిరీస్‌లో రివీల్ చేస్తుంది. తాను 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కన్న తండ్రి తనను అత్యాచారం చేసిన విషయాన్ని ఇంద్రాణి చెబుతుంది. ఆ తరువాత మళ్లీ మళ్లీ అత్యాచారానికి గురయ్యానని.. తన తండ్రి ద్వారానే తాను తల్లినయ్యానని ఇంద్రాణి రివీల్ చేస్తుంది. షీనాబోరాను దాదాపు 16 ఏళ్ల పాటు దూరంగా ఉంచిన ఇంద్రాణి.. ఆ తరువాత ఎందుకు తన దగ్గరకు తెచ్చుకుంది. మూడో భర్త కొడుకుతో ఇంద్రాణి కూతురు ప్రేమలో పడటం లాంటి చాలా జుగుప్సాకరమైన విషయాలను ఈ సిరీస్‌లో చూపించారు. పీటర్ ముఖర్జీయా కుమారుడు రాహుల్, ఇంద్రాణి కూతురు షీనాబోరా ప్రేమ వల్లే ఈ హత్య జరిగిందనే చర్చ ఉంది. అయితే షీనాబోరా మిస్సయ్యాక రాహుల్ ఏవిధంగా ఆమెను వెతికే ప్రయత్నం చేశాడో ఈ సిరీస్ ద్వారా బయటకు వచ్చింది. పీటర్ ముఖర్జీయాకు షీనా హత్య గురించి తెలుసా? లేదా అనే విషయంపై ఈ సిరీస్‌లో కీలకమైన పాయింట్ రివీల్ చేశారు. షీనాబోరా హత్యకేసుకు సంబంధించి చాలా విషయాలు ఇప్పటికే అందరికీ తెలిసినా.. ఈ సిరీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ప్రేక్షకులకు చివరిగా ఒక మాట… కూతురిని హత్య చేసిందనే ఆరోపణలతో 6 ఏళ్లపాటు జైల్లో ఉన్న ఇంద్రాణి… ఈ సిరీస్‌లో కనిపించిన తీరు మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్కడా భయం.. పశ్చాత్తాపం లాంటివి లేకుండా హీరోయిన్లా ఇంద్రాణి డైలాగ్స్ చెప్పడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తన అందం చూసి పార్టీల్లో మగవాళ్లు పిచ్చోళ్లై పోతారని… ఆడవాళ్లు ఇబ్బందిగా ఫీలవుతారని ఇంద్రాణి చెప్పే డైలాగులు ఆమెలోని కాన్ఫిడెన్స్‌ను బయటపెట్టాయి. మూడో పెళ్లి చేసుకున్నా… కన్న పిల్లలను చెల్లెలు, తమ్ముడిగా చెప్పుకున్నా అది తన ఎదుగుదలకే అని ఇంద్రాణి చెప్పిన మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు. కాని మీ కూతురుని మీరు హత్య చేశారా? అనే ప్రశ్నకు… ఇంద్రాణి చెప్పిన సమాధానం… ఈ సీరిస్‌లోనే హైలట్‌గా నిలిచింది. -ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
ఇంటి నెం.13 సినిమా రివ్యూ, నిజంగానే భయపెట్టిందా?
టైటిల్: ఇంటి నెం.13 నటీనటులు: నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్‌రాజ్, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్, నెల్లూరు సుదర్శన్, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, గుండు సుదర్శన్, దేవయాని తదితరులు రచన, దర్శకత్వం: పన్నా రాయల్ సంగీతం: వినోద్ యాజమాన్య సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్ ఎడిటింగ్: సాయినాథ్ బద్వేల్ మాటలు: వెంకట్ బాలగోని, పన్నా రాయల్ సమర్పణ: డా.బర్కతుల్లా నిర్మాత: హేసన్ పాషా బ్యానర్స్: రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్, డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ విడుదల తేదీ: 01.03.2024 సినిమా నిడివి: 126 నిమిషాలు హారర్ మూవీస్ అంటే దెయ్యాలు, ప్రేతాత్మలకు సంబంధించిన కథలతోనే తెరకెక్కుతుంటాయి. అయితే కొందరు దర్శకులు వాటిలోనే కొంత వైవిధ్యం వున్న కథలతో, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తీసుకొని కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి దర్శకుల్లో పన్నా రాయల్ ఒకరు. ఇంతకుముందు అలాంటి కథాంశాలతోనే కాలింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ చిత్రాలను తీసి పేరు గడించారు. ఇప్పుడు తన మూడో చిత్రంగా ‘ఇంటి నెం.13’ను తెరకెక్కించారు. ఒక కొత్త పాయింట్, కొత్త బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకొని ప్రేక్షకుల్ని మరోసారి భయపెట్టే ప్రయత్నం చేశారు. శుక్రవారం(మార్చి 1న) విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అయింది? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.. కథ ఓ 90 ఏళ్ల వృద్ధుడు తన జీవితంలో ప్రేతాత్మల నుంచి ఎంత మందిని విముక్తుల్ని చేశాడో వివరిస్తుంటాడు. అందులో భాగంగా ‘ఇంటి నెం.13’ అనే ఒక విల్లాకు సంబంధించిన కథను చెప్పడం మొదలు పెడతాడు. అర్జున్ ఒక రచయిత. అతను రాసిన ఓ నవల 10 లక్షల కాపీలు అమ్ముడుపోయిందంటూ అది ప్రింట్ చేసిన పబ్లిషర్ ఫోన్ చేసి చెబుతాడు. ఆ అచీవ్‌మెంట్‌కి బహుమానంగా ఒక విల్లా గిఫ్ట్‌గా ఇస్తానంటాడు. దానికి సంబంధించిన తాళాలను తన అన్నయ్య సంజయ్‌కి ఇమ్మని చెబుతాడు అర్జున్. అలా సంజయ్, అతని భార్య నిత్య, పనిమనిషి జేజమ్మ ఆ ఇంట్లో దిగుతారు. ఆ తర్వాత అర్జున్, నిత్య చెల్లెలు మధు కూడా ఆ ఇంటికి వస్తారు. కొన్ని రోజులు బాగానే గడుస్తుంది. ఆ తర్వాత నిత్యకు తెల్ల ముసుగు వేసుకున్న ఆకారాలు కనిపిస్తుంటాయి. దగ్గరకెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అలాంటివి తరచూ కనిపిస్తుండటంతో ఆమె మానసికంగా ఆందోళనకు గురవుతుంది. ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఇది గమనించిన భర్త ఆమెకు చికిత్స చేయించేందుకు డాక్టర్ని, సైకియాట్రిస్ట్‌లను తీసుకొస్తాడు. కానీ ఇద్దరూ చేతులెత్తేస్తారు. ఫైనల్‌గా గజానంద్ (ఆనంద్‌రాజ్) రంగంలోకి దిగుతాడు. ఆ ఇంట్లో కనిపిస్తున్న తెల్ల ముసుగు ఆకారాలు ఎవరివి? అవి ఏం సాధించడానికి నిత్యను ఆవహించాయి? ఆ ఇంటిలో ఉన్న సమస్యను గజానంద్ ఏవిధంగా పరిష్కరించాడు? అనేది మిగతా కథ. విశ్లేషణ మనం ఎప్పుడూ చూసే దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఏ సినిమా అయినా ఒక ఇంట్లో ఉండే సమస్యతోనే మొదలవుతుంది. ఇందులోనూ అలాంటి సమస్యే అయినా దాన్ని చెప్పిన విధానం విభిన్నంగా అనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ లేకుండా, ల్యాగ్ లేకుండా నడిపించేందుకు దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. కానీ కొన్నిచోట్ల సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయి. ఫస్ట్‌హాఫ్ కంటే సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా మారింది. వినోద్ యాజమాన్య ఇచ్చిన మ్యూజిక్ ఎంతో గ్రాండ్‌గా ఉంది. నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన నవీద్, శివాంగి మెహ్రా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పుకోదగిన గజానంద్ పాత్రను ఆనంద్‌రాజ్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు. అతిథి పాత్రల్లో కనిపించిన తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మీ, పృథ్విరాజ్, సుదర్శన్, శివన్నారాయణ, రవివర్మ వారి పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. సాంకేతిక నిపుణులు చిన్న సీన్‌ని కూడా బాగా ఎలివేట్ చేసేలా వినోద్ సంగీతం అందించారు.దర్శకుడు పన్నా రాయల్ తను అంతకుముందు చేసిన రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఆర్టిస్టుల నుంచి మంచి పర్ఫామెన్స్ రాబట్టుకున్నాడు. పి.ఎస్.మణికర్ణన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో హైలైట్‌గా చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో రిచ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ సాయి బద్వేల్ సినిమాను క్రిస్పీగా ఎడిట్ చేశారు. వెంకట్ బాలగోని, పన్నా రాయల్ రాసిన మాటలు పర్వాలేదనిపించాయి. నిర్మాత హేసన్ పాషా పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. హారర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చుతుంది. మరో విశేషం ఏమిటంటే.. లాస్ట్ సీన్ చూసిన తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని అర్థమవుతుంది. కొత్త తరహా సినిమాలను ఇష్టపడే వారికి, యాక్షన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిన వారికి ‘ఇంటి నెం.13’ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. -
కరెన్సీ నగర్ సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: కరెన్సీ నగర్ నటీనటులు: యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్, గౌతమ్ నిర్మాత సంస్థ: ఉన్నతి ఆర్ట్స్ నిర్మాతలు: ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ దర్శకుడు: వెన్నెల కుమార్ పోతేపల్లి సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని ఎడిటర్: కార్తిక్ సినిమాటోగ్రఫీ: సతీష్ విడుదల తేదీ: 2023 డిసెంబర్ 29 యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కరెన్సీ నగర్ . ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్‌పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ నిర్మించారు. ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో డిసెంబర్ 29న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. సత్య (సుదర్శన్)కు ఐదు లక్షల రూపాయలు అవసరం అవుతాయి. దొంగతనం చేసి అయినా సరే డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఒక చోట బంగారం ఉందని తెలుసుకున్న సత్య అక్కడికి వెళతాడు. అక్కడ సత్యకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురవుతుంది. మాట్లాడే ఒక ఇనుప పెట్టలో బంగారం ఉంటుంది, ఆ బంగారం తీసుకోవాలనే క్రమంలో ఇనుము పెట్ట సత్యతో మూడు కథలు చెబుతుంది. అందులో మొదటి కథ మానవ సంబంధాల గురించి, రెండో కథ ప్రేమ , మోసం గురించి, మూడో కథ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం కోసం అబ్బాయి చేసే తప్పులు.. ఇలా మూడు కథలు విన్న తరువాత సత్య ఏం చేశాడు ? అతను అసలు అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అతనికి కావాల్సిన ఐదు లక్షలు దొరికాయా ? నిజంగానే ఇనపెట్టే మాట్లాడిందా ? వంటి విషయాలు తెలియాలంటే కరెన్సీ నగర్ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. దర్శకుడు వెన్నెల కుమార్ పోతేపల్లి తాను తీసిన మొదటి సినిమానే అయినా చాలా అద్భుతంగా తీశాడు. తాను రాసుకున్న కథను తెరమీద చక్కగా చూపించాడు. కేశవ ,చాందిని ఎపిసోడ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. మొదటి కథ పెయిన్లో అమ్మ క్యారెక్టర్ చిన్నది అయినా బాగా వర్కవుట్ అయింది. ప్రీ క్లైమాక్స్ సినిమాకు ప్లస్ అయింది. క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. ఇలాంటి కథ, కథనాలతో థియేటర్‌కు వచ్చిన మొదటి సినిమాగా కరెన్సీ నగర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు వెన్నెల కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా చూస్తుంటే మన చిన్నప్పుడు చదివిన బేతాళ కథలు గుర్తుకు వస్తాయి. కానీ కథలు మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి. తెరమీద చూసి అనుభూతి చెందాల్సిన సినిమా కరెన్సీ నగర్. ఎవరెలా చేశారంటే... యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్, గౌతమ్ వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే సినిమా టెక్నికల్ వ్యాల్యూస్ బాగున్నాయి. నిర్మాతలు ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. సిద్ధార్థ్ సదాశివుని సంగీతం బాగుంది. కార్తిక్ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. సతీశ్ సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. -
తికమకతాండ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: తికమకతాండ నటీనటులు: హరికృష్ణ, రామకృష్ణ, యాని,రేఖ నిరోష, శివన్నారాయణ, రాకెట్ రాఘవ తదితరులు నిర్మాణ సంస్థ:టి ఎస్ ఆర్ మూవీమేకర్స్ నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు దర్శకత్వం : వెంకట్ సంగీతం: సురేశ్ బొబిల్లి సినిమాటోగ్రఫీ: హరికృష్ణన్ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. తికమకతాండ అనే గ్రామంలోని ప్రజలందరికి మతిమరుపు అనే సమస్య ఉంటుంది. రచ్చబండతో సహా ప్రతి ఏరియాను గుర్తుపెట్టుకోవాడానికి పలకపై పేర్లను రాసి అక్కడ తగిలిస్తారు. మతిమరుపు కారణంగా అనేక సమస్యలు వస్తాయి. దీంతో తమకున్న మతిమరుపు సమస్యను తొలగించుకోవడం కోసం అమ్మవారి జాతర చేద్దాం అనుకుంటారు. అంతా జాతరకు సిద్ధమైన సమయంలో అమ్మవారి విగ్రహం మాయమైపోతుంది. అసలు అమ్మవారి విగ్రహం ఎలా మాయమైంది? ఆ ఊరి జనాలకు మతిమరుపు సమస్య ఎలా వచ్చింది? ఆ ఊరి సమస్యను తీర్చడానికి రంగంలోకి దిగిన హీరోలకు ఎదురైన సమస్యలు ఏంటి? విగ్రహాన్ని తిరిగి తీసుకురావడానికి వాళ్లు పడిన కష్టమేంటి? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్‌లో తిమకతాండ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే... ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ఊరికి ఒక అమ్మవారు ఉండడం .. అమ్మవారి విగ్రహం మాయమవడం తిరిగి ఊరు వారు ఆ విగ్రహాన్ని పట్టుకున్నారా లేదా అనేదే ఆ మూవీ కథాంశం. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ..తెరపై అంతే కొత్తగా చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు.ఫస్టాఫ్ అంతా ఊరి వాళ్ళ మతిమరుపుతో కాస్త కామెడీ, హీరోల ప్రేమ కథలతో సాగుతుంది. యాదమ్మ రాజు కామెడీ నవ్వులు పూయిస్తుంది. విగ్రహం మాయమవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. విగ్రహం తీసుకురావడానికి హీరో రంగంలోకి దిగడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథనం సీరియస్‌గా సాగుతుంది. కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ..క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. లాజిక్స్‌ని పక్కకి పెట్టి చూస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ లవ్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆకట్టుకుంటుంది. నటీనటుల విషయానికొస్తే.. ఈ చిత్రంలో హీరోలుగా హరికృష్ణ రామకృష్ణ నటించారు.వారిద్దరికి ఇది తొలి సినిమానే అయినా.. చక్కగా నటించారు. డ్యాన్స్‌తో పాటు యాక్షన్స్ సీన్స్ కూడా అదరగొట్టేశారు.రాజన్న మూవీ లో మల్లమ్మ పాత్ర పోషించినయాన్ని ఈ సినిమాలో మల్లికగా కథానాయక గా పరిచయమైంది. ఊరు అమ్మాయి పాత్రలో గాని చాలా అద్భుతంగా నటించింది ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండించింది. ఓహో పుత్తడి బొమ్మ సాంగ్‌లో నిజంగా పుత్తడి బొమ్మలానె అనిపించింది. ఇంకో హీరోయిన్గా రేఖా నిరోషా నటించింది. నిడివి తక్కువైనా తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది. ఇక దర్శకుడు వెంకట్ పాత్రకు వస్తే దర్శకుడుగానే కాకుండా నటుడిగా కూడా తన ఏంటో నిరూపించుకున్నారు. శివన్నారాయణ గారు బుల్లెట్ భాస్కర్ యాదవరాజు ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేశారు. సాంకేతిక విషయాలకొస్తే..హరికృష్ణన్ గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్. సిద్ శ్రీరామ్ పాడిన ఓహో పుత్తడి బొమ్మ సాంగ్ సినిమాకి హైలైట్. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమా చూస్తే అర్థమతుంది. -
'జిగర్ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: జిగర్ తండ(డబుల్ ఎక్స్) నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య, నిమిషా, నవీన్ చంద్ర తదితరులు నిర్మాణ సంస్థ: స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, కతిరేశన్ దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: తిరు ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ విడుదల తేది: నవంబర్ 10, 2023 రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో తెరెకెక్కించిన చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం, ఎస్. కథిరేసన్ నిర్మించగా.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇది తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జిగర్ తండ(ఈ మూవీ తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా రీమేక్ అయింది) సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సీజర్(రాఘవ లారెన్స్) రాయలసీమలోని కర్నూలులో గ్యాంగ్‌స్టార్. ఆ ప్రాంతంలోని మరో గ్యాంగ్ స్టార్ లారెన్స్‌తో గొడవ పడుతుంటారు. అప్పుడే తన గురువు లాంటి అతన్ని సీజర్ చంపేస్తాడు. కానీ సీజర్కు స్థానిక రాజకీయ నాయకుడైన కారుమంచి(ఇళవరసు) సపోర్ట్ ఉంటుంది. మరో రాజకీయ నాయకుడైన టామ్ చాకో(జయకృష్ణ) మనిషిని సీజర్ చంపడంతో అతనిపై పగ పెంచుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే సీజర్‌ను చంపేయాలని జయకృష్ణ.. ఫారెస్ట్ ఆఫీసర్ అయిన నవీన్ చంద్రకు చెప్తాడు. అయితే సీజర్‌ను చంపే ప్రయత్నంలో ఎస్సై కావాల్సిన ఎస్జే సూర్య(రే దాసన్) మధ్యలో ఎందుకు ఎంటరయ్యాడు? అసలు జయకృష్ణకు సీజర్‌ను చంపాల్సిన అవసరమేంటి? చివరికీ జయకృష్ణ సీజర్‌ను చంపాడా? లేదా? అసలు సీజర్(లారెన్స్)ను, రే దాసన్(ఎస్జే) ఎందుకు చంపాలనుకున్నాడు? వీరిద్దరి మధ్య గల వైరానికి కారణమేంటి? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరోవైపు అడవిలో ఉండే ఆదివాసీలకు, అసలు సీజర్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఫారెస్ట్ అధికారుల వేధింపుల నుంచి ఆదివాసీలను సీజర్ ఎందుకు రక్షించాలనుకుంటాడు? చివరికీ వారికి అండగా నిలిచాడా? లేదా? ప్రభుత్వం, అటవీ అధికారులకు దొరకకుండా.. అడవిలో ఏనుగులను అంతమొందిస్తున్న స్మగ్లర్లను సీజర్ ఎందుకు పట్టుకున్నాడు? వాళ్లను పట్టుకున్నాక సీజర్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వచ్చింది? చివరికీ తాను అనుకున్న లక్ష్యం నేరవేరిందా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే. ఎలా సాగిందంటే.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లోనే కథను పరిచయం చేశాడు డైరెక్టర్. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ ముందుకొచ్చిన కార్తీక్ సుబ్బరాజు సీక్వెల్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 1970 ప్రాంతంలో రాయలసీమలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే ఏనుగుల దంతాల స్మగ్లింగ్ నేపథ్యంలో కథను తీసుకొచ్చారు. ఫస్టాఫ్‌లో రాయలసీమ జిల్లాల్లోని స్మగ్లర్లు, రాజకీయ నాయకులు, అడవిలో నివసించే ఆదివాసీల చుట్టే తిరుగుతుంది. అయితే ఎస్సైగా జాబ్‌లో చేరాల్సిన ఎస్జే సూర్య(రే దాసన్), మరో వైపు హీరో కావాలనుకున్నా రాఘవ(సీజర్) మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఫస్టాప్‌లో మరీ ముఖ్యంగా సీరియస్‌గా సాగుతున్న స్టోరీలో సత్యన్, ఎస్జే సూర్యతో కామెడీని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సుబ్బరాజు. ఇంటర్వెల్‌కు ముందు చిన్న ట్విస్ట్ ఇచ్చి సింపుల్‌గా ముగించారు. సెకండాఫ్ మొదలవగానే కథలో కాస్తా వేగం పెరిగింది. అడవితల్లితో వారికున్న బంధాన్ని చాలా చక్కగా చూపించారు. అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీల జీవన విధానాన్ని సైతం ప్రేక్షకులకు పరిచయం చేశారు కార్తీక్. ముఖ్యంగా అడవిలో ఏనుగులను అంతమొందిస్తున్నషెటానీ ముఠా.. రాఘవ లారెన్స్ మధ్య జరిగే ఫైట్ సీన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు కాస్తా ఉత్కంఠకు గురి చేస్తాయి. ఒకవైపు రాజకీయ నాయకులు, అధికారుల కుట్రలను ప్రేక్షకులకు చూపిస్తూనే.. మరోవైపు ఆదివాసీ బిడ్డల అమాయకత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. అడవి బిడ్డలైన ఆదివాసీలకు, జంతువులకు మధ్య ఉండే ప్రేమానురాగాలను కాస్తా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఏనుగులను చంపే షెటానీ ముఠా, సీజర్(రాఘవ లారెన్స్) మధ్య జరిగే ఫైట్ సీన్స్ సెకండాఫ్‌లో హైలెట్. ఒకవైపు రాజకీయ నాయకుల కుట్రలు, మరోవైపు అడవిలో స్మగ్లింగ్, వీరి మధ్యన నలిగిపోతున్న ఆదివాసీ బిడ్డలతో కథను ముందుకు తీసుకెళ్లారు. అక్కడక్కడ వచ్చే ప్రేకకుల ఊహకందే ట్విస్టులతో థియేటర్లో కూర్చోబెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ వచ్చేసరికి ఎమోషనల్ టచ్ ఇచ్చి ఆడియన్స్‌ను కంటతడి పెట్టించారు డైరెక్టర్. సినిమా చివరి 20 నిమిషాలు ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. సన్నివేశాలు కాస్త సినిమాటిక్‌గా ఉన్నా ఆడియన్స్‌లో మాత్రం ఉత్కంఠ పెంచుతాయి. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కించడంలో ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడనిపిస్తోంది. జగర్ తండకు సీక్వెల్ అయినా రెండు కథలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అయితే రెండింటిలోనూ సెటప్ అంతా దాదాపుగా ఒకే తరహాలో సాగుతుంది. అయితే మరో సీక్వెల్‌గా త్రిబుల్ ఎక్స్ తీసుకురానున్నట్లు చివర్లో హింట్ మాత్రం ఇచ్చేశారు. ఎవరెలా చేశారంటే... రాఘవ లారెన్స్ ఎప్పటిలాగే తన నటనతో అదరగొట్టేశారు. తనలోని ఫుల్ మాస్ యాక్షన్‌తో మరోసారి తనదైన నటనతో మెప్పించారు. ఎస్జే సూర్య సైతం తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. నవీన్ చంద్ర అటవీశాఖ అధికారి పాత్రలో ఒదిగిపోయారు. నిమిశా, ఇళవరసు, టామ్ చాకో, సత్యన్, బావ చెల్లాదురై, అరవింద్ ఆకాష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. సంతోష్ నారాయణన్ సంగీతం పర్వాలేదు. ఈ చిత్రంలో పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా సందర్భాన్ని తగినట్లుగానే ఉన్నాయి. బీజీఎం ఫరవాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్తా పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - మధుసూదన్, సాక్షి వెబ్ డెస్క్ -
ప్రేమదేశపు యువరాణి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: ప్రేమదేశపు యువరాణి నటీనటులు: యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి, మెహబూబ్ బాషా, హరికృష్ణ, యోగి కద్రి, రఘు, సునీత, మనోహర్, పవన్ ముత్యాల, రాజారెడ్డి, సందీప్, స్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపీనాయుడు తదితరులు నిర్మాణ సంస్థలు: ఏజీఈ క్రియేషన్స్. ఎస్2మెచ్2 ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల సంగీతం: అజయ్ పట్నాయక్ సినిమాటోగ్రఫీ: శివకుమార్ దేవరకొండ ఎడిటర్: ఎం.ఆర్. వర్మ విడుదల తేదీ: 02-09-2023. ఏజీఈ క్రియేషన్స్. ఎస్2మెచ్2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి ప్రధాన పాత్రల్లో సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ నిర్మించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, పాటలకు చక్కటి రెస్పాన్స్ వచ్చింది. పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. అమలాపురంలో వీరయ్య అనే రౌడీ షీటర్ చాలామంది ప్రజలను ఇబ్బంది పెడుతూ.. ఎదురు తిరిగిన వారిని చంపుతూ.. నచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతుంటాడు. అయితే అదే ఊర్లో బీటెక్ ఫెయిలై తాగుతూ జూలాయిగా తిరుగుతున్న చెర్రీ (యామిన్ రాజ్)కి, శ్రావణి (ప్రియాంక రేవ్రి) కనిపిస్తుంది. ఆమెను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెనే తన ప్రేమదేశపు యువరాణి అని ఫిక్స్ అయిపోతాడు.ఆమె గురించి ఫ్రెండ్స్ ద్వారా ఆరా తీస్తాడు. అయితే రావులపాలెం నుంచి ఉద్యోగ రీత్యా శ్రావణి కుటుంబం అమలాపురంకు వచ్చిందని శ్రావణి తండ్రి, చెర్రీ తండ్రి ఇద్దరు చిన్ననాటి స్నేహితులని తెలుస్తుంది. ఆ తరువాత శ్రావణితో పరిచయం కావడం.. దీంతో చెర్రీ బీటెక్ పాసయ్యేందుకు హెల్ప్ చేస్తానని ఆమె అంటుంది. ఆలా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. చివరకు పెళ్లి చేసుకుందామని చెర్రీ చెప్పగానే.. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నా నాకు చాలా గోల్స్ ఉన్నాయని నో అంటుంది. అయితే పెళ్లి విషయంలో శ్రావణిని చెర్రీ నిలదీయడంతో రవి (విరాట్ కార్తిక్)ను ఇష్టపడ్డానని చెబుతుంది. దీంతో షాక్ తిన్న చెర్రీ శ్రావణి ప్రేమను దక్కించు కోవడానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అసలు శ్రావణి చెర్రీని పెళ్లి చేసుకుందా? అనేదే అసలు కథ. అంతే కాకుండా మరో వైపు అదే ఊరిలో వరుసగా మర్డర్స్ జరుగుతుంటాయి. వీటి వల్ల రౌడీ షీటర్ వీరయ్య మనుషులు చనిపోతూ ఉంటారు. అసలు ఈ మర్డర్స్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే విషయాలు తెలిసేలోపే రౌడీ షీటర్ వీరయ్యతో పాటు తన కొడుకు భైరవ్ హత్యకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఈ హత్యలు ఎందుకు చేస్తుంది? అసలు ఈ రవి ఎవరు? తనకు శ్రావణి ఎందుకు దూరంగా ఉంది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న తను కలెక్టర్ అవుతుందా? చివరకు శ్రావణి చెర్రీ కు దగ్గరైందా? లేక రవికి దగ్గరైందా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో తప్పకుండా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఎమోషనల్ ఉన్న సబ్జెక్ ను ఫీల్‌గుడ్ లవ్‌స్టోరిని తెరకెక్కించారు సాయి సునీల్ నిమ్మల. ఆసక్తికర సన్నివేశాలతో చక్కని కథను మలిచారు. డబుల్ మీనింగ్ జోకులు.. కుల్లి కామెడీ లేకుండా సహజంగా ఆకట్టుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నీట్ అండ్ క్లీన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు అందించడంలో దర్శకుడు సాయి సునీల్ నిమ్మల సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అజయ్ పట్నాయక్ అద్భుతమైన సంగీతం సినిమాకు ప్లస్. ఆర్పీ, పట్నాయక్, సునీత పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ‘ప్రేమదేశపు యువరాణి’ సినిమాకు వచ్చిన వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారు. ఎవరెలా చేశారంటే? చెర్రీ పాత్రలో నటించిన (యామిన్ రాజ్) తన నటనతో అన్ని విధాలుగా ఆకట్టుకున్నాడు. శ్రావణి పాత్రలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక రేవ్రి తనకిచ్చిన పాత్రలో ఒదిగి పోయింది. రవి పాత్రలో లెక్చరర్‌గా నటించిన విరాట్ కార్తిక్ తన పాత్రకు న్యాయ చేశాడు. హీరోకు ఫ్రెండ్స్‌గా నటించిన మెహబూబ్ బాషా, బండ సాయి, బక్క సాయి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాత్రలో శంకర్ గా నటించిన రాజారెడ్డి నటన ఈ చిత్రానికే హైలెట్ అని చెప్పవచ్చు, క్రైమ్‌ను సాల్వ్ చేసే విషయంలో పోలీసుల ఇన్వేస్టిగేషన్, వారి ఆలోచన తీరు, వారు వేసే ఎత్తులు, ఎలా ఉంటాయనే సన్నివేశాల్లో సహజమైన నటనతో పాటు పాత్రలో ఒదిగిపోయాడు. వీరయ్య పాత్రలో సందీప్ క్రూరమైన విలన్ గా టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరో తల్లి తండ్రులుగా హరికృష్ణ, సునీత, యోగి కద్రి, రఘు, ముత్యాల, రాజారెడ్డి, స్రవంతి, , ప్రత్యూష, గోపీనాయుడు తమ పాత్రల పరిధిమేర మెప్పించారు. సాంకేతికత విషయాకొనికొస్తే శివకుమార్ దేవరకొండ సినిమాటోగ్రఫీ బాగుంది.. సస్పెన్స్ తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బందించి తన కెమెరా పనితనాన్ని చాటారు. ఎం.ఆర్. వర్మ ఎడిటింగ్ పనితీరు ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి. -మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్ -
SPY Review: నిఖిల్ 'స్పై' మూవీ ట్విట్టర్ రివ్యూ!
యంగ్ హీరో నిఖిల్ నటించిన 'స్పై' థియేటర్లలోకి వచ్చేసింది. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంతో గూఢచారి కథతో తీసిన ఈ సినిమాకు విడుదల ముందే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని అందుకుందని అమెరికాలో ప్రీమియర్స్ చూసిన కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తమ అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో పంచుకుంటున్నారు. ఇక 'స్పై' సినిమాలో రా ఏజెంట్ గా నిఖిల్ అద్భుతంగా నటించాడని, యాక్షన్ సీన్స్ బాగున్నాయని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ కూడా అదిరిపోయాయని అంటున్నారు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టిన నిఖిల్.. మరోసారి సక్సెస్ అందుకున్నాడని అభిమానులు చెబుతున్నారు. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'సాక్షి' బాధ్యత వహించదు. (ఇదీ చదవండి: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి!) Just finished watching #spyMovie the first half was very good going into story... The second half NXT level some goosebumps scenes are erupted.... The main asset of the movie @actor_Nikhil acting was outstanding.. And director was narrated some new scenes to engage the audience pic.twitter.com/xBmiVPA4v3 — Rakesh (@Rakesh68529974) June 29, 2023 #SPYMovie 🎬 Review : #SPY is Overall a Good Honest SPY Action Thriller from @actor_Nikhil & Team 💥💥💥 pic.twitter.com/JnMK7Zvdos — Mee Cinema (@Mee_Cinema) June 29, 2023 #SPYMovie received good positive talk from the USA premiere and box office winner. congratulations to @actor_Nikhil and team.. 3 వరుస హిట్స్ తో రచ్చ చేస్తున్న #NikhilSiddhartha 🔥 pic.twitter.com/ppMGDUQl8x — Veera Reddy @For The People (@VeeraReddyForT1) June 29, 2023 @actor_Nikhil anna Dil Le Lo Mera...💖😘 The Movie is Blockbuster 📝🔥#SPYMovie⭐⭐⭐⭐ pic.twitter.com/5GnFwy6jAq — Darling Fan⭐ (@s42359) June 29, 2023 crossed the expectations set on the movie... Especially @actor_Nikhil acting is very good.. Everyone can go and watch this movie.#spy #SPYMovie #SPYReview #SPYMovieReview #NikhilSiddhartha pic.twitter.com/jcexlfIHE5 — Vayalpad Tabrej (@Tabrej1411) June 29, 2023 -
#మెన్‌టూ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: #మెన్‌టూ(MenToo) నటీనటులు : నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీకాంత్ జి. రెడ్డి నిర్మాత : మౌర్య సిద్ధవరం సినిమాటోగ్రఫీ : పీసీ మౌళి సంగీతం : ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్ విడుదల తేదీ: మే 26, 2023 నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం #MenToo. . శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం యూత్‌ను ఎలా అలరించిందో చూద్దాం . అసలు కథేంటంటే.. ఓ నలుగురు యువకులు ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్), మున్నా(మౌర్య సిద్ధవరం), రాహుల్(వైవా హర్ష) నలుగురు యువకులు ఓ పబ్‌లో రెగ్యులర్ కలుసుకుని తమ జీవితాల్లో జరిగిన కష్టనష్టాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఆ పబ్ ఓనర్(బ్రహ్మాజి), అందులో పనిచేసే బాయ్(సుదర్శన్) కూడా వారి సాదక, బాధకాలు షేర్ చేసుకుంటారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో ఎక్సీపీరియన్స్. ఒకరు భార్య వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది షేర్ చేసుకుంటే... ఇంకొకరేమో తనను అనవసరంగా వేధింపులతో తనువు చాలించడం... మరొకరేమో విదేశాలకు వెళ్లడం ఇష్టం లేక ప్రియురాలికి దూరం కావడం... ఒకరేమో ప్రియురాలి ఎక్స్పేక్టేషన్స్ అందుకోలేకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బందులు పడే మగాళ్లంతా... చివరకు ఏమి చేశారనేదే మిగతా కథ. కథ ఎలా సాగిందంటే.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్‌కి మంచి ఆదరణే ఉంటుంది. ఇలాంటి సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. కొంచెం మెసేజ్ ఓరియంటెడ్‌గా సినిమా తీస్తే... యూత్ బాగా ఆదరిస్తారని ఇది వరకు చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటి సినిమానే #MenToo. కేవలం అమ్మాయిలే కాదు... వేధింపులకు గురై బాధపడే అబ్బాయిలు కూడా ఉంటారు అనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నిత్యం మనం చుట్టూ యువతీ యువకుల్లో జరిగే అంశాల ఆధారంగా కొంత మెసేజ్ ఇస్తూనే... యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా మలిచారు దర్శకుడు. కథ... కథనాలతో ఎక్కడా బోర్ లేకుండా నలుగురు యువకుల మధ్య జరిగిన సంఘటనలను ఎంతో ఎమోషనల్‌గా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌లో రాహుల్ కథతో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ నిచ్చిన దర్శకుడు... ఆ తరువాత ద్వితీయార్థం అంతా ఎమోషనల్‌గా నడిపించి ఆడియన్స్ ని సినిమాలోని మల్టిపుల్ ట్రాక్స్ కి కనెక్ట్ చేయడంలో విజయం సాధించారు. వర్క్ ప్లేస్‌లో కేవలం అమ్మాయిలకే ప్రాధాన్యం ఇచ్చే ఎంఎన్సీ కంపెనీలు... అబ్బాయిలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే అమ్మాయిల అభిప్రాయాలను గౌరవించాలనే దానిని ఆదిత్య పాత్రతోనూ, అమ్మాయిలు... అబ్బాయిలకు కారణం లేకుండా బ్రేకప్ చెప్పడం లాంటి వాటిని ఫేస్ చేసే పాత్రలో సంజు పాత్రను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినా... తన ప్రియురాలికి తన ప్రేమను చెప్పలేని పాత్రలో మున్నా పాత్రని ఎంతో ఎమోషనల్‌గా తెరమీద చూపించారు దర్శకుడు. అబ్బాయిలు కూడా అమ్మాయిల్లాగే అన్ని విధాలుగా ఇబ్బందులు అన్నిచోట్లా ఎదుర్కొంటూనే ఉంటారు. వారికి కూడా ఓ వేదిక కావాలి అభిప్రాయాలను పంచుకోవడానికి అనేదానితో తెరకెక్కిన ఈచిత్రం ఆద్యంతం అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే... ఇందులో నరేష్ అగస్త్య పాత్ర చాలా మంది యువతకు మెసేజ్ ఇస్తుంది. అలాగే కౌషిక్ కూడా కాస్త తన నటనతో మెప్పించాడు. మున్నా పాత్రలో చిత్ర నిర్మాత మౌర్య ఆకట్టుకుంటాడు. గీతా పాత్రలో రియా సుమన్... గ్లామరస్‌గా కనిపించి మెప్పించింది. భార్య బాధితునిగా బ్రహ్మాజీ నవ్వించాడు. బార్లో పనిచేసే యువకుని పాత్రలో సుదర్శన్ ఆకట్టుకుంటాడు. వైవా హర్షా చేసిన పాత్ర కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఇక మిగత పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త కత్తెర పడాల్సింది. సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి.