అది యూజీసీ బాధ్యతే! | madabhushi sridhar article on right to information | Sakshi
Sakshi News home page

అది యూజీసీ బాధ్యతే!

Oct 14 2016 12:33 AM | Updated on Sep 4 2017 5:05 PM

అది యూజీసీ బాధ్యతే!

అది యూజీసీ బాధ్యతే!

‘జ్ఞాన్ విజ్ఞాన్ విముక్తయే’ తమకు స్ఫూర్తి అనే యూజీసీ జ్ఞానాన్ని కాకపోరుునా, కనీసం సమాచారమైనా ఇవ్వాలి. చట్టబద్ధ సంస్థ యూజీసీ తాను గుర్తించిన కోర్సుల విలువ, నాణ్యతల సమాచారాన్ని ఇవ్వాల్సిందే.

విశ్లేషణ
‘జ్ఞాన్ విజ్ఞాన్ విముక్తయే’ తమకు స్ఫూర్తి అనే యూజీసీ జ్ఞానాన్ని కాకపోరుునా, కనీసం సమాచారమైనా ఇవ్వాలి. చట్టబద్ధ సంస్థ యూజీసీ తాను గుర్తించిన కోర్సుల విలువ, నాణ్యతల సమాచారాన్ని ఇవ్వాల్సిందే.
 
కెరీర్ అడ్వాన్ ్సమెంట్ స్కీంలో పదోన్నతికి యోగ్యతనిచ్చే కోర్సుల వివరాలను ఒక అధ్యా పకుడు ఆర్టీఐ కింద యూజీసీని, ఇగ్నో (ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం) ను అడిగాడు. ఇగ్నో ఆ దరఖాస్తును యూజీసీకి బదిలీ చేసింది. వివరణలు ఇవ్వవలసిన బాధ్యత ఆర్టీఐ కింద తమకు లేదని యూజీసీ తిరస్కరించింది. అండర్ సెక్రటరీ స్థారుు అధికారి (పీఐఓ) వివరణలిచ్చే బాధ్యత లేదనడం సమంజసమా? జాయింట్ సెక్రటరీ (మొదటి అప్పిలేట్ అధి కారి) డాక్టర్ రేను బాత్రా కూడా ఈ అవసరాన్ని గుర్తిం చలేదు. యూజీసీ చట్టం సెక్షన్ 12 ప్రకారం అది దేశ, విదేశ విశ్వవిద్యాలయాల నుంచి అవసరమైన సమాచా రాన్ని సేకరించి ఇక్కడి విశ్వవిద్యాలయాలకు ఇవ్వాలి.
 
అక్రమ వసూళ్లు ఆపే అధికారం
1984లో యూజీసీ చట్టాన్ని సవరించి ఫీజు రెగ్యులేషన్, డొనేషన్ల నిషేధ అధికారాలను ఇచ్చారు. రెగ్యులేషన్‌లో పేర్కొన్న పరిధులు దాటి విద్యాసంస్థలు అధికంగా ఫీజులు, చార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. కోర్సులో ప్రవేశానికి, కొనసాగించడానికి పరోక్షంగా చెల్లింపులు, విరాళాలు, బహుమతుల కోసం ఒత్తిడులు చేయడానికి వీల్లేదు.

డిగ్రీలు ప్రదానం చేయకుండా విద్యాసంస్థలను నిషేధించేందుకు, ప్రభుత్వ అంగీకారంతో ఉత్తర్వులు జారీ చేసే అధికారం యూజీసీకి ఉంది. కమిషన్ సిఫా ర్సులను నిరాకరించినా, రెగ్యులేషన్లను, సెక్షన్ 12 ఏ నియమాలను ఉల్లంఘించినా ఆ విశ్వవిద్యాలయానికి ప్రతిపాదిత గ్రాంట్లను నిలిపివేసే అధికారం కూడా యూజీసీకి ఉంది. కోర్సుల ఫీజులను, ప్రమాణాలను క్రమబద్ధీకరించాలి. ఆ అంశాలపై యూజీసీ కనుక అభ్యంతరం తెలిపితే ఆ కళాశాల గానీ యూనివర్సిటీ  గానీ ఆ కోర్సుకు సంబంధించిన డిగ్రీలు ప్రదానం చేయడానికి వీల్లేదు.

సమాచారాన్ని సేకరించి ఇచ్చే బాధ్యత, విద్యా ప్రమాణాలను, సమంజసమైన ఫీజులను క్రమబద్ధీ కరించే బాధ్యత కలిగి ఉన్న యూజీసీ ఆ కోర్సుల వివ రణలు ఇవ్వవలసిన అవసరం లేదని నిరాకరించడం సమంజసం కాదు. ‘జ్ఞాన్ విజ్ఞాన్ విముక్తయే’ (విముక్తి కలిగించేది జ్ఞానమూ, విజ్ఞానమే) అని స్ఫూర్తిగా పెట్టు కున్న యూజీసీ ఆ లక్ష్య సాధన కోసం జ్ఞానం కాక పోరుునా, కనీసం సమాచారమైనా ఇవ్వవలసి ఉంటుంది. చట్టబద్ధ సంస్థ  యూజీసీ తాను గుర్తించిన కోర్సుల విలువ. నాణ్యతల సమాచారాన్ని ఇవ్వాల్సిందే. ఆ వివరణలు యూజీసీ తప్ప మరెవరూ ఇవ్వలేనపుడు, ఇంకెవరిని అడిగే వీలుంటుంది?
 
విధాన లోపం
ఇలా వివరణలు ఇవ్వబోను అని యూజీసీ నిర్ణరుుంచు కోవడం విధాన లోపం అనిపిస్తున్నది. ఈ సంగతి ఈ ఆర్టీఐ అర్జీ ద్వారా తేలింది. ఆర్టీఐ చట్టాన్ని యూజీసీ చట్టంతో కలిపి చదివితే, సెక్షన్ 4(1)(సీ)(డీ) కింద విద్యావిధానానికి సంబంధించిన అంశాలను తమంత తామే వెల్లడించాల్సిన బాధ్యత యూజీసీకి ఉందని తేలుతుంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు అడిగిన సందేహాలను గుర్తించి, అర్థం చేసుకుని, తీర్చవలసి ఉంటుంది. అందుకు తరచు అడిగే ప్రశ్నలకు సమా ధానాలు తయారుచేసే బృందాన్ని అధికారికంగా నియమించాలి. వారు ఆర్టీఐ దరఖాస్తులలో వెల్లడైన సందే హాలను పరిశీలించి ఊఅఖ  సమాధానాలు తయారు చేయాలి.

సెక్షన్ 2(ఎఫ్) కింద వివరణలు, అభిప్రా యాలు ఇవ్వడం ిపీఐఓకు సాధ్యం కాదనడానికి వీలున్న మాట నిజమే. కానీ యూజీసీ వంటి విద్యావిధాన రూప కల్పనా సంస్థ, కోర్సుల నాణ్యత వివరించి, ఏయే సంద ర్భాలలో వాటిని యోగ్యతా పత్రాలుగా స్వీకరించాలో నిర్ణరుుంచి, ఆ వివరాలు ఇవ్వడం మౌలిక బాధ్యత. అది విధానపరమైన బాధ్యత. కనుక ఆర్టీఐ కింద వివరణ ఇవ్వడమే యూజీసీ బాధ్యత.
 
ఆర్టీఐ చట్టం సెక్షన్ 19(8)(ఏ) నాలుగో భాగం ప్రకారం పబ్లిక్ అథారిటీ కొన్ని కొత్త ప్రక్రియలను, పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా సమాచారాన్ని వెల్లడి చేయాలని సూచించే అధికారం సీఐసీకి ఉంది. కనుక ఊఅఖ రూపకల్పన ద్వారా ఇటువంటి వివరణలు ఇవ్వా లని, తమంత తామే వీటిని వెబ్‌సైట్‌లో ఉంచాలని కమిషన్ ఆదేశించింది. సెక్షన్ 4ను అమలుచేసే అధి కారం కమిషన్‌కు లేదు. కాని ఆ సెక్షన్ కింద వెల్లడి చేయాల్సిన సమాచారం ఇవ్వనపుడు, ఆర్టీఐ కింద అడి గిన సందర్భంలోనైనా ఇవ్వాలి. ఆ దశలో సెక్షన్ 4ను సెక్షన్లు 3, 6, 20 ద్వారా అమలు చేసే అధికారం కమి షన్‌కు ఉంటుంది. ఇవ్వవలసిన సమాచారం ఇవ్వనం దుకు యూజీసీ ిపీఐఓకి జరిమానా ఎందుకు విధించ కూడదో తెలియజేయాలని కమిషన్ కారణ వివరణ నోటీసు జారీ చేసింది. (రామకిషన్ శర్మ వర్సెస్ యూజీసీ కేసు నంబర్ cic/cc/A//2014/001770 కమి షన్ 27.09.2016 తీర్పు ఆధారంగా).

వ్యాసకర్త  మాడభూషి శ్రీధర్
కేంద్ర సమాచార కమిషనర్
ఈమెయిల్: professorsridhar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement