కొట్టేసిన బ్యాగులో ఓ బుడ్డోడు దొరికాడు | Thief steals bag in Mumbai train and finds a baby boy inside | Sakshi
Sakshi News home page

కొట్టేసిన బ్యాగులో ఓ బుడ్డోడు దొరికాడు

Jan 30 2014 12:22 PM | Updated on Sep 2 2017 3:11 AM

కొట్టేసిన బ్యాగులో ఓ బుడ్డోడు దొరికాడు

కొట్టేసిన బ్యాగులో ఓ బుడ్డోడు దొరికాడు

అతడో దొంగ. బస్సులు, రైళ్లలో ప్రయాణికులకు బురిడీ కొట్టించి వాళ్ల బ్యాగులు చోరీ చేయడంలో అతగాడిది అందెవేసిన చేయి.

బుల్లిబ్యాగులో ఓ బుడ్డోడు దొరికాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది. చూసిన జనానికే కాదు. ఆ బ్యాగును దొంగతనం చేసిన దొంగకు కూడా. ప్రయాణికులతో పాటు అధికారులను కూడా ఓ గంటపాటు ఆందోళనకు గురిచేసిన ఈ సంఘటన ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది.

ప్లాట్‌ఫామ్‌పై ఆగిఉన్న రైలు కంపార్టుమెంటునుంచి దొంగ ఓ బ్యాగును దొంగిలించాడు. అందులో కొంత డబ్బు, విలువైన వస్తువులు ఉంటాయని ఊహించుకుంటూ.. దూరంగా వెళ్ళి జిప్పు తెరిచిచూసి షాక్‌ తిన్నాడు. ఎత్తుకోమంటున్నట్లు చేతులాడిస్తున్న చిన్నోడు కనిపించాడు. బ్యాగును తిరిగి తీసుకెళ్ళి.. రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్‌పై తినుబండారాలు అమ్ముకునే ఓ వ్యక్తి దగ్గర వదిలేశాడు.

 టికెట్లు చెకింగ్‌ చేస్తున్న రైల్వే అధికారులకు ఆ దృశ్యాన్ని చూసి అనుమానంతో  బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులోఉన్న మగశిశువును చూసి షాక్‌ తిన్నారు. వెంటనే దగ్గర్లోని బాబా ఆస్పత్రిలో చేర్పించారు. మగ శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఎంత పేదవారైనా ఎటువంటి అంగవైకల్యం లేకుండా.. పూర్తి ఆరోగ్యంతో ఉన్న శిశువును ఎందుకు వదిలించుకోవాలనుకున్నారో అర్థం కాలేదని వైద్యులు చెబుతున్నారు.  శిశువును ముంబై మాతాశిశు సంరక్షణ కేంద్రం ఆశా సదన్‌లో చేర్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement