ఫేస్ బుక్ సరికొత్త యాప్! | talk to celebrities at Emmy Awards with Facebook app | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్ సరికొత్త యాప్!

Aug 23 2014 6:03 PM | Updated on Aug 20 2018 2:35 PM

ఫేస్ బుక్ సరికొత్త యాప్! - Sakshi

ఫేస్ బుక్ సరికొత్త యాప్!

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ సరికొత్త యాప్ ను లాంచ్ చేయనుంది.

న్యూయార్క్:సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ సరికొత్త యాప్ ను లాంచ్ చేయనుంది. హాలీవుడ్ సెలబ్రిటీలతో మనం నేరుగా  మాట్లాడాలనుకుంటే ఫేస్ బుక్ ప్రవేశపెట్టే ఈ సరికొత్త యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. అది కేవలం హాలీవుడ్ లో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఎమ్మీ అవార్డులకు మాత్రమే. ఆగస్టు 25వ తేదీన జరుగనున్న 66 వ ఎమ్మీ అవార్డుల గాను ఈ యాప్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆ యాప్ కు 'మెన్షన్స్ బాక్స్' గా నామకరణం చేసి మన ముందుకు తీసుకురానుంది.

 

దీంతో మీకు ఇష్టమైన నటీ నటులతో మాట్లాడే అవకాశం ఉంటుందని ఫేస్ బుక్ యాజమాన్యం స్పష్టం చేసింది. అంతే కాకుండా ఇది ట్యాబ్లెట్ యాప్ కావడంతో అందులో ఉన్న కెమెరా నుంచే నేరుగా వారిని చూసే అవకాశం కూడా ఉందట. దీంతో మనం ఆ వీడియోలో మనకు నచ్చిన సెలబ్రిటీని ఎంపిక చేసుకుని వారితో ముచ్చటించవచ్చని ఫేస్ బుక్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement