ఒక్కరికే ప్రమోషన్ | Prakash Javadekar takes oath as Cabinet Minister | Sakshi
Sakshi News home page

ఒక్కరికే ప్రమోషన్

Jul 5 2016 11:51 AM | Updated on Apr 6 2019 9:38 PM

ఒక్కరికే ప్రమోషన్ - Sakshi

ఒక్కరికే ప్రమోషన్

ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలోని స్వతంత్ర మంత్రుల్లో ఒక్కరికే ప్రమోషన్ కల్పించారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలోని స్వతంత్ర మంత్రుల్లో ఒక్కరికే ప్రమోషన్ కల్పించారు. కేంద్ర సహాయ మంత్రి (పర్యావరణం-స్వతంత్ర హోదా) ప్రకాష్ జవదేకర్కు కేబినెట్ హోదా లభించింది. ప్రస్తుతం స్వతంత్ర హోదాతో ఉన్న పీయుష్ గోయల్ (ఇంధన శాఖ), ధర్మేంద్ర ప్రధాన్(పెట్రోలియం), నిర్మలా సీతారామన్ (వాణిజ్యం, పరిశ్రమలు), ముక్తార్ అబ్బాస్ నఖ్వీ (మైనారిటీ వ్యవహారాలు)లకు కేబినెట్ హోదా దక్కుతుందని ప్రచారం జరిగినా మోదీ..  ప్రకాష్ జవదేకర్ ఒక్కరితో సరిపెట్టారు.

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రకాష్ కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. మంగళవారం ఉదయం జరిగిన రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement