'ఆయన మంచి మనిషి, ఓటువేయండి' | Nitish kumar is a good person, says Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

'ఆయన మంచి మనిషి, ఓటువేయండి'

Published Thu, Oct 1 2015 11:12 AM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM

'ఆయన మంచి మనిషి, ఓటువేయండి' - Sakshi

'ఆయన మంచి మనిషి, ఓటువేయండి'

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పూర్తి మద్దతు ప్రకటించారు. నితీశ్ కు ఓటు వేయాలని బిహార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పూర్తి మద్దతు ప్రకటించారు. నితీశ్ కు ఓటు వేయాలని బిహార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 'నా ప్రకటనను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయి. నా పూర్తి మద్దతు నితీశ్ కుమార్ కు ప్రకటిస్తున్నా. ఆయన మంచి మనిషి. ఆయనకే ఓటు వేయాలని బిహార్ ప్రజలను కోరుతున్నా' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోదని, ఎన్నికల ప్రచారానికి వెళ్లబోనని కేజ్రీవాల్ చెప్పినట్టు మీడియాలో బుధవారం వార్తలు వచ్చాయి. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో'ఆప్'కు జేడీ(యూ) మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. వారణాసిలో నరేంద్ర మోదీపై పోటీ చేసిన కేజ్రీవాల్ కు జేడీ(యూ) అండగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement