'టెర్రరిస్టుల్లో మంచివారు, చెడ్డవారు ఉండరు' | Sakshi
Sakshi News home page

'టెర్రరిస్టుల్లో మంచివారు, చెడ్డవారు ఉండరు'

Published Fri, Mar 13 2015 12:06 PM

'టెర్రరిస్టుల్లో మంచివారు, చెడ్డవారు ఉండరు'

న్యూఢిల్లీ : ముంబైపై దాడి కేసులో ప్రధాన సూత్రధారి లఖ్వీ విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించడం పట్ల భారత విదేశాంగ శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముంబై దాడి కేసులో లఖ్వీకు సంబంధించిన సరైన ఆధారాలు పాక్ కోర్టు ముందు పెట్టడంలో నవాజ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది.

లఖ్వీ విడుదల కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాకిస్థాన్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. టెర్రరిస్టుల్లో మంచివారు, చెడ్డవారు ఉండరనే సంగతి గుర్తుంచుకోవాలని భారత విదేశాంగ శాఖ... పాక్ ప్రభుత్వానికి సూచించింది.

2008 ముంబైపై దాడిలో కీలక సూత్రధారి లఖ్వీ నిర్బంధం అక్రమమని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అతడిని జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖపై విధంగా స్పందించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement