'రాజకీయాల్లో చేరను.. ఎన్నికల్లో పోటీ చేయను' | I am not contesting elections for Aam Aadmi Party: Anupam Kher | Sakshi
Sakshi News home page

'రాజకీయాల్లో చేరను.. ఎన్నికల్లో పోటీ చేయను'

Jan 16 2014 5:29 PM | Updated on Apr 4 2018 7:42 PM

'రాజకీయాల్లో చేరను.. ఎన్నికల్లో పోటీ చేయను' - Sakshi

'రాజకీయాల్లో చేరను.. ఎన్నికల్లో పోటీ చేయను'

రాజకీయాల్లో చేరబోతున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు.

రాజకీయాల్లో చేరబోతున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎన్నికల్లో పోటి చేయనున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఎన్నికల్లో పోటీ చేయబొతున్నారంటూ వచ్చిన వార్తలతో తన నిర్మాత ఆందోళన చెందారని అనుపమ్ ఖేర్ తెలిపారు.

దాంతో తాను రాజకీయాల్లోకి వెళ్లడం లేదని నిర్మాతకు సర్ధిచెప్పాల్సి వచ్చిందన్నారు. తాను రాజకీయాల్లో చేరడం లేదని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇలాంటి వార్తలన్ని ఎవరు ప్రచారం చేస్తున్నారో అర్ధం కావడం లేదు అని ఆయన అన్నారు. ప్రజ సమస్యలపై అవసరమైతే స్పందిస్తాను కాని.. రాజకీయాల్లో చేరే ఆసక్తి తనకు లేదని.. చిత్ర పరిశ్రమలో తాను సంతోషంగా ఉన్నాను అని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement