హెచ్‌టీసీ.. 3 కొత్త స్మార్ట్‌ఫోన్లు | HTC launches One M9+, One E9+, Desire 326G in India; plans 4G phones under Rs 20K | Sakshi
Sakshi News home page

హెచ్‌టీసీ.. 3 కొత్త స్మార్ట్‌ఫోన్లు

Apr 15 2015 12:35 AM | Updated on Sep 3 2017 12:18 AM

హెచ్‌టీసీ.. 3 కొత్త స్మార్ట్‌ఫోన్లు

హెచ్‌టీసీ.. 3 కొత్త స్మార్ట్‌ఫోన్లు

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ హెచ్‌టీసీ ‘ఎం9 ప్లస్’, ‘ఈ9 ప్లస్’, ‘డిజైర్ 326 జి’ అనే 3 కొత్త స్మార్ట్‌ఫోన్లను

ప్రీమియం 4జీ మొబైల్ ‘ఎం9 ప్లస్’ ః రూ.52,500
 న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ హెచ్‌టీసీ ‘ఎం9 ప్లస్’, ‘ఈ9 ప్లస్’, ‘డిజైర్ 326 జి’ అనే 3 కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఇవి వచ్చే నెల మే నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై నడిచే ‘ఎం9 ప్లస్’ స్మార్ట్‌ఫోన్ 5.2 అంగుళాల తెర, 4జీ, 20 ఎంపీ రియర్ కెమెరా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 2,840 ఎంఏహెచ్ బ్యాటరీ, బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను సపోర్ట్ చేసే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. దీని ధర రూ. 52,500. అలాగే 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై నడిచే ‘ఈ9 ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల తెర, 20 ఎంపీ రియర్ కెమెరా, 4జీ, 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటి ంచాల్సి ఉంది.
 
 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 3జీ, 4.5 అంగుళాల తెర, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ‘డిజైర్ 326 జి’ సొంతం. దీని ధరను కూడా కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. హెచ్‌టీసీ కంపెనీ ఈ మొబైళ్లకు ఇన్సూరెన్స్‌ను కూడా అందిస్తోంది. ‘ప్రస్తుతం తాము భారత్‌లో నిర్దేశించుకున్న 7% అమ్మకాల లక్ష్యానికి దగ్గరలో ఉన్నాం. అదే విధంగా ఈ ఏడాది చివరకు 10% అమ్మకాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని హెచ్‌టీసీ గ్లోబల్ సేల్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ చియా-లిన్ చేంజ్ అన్నారు. ఈ ఏడాది రూ.20,000కు తక్కువ ధర శ్రేణుల లో పలు 4జీ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేస్తామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement