పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ముందడుగు వేసింది. ఆ పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ...
న్యూఢిల్లీ: పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ముందడుగు వేసింది. ఆ పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం కేంద్ర వ్యవసాయశాఖామంత్రి రాధా మోహన్ సింగ్ ను కలిశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో జరిగిన ధరల ఒప్పందాలకు కట్టుబడటం లేదని ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని కేంద్ర మంత్రికి తెలియజేశారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారస్తులు వేలంపాట బహిష్కరించి రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు.