బీజేపీ నేతపై లైంగిక దాడి కేసు నమోదైంది.
బదౌన్(ఉత్తరప్రదేశ్): బీజేపీ నేతపై లైంగిక దాడి కేసు నమోదైంది. బెదిరింపులకు పాల్పడుతూ తనపై గత ఆరు సంవత్సరాలుగా లైంగికదాడి చేస్తున్నాడని ఓ మహిళ ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత ఉమేశ్ ఠాకూర్పై ఆరోపణలు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అయితే, ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలని ఉమేశ్ ఠాకూర్ కొట్టి పారేశారు. పోలీసులకు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం 2009 ఫిబ్రవరి 14 నుంచి ఉమేశ్ ఆమెను బెదిరించి లొంగదీసుకుని లైంగిక దాడి చేస్తున్నాడు.
తనను తిరస్కరిస్తే ఏమాత్రం సహించేది లేదని ఈ నెల 10న తీవ్రంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతోపాటు ఆమె అతడు బెదిరిస్తున్న వీడియో క్లిప్పుంగును కూడా అప్పగించింది. దీంతో పోలీసులు ఉమేశ్ ఠాకూర్పై కేసు నమోదు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన ఠాకూర్ 2017 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేందుకు సీటును ఆశిస్తున్నాడు.