ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భూకంపం సంభవించింది.
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం సాయంత్రం ఆ రాష్ట్రంలో పలు చోట్ల భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది.
భూప్రకంపనలకు ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.