తన ప్రేమను అమ్మాయి తిరస్కరించిందని ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు! ఇంతకీ అతడి వయసు 17 సంవత్సరాలు మాత్రమే!!
ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు చాలాసార్లు చాలా రకాలుగా చెప్పాడు. కానీ, ఆమె అతడి ప్రేమను తిరస్కరించింది. అంతే, అతడి హృదయం భగ్నమైంది. ఏంచేయాలో అర్థం కాలేదు. తమ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు! ఇంతకీ అతడి వయసు 17 సంవత్సరాలు మాత్రమే!! ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది.
మన్దీప్ అనే కుర్రాడు 12వ తరగతి చదువుతున్నాడు. అతడో అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఎంతగానంటే, ఆ అమ్మాయి పేరును తన చేతిమీద కత్తితో రాసుకున్నాడు. కానీ అమ్మాయి మాత్రం ఆ ప్రేమను తిరస్కరించింది. దాంతో మన్దీప్ తట్టుకోలేకపోయాడు. తమ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు వదిలేశాడు. అతడి మృతదేహాన్ని ముందుగా అతడి తల్లే గమనించారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా లేఖ ఏదీ దొరకలేదుగానీ, అతడి చేతిమీద ఉన్న అమ్మాయి పేరు ఆధారంగా ప్రేమలో విఫలమైనట్లు పోలీసులు గుర్తించారు.