భారతీయ పర్యావరణవేత్త బంకర్ రాయ్, పాకిస్థాన్లో బాలికల విద్యపై తాలిబన్లను సైతం ఎదిరించిన మలాల యూసఫ్ జాయ్లు ఈ ఏడాది ప్రతిష్టాత్మక క్లింటన్ గ్లోబల్ సిటిజన్స్ అవార్డ్సుకు ఎంపికయ్యారు.
భారతీయ పర్యావరణవేత్త బంకర్ రాయ్, పాకిస్థాన్లో బాలికల విద్యపై తాలిబన్లను సైతం ఎదిరించిన మలాల యూసఫ్ జాయ్లు ఈ ఏడాది ప్రతిష్టాత్మక క్లింటన్ గ్లోబల్ సిటిజన్స్ అవార్డ్సుకు ఎంపికయ్యారు. న్యూయార్క్లో రేపు జరగనున్న క్లింటన్ గ్లోబల్ ఇన్షియేటివ్ వార్షిక సమావేశంలో బంకర్ రాయ్, మలాలలు ఆ అవార్డ్సు స్వీకరించనున్నారు. దాదాపు 40 ఏళ్ల క్రితం భారతీయుడు రాయ్ బేర్పూట్ కాలేజీని స్థాపించారు. ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా గ్లోబల్ సిటిజన్స్ అవార్డ్సు కమిటీ కొనియాడింది.
ప్రపంచంలో పేదరిక నిర్మూలనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల పల్లె ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక సదుపాల రూపకల్పనలో ఆ సంస్ధ పాటుపడుతున్న తీరు నభూతోనభవిష్యత్తు అంటూ కిర్తీంచింది. వర్షం నీటిని నిల్వ చేసి మంచినీటి మార్చి ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది పాఠశాల విద్యార్థులకు అందజేసిన తీరు ఆ సంస్థ సమాజసేవకు పాటుపడుతున్న తీరుకు ఓ నిదర్శనమని పేర్కొంది. ప్లానెట్ను రక్షించే 50 మంది ప్రపంచ పర్యావరణవేత్తల జాబితాలో గార్డియన్ పత్రిక రూపొందించిన జాబితాలో రాయ్ స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.
అలాగే ప్రపంచంలోని ప్రజలను అత్యంత ప్రభావితం చేసే 100 మంది వ్యక్తుల్లో రాయ్ కూడా ఉన్నట్లు టైమ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. రేపు జరగనున్న ఆ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులుల, పౌర సమాజ ప్రతినిధిలు, హాజరుకానున్నారు. 2007లో స్థాపించిన క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డ్ను స్థాపించారు. ప్రపంచంలోని వివిధ సమస్యలను దర్శనికతతో పరిష్కరించడమే కాకుండా అరుదైన ప్రతిభ పాటవాల ద్వారా నాయకత్వ లక్షణాలు కలిగిన వారి కోసం ఈ అవార్డును ఏర్పాటు చేశారు.