రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీని బలోపేతం చేస్తాం | bjp general secretary ram madhav says, we will strengthen party in two states | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీని బలోపేతం చేస్తాం

Aug 18 2014 5:03 PM | Updated on Mar 29 2019 9:24 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చెప్పారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చెప్పారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ విభిన్న వ్యూహాలతో ముందుకు వెళ్తామన్నారు. గతంలో ఒక రాష్ట్రంగా ఉన్న దృష్ట్యా ఒకే విధానాన్ని అమలు చేశామని, ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా చూస్తున్నామని, రెండు భిన్న వ్యూహాలతో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామ్‌మాధవ్ ఆదివారం ‘సాక్షి టీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని పరిమిత అవకాశాలను విసృ్తతంగా మార్చుకోవడమే రాజకీయ సామర్ధ్యమని చెప్పారు. తెలంగాణలో బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు.

 

తెలంగాణ, ఏపీ సహా కేరళ, తమిళనాడులో సంస్థాగతంగా బలోపేతం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజల మద్దతు లభిస్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కేరళ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీకి కనీసం ఒక్క ఎంపీ నుంచి అధిక స్థానాల్లో గెలిచారని చెప్పారు. కాంగ్రెస్ 12 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క స్థానంలోనూ గెలవలేదన్నారు. బీజేపీపై ఆర్‌ఎస్‌ఎస్ పట్టుసాధిస్తుందనడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement